View

ఏదైనా జరగొచ్చు ప్రీ-రిలీజ్‌ విశేషాలు

Tuesday,August20th,2019, 03:06 PM

శివాజీరాజా తనయుడు విజయ్‌ రాజా హీరోగా పరిచయం అవుతూ, పూజా సోలంకి, సాషా సింగ్‌ హీరోయిన్లుగా కె. రమాకాంత్‌ దర్శకత్వంలో వెట్‌బ్రెయిన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, సుధర్మ్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై సుదర్శన్‌ హనగోడు నిర్మిస్తున్న చిత్రం 'ఏదైనా జరగొచ్చు'. నేషనల్‌ అవార్డు విన్నర్‌, తమిళ స్టార్‌ బాబి సింహ ఈ చిత్రంలో నెగటివ్‌ రోల్‌లో కనిపించనున్నారు. అలాగే ఎంతో మంది ప్రముఖ నటీనటులకు నటనలో శిక్షణ ఇచ్చిన వైజాగ్‌ సత్యానంద్‌ గారి కుమారుడు రాఘవ, ప్రముఖ దర్శకుడు విజయ భాస్కర్‌ గారి అల్లుడు రవి శివ తేజ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఆగష్టు 23న కె.ఎఫ్‌.సి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ద్వారా విడుదచేయబోతున్నారు.. ఈ సందర్భంగా హైదరాబాద్‌ ప్రసాద్‌ ల్యాబ్‌లో ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో...


నటుడు శివాజీ రాజా మాట్లాడుతూ - ''గత ఆరు నెలల నుండి చిన్న సినిమా పెద్ద సినిమా అని కాకుండా కేవలం స్టోరీ, కంటెంట్‌ బాగున్న సినిమాలే ఎక్కువ విజయం సాధించాయి. దాదాపు 35 సంవత్సరాలక్రితం నేను '' కళ్ళు' అనే సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యాను. ఆ సినిమా నాకు 17 అవార్డ్స్‌ తెచ్చి పెట్టింది. ఆ సినిమాలో హీరో నేనే అయినా గొల్లపూడి గారు, రఘు గారే హీరోలని నేను ఇప్పటికి చెబుతుంటాను. ఎందుకంటే రచయిత, దర్శకుడే సినిమాకు ప్రాణం. అలాగే ఈ సినిమా కూడా రమాకాంత్‌దే అని చెప్తాను. బాబీసింహ గారు అత్యున్నత నటులు, అయన యాక్టింగ్‌ చూడడానికే నేను ఒకే సారి షూటింగ్‌కి వెళ్ళాను. మ్యూజిక్‌ చాలా బాగుంది. ఆర్టిసులు, టెక్నీిషియన్స్‌ అందరికీ ఆల్‌ ది బెస్ట్‌'' అన్నారు.


మ్యూజిక్‌ డైరెక్టర్‌ శ్రీకాంత్‌ పెండ్యాల మాట్లాడుతూ - ''ఈ చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయమయడం సంతోషంగా ఉంది. ఈ ప్రాజెక్టు నాలుగు సంవత్సరాల క్రితం స్టార్ట్‌ అయింది. అన్ని సాంగ్స్‌ అప్పుడే కంపోజ్‌ చేశాం. సందర్భానుసారం వచ్చే సంగీతంతో పాటు ఆర్‌.ఆర్‌ కూడా మిమ్మల్ని మెస్మరైజ్‌ చేస్తుంది' అన్నారు.
నేషనల్‌ అవార్డ్‌ విన్నర్‌ నటుడు బాబీ సింహ మాట్లాడుతూ - ''2 ఇయర్స్‌ బ్యాక్‌ ఈ స్క్రిప్ట్‌ వినగానే నాకు గూస్‌బమ్స్‌ వచ్చాయి. స్క్రీన్‌ ప్లే, సీన్స్‌ పోట్రెట్‌ చాలా బాగుంటుంది. ఈ కథను దర్శకుడు ఎలా ఆలోచించారు?ఎలా సీన్లు రాసుకున్నారు? వాటిని ఎలా కనెక్ట్‌ చేశారు? అనేది నాకు ఇప్పటికి సర్ప్రైజింగ్‌గా ఉంది. విజయ్‌ చాలా మంచి నటుడు, ఫస్ట్‌ మూవీ అయినా ఎలాంటి బెరుకు లేకుండా నటించాడు. టీమ్‌ అందరికీ ఆల్‌ ది బెస్ట్‌'' అన్నారు.


దర్శకుడు కె . రమాకాంత్‌ మాట్లాడుతూ - '' ఇది ఒక డార్క్‌ కామెడీ హారర్‌ థ్రిల్లర్‌. ఏప్రిల్‌1న పుట్టి స్టుపిడ్‌ పనులు చేసే ముగ్గురి జీవితాలు అనుకోని సంఘటన వల్ల ప్రమాదంలో పడితే ఆ ప్రమాదం నుండి ఎలా బయటపడ్డారు అనే పాయింట్‌తో ఈ కథ రాసుకున్నాను. తెలుగు స్క్రీన్‌ మీద ఇప్పటి వరకు మీరు చూడని లవ్‌ స్టోరీ ఈ సినిమాలో చూడబోతున్నారు. జాషువా మాస్టర్‌ కంపోజ్‌ చేసిన యాక్షన్‌ సీన్లు సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయి. బాబీ సింహ, అజయ్‌ ఘోషి క్యారెక్టర్స్‌ అద్భుతంగా వచ్చాయి. ఆగష్టు 23 అందరూ సినిమా చూడండి'' అన్నారు.


హీరో విజయ్‌ రాజా మాట్లాడుతూ - ''జిగర్తాండ' సినిమాలో బాబీ సింహ గారి నటన చూసి ఆయనతో ఒక్క సినిమాలోనైనా నటించాలి అనుకున్నాను. నా మొదటి సినిమాకే ఆయనతో కలిసి నటించడం నా అద ష్టం. అలాగే అజయ్‌ గోషి లాంటి సీనియర్‌ నటుడితో నటించడం హ్యాపీ. సంగీతం, ఆర్‌ ఆర్‌ అలాగే విజువల్స్‌ సినిమాకు హైలెట్‌. ఈ సినిమా తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను' అన్నారు.


కో ప్రొడ్యూసర్‌ సుదర్శన్‌ హనగోడు మాట్లాడుతూ - ''రమాకాంత్‌ ఒక స్నేహితుడిలా నాకు హెల్ప్‌ చేశారు. ఒక మంచి సినిమాలో భాగం అయినందుకు సంతోషంగా ఉంది. విజయ్‌, బాబీ సింహ, అజయ్‌ గోషిలతో కలిసి వర్క్‌ చేసే అవకాశం రావడం గొప్ప విషయం. ఆగష్టు 23 అందరూ సినిమా చూడండి'' అన్నారు.

 
ఇంకా ఈ కార్యక్రమంలో పూజ సోలంకి , సాషా సింగ్‌, ఫైట్‌ మాస్టర్‌ జాషువా, ఎడిటర్‌, ఎస్‌ బి ఉద్దవ్‌ ,రచ్చరవి పాల్గొని సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు.


విజయ్‌ రాజా, పూజా సోలంకి, సాషా సింగ్‌, బాబీ సింహా, రచ్చరవి, శివ తేజ, వైవా రాఘవ, నాగబాబు, అజయ్‌ ఘోష్‌, వెన్నెల కిశోర్‌, తాగుబోతు రమేష్‌ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.
టెక్నీషియన్లు:
దర్శకుడు: కె. రమాకాంత్‌
బ్యానర్లు: వెట్‌ బ్రెయిన్‌ ఎంటర్‌ట్కెన్‌మెంట్స్‌, సుధర్మ్‌ ప్రొడక్షన్స్‌
సహ నిర్మాత: పి. సుదర్శన్‌
ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: విజయ్‌ప్రకాష్‌ అన్నంరెడ్డి
సంగీతం: శ్రీకాంత్‌ పెండ్యాల
సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డి
ఎడిటర్‌: ఎస్‌.బి.ఉద్ధవ్‌
స్టంట్స్‌: జాషువా మాస్టర్‌
మాటలు: వికర్ణ
స్క్రీన్‌ప్లే: కోటి బండారు, వేణుగోపాల్‌రెడ్డి
ఆర్ట్‌: రమేష్‌
లిరిక్స్‌: ఇమ్రాన్‌ శాస్త్రి, ప్రణవ్‌చాగంటి,అలరాజు
పీఆర్‌ఓ: వంశీ శేఖర్‌.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా చేసి అందరినీ స్వీట్ షాక్ కి గురి చేసా ..

Read More !

Gossips

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !