View

మహానటి ఏ ఒక్కరో కాదు.. అందరూ మహానటిలే : జయసుధ

Tuesday,September03rd,2019, 12:05 PM

ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకు ఇద్దరు బ్రదర్స్ ఉన్నారనీ, వారిలో ఒకరు మోహన్‌బాబు అయితే, మరొకరు మురళీమోహన్ అనీ సహజనటిగా పేరుపొందిన జయసుధ వ్యాఖ్యానించారు. అంతే కాదు.. మనం 'మహానటి' అనే మాటను ఒకరికే ఉపయోగిస్తుంటామనీ, కానీ అందరూ మహానటిలేననీ ఆమె అన్నారు. జయసుధకు 'అభినయ మయూరి' అనే ఆవార్డును ఇవ్వనున్నట్లు కళాబంధు టి. సుబ్బరామిరెడ్డి ప్రకటించారు. ఆయన జన్మదినమైన సెప్టెంబర్ 17న విశాఖపట్నంలో ఆ అవార్డును ప్రదానం చేయనున్నారు. దీనికి సంబంధించి మంగళవారం హైదరాబాద్‌లో ఆయన ఏర్పాటు చేసిన సమావేశంలో జయసుధ మాట్లాడారు.


"ఫిల్మ్ ఇండస్ట్రీలో నాకు ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. ఒకరు మోహన్‌బాబు గారైతే, మరొకరు మురళీమోహన్ గారు. మురళీమోహన్ గారితో హీరోయిన్‌గా ఎక్కువ సినిమాల్లో నటించాను. వాటిలో ఎన్నో సక్సెస్ అయ్యాయి. మహానటి అంటే మనం ఒక్కరే అనుకుంటాం. అందరూ మహానటిలే. మహనటి అయితే తప్ప ఇండస్ట్రీలో సస్టైన్ అవలేం. జమున గారి నుంచి డిసిప్లిన్ నేర్చుకున్నా. ఆమెకంటూ కొన్ని ప్రిన్సిపుల్స్ ఉన్నాయి. వాటిని శాక్రిఫైస్ చెయ్యకుండా సక్సెసయ్యారు. మురళీమోహన్ గారు ఎవర్‌గ్రీన్ హీరో. ఆయన (జుట్టుకి) కలర్ వేసుకున్నా, వేసుకోకపోయినా యువకుడిలాగే కనిపిస్తారు. మా ఇంట్లో జీన్స్ ప్రకారం నా జుట్టు ఊడిపోతోంది. అవార్డులు రాకపోయినా ఫర్వాలేదని అంటుంటాం కానీ, అవార్డులు వస్తే మనసులో సంతోషంగా అనిపిస్తుంది. అవార్డు అనేది మనం చేసిన పనికి గుర్తింపు. కొన్ని అవార్డులు ఇస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఉదాహరణకు నంది అవార్డులు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు వాటిని పక్కన పెట్టేశాయి. తమిళనాడు ప్రభుత్వం సినిమా ప్రముఖులకు కలైమామణి అవార్డు ఇస్తూ వస్తోంది. వాళ్లు దాన్ని బాగా చేస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు వాటిని ఏ పేరుతో ఇస్తారో.. ఇవ్వాలి. వాళ్లే మమ్మల్ని గుర్తించకపోతే ఎలా? మేం చాలా కార్యక్రమాలకు వస్తుంటాం. సోషల్ వర్క్‌కు రావాలంటే వస్తాం. అలాంటి మమ్మల్ని గుర్తించి అవార్డులిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. దానివల్ల నవ తరానికి కూడా అవార్డు విలువ తెలుస్తుంది. ఎవరిచ్చినా, ఇవ్వకపోయినా సుబ్బరామిరెడ్డి గారు ఆయన బర్త్‌డేకి అవార్డులు ఇస్తుంటారు. 20 ఏళ్ల నుంచీ నిర్విరామంగా ఆయన అవార్డులు ఇస్తుండటం చాలా గొప్ప విషయం" అని ఆమె అన్నారు.


అంతకు ముందు కళాబంధు టి. సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ "ఇరవై ఏళ్ల నుంచీ సెప్టెంబర్ 16, 17 తేదీల్లో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నా. సినీ రంగానికి చెందిన ఎంతోమంది గొప్పవాళ్లకు అవార్డులు ఇస్తూ వస్తున్నా. ఇప్పుడు జయసుధకు 'అభినయ మయూరి' అనే అవార్డును ఇవ్వబోతున్నా. ఆమె అద్భుత నటి. మనం గర్వించే నటి. ఆమెది 46 ఏళ్ల కెరీర్. సెప్టెంబర్ 17న విశాఖపట్నంలోని కళావాహిని ఆడిటోరియంలో ఆమెకు అవార్డును ప్రదానం చేస్తాం. దానికి సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు వస్తున్నారు. కొంతమంది సినిమా కళను తక్కువ చేసి మాట్లాడుతుంటారు. కానీ ఎన్నో శాఖల్ని ఇముడ్చుకున్న సినిమా దేవుని సృష్టిలో చాలా గొప్ప కళ. ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి మహానటులు ఏ అవార్డు ప్రకటించినా వచ్చి తీసుకునేవాళ్లు. ఇప్పటి హీరోలు వాళ్లను ఫాలో కావడం లేదు" అన్నారు.


సీనియర్ నటుడు మురళీమొహన్ మాట్లాడుతూ "జయసుధ అదివరకు చేసిన సినిమాలు ఒక ఎత్తు అయితే, 'జ్యోతి' సినిమా మరో ఎత్తు. ఆ సినిమాతో ఆమె నటిగా విపరీతమైన పేరు తెచ్చుకుంది. ఇద్దరం చాలా సినిమాల్లో కలిసి నటించాం. తను స్నేహానికి చాలా విలువిచ్చే నటి. సుబ్బరామిరెడ్డిగారు ఆమెకు 'అభినయ మయూరి' అనే అవార్డుతో సత్కరించనుండటం ఆనందంగా ఉంది. ఏదో ఒకరోజు నాకు కూడా ఆయన ఏదో ఒక అవార్డును ఇస్తారని ఆశిస్తున్నా. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా అవార్డుల్ని పట్టించుకోవట్లేదు. నంది అవార్డు వచ్చిందంటే గొప్పగా చెప్పుకుంటారు. దయచేసి ఇప్పటి ప్రభుత్వం ఆ అవార్డుల్ని ఇవ్వాల్ని కోరుతున్నా. నాలుగేళ్ల నుంచీ ఆ అవార్డులు పెండింగులో ఉన్నాయి" అని చెప్పారు.


ఒకప్పటి అందాల నటి జమున మాట్లాడుతూ "జయసుధ 'పండంటి కాపురం'లో నా కూతురిగా నటించింది. చాలా చక్కని నటి. ఆమెకు సుబ్బరామిరెడ్డిగారు అవార్డు ప్రకటించడం ఆనందంగా ఉంది. ఆమె మాతో సమానమైన మహానటి అని చెప్పొచ్చు. గొప్ప గొప్ప పాత్రలు చేసింది. కళల పట్ల, సినీ రంగం పట్ల సుబ్బరామిరెడ్డి గారికున్న అభిమానం చాలా గొప్పది. విశాఖపట్నంలో ఆయన చేసే సేవా కార్యక్రమాలు అపూర్వం" అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా చేసి అందరినీ స్వీట్ షాక్ కి గురి చేసా ..

Read More !

Gossips

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !