View

ఇంటర్య్వూ - అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌ (కథనం)

Thursday,August08th,2019, 03:42 PM

ది గాయత్రి ఫిలిమ్స్ మరియు ది మంత్ర ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రముఖ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'కథనం'. రాజేష్ నాదెండ్ల దర్శకత్వం వహించగా, బి నరేంద్ర రెడ్డి, శర్మ చుక్కా నిర్మాతలుగా వ్యవహరించిన ఈ చిత్రం ఈనెల 9న వరల్డ్ వైడ్ గా విడుదలవుతుంది. ఈ సంద‌ర్భంగా అన‌సూయ‌తో ఇంటర్వ్యూ...


* ఇండ‌స్ట్రీకి నేను వ‌చ్చి 10 సంవ‌త్స‌రాలు అవుతుంది. ఏదీ అనుకోని జ‌ర‌గ‌లేదు. ఎంబీఏ చేసి ఉద్యోగం చేసుకుంటున్నాను. పెళ్లికి బ్రేక్ తీసుకున్నాను. ఆ స‌మ‌యంలో పేప‌ర్‌లో యాడ్ చూసి అప్లై చేశాను. ఈరోజు నేను మెయిన్ హీరోయిన్‌గా సినిమా వ‌స్తుంద‌ని అనుకోలేదు. న‌టిగా ఇప్పుడున్న పోజిష‌న్‌కి చాలా హ్యాపీగా ఉన్నాను.


* హీరోయిన్‌ని ఎందుకు అయ్యాన‌ని అనుకోలేదు. ఈ ప్రాసెస్‌లో హీరోయిన్ కావ‌డాన్ని ఓ రెస్పాన్సిబిలిటీగా ఫీలవుతాను. క‌థ‌నం సినిమా ప్ర‌మోష‌న్ చూసి నేనే ఫేస్ అని క‌దా అనుకుంటున్నానే త‌ప్ప‌.. నేను హీరోయిన్‌గా ఫీలై చేయ‌లేదు. డైరెక్ట‌ర్ చెప్పింది చేసుకుంటూ వ‌చ్చాను. ఉదాహ‌ర‌ణ‌కు `రంగ‌స్థ‌లం` సినిమాలో నా పాత్రకు అంత ఇంపార్టెన్స్ ఉంటుంద‌ని అనుకోలేదు. సుకుమార్‌గారు చెప్పింది చేసుకుంటూ వెళ్లాను. ఈ సినిమాకు కూడా అంతే. నాకు టీవీ కెమెరాకు, సినిమా కెమెరాకు పెద్ద తేడా లేదు. ఒకేలా భావిస్తాను. ఇచ్చిన ప‌నిని స‌క్ర‌మంగా చేయ‌డానికే ప్రాధాన్య‌త ఇస్తాను.


*క‌థ‌నం సినిమా నేను మెయిన్ హీరోయిన్‌గా విన్న తొలి సినిమా క‌థేం కాదు. చాలా క‌థ‌లే విన్నాను. రంగ‌స్థ‌లం.. క‌థ‌నం మ‌ధ్య 12-13 క‌థ‌ల‌ను విన్నాను. క‌థ‌ను విన‌గానే తొలిసారి న‌చ్చింది. వంట‌బాగా చేసినా తినేవాళ్లు లేక‌పొతే న‌ష్ట‌మే. అలాగే సినిమా ఎంత బాగా చేసినా..ప్రాప‌ర్ రిలీజ్ అవ‌స‌రం. చేసిన ప‌నికి క‌చ్చిత‌మైన గుర్తింపు రాక‌పొతే నేను డిసప్పాయింట్ అవుతాను.


*క‌థ‌నం లో నా పాత్ర పేరు అను. అసిస్టెంట్ డైరెక్ట‌ర్ నుండి డైరెక్ట‌ర్‌గా మారిన నా పాత్ర సినిమాను డైరెక్ట్ చేయ‌డానికి, త‌న‌ను తాను నిరూపించుకునే క్ర‌మంలో ఓ సినిమా చేయ‌డానికి నిర్మాత‌లు ముందుకు వ‌స్తారు. ఆమె రాసుకున్న క‌థ మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ. క‌థ‌ల రాసుకున్న త‌ర‌హాలోనే హ‌త్య‌లు జ‌ర‌గ‌డంతోటెన్ష‌న్ మొద‌లవుతుంది. అక్క‌డి నుండి క‌థ ఎలాంటి మ‌లుపులు తిరిగింద‌నేదే ఈ సినిమా.


*సినిమాలో నేను మెయిన్‌గా ఉండ‌టాన్ని నేను బాధ‌గా ఫీల్ కావ‌డం లేదు. ఓ బాధ్య‌త‌గా భావిస్తున్నాను. నేను ఏది చేసినా ప్రేక్ష‌కుడు థియేట‌ర్ వ‌చ్చేవ‌ర‌కే.. మ‌రి సినిమా ప్రేక్ష‌కుడికి న‌చ్చిందా లేదా? అని తెలియాలంటే మాత్రం విడుద‌ల వ‌ర‌కు ఆగాల్సిందే. `క్ష‌ణం` నుండి నిర్మాత‌ల‌కు నాపై ఓ న‌మ్మ‌కం ఏర్ప‌డింది.


*పెళ్లికి ముందు.. సినిమాల్లోకి రాక‌ముందు నాకు చాలా సినిమా అవ‌కాశాలే వ‌చ్చాయి. అయితే సినిమాలెందుకు? అనే సాధార‌ణ తెలుగు కుటుంబానికి చెందిన అమ్మాయిని కావ‌డంతో సినిమాల్లోకి వెళ్ల‌లేక‌పోయాను. పెళ్లి త‌ర్వాత మా అయ‌న న‌న్ను ముందుండి న‌డింపించారు. అలాగే మా అత్త‌య్య మావ‌య్య కూడా స‌పోర్ట్ ఇచ్చారు. నాకు ఫ్రీడమ్ ఇచ్చారు. `క్ష‌ణం` న‌టిగా నాలో న‌మ్మ‌కాన్ని పెంచింది. నేను ఇప్పుడున్న స్థానాన్ని చూసి బాధ‌ప‌డటం లేదు.


*నాతో పాటు ఈ సినిమాలో ధ‌న‌రాజ్ పాత్ర ట్రావెల్ చేస్తుంది. అను అనే అనాథ‌కు ధ‌న‌రాజ్ పాత్ర స‌పోర్ట్ చేస్తుంటుంది. అలాగే ఈ సినిమాలో ఇంకా అవ‌స‌రాల శ్రీనివాస్‌గారు చాలా మంచి పాత్ర‌లో క‌న‌ప‌డ‌తారు. ఇంకా ర‌ణ‌ధీర్‌, పెళ్లి పృథ్వీ, స‌మీర్‌, ముఖ్తార్ త‌దిత‌రులు న‌టించారు. ప్ర‌తి పాత్ర‌కు ఓ స్పేస్ ఉంటుంది. ఓ ఇంపార్టెన్స్ ఉంటుంది.


*మంచి ఫ్యామిలీ దొరికింది. అది దేవుడిచ్చిన అదృష్టంగా భావిస్తున్నాను. ఒక‌ప్పుడు సోష‌ల్ మీడియాలో బాగా రియాక్ట్ అయ్యేదాన్ని. ఇప్పుడు కాస్త ఓపిక పెరిగింది. ప్ర‌తి దాన్ని సీరియ‌స్‌గా తీసుకోవాల్సిన అవ‌స‌రం లేదనిపించింది.


*డైరెక్ట‌ర్ రాజేశ్ సినిమాను చ‌క్క‌గా తెర‌కెక్కించాడు. జాగ్ర‌త్త‌గా డైరెక్ట్ చేశాడు. నాకు స్పేస్ ఇచ్చి ఓపిక‌గా సినిమాను రూపొందించారు. అలాగే కొత్త నిర్మాణ సంస్థ అయినా మేకింగ్ లో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. అలాగే సినిమా బాగా రావడానికి వారి నుండి పూర్తి సహకారం అందింది. 

 

*తరుణ్ భాస్క‌ర్ డైరెక్ష‌న్‌లో ఓ సినిమా చూస్తున్నాను. అలాగే రెండు, మూడు స్క్రిప్ట్స్ వింటున్నాను. ఇంకా ఏది ఫైనల్ చేయాలి అనుకోలేదు. ఏజ్ అనేది ఒక నెంబర్ మాత్రమే.. అని నమ్ముతాను. సినిమా చూసి ఇంటికి వచ్చాక కూడా గుర్తుండిపోయే పాత్రలే చేయాలనుకుంటున్నాను.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !