View

సిరివెన్నెల ఆడియో లాంచ్‌ విశేషాలు

Sunday,July21st,2019, 07:51 AM

ప్రియమణి ప్రధాన పాత్ర పోషించిన హార‌ర్ థ్రిల్ల‌ర్ చిత్రం ‘సిరివెన్నెల’. ప్రకాష్‌ పులిజాల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి కమల్‌ బోరా, ఏఎన్‌బాషా, రామసీత నిర్మాతలుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. మహానటి ఫేమ్ సాయి తేజస్విని, బాహుబలి ఫేమ్ కాలకేయ ప్రభాకర్, సీనియర్ నటుడు అజయ్ రత్నం, రాకెట్ రాఘవ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం ఆడియో ఫంక్ష‌న్ శ‌నివారం ఆర్‌.కె.మ‌ల్టీ ప్ల‌క్స్‌లో ఘ‌నంగా నిర్వ‌హించారు.

 

ఈ సంద‌ర్భంగా విలేక‌రుల స‌మావేశంలో...
వైవిఎస్ చౌద‌రి మాట్లాడుతూ... చాలా మంది మ‌హానుభావులు ఇక్క‌డ‌కి వ‌చ్చారు. మా గురువుగారు రాఘ‌వేంద్ర‌రావుగారు. నేను ఎంతో ఇష్ట‌ప‌డే నాతో ఎన్నో సినిమాలు చేసిన భాషా. సినిమా నిర్మించ‌డం, విడుద‌ల చెయ్య‌డం ఎన్నో డ‌బ్బులు ఎంతో ప్రాబ్ల‌మ్స్‌. ఎన్నో లుక‌లుక‌లు ఇవ‌న్నీ సినిమా రంగంలో చూసి చూసి వ‌చ్చారు భాషా. అన్నీ ప‌నులకు డ‌బ్బులు ఖ‌ర్చుపెట్టి తీరా సౌండింగ్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేస‌రికి డ‌బ్బులు అయిపోవ‌డం అనేది చాలా సార్లు చూశాం. అలాంటివ‌న్నీ చూసి త‌ను ప్రొడ్యూస‌ర్‌గా మొద‌టి ప్ర‌య‌త్నం ఈ సినిమా ఆయ‌న‌కి కీర్తి క‌న‌కం తీసుకురావాల‌ని కోరుకుంటున్నాను. ఈ చిత్రంలో న‌టించిన ప్ర‌తి ఒక్క‌రికి కృత‌జ్ఞ‌త‌లు అన్నారు.


ఆర్‌.పి. ప‌ట్నాయ‌క్ మాట్లాడుతూ...మా మ్యూజిక్ ఫ్యామిలీ నుంచి ప్రొడ్యూస‌ర్ గా భాషా రావ‌డం చాలా ఆనందంగా ఉంది. రాజేంద్ర‌ప్ర‌సాద్‌గారి న‌ట‌వార‌సురాలు సాయి చాలా బాగా చేసింది. ఆల్ ద బెస్ట్‌. నీకు చాలా పెద్ద హీరోయిన్ వి అవుతావు. ఈ చిత్రంలో న‌టించిన వారంద‌రికీ గుడ్‌ల‌క్‌. బెమిని సురేష్ నా స్నేహితుడు ఈ చిత్రంలో చాలా మంచి క్యారెక్ట‌ర్ చేశారు. ఎంటైర్ టీమ్ కి ఆల్ ద బెస్ట్ అన్నారు.


సురేష్ కొండేటి మాట్లాడుతూ... నా ఎస్‌.కె. పిక్చ‌ర్స్ స్టూడెంట్ నెం.1 చిత్రం నెంచి ప్రారంభ‌మైంది. అప్ప‌టి నుంచి భాషా నాకు ప‌రిచ‌యం. ఇండ‌స్ట్రీలో ఎన్నో చూశారు ఆయ‌న‌. ఆయ‌న‌కి మంచి స‌క్సెస్ రావాల‌ని కోరుకుంటున్నాను. చిన్నారి సాయి చాలా బాగా న‌టించింది. మంచి ఫ్యూచ‌ర్ ఉంది అని అన్నారు.


ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు మాట్లాడుతూ... మీ తాతయ్య న‌వ్వించేవారు నువ్వు భ‌య‌పెడుతున్నావు. మ‌హాన‌టితో స్టార్ట్ చేశావ్. మ‌న స‌క్సెస్ క‌న్నా మ‌న పిల్ల‌ల స‌క్సెస్ చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది. భాషాకి రాజ‌మౌళి తెలుసు, రాఘ‌వేంద్ర‌రావు తెలుసు అంద‌రితోనూ ప‌ని చేశారు. నా సినిమాల‌కు చాలా వ‌ర‌కు ఆయ‌నే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. ఒక సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లేక పోతే సినిమానే లేదు. క‌మ‌ల్‌గారు మీరు చాలా క‌రెక్ట్ ప‌ర్స‌న్‌ని సెలెక్ట్ చేసుకున్నారు అన్నారు. ప్రియ‌మ‌ణి స‌తిసావిత్రిలాగా అటు మోడ్ర‌న్‌, ఇటు ట్రెడిష‌న‌ల్ ఏపాత్ర కైనా సూట్ అవుతుంది. ప్ర‌స్తుతం యాక్ష‌న్ చిత్రం చెయ్య‌డం చాలా బావుంది. అంద‌రికీ థ్యాంక్స్‌. ట్రైల‌ర్ స్టార్టింగ్ జై జై గ‌ణేషా సాంగ్ అన్నారు. ఆల్ ద బెస్ట్ అని అన్నారు.


ప్రియ‌మ‌ణి మాట్లాడుతూ... నేను ఈ సినిమాలో ఇంత బాగా క‌నిపించ‌డానికి కార‌ణం ప్ర‌కాష్‌గారు. నేను చెన్నైలో ఉండ‌గా ఓం ప్ర‌కాష్‌, భాషాగారు వ‌చ్చి క‌థ చెప్పారు. నేను ఒక‌రోజు టైం తీసుకుని మా ఇంట్లోవాళ్ళ‌ని అడిగి క‌థ నాకు కూడా న‌చ్చడంతో ఓకే చెప్పాను. ఈ సినిమాతో నా సెఎండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయిన‌ట్లే. ఇందులో సెకెండ్ హీరోయిన్‌గా న‌టించ‌డం చాలా ఆనందంగా ఉంది. చిన్నారి సాయి త‌న పాత్ర‌లో చాలా బాగా న‌టించింది. టీజ‌ర్‌, ట్రైల‌ర్ చాలా బావున్నాయి. నాకు ఇంత మంచి అవ‌కాశం ఇచ్చిన భాషాగారికి ఓం ప్ర‌కాష్‌గారికి నా కృత‌జ్ఞ‌త‌లు అన్నారు.


ద‌ర్శ‌కుడు ఓం ప్రాకాష్ మాట్లాడుతూ... అన‌గ‌న‌గా ఓ దుర్గా చిత్రం చేశాను. ఆ సినిమా చూసి భాషాగారు ఏద‌న్నా క‌థ ఉంటు చెప్ప‌మ‌న్నారు. అప్పుడు ఈ క‌థ చెప్పాను. భాషాగారికి, బోరా గారికి క‌థ న‌చ్చ‌డంతో ఈ ప్రాజెక్ట్ ఓ కే అయింది. క్యారెక్ట‌ర్ కోసం ఎదురు చూస్తున్న స‌మ‌యంలో ప్రియ‌మ‌ణిగారికి ఈ క‌థ చెప్ప‌డంతో ఆవిడ‌కి న‌చ్చ‌డంతో ఓకే చేశారు. నా రెండో చిత్ర‌మే నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్‌తో చెయ్య‌డం దేవుడిచ్చిన వ‌రంగా భావిస్తున్నాను. సిరివెన్నెల పాత్ర ఎవ‌రు అని ఆలోచించే స‌మయంలో మ‌హాన‌టి చిన్నారి గుర్తుకువ‌చ్చింది. రాజేంద్ర‌ప్రసాద్‌గారికి చెప్పి డేట్స్ తీసుకున్నాము. మంచి క్యారెక్ట‌ర్స్ సిరివెన్నెల పాప చాలా బాగా న‌టించింది. సినిమా కూడా చాలా బాగా వ‌చ్చింది. నాకు ఇంత మంచి అవ‌కాశం క‌ల్పించిన భాషా, బోరా గారికి నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు అన్నారు.


ప్రొడ్యూస‌ర్ భాషా మాట్లాడుతూ... ఇంత మంచి చిత్రం అందించిన ప్రొడ్యూస‌ర్ క‌మ‌ల్‌బోరాగారికి, డైరెక్ట‌ర్ ఓం ప్ర‌కాష్‌కి నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు అన్నారు.


ప్రొడ్యూస‌ర్ క‌మ‌ల్ బోరా మాట్లాడుతూ... ఇది నా రెండ‌వ సినిమా నా మొద‌టి చిత్రంకి మంచి పేరు వ‌చ్చింది. రెండో చిత్రానికి పేరుతో పాటు డ‌బ్బులు కూడా రావాల‌ని కోరుకుంటున్నాను. ఈ సినిమా చాలా బాగా వ‌చ్చింది. త‌ప్ప‌కుండా విజ‌యం సాధిస్తుంది అని అన్నారు.


ఎం.ఎం. కీర‌వాణి మాట్లాడుతూ... ప్రొడ్యూస‌ర్ భాషా శివ‌రాం అనే కీబోర్డ్ ప్లేయ‌ర్ ద‌గ్గ‌ర ఆఫీస్ బాయ్‌గా చేరారు. ఆ త‌రువాత అంచ‌లంచ‌లుగా ఎదుగుతూ నా ద‌గ్గ‌ర మ్యూజిక్ కోఆర్డినేట‌ర్‌గా ప‌నిచేశారు. ఆయ‌న‌లో ఉన్న ప్ర‌త్యేక‌త ఏమిటంటే ఒక సినిమాకి ప‌నిచేస్తూ కూడా అన్ని ప‌నులు ఏక‌కాలంలో చెయ్య‌గ‌ల‌రు. ఒక ప్రొడ్యూస‌ర్‌కి కావ‌ల‌సిన అన్ని ల‌క్ష‌ణాలు భాషాగారిలో ఉన్నాయి. ఈ చిత్రం మంచి విజ‌యం సాధించాల‌ని ఈ చిత్రం త‌ర్వాత వంద చిత్రాలు ఆయ‌న నిర్మించాల‌ని. ఇండ‌స్ట్రీకి ఎంతోమంచి మ్యూజిక్ డైరెక్ట‌ర్స్‌ని ప‌రిచ‌యం చెయ్యాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నారు.


డా.రాజేంద్ర‌ప్ర‌సాద్ మాట్లాడుతూ...నేను ఈ స్టేజ్ మీద నిల‌బ‌డ‌డానికి కార‌ణ‌మైన భాషాగారికి కృత‌జ్ఞ‌త‌లు. తెలుగు సినిమాని ఇంట‌ర్‌నేష‌న‌ల్ స్టాయికి ప‌రిచ‌యం చేసిన కీర‌వాణిగారికి , ఆర్‌.పి. ప‌ట్నాయ‌క్ ఇంత మంచి మ‌హానుభావులను ఒకే వేదిక‌మీద క‌ల‌వ‌డం ఆనందంగా ఉంది అన్నారు. ద‌ర్శ‌కుడు ప్ర‌కాష్ సినిమా జయ్ జ‌య్ గ‌ణేషా అనే పాట‌తో ప్రారంభించారు. అంతా మంచే జ‌రుగుతుంది. ప్ర‌తి వినాయ‌క‌చ‌వితికి పెట్టుకుని వినే పాట అవుతుంది. మా మ‌న‌వ‌రాలు గురించి నేను చెప్ప‌కూడ‌దు మీరే ఈ సినిమా చూసి ఎలా న‌టించిందో చెప్పండి అని అన్నారు.


ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో ఆర్‌.పి. ప‌ట్నాయ‌క్‌, ప్ర‌ణ‌తి, జ‌బ‌ర్ద‌స్త్ అవినాష్ చిత్ర‌యూనిట్ త‌దిత‌రులు పాల్గొన్నారు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !