View

మన్మథుడు2 కథ డిఫరెంట్ గా ఉంటుంది - నాగ్

Thursday,July25th,2019, 01:35 PM

కింగ్‌నాగార్జున, ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్‌ గా రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో వయాకామ్‌ 18 స్టూడియోస్‌, మనం ఎంటర్‌ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకాలపై రూపొందుతోన్న చిత్రం 'మన్మథుడు 2'. నాగార్జున అక్కినేని, పి.కిరణ్‌(జెమిని కిరణ్‌) నిర్మాతలు. ఆగస్ట్‌ 9న సినిమా విడుదలవుతుంది. గురువారం ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో వయాకామ్‌ 18 స్టూడియోస్‌ అజిత్‌, డైరెక్టర్‌ రాహుల్‌ రవీంద్రన్‌, కింగ్‌ నాగార్జున తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా...


వయాకామ్‌ ప్రతినిధి అజిత్‌ మాట్లాడుతూ - ''ఈ ఏడాది హిందీలో పెద్ద విజయాన్ని సాధించిన చిత్రం ఓ తెలుగు సినిమా. త్వరలోనే హిందీలో మరో తెలుగు సినిమా కూడా పెద్ద మూవీగా నిలవబోతుంది. ఇక్కడే ప్రేక్షకులు సినిమాను ఎక్కువగా ప్రేమిస్తారు. ఇక్కడ స్టార్స్‌ను ఎక్కువ ప్యాషన్‌తో ప్రేమిస్తారు. అందుకనే హాలీవుడ్‌ నిర్మాణ సంస్థల్లో ఒకటిగా పేరున్న వయాకామ్‌ తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టింది. మన్మథుడు 2 కామెడీ ఎంటర్‌టైనర్‌. నాకు అన్నపూర్ణ స్టూడియోస్‌ సంస్థతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. ఈ బంధాన్ని భవిష్యత్‌లో కొనసాగించాలనుకుంటున్నాను. టైమ్‌లెస్‌ హీరో కింగ్‌ నాగార్జునగారితో కలిసి పనిచేయడాన్ని ఆస్వాదించాను'' అన్నారు.


డైరెక్టర్‌ రాహుల్‌ రవీంద్రన్‌ మాట్లాడుతూ - ''మన్మథుడు సినిమాను తెలుగు ప్రేక్షకులు ఎంత ప్రేమించారో నాకు తెలుసు. ఇప్పుడు అదే రకమైన సపోర్ట్‌ను ఎదురుచూస్తున్నాను. సినిమా ఎప్పుడు స్టార్ట్‌ అయ్యిందో తెలియదు లేదు. త్వరగా పూర్తయ్యింది. ఈ సినిమాకు మన్మథుడు కరెక్ట్‌ టైటిల్‌. నాగ్‌సారే చేస్తున్నారు కాబట్టి. మన్మథుడు 2 అని పెట్టాం. మూడు తరాలుగా పోర్చుగల్‌లో సెటిలైన తెలుగు ఫ్యామిలీ కథ ఇది. ఫ్యామిలీ ఆడియెన్స్‌ ఎంజాయ్‌ చేసేలా సినిమా క్లాస్‌గా ఉంటుంది. సమంతగారి చిన్న అతిథి పాత్రలో నటించారు. ఆ పాత్రలో ఆమెను ఎందుకు నటింప చేశాననేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. షూటింగ్‌ స్టార్ట్‌ చేయడానికి ముందే టైటిల్‌ ఫిక్స్‌ అయ్యింది. ఫస్ట్‌ కాపీని చూశాం. అందరం ఎంజాయ్‌ చేశాం. రేపు ప్రేక్షకులు కూడా ఎంజాయ్‌ చేస్తారు'' అన్నారు.


కింగ్‌ నాగార్జున మాట్లాడుతూ - ''వయాకామ్‌తో అన్నపూర్ణ స్టూడియోస్‌ అసోసియేట్‌ కావడం ఇదే తొలిసారి. ఏ ప్రాబ్లెమ్‌ లేకుండా సినిమా చాలా చక్కగా పూర్తయ్యింది. డిస్ట్రిబ్యూటర్స్‌, బయ్యర్స్‌ అందరూ హ్యాపీగా ఉండాలనే ప్లాన్‌తోనే ఈ సినిమా ముందు నుండి ప్లాన్‌ చేసుకుంటూ వస్తున్నాం. ప్రొడక్షన్‌ కాస్ట్‌, సేల్‌ రేట్స్‌ అన్ని అందరూ హ్యాపీగా ఫీలయ్యేలానే ప్లాన్‌ చేశాం. త్వరలోనే మన్మథుడు జర్నీ ప్రోగ్రామ్‌ను నిర్వహించాలనుకుంటున్నాం. ఆ వివరాలను త్వరలోనే తెలియజేస్తాం. మన్మథుడు వచ్చి 15 సంవత్సరాలు అయ్యింది. ఇప్పుడు మన్మథుడు 2 వచ్చింది. ఏది ఎక్కువగా ఎంజాయ్‌ చేశానంటే చెప్పలేను. విజయ్‌భాస్కర్‌గారితో చేసిన మన్మథుడు చాలా ఈజీగా, సాఫీగా ఎలా సాగిందో.. ఈ సినిమాకు కూడా అంతే ఎంజాయ్‌ చేశాం. ఆ సినిమాకు ఇది ఈక్వెల్‌గా ఉంటుందనే నా ధీమా. సమంతతో పనిచేయడాన్ని ఎంజాయ్‌ చేస్తాను. తనతో ఇప్పటికే మనం, రాజుగారిగది 2 సినిమాలు చేశాను. తను కోడలైన తర్వాత మరింత కేర్‌ తీసుకుంటున్నాను. మన్మథుడు సీక్వెల్‌గా ఈ సినిమాను తెరకెక్కించలేదు. ఆ క్యారెక్టర్స్‌కు, కథకు ఎక్కడా సంబంధం లేదు. డిఫరెంట్ గా ఉంటుంది. అయితే జోనర్‌ మాత్రం రొమాంటిక్‌ కామెడీ. 'ఊపిరి' సినిమాను 'అన్‌టచ్‌బుల్స్‌' అనే సినిమాను బేస్‌ చేసుకుని, రైట్స్‌ కొనుక్కుని రీమేక్‌ చేశాం. అలాగే ఈ సినిమా విషయానికి వస్తే.. కేవా మూవీస్‌ నుండి గీత ఏడాదిన్నర క్రితం ఓ ఫ్రెంచ్‌ మూవీను తీసుకొచ్చి మీరు చేస్తే బావుంటుందని చెప్పింది. ఆ సినిమా నేను చూశాను. బాగా నచ్చడంతో ఆ సినిమా హక్కులను కొని దానిపై ఏదాడి పాటు వర్క్‌ చేసి సినిమా చేశాం. తప్పకుండా సినిమా అందరినీ మెప్పించేలా ఉంటుంది'' అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా చేసి అందరినీ స్వీట్ షాక్ కి గురి చేసా ..

Read More !

Gossips

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !