View

శివ కంఠమనేని ఫ్యామిలీ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ప్రారంభం

Saturday,August24th,2019, 01:33 PM

శివ కంఠమనేని కథానాయకుడిగా లైట్‌ హౌస్‌ సినీ మేజిక్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెం. 2గా రూపొందుతోన్న నూతన సినిమా హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో శనివారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. సంజీవ్‌ మేగోటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు జి. రాంబాబు యాదవ్‌, ఆర్‌. వెంకటేశ్వరరావు, కె.ఎస్‌. శంకరరావు, వి. కృష్ణారావు నిర్మాతలు. యువ కథానాయిక నందితా శ్వేత, రాశి. కె. అశోక్‌కుమార్‌. శ్రీనివాసరెడ్డి ప్రధాన తారాగణం. ఈ ప్రారంభోత్సవంలో శివ కంఠమనేని, నందితా శ్వేత, రాశిపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ‘వాసవి గ్రూప్‌’ విజయ్‌కుమార్‌ కెమెరా స్విచ్ఛాన్‌ చేయగా... అశోక్‌ కుమార్‌ క్లాప్‌ ఇచ్చారు. చంద్ర సిద్ధార్థ గౌరవ దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్‌, నటుడు, రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి అతిథులుగా హాజరయ్యారు.


శివ కంఠమనేని మాట్లాడుతూ ‘‘ఇంతకు ముందు మేం లైట్‌ హౌస్‌ సినీ మేజిక్‌ పతాకంపై ‘అక్కడొకటుంటాడు’ సినిమా చేశాం. ఇది మా రెండో ప్రొడక్షన్‌. కుటుంబ కథా చిత్రమిది. అలాగే, సస్పెన్స్‌ థ్రిల్లర్‌! ఇందులో నేను, రాశిగారు లీడ్‌ రోల్స్‌ చేస్తున్నాం. హీరోయిన్‌గా నందితా శ్వేతగారు చేస్తున్నారు. శ్రీనివాసరెడ్డి మరో లీడ్‌ రోల్‌ చేస్తున్నారు. మా దర్శకుడు సంజీవ్‌ మేగోటి ఇంతకు ముందు తెలుగు, కన్నడ భాషల్లో సినిమాలు చేశారు. రెండు షెడ్యూళ్ళల్లో సినిమాను పూర్తి చేయాలనుకుంటున్నాం. ఈ రోజు రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తున్నాం. 25 రోజుల పాటు ఈ షెడ్యూల్‌ కంటిన్యూ అవుతుంది. ఇది పూర్తయిన తర్వాత పది పదిహేను రోజులు విరామం తీసుకుని రెండో షెడ్యూల్‌ ప్రారంభిస్తాం. ఈ సినిమాలో మొత్తం ఐదు పాటలు ఉన్నాయి. ఆల్రెడీ నాలుగు పాటలు రికార్డ్‌ చేశాం. పాటలు విన్న వారందరూ మంచి బావున్నాయని ప్రశంసించారు. ఒక మంచి సినిమా ప్రేక్షకులు అందివ్వాలని మా తాపత్రయం’’ అని అన్నారు.


రాశి మాట్లాడుతూ ‘‘చాలా గ్యాప్‌ తర్వాత మంచి సినిమాతో నేను మళ్లీ ప్రేక్షకుల ముందుకొస్తున్నాను. ముఖ్యంగా నాకు కథ బాగా నచ్చింది. వెరీ బోల్డ్‌, ఇండిపెండెంట్‌ విమెన్‌ క్యారెక్టర్‌ చేస్తున్నాను. చాలా రోజులకు నాకు నచ్చిన పాత్ర వచ్చింది. ఈ మధ్యలో చాలా పాత్రలు వచ్చాయి. కానీ, నేను యాక్సెప్ట్‌ చేయలేదు. ఇందులో నందితా శ్వేత నా కుమార్తెగా చేస్తోంది. తనతో నేను తొలిసారి నటిస్తున్నా. అలాగే, చాలా రోజుల తర్వాత అన్నపూర్ణమ్మగారితో సినిమా చేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది’’ అని అన్నారు.


అన్నపూర్ణమ్మ మాట్లాడుతూ ‘‘లైట్‌ హౌస్‌ అంటే చాలా వెలుతురుగా ఉంటుంది. చాలా దూరం కనిపిస్తుంది. మా సినిమా కూడా చాలా బాగా, బ్రహ్మాండంగా ఉంటుంది. నా క్యారెక్టర్‌ కూడా బావుంటుంది. రాశి చెప్పినట్టు నాదీ ఇండిపెండెంట్‌ క్యారెక్టర్‌. ఇందులో రాశి నా కుమార్తెగా, నందిత నా మనవరాలిగా నటిస్తున్నారు. అందరి ఆశీర్వాదంతో నాకు వెరైటీ క్యారెక్టర్లు లభిస్తున్నాయి’’ అని అన్నారు.


నందితా శ్వేత మాట్లాడుతూ ‘‘నేను తమిళ్‌, కన్నడ సినిమాలు చేస్తున్నప్పుడు ‘మీరు తెలుగు సినిమాలు చేస్తారా? ఓన్లీ గ్లామర్‌ రోల్స్‌ ఉంటాయి?’ అని అక్కడివారు అడిగేవారు. నేను వెయిట్‌ చేసి చేసి మంచి సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాను. ఇప్పటివరకూ గ్లామర్‌ కంటే ఎక్కువగా నటనకు ఆస్కారం ఉన్న పాత్రల్లో నటించాను. ఫీమేల్‌కి వేల్యూ ఉన్న పాత్రలే చేశాను. ఇప్పుడు ఈ సినిమాలో గ్లామర్‌ రోల్‌ చేస్తున్నాను. వెరీ హ్యాపీ. ఎగ్జైటింగ్‌గా ఉంది. ఇందులో నా క్యారెక్టర్‌ పేరు లక్కీ. టెర్రర్‌ గాళ్‌గా కనిపిస్తా. మంచి మంచి యాక్టర్స్‌తో చేస్తున్నా. నేను నేర్చుకోవడానికి ఎంతో స్కోప్‌ ఉంది. నాపై నమ్మకంతో ఈ క్యారెక్టర్‌ ఇచ్చినందుకు థ్యాంక్స్‌’’ అని అన్నారు.


దర్శకుడు సంజీవ్‌ మేగోటి మాట్లాడుతూ ‘‘నేను చాలా ఏళ్ల క్రితం తెలుగులో సినిమాలు చేశాను. తర్వాత కర్ణాటక వెళ్లాను. కన్నడలో ఆరు సినిమాలకు దర్శకత్వం వహించాను. స్ర్కీన్‌ప్లే రైటర్‌గా కన్నడ, తెలుగు ఛానల్స్‌లో బిజీగా ఉన్నాను. మంచి ప్రాజెక్ట్‌ చేయాలని అనుకుంటున్న టైమ్‌లో కొత్తదనంతో కూడిన కథ రెడీ చేశా. కథ ప్రకారం 40, 45 సంవత్సరాల వయసు ఉన్న హీరో కావాలి. సరైన కథకు సరైన నటీనటులు లభిస్తే ఎంత బావుంటుందో ప్రేక్షకులందరికీ తెలుసు. శివ కంఠమనేని, రాశి, నందిత, అన్నపూర్ణమ్మ, శ్రీనివాసరెడ్డి, అజయ్‌ ఘోష్‌... ఇలా మంచి మంచి నటీనటులు కుదిరారు. కథకు ఏం కావాలో చెప్పమని అడిగిన నిర్మాతలకు థ్యాంక్స్‌. ‘బుద్ధం శరణం గచ్చామి’... అంటే శాంతంగా ఉండాలన్న దేవకి పాత్రలో రాశిగారు నటిస్తున్నారు. ‘బుద్ధం శరణం గచ్ఛామి కాదు... యుద్ధం శరణం గచ్ఛామి’... అంటే ఇప్పుడున్న కాలంలో శాంతంతో కాదు, ఆలోచిస్తూ ఆవేశంతో సమస్యలను ఎదుర్కొవాలన్న పాత్రలో శివ కంఠమనేనిగారు నటిస్తున్నారు. శాంతం, ఆవేశం అన్నీ కలగలిపితేనే జీవితం అనే క్యారెక్టర్‌లో నందితా శ్వేతాగారు నటిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఢిఫరెంట్‌ క్యారెక్టర్లలో కనిపిస్తారు. ఫస్ట్‌ షెడ్యూల్‌ హైదరాబాద్‌లో, సెకండ్‌ షెడ్యూల్‌లో వైజాగ్‌లో చేస్తాం’’ అని అన్నారు.


నిర్మాతలలో ఒకరైన ఆర్‌. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ‘‘గత ఏడాది శివ కంఠమనేని హీరోగా ‘అక్కడొకటుంటాడు’ సినిమా చేశాం. ఇప్పుడు మా రెండో సినిమా ప్రారంభించాం. ఇందులోనూ శివ కంఠమనేని హీరో. ఈ సినిమా కంటే ముందు చాలా కథలు విన్నాం. సంజీవ్‌ మేగోటిగారు మంచి కథ చెప్పారు. ఆ కథ నచ్చడంతో ఈ సినిమా మొదలుపెట్టాం. అశ్లీలత, అసభ్యతకు తావు లేకుండా కుటుంబమంతా కలిసి చూసేలా సినిమా తీస్తున్నాం’’ అని అన్నారు.


నిర్మాతలలో ఒకరైన రాంబాబు యాదవ్‌ మాట్లాడుతూ ‘‘కథ నచ్చి మేమంతా పెట్టుబడి పెట్టడానికి సిద్ధపడ్డాం. ఈ సినిమా బాగా వస్తుందని మా దర్శకుడు, మాటల రచయిత పనితనం చూస్తే అర్థమవుతుంది. పెద్దలు, పిల్లలు, కుటుంబం అందరూ రెండు గంటలు ఆనందించే సినిమా తీయాలని మేం ప్రయత్నిస్తున్నాం. ఉమ్మడి రాష్ట్రాల్లో ప్రజలు మొదటి సినిమాకు మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చారు. ఈ సినిమాకూ అదే విధంగా మంచి ప్రోత్సాహాన్ని ఇస్తారని, ఆశ్వీరదిస్తారని ఆశిస్తున్నాం’’ అని అన్నారు.


సంగీత దర్శకుడు సుధాకర్‌ మారియో మాట్లాడుతూ ‘‘యశస్వినీ గున్నుగారితో కలిసి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాను. సంజీవ్‌గారు ఇంతకు ముందు చేసిన సినిమాలకు నేను కీబోర్డ్‌ ప్లేయర్‌గా పని చేశా. నాకు సంగీత దర్శకుడిగా పని చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు, దర్శకుడికి థ్యాంక్స్‌’’ అని అన్నారు.


మాటల రచయిత అంజన్‌ మాట్లాడుతూ ‘‘ప్రముఖ ఛానల్స్‌లో వస్తున్న మెగా సీరియల్స్‌కి నేను మాటలు రాశా. ఇంతకు ముందూ చాలా వాటికి రాశాను. సినిమాకు మాటలు రాయాలన్న తపన, ఆశయం నాలో ఉన్నాయి. లైట్‌ హౌస్‌ సినీ మేజిక్‌ వాళ్లు నాకు అవకాశం ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నాను. మంచి కథకు మంచి మాటలు రాస్తే వచ్చే ఆనందం, రిజల్ట్‌ అందరికీ తెలిసిందే. సంజీవ్‌గారు మంచి కథ అందించారు. ఇటువంటి కథకు కమర్షియల్‌ హంగులు, మంచి నటీనటులు, సాంకేతిక నిపుణులు ఉన్నప్పుడు మాటలు రాయడం ఎంత ఉత్సాహంగా ఉంటుంది’’ అని అన్నారు.


శివ కంఠమనేని, నందితా శ్వేత, రాశి, శ్రీనివాసరెడ్డి, కె. అశోక్‌కుమార్‌, అజయ్‌, పోసాని కృష్ణమురళి, ప్రవీణ్‌, ‘బిత్తిరి సత్తి, అజయ్‌ ఘోష్‌, ఆదిత్యా మీనన్‌, అన్నపూర్ణమ్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రంలో ప్రధాన తారాగణం.


సాంకేతిక నిపుణుల వివరాలు....
స్టంట్స్‌: సతీష్‌
కూర్పు: ఆవుల వెంకటేశ్‌
కళా దర్శకుడు: కె.వి. రమణ
మాటలు: అంజన్‌
ఛాయాగ్రహణం: హరీష్‌
ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: గంటా శ్రీనివాసరావు
నిర్మాణ సంస్థ పేరు: లైట్‌ హౌస్‌ సినీ మేజిక్‌
సంగీత దర్శకులు: యశస్వినీ గున్ను, సుధాకర్‌ మారియో
నిర్మాతలు: జి. రాంబాబు యాదవ్‌, ఆర్‌. వెంకటేశ్వరరావు, కె.ఎస్‌. శంకరరావు, వి. కృష్ణారావు
కథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: సంజీవ్‌ మేగోటి

 

Siva Kantamaneni's suspenseful family thriller's puja held

 

The Production No. 2 of Light House Cine Magic banner was launched on Saturday at Hyderabad's Ramanaidu Studios with a puja ceremony. Siva Kantamaneni is the hero of the project. To be directed by Sajeev Megoti, this one is produced by G Rambabu Yadav, R Venkateswara Rao, KS Sankara Rao, and V Krishna Rao. Nandita Swetha, Raashi, K Ashok Kumar and Srinivasa Reddy play key roles.


During the launch event, the first shot was filmed on the hero, Nandita Swetha and Raashi. If Vasavi Group's Vijay Kumar switched on the camera, Ashok Kumar gave the clap. Chandra Siddhartha directed it. Prominent producer C Kalyan, and Posani Krishna Murali attended the event as guests.


Speaking on the occasion, Siva Kantamaneni said, "Akkadokaduntadu was the first film on our banner. The current project is a family entertainer. It's also a suspense thriller wherein me and Raashi garu are playing lead roles. Nandita Swetha and Srinivasa Reddy garu have other lead roles. The director has previously made films in Kannada and Telugu. The plan is to complete the shoot in two schedules. The first schedule will go on for 25 days. The next one will start after a gap of 15 days. We have completed recording four of the five songs."


Raashi said, "I am glad to be coming in front of the camera after a long gap with a very good role. I am playing a bold and independent woman in the movie. I have got a nice role after a long time. Nandita Swetha is playing my daughter. I am working with Annapurnamma garu after several years."


Annapurnamma said, "Like the name of the banner, our film is going to be magnificent. I am playing a strong role as the mother to Raashi."


Nandita Swetha said, "I entered the Telugu film industry with a strong role a few years ago. I have consistently chosen performance oriented roles. I am playing a strong role once again in this movie. Lucky is the name of my character. Since I will be working with very good actors, I am hoping to learn a lot."


Director Sanjeev Megoti said, "I did films in Telugu several years ago. I then moved to Sandalwood. I have been a busy screenplay writer, too. My latest film has got a meaty story. As per the story, we needed a hero who is middle-aged. Happily, we have got on board an ensemble cast. Raashi plays a peaceful character. Siva Kantamaneni will be seen in the opposite kind of character. Nandita Swetha represents the best traits of the two. The first schedule will be shot in Hyderabad. The second one will be shot in Vizag."


Producer R Venkateswara Rao said, "We okayed this project after listening to several stories. There is no place for obscenities, vulgarity in the movie. We are glad to have teamed up with Siva Kantamaneni once again."


Rambabu Yadav said, "We got together to produce the movie only because of the script. We are confident about the writing department. Our endeavour is to make a family entertainer. We hope that the audience will bless our movie as they did the first one."


Music director Sudhakar Mario said, "I have teamed up with Yasaswini Gunnu for the movie's music. I did keyboard playing for the director's previous movies. I thank the makers for this opportunity."


Dialogue writer Anjan said, "I have penned dialogues for a number of mega TV serials. I have always loved writing for movies. A good story, combined with good dialogues, would be great. This is a proper commercial story."


Cast: Siva Kantamaneni, Nandita Swetha, Raashi, Srinivasa Reddy, K Ashok Kumar, Ajay, Posani Krishna Murali, Praveen, Bithiri Sathi, Ajay Ghosh, Aditya Menon, Annapurnamma


Crew: Stunts: Satish, Editing: Avula Venkatesh , Art: KV Ramana, Dialogues: Anjan, Cinematography: Harish, Executive Producer: Ganta Srinivas Rao, Banner: Light House Cine Magic, Music Directors: Yasaswini Gunnu, Sudhakar Mario, Producers: G Rambabu Yadav, R Venkateswara Rao, KS Sankara Rao, V Krishna Rao, Story, screenplay, direction: Sanjeev MegotiAuthor :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !