View

కార్తికేయ ఎగ్జిబిట‌ర్స్ శ్రీను ఇప్పుడు ఇస్మార్ట్ శ్రీనుగా అభినంద‌న‌లు పొందుతున్నారు

Saturday,July20th,2019, 09:17 AM

పెద్ద మొత్తం డ‌బ్బుతో పాటు అద‌నంగా న‌మ్మ‌కాన్ని కూడా పెట్టుబ‌డిగా పెట్టి చేయాల్సిన వ్యాపారం డిస్ట్రిబ్యూష‌న్‌. లాభాలు వ‌స్తే వ‌చ్చిన‌ట్టు. ఆ స‌ద‌రు సినిమా ప్రేక్ష‌కుడికి న‌చ్చ‌క‌పోతే మ‌న చేతులు కాలిన‌ట్టు. అందుకే ఈ వ్యాపారంలో న‌మ్మ‌కానికి, అదృష్టం తోడు కావాల‌ని అంటారు. ఈ మ‌ధ్య కాలంలో డిస్ట్రిబ్యూట‌ర్‌గా అలా న‌మ్మ‌కాన్ని, అదృష్టాన్ని త‌న‌వెంట పెట్టుకుని 'ఇస్మార్ట్' గా ముందుకు అడుగులు వేస్తున్నారు శ్రీను. మొన్న మొన్న‌టిదాకా ఆయ‌న కార్తికేయ ఎగ్జిబిట‌ర్స్ శ్రీను.... ఇప్పుడు 'ఇస్మార్ట్ శంక‌ర్‌' తో డిస్ట్రిబ్యూట‌ర్‌గా హ్యాట్రిక్ హిట్ సాధించి 'ఇస్మార్ట్' శ్రీనుగా అభినంద‌న‌లు పొందుతున్నారు. పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి నిర్మాత‌లుగా, పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో హీరో రామ్ తెలంగాణ యాస‌లో అద‌ర‌గొట్టిన 'ఇస్మార్ట్ శంక‌ర్‌' ఆయ‌న‌కు డిస్ట్రిబ్యూట‌ర్‌గా హ్యాట్రిక్ చిత్ర‌మ‌న్న‌మాట‌.


బాక్సాఫీస్ ద‌గ్గ‌ర క‌లెక్ష‌న్ల జోరు చూపిస్తున్న ఈ చిత్రం గురించి, త‌న గురించి డిస్ట్రిబ్యూట‌ర్ శ్రీను మాట్లాడుతూ - ''మా కార్తికేయ ఎగ్జిబిట‌ర్స్ సంస్థ త‌ర‌ఫున నైజామ్‌లో మొద‌ట 'క‌బాలీ' చేశాను. ర‌జ‌నీకాంత్ హీరోగా చేసిన ఆ సినిమా చాలా మంచి క‌లెక్ష‌న్లు తెచ్చింది. ఆ త‌ర్వాత 'హుషారు' డిస్ట్రిబ్యూట్ చేశాను. యూత్‌ఫుల్ స‌బ్జెక్ట్ తో 'హుషారు' కుర్ర‌కారును థియేట‌ర్ల‌లో కూర్చోబెట్టింది 'ఉండిపోరాదే....' అంటూ స‌క్సెస్‌లు మాతో ఉండేలా చేసింది. స‌క్సెస్‌ఫుల్‌గా ద్వితీయ విఘ్నం దాటేశాన‌ని మిత్రులంద‌రూ అప్పుడు అభినందించారు. మూడో సినిమాతో హ్యాట్రిక్ కొట్టాల‌ని ఆ క్ష‌ణాల్లోనే బ‌లంగా కోరుకున్నా. అందుకే తొంద‌ర‌ప‌డ‌కుండా ఆచితూచి అడుగులు ముందుకేశా. పూరి జ‌గ‌న్నాథ్‌గారు, హీరో రామ్ గారి కాంబినేష‌న్‌లో 'ఇస్మార్ట్ శంక‌ర్‌' రూపొందుతున్న‌ప్ప‌టి నుంచే నాకు క్రేజీగా అనిపించింది. రామ్‌గారి తెలంగాణ యాటిట్యూడ్ కొత్త‌గా అనిపించింది. సినిమా క‌చ్చితంగా హిట్ అవుతుంద‌ని పూరిగారిని, ఛార్మిగారిని క‌లిసి ఈ సినిమా డిస్ట్రిబ్యూష‌న్ హ‌క్కులు తీసుకున్నా. నేను అనుకున్న‌ట్టుగానే బాక్సాఫీస్ ను 'ఇస్మార్ట్ శంక‌ర్‌' షేక్ చేస్తోంది. థియేట‌ర్ల‌లో సినిమాను చూసి బ‌య‌ట‌కొస్తున్న ఫ్యాన్స్ 'పూరిగారి 'పోకిరి' చిత్రం గుర్తుకొస్తోంది' అని అంటున్నారు. 'పోకిరి' రోజులంటే క‌లెక్ష‌న్ల సునామీ అన్న‌మాటే. 'ఇస్మార్ట్ శంక‌ర్‌' నాకు హ్యాట్రిక్ హిట్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ విష‌యాన్నే పూరిగారితో, ఛార్మిగారితో అన్నాను. వాళ్లిద్ద‌రూ 'ఇక నిన్ను అంద‌రూ 'ఇస్మార్ట్' శ్రీను అంటారు. అదే పేరుతో పాపుల‌ర్ అవుతావు' అని అన్నారు. వారి మాట‌లు చాలా ఆనందం క‌లిగించాయి. 'ఆర్‌.ఎక్స్.100' కార్తికేయ హీరోగా న‌టించిన 'గుణ 369' ఆంధ్ర‌ప్ర‌దేశ్ హ‌క్కులు తీసుకున్నా. అదొక య‌థార్థ‌గాథ‌తో తెర‌కెక్కించిన చిత్రం. మాన‌వ విలువ‌ల్ని ట‌చ్ చేసే క‌మ‌ర్షియ‌ల్ సినిమా. ఇప్ప‌టిదాకా చేసిన 'క‌బాలి', 'హుషారు', 'ఇస్మార్ట్ శంక‌ర్‌'....ఈ మూడు సినిమాల విష‌యంలో నా అంచ‌నాలు త‌ప్పు కాలేదు. నా మూడు చిత్రాల విజ‌య‌ప‌రంప‌ర‌ను 'గుణ 369' కొన‌సాగిస్తుంద‌ని నా న‌మ్మ‌కం. భ‌విష్య‌త్తులోనూ మంచి మంచి సినిమాల‌ను పంపిణీ చేసి, మా సంస్థ పేరును 'ఇస్మార్ట్' గా నిల‌బెట్టుకోవాల‌ని అనుకుంటున్నా'' అని చెప్పారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా చేసి అందరినీ స్వీట్ షాక్ కి గురి చేసా ..

Read More !

Gossips

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !