View

ఈ మన్మధుడు ఉమెన్స్ ని లవ్ చేస్తాడు - నాగ్

Monday,August05th,2019, 02:49 PM

నాగార్జున - రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన మన్మథుడు 2 సినిమా ఆగస్టు 9న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన మన్మధుడు 2 డైరీస్ ఈవెంట్ ను ఆదివారం గ్రాండ్ గా నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ వారి అభిప్రాయాలను తెలియజేశారు.


దర్శకుడు రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ.. మన్మథుడు 2 మొదలవ్వడానికి కారణం నాగార్జున గారే. నా ఫస్ట్ సినిమా రిలీజ్ కి ఒక వారం ముందు నాగార్జున గారు ఇంటికి పిలిచి మాట్లాడారు. ని సినిమా చూశాను టేకింగ్ చాలా బావుంది. ఒక ఫ్రెంచ్ సినిమా చూశాను నువ్వు కూడా అది చూడు. నీతో అలాంటి సినిమా ఒకటి చేయాలని అనుకుంటున్నాను అనగానే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నిజంగా ఆయనతో వర్క్ చేయడం నా అదృష్టం. ఫ్రెంచ్ సినిమాను చూసి దాన్ని నాగ్ గారికి సెట్టయ్యే విధంగా మలుచుకుంటే బావుంటుందని అనుకున్నా. డిఫరెంట్ గా ఆయన రోల్ కి తగ్గట్టు స్టోరీని డెవలప్ చేయడం జరిగింది. నాగార్జున పాత్ర ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది.


సీనియర్ ఆర్టిస్ట్ లక్ష్మీ మాట్లాడుతూ.. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ అందరి నుంచి చాలా మంచి నటనను రాబట్టారు. ఆయన ముందు నుంచి నటుడు కాబట్టి ఆర్టిస్ట్ గా ఆలోచించి ప్రతి సీన్ ను యాక్ట్ చేసి చూపించేవారు. ప్రతి డైలాగ్ , ప్రతి సీన్ ఈజీగా నేర్పించాడు. ఎవ్వరిలో ఈగో లేకుండా అందరూ కలిసి మెలిసి పని చేశారు. ఎవ్వరికి ఎలాంటి అహంకారం లేదు. మా హీరో ప్రొడ్యూసర్ చాలా బాగా మాతో హ్యాపీ గా వర్క్ చేశారు. ఈ సినిమాకు డబ్బింగ్ చెప్పేటప్పుడు పడి పడి నవ్వాను. నాగార్జున నుంచి మరో రూపాన్ని ఈ సినిమాలో చూస్తారు. క్రెడిట్ మొత్తం డైరెక్టర్ కు చెందుతుంది. ఈ సినిమాలో నటించినందుకు చాలా హ్యాపీగా ఉందని ఆమె వివరించారు.


అక్కినేని అమల మాట్లాడుతూ.. 'చిత్ర యూనిట్ అందరికి బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను. సినిమా కోసం మీ అందరిలాగే నేను వెయిట్ చేస్తున్నాను. మన్మధుడు 2 అందరికి నచ్చే సినిమా అవుతుందని భావిస్తున్నాను' అన్నారు


మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ మాట్లాడుతూ.. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా సాఫీగా వర్క్ సాగింది. ముందుగా నాగార్జున గారికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆర్ఎక్స్ 100 సినిమా తరువాత నేను చేస్తున్న ఈ సినిమా చాలా డిఫరెంట్ మూవీ. డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ టాలెంట్ ఈ సినిమాలో కనిపిస్తుంది. ఆయన చాలా బాగా సపోర్ట్ చేశారు. తన ఐడియాలు బాగా షేర్ చేసుకుంటారు. నాలోనా.. అనే సాంగ్ ఈ సినిమాలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. లాంగ్ బ్యాక్ నేను రెడీ చేసిన ఈ సాంగ్ వినిపించగానే ఆయన సినిమాలో యాడ్ చేశారు.
దేవి శ్రీ ప్రసాద్ మాట్లాడుతూ.. మన్మథుడు 2 సినిమాకు నన్ను ఇన్వైట్ చేస్తారని అసలు అనుకోలేదు. చాలా సంతోషంగా ఉంది. నా కెరీర్ మొదట్లో నేను చేసిన మన్మథుడు1 నాకు మంచి గుర్తింపును ఇచ్చింది. అప్పట్లో అదే నాకు పెద్ద సినిమా.ఆ సినిమా దర్శకుడు కె.విజయభాస్కర్ - నాగార్జున గారికి నేను ఎప్పటికి ఋణపడి ఉంటాను. సినిమా టీజర్ చాలా బావుంది. డైరెక్టర్ టేకింగ్ కూడా చాలా బావుంది. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ భరద్వాజ్ కి కూడా నా బెస్ట్ విశేస్. సినిమాలో నటించిన వారందరికి కూడా ఆల్ ది బెస్ట్. ఇక నాగార్జున గారు ఎప్పుడు ఒకేలా కనిపిస్తారు. డిఫరెంట్ సినిమాలు చేస్తూ ఎల్లప్పుడు పాధ్ బ్రేకర్ గా ఆదర్శంగా నిలుస్తున్నారు.


మన్మథుడు డైరెక్టర్ విజయ్ భాస్కర్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. మన్మథుడు సినిమా నా కెరీర్ లో ది బెస్ట్ ఫిల్మ్. అన్నపూర్ణ స్టూడియోస్ లో వర్క్ చేయాలంటే అదృష్టం ఉండాలి. చాలా బాగా రెస్పెక్ట్ ఇస్తారు. మన్మథుడు సినిమా స్టార్ట్ చేసినప్పుఫు ఎప్పుడు స్టార్ట్ చేశామో ఎప్పుడు ఫినిష్ చేశామో కూడా తెలియదు. త్రివిక్రమ్ అప్పట్లో మంచి మాటలు అందించారు. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం అద్భుతం. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించాలని ఆశిస్తున్నాను.


రకుల్ మాట్లాడుతూ.. అక్కినేని ఫ్యాన్స్ అందరికి నమస్కారం. రాహుల్ మొదట కథ చెప్పినప్పుడు ఫస్ట్ నెరేషన్ లొనే అవంతిక క్యారెక్టర్ చేయాలని అనుకున్నా. కెరీర్ లో ఇలాంటి అవకాశాలు చాలా తక్కువగా వస్తాయి. రాహుల్ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ ముందు నుంచి నాకు తెలుసు. ఇక నాగ్ సర్ తో వర్క్ చేయడం ఎప్పటికి మరచిపోలేని. ఆయనను ఎందుకు కింగ్ అంటారో ఇప్పుడు అర్ధమైంది. చిత్ర యూనిట్ మొత్తాన్ని ఆయన చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. ఈ సినిమా అందరికి నచ్చుతుంది అనుముంటున్నా. ఈ సినిమా నాకు చాలా స్పెషల్. అందరికి ఈ సినిమా మంచి గుర్తింపు తెస్తుందని ఆశిస్తున్నా.


నాగ చైతన్య మాట్లాడుతూ.. అక్కినేని అభిమానులందరికి నమస్కారం. నిజంగా చెప్పాలంటే ఈ మధ్య నాన్న ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి రావాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. ముందేమో అందరూ బ్రదర్స్ లాగా ఉన్నారని అనేవారు. సరే లే లుక్స్ తో మ్యానేజ్ చేయవచ్చు అని అనుకున్నా. కానీ ఇప్పుడు కంటెంట్ కూడా అలాగే అటెంప్ట్ చేస్తున్నారు నాన్న. ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఒక లవ్ స్టోరీని ఫ్రెష్ గా ప్రజెంట్స్ చేస్తున్నారు అంటే రియల్ గా అమేజింగ్ నాన్న. ఒక హిట్టోస్తే మళ్ళీ మేము అదే తరహాలో లో మరో రెండు సినిమాలు సేఫ్ గా చేస్తుంటాం. ప్లాప్ వస్తే జాగ్రత్తగా స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంటాం. కానీ నాన్న మాత్రం హిట్టొచ్చినా ప్లాప్ వచ్చినా ప్రతి స్టెప్ డేరింగ్ గా తీసుకుంటారు. అందుకే ఆయనను కింగ్ అంటారు. మా అందరికి ఆయన స్ఫూర్తిగా నిలుస్తున్నారు. డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ మొదటి సినిమా చిలాసౌ చూడగానే నాన్నకు చెప్పాను. తప్పకుండా అతనితో అన్నపూర్ణ స్టూడియోస్ లొనే ఒక మంచి సినిమా చేయించాలని చెప్పా. భవిష్యత్ లో కూడా ఆయనతో వర్క్ చేసే అవకాశం వస్తుంది అనుకుంటున్నా. చిత్ర యూనిట్ లో నటించిన ప్రతి ఒక్కరికి నా బెస్ట్ విషెస్. అలాగే ఇక్కడికి వచ్చిన ముఖ్య అతిథులకు చాలా థ్యాంక్స్. మన ఆడియెన్స్ అనే కాదు బాలీవుడ్ ఆడియెన్స్ కూడా మనం ఎమ్ చేస్తున్నారో చూస్తున్నారు. మన్మథుడు 2 ఈ ఇయర్ లో బెస్ట్ ఫిల్మ్ అవుతుందని అనుకుంటున్నా. మన సినిమాలను బాలీవుడ్ లో కూడా రీమేక్ చేస్తున్నారు. డబ్ చేస్తున్నారు. మంచి అవకాశాలు వస్తున్నాయి. రాహుల్ కూడా అదే స్థాయికి చేరుకోవాలని అనుకుంటున్నా. అభిమానులందరికి చివరగా కృతజ్ఞతలని అందరూ జాగ్రత్తగా ఇంటికి వెళ్లాలని నాగ్ వివరణ ఇచ్చారు.


హీరో అక్కినేని నాగార్జున మాట్లాడుతూ.. ఈ సినిమాకు మన్మథుడు టైటల్ ఎందుకు పెట్టామంటే.. ఒరిజినల్ మన్మథుడు ఉమెన్స్ ని హేట్ చేస్తాడు. ఈ మన్మథుడు ఉమెన్స్ ని లవ్ చేస్తాడు. సర్కిల్ ని ఫినిష్ చేయాలి కదా అందుకే.. మన్మథుడు 2 అని టైటిల్ సెట్ చేశాం. ఏడాది క్రితం ఒక ఫ్రెంచ్ సినిమా చూశాను. నా వయసుకు తగ్గ సినిమా ఇది అనిపించింది. ఏ వయసులో అయినా లవ్ చేయవచ్చు. అది ఈ సినిమాలో కరెక్ట్ గా కనిపిస్తుంది. ఒరిజినల్ మన్మథుడు నాకు మోస్ట్ స్పెషల్ మెమరబుల్ మూవీ. అప్పటి దర్శకుడు విజయ భాస్కర్ గారి టేకింగ్ అద్భుతం. ఇక ఈ మన్మథుడు 2కి కూడా రాహుల్ రవీంద్రన్ అద్భుతంగా వర్క్ చేశాడు. పోర్చుగల్ లో 40 రోజుల పాటు షూటింగ్ చేశాం. తోటి నటీనటులు చాలా చక్కగా యాక్ట్ చేశారు. రోజు వెన్నెల కిషోర్ నాతో కలిసి బాగా తినేవాడు. ఇది ఒక వండర్ఫుల్ జర్నీ. నేను కెరీర్ లో ఇంత స్టయిలిష్ గా ఎప్పుడు కనిపించలేదు. చాలా బాగా కనిపించడానికి ప్రధాన కారణం సినిమాటోగ్రఫర్ సుకుమార్ ముఖ్యకారణం. నన్ను చాలా బాగా చూపించారు. ఇక రకుల్ తో పని చేయడం చాలా ఈజీ. ఆమె చాలా హార్డ్ వర్కర్. అలాగే మంచి మనస్తత్వం గల అమ్మాయి. చాలా టాలెంటెడ్ కూడా. ఆమెతో వర్క్ చేయడం చాలా బావుంది. డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ చేసిన వర్క్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పొట్ట పట్టుకొని నవ్విస్తుంది. అది గ్యారెంటీ. మొన్న నాగ చైతన్య మజిలీ సినిమాతో హిట్ కొట్టాడు. నిన్న ఓ బేబీ సినిమాతో మా కోడలు సక్సెస్ అందుకుంది. రేపు ఆగస్ట్ 9న వాటికంటే ఎక్కువ ఆకట్టుకునే విధంగా మన్మథుడు 2 రాబోతోంది. ఆర్ఎక్స్ 100 కి మ్యూజిక్ అందించిన చేతన్ భరద్వాజ్ ఈ సినిమాలో మూడు మంచి పాటలు కంపోజ్ చేశాడు. అతను బిగ్ మ్యూజిక్ డైరెక్టర్ అవుతారని ఈ వేడుకకు వచ్చిన అక్కినేని అభిమానులందరికి చాలా కృతజ్ఞతలని నాగార్జున తెలియజేశారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !