View

టి మా అసోసియేషన్ కార్యవర్గ సభ్యులను ప్రకటించిన తెలంగాణ ఫిలించాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఛైర్మన్‌ డా.ప్రతాని రామకృ

Wednesday,September04th,2019, 11:13 AM

తెలంగాణ ఫిలించాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఛైర్మన్‌ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్‌ నూతనంగా ఏర్పాటు చేసిన ‘టి మా’ (తెలంగాణ మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌’ కార్యవర్గ సభ్యులను ఈ రోజు హైదరాబాద్‌లో ప్రకటించారు. ‘టి మా’ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌గా జెవిఆర్‌, వైస్‌ ప్రెసిడెంట్స్‌గా సీనియర్‌ నటి గీతాంజలి, నటుడు బాలాజీ, హీరో దిలీప్‌ రాథోడ్‌ , జనరల్ సెక్రటరీగా స్నిగ్ధ మద్వాని , జాయింట్‌ సెక్రటరీ స్ గా నటుడు కిరణ్‌ , లత, ఇమ్మడి ధర్మా రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీస్ గా వై.శ్రీనివాస్ , ఆదర్శిని, యోగి తో పాటు ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబెర్స్ గా గుండు రవి తేజ, ప్రేమ్ , శ్రీశైలం , గీత సింగ్ , గాయత్రీ , మహాలక్ష్మి , టి, న్యూస్ రాజేష్ , ప్రవీణ , మమత, దయ ఎన్నికయ్యారు.


ఈ సందర్భంగా డా.ప్రతాని రామకృష్ణ గౌడ్‌ మాట్లాడుతూ...‘ ఇప్పటికే తెలంగాణ ఫిలించాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌లో 85 సినిమాలకు సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేశాం. అలాగే చాలా సినిమా టైటిల్స్ రిజిస్ట్రేషన్ చేశాం. మా ఛాంబర్‌లో మెంబర్సైన నిర్మాతల ను అన్ని విధాల ఆదుకుంటున్నాం. ఇక ఇప్పటి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు గతంలో కేంద్రంలో సినిమాటోగ్రఫీ మంత్రిగా వ్యవహరిస్తోన్న సమయంలో మా ‘టియఫ్‌సిసి’కి పర్మిషన్‌ ఇప్పించారు. వారికి పత్రికాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. మా ఛాంబర్‌లోసభ్యులైన వారికి హెల్త్‌కార్డ్స్‌తో పాటు అనేక రకాలుగా ఆర్థిక సాయం అందిస్తున్నాం. ఇప్పటికే చాలా మంది వాటిని ఉపయోగించుకోవడం కూడా జరుగుతోంది. ఇక మా ఛాంబర్‌ కేవలం తెలంగాణ నటీనటులకు చెందినది మాత్రమే కాదు. రెండు రాష్ట్రా లవారికి మెంబర్స్‌ అయ్యే అవకాశం ఉంది. ఆల్‌ ఇండియా వైస్‌గా ఐదువేల మందికి పైగా నటీనటులు , సాంకేతిక నిపుణులు మా చాంబర్‌లో మెంబర్స్‌గా ఉన్నారు. ఇక ఒక మంచి ఉద్దేశంతో ఈ రోజు ‘టి మా’ (తెంగాణ మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌) ప్రారంభించాం. అందరి ఆమోదంతో ‘టి మా’ అధ్యక్షులుగా జెవిఆర్‌, ఉపాధ్యక్షులుగా సీనియర్‌ నటి గీతాంజలిగారిని ఎన్నుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. వారి వారి బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిసారని ఆశిస్తున్నా. ఇక ఇప్పటికే తెంగాణ స్టేట్‌ ఫిలించాంబర్‌ ఒకటి ఉంది కదా అనేది కొంత మంది ప్రశ్న. అయితే అది నభై ఏళ్లుగా ఉంది కానీ, డిస్ట్రిబ్యూటర్స్‌కు సంబంధించింది. అందులో డిస్ట్రిబ్యూటర్సే మెయిన్‌ మెంబ ర్స్‌గా ఉంటారు. మా దాంట్లో అలా కాదు నిర్మాతలే ముఖ్య పాత్ర వహిస్తారు’’ అన్నారు.


‘టియఫ్‌సిసి’ వైస్‌ ఛైర్మన్‌, నిర్మాత గురురాజ్‌ మాట్లాడుతూ..‘ఇటీవల నన్ను ప్రతాని రామకృష్ణ గారు ‘టియఫ్‌సిసి’కి వైస్‌ ఛైర్మన్‌ బాధ్యతలు అప్పగించారు. ఇక ‘టి మా’ను ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఎన్నికైన ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ...వారి వారి బాధ్యతల ను సక్రమంగా నిర్విరిస్తారని ఆశిస్తున్నా’’ అన్నారు.


‘టి మా’ అధ్యక్షులు జెవిఆర్‌ మాట్లాడుతూ...‘‘మా పై నమ్మకంతో `టి మా` కు అధ్యక్షులుగా పదవిని అప్పగించిన ప్రతాని గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ..‘టి మా’ అభివృద్ధికి కృషి చేస్తాను’’ అన్నారు.


సీనియర్‌ నటి, ‘టి మా’ ఉపాధ్యక్షురాలు గీతాంజలి మాట్లాడుతూ...‘‘ నా యాభై ఐదేళ్ల సినిమా కెరీర్‌లో ఎన్నో కష్టనష్టాలు అనుభవించాను.అయినా ఏనాడు నిరుత్సాహ పడలేదు. నటులు ఎప్పుడూ నిరుత్సాహ పడకూడదు. ‘సీతారామ కళ్యాణం’ తో నాకు ఎన్టీరామారావుగారు సీతగా సినీ పరిశ్రమలో మంచి గుర్తింపునిచ్చారు. అది నా అదృష్టం. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో నటీ నటులకు మంచి వేషాలు రావట్లేదనే చెప్పాలి. ఒకటి, రెండు రోజు కాల్‌ షీట్స్‌ అడుగుతున్నారు. అవి అలా కనిపించి ఇలా వెళ్లిపోయే పాత్రలు . నేను కూడా సినిమాల్లో నాయనమ్మ పాత్రలు చేస్తున్నాను. ఇక ప్రతాని రామకృష్ణగారు మా వారికి మంచి మిత్రులు, మంచి మనిషి. వారు అడగడంతో నేను ‘టి మా’కు ఉపాధ్యక్షులుగా వ్యవహరిస్తున్నా. `టి మా` అసోసియేషన్‌ అభివృద్ధిలోకి రావాన్నది నా కోరిక. దానికి నా వంతు నేను కృషి చేస్తాను’’ అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా చేసి అందరినీ స్వీట్ షాక్ కి గురి చేసా ..

Read More !

Gossips

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !