View

ఈ 23న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న కౌసల్య కృష్ణమూర్తి

Wednesday,August14th,2019, 11:41 AM

ఐశ్వర్యా రాజేష్‌, నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్‌, కార్తీక్‌ రాజు, వెన్నెల కిషోర్‌ ముఖ్య పాత్రల్లో క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ప్రొడక్షన్‌ నెం.47గా క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ నిర్మిస్తున్న విభిన్న కథా చిత్రం 'కౌసల్య క ష్ణమూర్తి ది క్రికెటర్‌'. ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో ప్రముఖ తమిళ్‌ హీరో శివ కార్తికేయన్‌ నటిస్తున్నారు. ఈ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకొని క్లీన్‌ 'యు' సర్టిఫికెట్‌ పొందింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ చిత్రాన్ని ఆగస్ట్‌ 23న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆగస్ట్‌ 14న హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌ కల్చరల్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు, దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు, రచయిత హనుమాన్‌ చౌదరి పాల్గొన్నారు.


క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు మాట్లాడుతూ - ''ఈమధ్య కాలంలో స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన అన్ని సినిమాల్లోనూ జెంట్స్‌ చేశారు. మొదటిసారిగా మన తెలుగమ్మాయి ఐశ్వర్య రాజేష్‌ అలాంటి స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన 'కౌసల్య కృష్ణమూర్తి' చిత్రంలో నటించింది. ఈ సినిమాకి సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తయినప్పటికీ మంచి కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రం కనుక తప్పకుండా ప్రేక్షకులందరికీ అందుబాటులో ఉండాలని ఆగస్ట్‌ 23న ఒక పెద్ద సినిమాగా మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన ఐశ్వర్య రాజేష్‌ దాదాపు 20 తమిళ సినిమాలే కాకుండా మలయాళం, హిందీలో ప్రముఖ నటుడు అర్జున్‌ రాంపాల్‌తో నటించి అన్ని భాషలతో పాటు నేషనల్‌ లెవల్‌లో మంచి పెర్ఫార్మర్‌గా పేరుతెచ్చుకొని ప్రస్తుతం మా సినిమా ద్వారా తెలుగులో పరిచయమవుతుంది. ఆ అమ్మాయి సీనియర్‌ నటుడు అమర్‌నాథ్‌ మనవరాలు. అలాగే నటుడు రాజేష్‌ కుమార్తె. నేను ఈ సినిమాను మొదటి సారిగా తమిళ్‌లో చూసి స్టన్‌ అయ్యాను ఎందుకంటే రెండున్నర గంటలపాటు ఆ సినిమాను ఆమె తన భుజాలపై మోసింది. ఆ వారం ఐదు పెద్ద సినిమాలు రిలీజ్‌ అయినా కూడా అన్ని సినిమాల్లో ఈ సినిమానే గొప్పది అనిపించింది. ఇప్పటికీ ఆ పిక్చర్‌లో నటించిన నటులకు. టెక్నీషియన్స్‌కి సన్మానాలు చేయడం నాకు ఆశ్చర్యం కలిగించింది. తమిళంలో శివ కార్తికేయన్‌ కూతురు పాడిన పాట 130 మిలియన్స్‌ వ్యూస్‌ సాధించింది. తెలుగులో కూడా ఆ పాట మంచి హిట్‌ అయింది. అంత సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన ఈ సినిమాను ఎలాగైనా తెలుగు ప్రేక్షకులకు అందివ్వాలని, అలాగే తమిళంలో మంచి పేరు తెచ్చుకున్న తెలుగు అమ్మాయి ఐశ్వర్య రాజేష్‌ని తెలుగులో పరిచయం చేయాలనీ ఈ సినిమా రైట్స్‌ తీసుకోవడం జరిగింది. ఇలాంటి ఒక మంచి సినిమాకు భీమనేనిగారైతే పూర్తి న్యాయం చేయగలరని ఆయన్నే దర్శకుడిగా తీసుకున్నాం. సినిమాలో ఏ చిన్న పొరపాటు కూడా ఉండకూడదని ఆయన పడిన తాపత్రయానికి ఆయన్ను అభినందిస్తున్నాను. అలాగే ఒక కొత్త యువకుడైన హనుమాన్‌ చౌదరి చాలా బాగా మాటలు రాశాడు. రేపు సినిమా విడుదలయ్యాక అతన్ని అందరూ ప్రశంసిస్తారు. ఆగష్టు 18న గ్రాండ్‌గా ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ను ప్లాన్‌ చేస్తున్నాం. ఈనెల 23న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఈ సినిమా తప్పకుండా మీ అందర్నీ ఆకట్టుకుంటుంది'' అన్నారు.


నిర్మాత కె.ఎ.వల్లభ మాట్లాడుతూ ''క్రికెట్‌ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ప్రతి ఒక్కరినీ అలరిస్తుంది. ఈ సినిమా తమిళ్‌లో చాలా పెద్ద హిట్‌ అయ్యింది. తెలుగులో అంతకుమించిన విజయం సాధిస్తుందన్న కాన్ఫిడెన్స్‌తో ఉన్నాం'' అన్నారు.


దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ - ''ఆల్రెడీ టీజర్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. అలాగే సాంగ్స్‌ మిలియన్స్‌ వ్యూస్‌తో సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే ఈ సినిమా మీద ఆడియన్స్‌కి పాజిటివ్‌ బజ్‌ ఉందని తెలుస్తోంది. మా ప్రొడ్యూసర్‌ గారు చెప్పినట్టు కౌసల్య క ష్ణమూర్తి డెఫినెట్‌గా ఒక మంచి సినిమా అవుతుంది. సినిమా ఔట్‌ ఫుట్‌ చాలా బాగుంది. మా కుటుంబ సభ్యులు కొంతమంది ఈ సినిమాను చూశారు. సినిమా టెక్నికల్‌గా కూడా చాలా బాగా వచ్చింది. రీమేక్‌ సినిమా అయినా ఒక స్ట్రెయిట్‌ సినిమా కన్నా ఎక్కువ ఎఫర్ట్‌ పెట్టి చేశాం. నిర్మాత రామారావుగారు చాలా మంచి ఆర్టిస్టులను, టెక్నీషియన్స్‌ని ఇచ్చారు. ఇప్పటి తరానికి తగినట్లు తన ఆలోచనలను మార్చుకుంటూ సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు ఆయన. మా టీమ్‌ అందరం మంచి డెడికేషన్‌తో సినిమా తెరకెక్కించాం. మీ అందరి సపోర్ట్‌ మాకు కావాలి. డెఫినెట్‌గా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను'' అన్నారు.


మాటల రచయిత హనుమాన్‌ చౌదరి మాట్లాడుతూ - ''నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావుగారికి థాంక్స్‌. దర్శకుడు భీమనేనిగారితో నేను 'సుడిగాడు' సినిమాకు వర్క్‌ చేయడం జరిగింది. నేను 'కె.జి.ఎఫ్‌' తరువాత మాటలు రాసిన సినిమా ఇది. ఒక అద్భుతమైన కథతో ఈ సినిమా రూపొందింది. డెఫినెట్‌గా ఈ సినిమా ఘనవిజయం సాధించి మా అందరికీ మంచి పేరు తెస్తుంది'' అన్నారు.


ఐశ్వర్యా రాజేష్‌, నటకిరీటి రాజేంద్రప్రసాద్‌, శివకార్తికేయన్‌(స్పెషల్‌ రోల్‌), కార్తీక్‌రాజు, ఝాన్సీ, సి.వి.ఎల్‌.నరసింహారావు, వెన్నెల కిశోర్‌, 'రంగస్థలం' మహేశ్‌, విష్ణు(టాక్సీవాలా ఫేమ్‌), రవిప్రకాశ్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఐ. ఆండ్రూ, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, సంగీతం: దిబు నినన్‌, కథ: అరుణ్‌రాజ కామరాజ్‌, మాటలు: హనుమాన్‌ చౌదరి, పాటలు: రామజోగయ్యశాస్త్రి, క ష్ణ కాంత్‌ (కెకె), కాసర్ల శ్యామ్‌, రాంబాబు గోసల, ఫైట్స్‌: డ్రాగన్‌ ప్రకాశ్‌, డాన్స్‌: శేఖర్‌, భాను, ఆర్ట్‌: ఎస్‌.శివయ్య, కో-డైరెక్టర్‌: బి.సుబ్బారావు, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: బి.వి.సుబ్బారావు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎ.సునీల్‌కుమార్‌, లైన్‌ ప్రొడ్యూసర్‌: వి.మోహన్‌రావు, సమర్పణ: కె.ఎస్‌.రామారావు, నిర్మాత: కె.ఎ.వల్లభ, దర్శకత్వం: భీమనేని శ్రీనివాసరావు.


Our 'Kausalya Krishnamurthy' Which Is Releasing Worldwide On August 23 Will Impress Everyone - Creative Producer KS Rama Rao


Aishwarya Rajesh, Natakireeti Dr. Rajendraprasad, Karthik Raju, Vennela Kishore starrer 'Kausalya Krishnamurthy' - The Cricketer is gearing up for its release worldwide on August 23rd. Directed by popular director Bheemaneni Srinivasa Rao, 'Kausalya Krishnamurthy' is Presented by creative producer KS Rama Rao as Production No 47 in Creative Commercials banner, Produced by KA Vallabha. Popular Tamil hero Siva Kartikeyan did a crucial role in the film. On this occasion team spoke with media on August 14th at FNCC, Hyderabad.


Creative Producer KS Rama Rao said, " In all sports-based films those were made recently men played the lead roles. Aishwarya Rajesh, though she is a Telugu girl has acted for the first time in Telugu and she has given a splendid performance in 'Kausalya Krishnamurthy'. In spite of the completion of all works, as the film has been made with a noble concept we opted for a big release on August 23rd as per our distributor's advice to have a wide reach among the audiences. Aishwarya Rajesh did 20 films in Tamil. She also acted in Malayalam and Hindi films. She has won many accolades at the national level as a good performer and is now getting introduced in Telugu with our film. She is the granddaughter of senior actor Amarnath Garu and daughter of actor Rajesh. I was stunned when I watched the film in Tamil. She shouldered the entire film for two and a half hours. Though the film was released amidst 5 big films, It emerged successful with audiences verdict because of its strong content. Even today, I wonder to see the actors and technicians who worked for the film are being felicitated for their work. The song crooned by Siva Kartikeyan's daughter has clocked 130 million views. It became a very good hit in Telugu too." He also said, " This film has created a sensation in Tamil and I wanted to present it to the Telugu audiences. I also wanted to introduce the Telugu girl who made a good name for her in Tamil to Telugu films. So I have bought the remake rights of the film. We wanted Bheemaneni Garu to direct such a good film as he can do complete justice to the content. I appreciate him for his dedication and the care he took to make this film flawless is commendable. Hanuman Chowdary being a new young writer has penned superb dialogues for the film. Everyone will talk about him after the movie's release. We are planning a grand Pre-release event on August 18th. A special screening of the film will be held on Aug 22nd for the Media who are giving their valuable support for us. I hope you all will make the film a grand success."Producer KA Vallabha said, " This film which has been made with cricket backdrop will strike a chord with everyone. This film was a big hit in Tamil. We are confident that it will become even bigger success in Telugu.


"Director Bheemaneni Srinivasa Rao said, "The teaser which was released recently gathers a very good response. Songs are trending in social media with millions of views. These indicate the amount of positive buzz the film has among the audiences. Like our Producer, KS Rama Rao Garu said, 'Kausalya Krishnamurthy' is a very good film and will surely score a big success. The output of the film came out very well. My family members have watched the film and appreciated our unit. The film came out rich on the technical front too. Though this is a remake, we have put in a lot of effort even more than a straight film. Producer Rama Rao Garu has provided very good artists and technicians. He is changing with times and making films according to the current generation. Our entire team worked with the utmost dedication for this film. We are coming before you all on August 23rd. We need all of your support. I believe you will love this film.


"Dialogue Writer Hanuman Chowdary said, " First of all I would like to thank my producer KS Rama Rao Garu for this opportunity to work for such a good film. I have worked with Director Bheemaneni Garu for his 'Sudigaadu' film. After KGF I have written dialogues for this film. This film has a beautiful story. It will bring us fame."


Cast:Aishwarya Rajesh, Natakireeti Rjendraprasad, Siva Karthikeyan (Special Role), Karthik Raju, Jhansi, CVL Narasimha Rao, Vennela Kishore, 'Rangasthalam' Mahesh, Vishnu (Taxiwala fame), Raviprakash and others.Crew:Cinematography: I Andrew, Editing: Kotagiri Venkateswara Rao, Music: Dhibu Ninan Thomas, Story: Arunraja Kamaraj, Dialogues: Hanuman Chowdary, Lyrics: Ramajogayya Sastry, Krishnakanth (KK), Kasarla Shyam, Rambabu Gosala, Fights: Dragon Prakash, Dance: Shekhar, Bhanu, Art: S Sivayya, Co-Director: B Subba Rao, Production Controller: BV Subba Rao, Executive Producer: A Sunil Kumar, Line Producer: V Mohan Rao, Presented By KS Rama Rao, Producer: KA Vallabha, Directed By Bheemaneni Srinivasa RaoAuthor :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !