View

న్యూ క్లాతింగ్ బ్రాండ్ ను ప్రారంభించిన సూప‌ర్‌స్టార్ మహేష్

Thursday,August08th,2019, 02:50 PM

సూపర్ స్టార్ మహేష్ ఒక పక్క సినిమాలతో బిజీగా ఉంటూనే మరో వైపు వ్యాపార రంగంలోనూ తన సత్తా చాటుతున్నారు. ఈ మధ్యనే మల్టీప్లెక్స్‌ రంగంలోకి అడుగుపెట్టి గచ్చిబౌలిలో విలాసవంతమైన ‘ఏఎమ్‌బీ’ సినిమాస్‌ పేరుతో ఓ మల్టీప్లెక్స్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ స‌రికొత్త వ‌స్త్ర ప్ర‌పంచంలోకి మ‌నల్ని తీసుకెళ్ల‌నున్నారు. స్పాయిల్‌తో క‌లిసి ఆయ‌న ప్రారంభించిన క్లాత్ బ్రాండ్ 'ది హంబుల్ కో' బుధ‌వారం అధికారికంగా ప్రారంభ‌మైంది. నేష‌న‌ల్ హ్యాండ్ లూమ్ డే సంద‌ర్భంగా హంబుల్ అండ్ కో ప్రారంభించారు మహేష్. హంబుల్ అండ్ కోలో 160 ర‌కాల స్టైల్స్‌కి సంబంధించిన దుస్తులు రూ.599 ల నుండి లభ్యమవనున్నాయి. వీటిలో కొన్నింటిని మోడల్స్ స్టేజ్‌పై ప్ర‌ద‌ర్శించారు. ఈ ప్రకటనకు ముందు మహేష్ టీమ్ ఓ ఆసక్తికర కాంటెస్ట్ నిర్వహించింది. మూడురోజుల కౌంట్ డౌన్ తో ఫ్యాన్స్ ని మహేష్ చేయనున్న బిజినెస్ గెస్ చేయండి అని ఓ పజిల్ నిర్వహించగా అభిమానులు పెద్ద ఎత్తున స్పందించారు. కాగా వారిలో లక్కీ డిప్ ద్వారా ఐదుగురు అదృష్టవంతులకు మహేష్ ని కలిసే అవకాశం దక్కింది. ఈ కార్య‌క్ర‌మంలో స్పాయిల్ సి.ఇ.ఒ భార్గ‌వ్ ఎర్రంగి, స్పాయిల్ ప్రైవేట్ బ్రాండ్ డివిజ‌న్ హెడ్ సుశ్రితి కృష్ణ పాల్గొన్నారు.


సూపర్ స్టార్ మహేష్ మాట్లాడుతూ - " హంబుల్ క్లోతింగ్ కలెక్షన్ నా పర్సనాలిటీ, స్టైల్ ని ప్రతిబింబించేలా ఉంటుంది. సింపుల్ గా, డౌన్ టు ఎర్త్ ఉండడానికే నేను ఇష్టపడతాను. హంబుల్ లో అదే కనిపిస్తుంది. దీని ద్వారా ఫాన్స్ తో నా బంధం మరింత దృఢపడుతుందని భావిస్తున్నాను."


స్పాయిల్ సి.ఇ.ఒ భార్గ‌వ్ ఎర్రంగి మాట్లాడుతూ - " సూపర్ స్టార్ మహేష్ తో కలిసి మైక్రో లెవెల్ క్లోతింగ్ బ్రాండ్ హంబుల్ కో లో భాగమైనందుకు సంతోషంగా ఉంది. మహేష్ గారు సింప్లిసిటీ, హుంబుల్ పర్సన్. ఆయన స్టైల్ ను ఈ బ్రాండ్ రిఫ్లెక్ట్ చేస్తుంది. మహేష్ ఇచ్చే విలువైన డైరెక్షన్స్ కోసం మా టీం అందరూవెయిట్ చేస్తున్నారు. సోషల్ కామర్స్ బిజినెస్ లో ఒక మంచి సెలబ్రిటీ బ్రాండ్ గా హుంబుల్ కో నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు" అన్నారు.


స్పాయిల్ ప్రైవేట్ బ్రాండ్ డివిజ‌న్ హెడ్ సుశ్రితి కృష్ణ మాట్లాడుతూ - మహేష్ తో కలిసి అసోసియేట్ అవడం హ్యాపీ గా ఉంది. హుంబుల్ కో రూట్ లెవెల్ కలెక్షన్స్ ద్వార కమ్యూనిటీస్ రిబిల్డ్ అవుతాయని నమ్ముతున్నాం. చేనేత కార్మికులకు ప‌నిని క‌ల్పించేలా న్యాచురల్ డైస్, నాణ్యమైన ఫాబ్రిక్స్ తో తయారయ్యే దుస్తులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాం" అన్నారు.


ఈ సంద‌ర్భంగా మ‌హేశ్ పాత్రికేయుల ప్ర‌శ్న‌ల‌కు స‌మాధాన‌మిచ్చారు.


నిజ జీవితంలో మీరెలాంటి దుస్తులు ధరించడానికి ఇష్టపడతారు? మీ ఫేవరెట్ స్టైల్ ఏంటి?
- నేను చాలా కంఫ‌ర్ట్‌గా ఉండే దుస్తుల‌ను ధ‌రించ‌డానికే ప్రాధాన్య‌త ఇస్తాను. జీన్స్ ప్యాంట్‌, చెక్స్ ష‌ర్ట్‌ను ఎక్కువ‌గా ధ‌రిస్తుంటాను. మ‌న రెండు తెలుగు రాష్ట్రాల‌కు సంబంధించిన చేనేత కార్మికులకు ప‌నిని క‌ల్పించేలా ఉండే దుస్తులే ధ‌రించ‌డానికి ఎక్కువ ఇష్ట‌ప‌డ‌తాను. అవే నా ఫేవ‌రేట్‌.


హంబుల్ అంటే అర్థ‌మేంటి? స్పాయిల్ తో ఎలా అసోసియేట్ అయ్యారు?
- హంబుల్ అంటే నిజంగా ఉండ‌టం...విన‌యంగా ఉండ‌టం. క్లాత్ బిజినెస్‌లోకి రావాల‌నే ఆలోచ‌న అని కాకుండా ఏదైనా కొత్త‌గా చేయాల‌ని ఆలోచ‌నైతే ఉండింది. ఆ స‌మ‌యంలో భార్గ‌వ్ న‌న్ను క‌లిశారు. ఆయ‌న విజ‌న్ న‌చ్చ‌డ‌మే కాదు..ఎగ్జ‌యిటెడ్‌గా కూడా అనిపించింది.


ఎ.ఎం.బి సినిమా త‌ర్వాత హంబుల్ స్టార్ట్ చేశారు. త‌ర్వాత ఏం స్టార్ట్ చేయ‌బోతున్నారు?
- మ‌న‌సులో చాలానే ఉన్నాయి. అయితే సినిమాల్లో న‌టించ‌డానికి నేను ముందు ప్రాధాన్య‌త‌నిస్తాను. నా పుట్టిన‌రోజుకి రెండు రోజుల ముందు సోష‌ల్ మీడియాలో నా అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు. ఇలాంటి అభిమానులున్నందుకు నేనెంతో అదృష్ట‌వంతుడిని.


మీరు బ‌య‌ట ఎవరి స్టైల్‌నైనా ఇష్టపడతారా? మీ ఫేవరేట్ స్టైల్ ఏంటి?
- చూడ‌గానే రియ‌ల్‌గా అనిపించే ఏ స్టైల్‌ను అయినా నేను ఇష్ట‌ప‌డ‌తాను. నా ఫేవరేట్ కలర్ బ్ల్యూ చెక్స్ అండ్ జీన్స్ .


జాతీయ చేనేత కార్మికుల దినోత్స‌వం రోజున హంబుల్‌ను స్టార్ట్ చేయ‌డం ఎలా అనిపిస్తుంది?
- చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓ మంచి రోజున మా హంబుల్‌ను స్టార్ట్ చేయ‌డం ఎగ్జ‌యిటింగ్‌గానే అనిపిస్తుంది. భార్గ‌వ్‌, సుశ్రిత‌కు అందుకు థ్యాంక్స్‌.


హంబుల్ పేరు విన‌గానే ఫస్ట్ మీకు ఎలా అనిపించింది?
- నిజానికి భార్గ‌వ్ వ‌చ్చి ఆలోచ‌న చెప్పగానే న‌చ్చింది. ఆయ‌న హంబుల్ అనే పేరు చెప్ప‌గానే క‌నెక్ట్ అయిపోయాను. నా ప‌ర్స‌నాలిటీకి ద‌గ్గ‌ర‌గా ఉంటుంద‌ని ఫీల‌య్యాను. హంబుల్‌లో ఎం, బి అనే అక్ష‌రాలు ప‌క్క ప‌క్క‌నే ఉన్నాయ‌ని అనుకోలేదు. వాటిని గ‌మ‌నించిన మా గ్రాఫిక్స్ టీం వాటిని అండ‌ర్ లైన్ చేసింది.


Superstar Mahesh Launches New Clothing Brand 'THE HUMBL CO' Along WIth Spoy


Superstar Mahesh who is quite busy with his films has been expanding his horizon by successfully venturing new businesses. Recently he entered into Multiplex area with a plush, luxurious AMB Cinemas at Gachibowlii in Hyderabad. Now Superstar Mahesh is taking us into a new world of clothing. He launches a clothing brand, 'THE HUMBL Co' exclusively with SPOYL. On the occasion of National Handloom Day Mahesh has unveiled 'THE HUMBL CO' on August 7th. The Humbl Co brand features easy-to-wear- styles for men of all ages with over 160 styles that start at a pocket-friendly price of 599 onwards. Some of the designs were exhibited by models on stage during the launch. Mahesh babu Team has conducted an interesting contest a few days ago. They asked to guess the business Mahesh is venturing into. Many fans took part in it and among them, five were selected through the lucky dip. These five lucky fans met their favourite star Mahesh during the launch. Spoyl CEO Bhargav Errangi,Spoyl Pvt Brand Division Head Sushruthi Krishna also took part in the launch. Humbl will be live exclusively on Spoyl app and Spoyl website.


Superstar Mahesh said, " The Humbl Co's clothing collection is an expression of my personal style and way of life. The values of simplicity & humility that I believe in, forms the core of the brand's mission statement. Through The Humbl Co., I want to cement my relationship with my fans by inspiring them to live real and stay humble."


Spoyl CEO Bhargav Errangi said, "We are very happy to associate with Superstar Mahesh Babu to build a product that's truly reflective of his star -power and his down-to-earth off-screen personality. I am looking forward to the exciting direction that The Humbl Co will take the Spoyl. We believe that Humbl will emerge as a major celebrity brand in social commerce."


Spoyl Pvt brand Division Head Sushruthi Krishna said, " We're glad to have a way to support Mahesh babu's inclination toward community outreach through the Humbl co's roots collection. The collection is also made using handloom, natural dyes and sustainable fabrics."


Mahesh Interacted with Press during the launch of The Humbl Co


How conscious you are when you come to choose your clothes on a daily basis?
- My Style has always been very simple and classic. I always wear what I am comfortable in. I like to be in a checks shirt and jeans.


What will be the choice from your own brand if you have to wear it?
- It's the Roots collections which is very very special from our brand. It gives employment opportunities to our rural weavers in both of our states. That's my favourite collection along with checks shirts.


What is Humbl mean to you?
- Live Real Stay Humble. A lot of my personality reflects on the brand. It's not something which we did it overnight. There is something going on in my mind for a long time to do something like this. When Bhargav approached us his vision and clarity made me excited to start this. It wouldn't have been possible without him. A big thanks to him and Spoyl.


After AMB Cinemas, The Humbl Co what's next?
- A lot of things are going on. But, Doing films is always my first passion. I am busy over the next two years with a lot of exciting projects. Launching Humbl two days ahead of my birthday is very exciting for me. I have to thank all my fans. The social media has been buzzing and they are trending my birthday. I am really blessed to have fans like them. A big big thanks to them.


Who is your favourite stylish person?
- I like the style of people who stay real. Whenever I look at such people I can relate to it.


How do you feel launching your brand on National Handlooms Day?
- I am very very happy to launch on this special day. Thanks to Bhargav, Sushrutha and Spoyl.


Why did you choose the name 'Humbl' for your brand?
- I always have this idea in my mind to come up with a clothing line. When Bhargav gave me the presentation, they came up with this name, 'The Humbl' and I instantly connected to it. I felt it is close to my belief and personality. I haven't observed the letters 'M' and 'B' were side by side in Humbl. Observing this graphics team have underlined them.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !