View

మీరు మర్చిపోయిన రిలేషన్స్ అన్నీ గుర్తుకొస్తాయి - నీ కోసం చిత్ర యూనిట్

Thursday,September05th,2019, 04:47 AM

తెలుగు ప్రేక్షకులకు అందమైన ప్రేమకథ అందించేందుకు వస్తున్న చిత్రం నీకోసం. నిజ జీవితంలో చూసిన, విన్నసంఘటనల నుండి పుట్టిన కథే నీ కోసం. అందరూ కొత్త వాళ్లే అయినా కొత్తదనం నిండిన కథతో ఎంటర్టైన్ చేసేందుకు ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు మంచి ఆదరణ సొంతం చేసుకున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో...


మ్యూజిక్ దర్శకుడు శ్రీనివాస్ శర్మ మాట్లాడుతూ - పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రతి ఒక్కరూ జీవితంలో ఏదో ఒక సంఘటన ఈ సినిమా లో ఏదో సీన్ కి కనెక్ట్ అవుతుంది. ఈ సినిమా రి రికార్డింగ్ లో ఒక మంచి సినిమా కు పనిచేసాను అనే సంతృప్తి కలిగింది టీం అందరూ బాగా చేసారు అన్నారు.


హీరో అరవింద్ రెడ్డి మాట్లాడుతూ - అందరం కొత్తవాళ్లమే. ఈ సినిమా ఎందుకు చూడాలి అనే వారికి నేను ఇచ్చే భరోసా ఒక్కటే ఈ సినిమా ఆడుతున్న థియేటర్స్ దగ్గర నా మొబైల్ నెంబర్ కౌంటర్ లో ఇస్తాను చూసి ఈ సినిమా బాగోలేదు అంటే నేను వాళ్ళ డబ్బులు వెనక్కి ఇస్తాను. ఈ సినిమా నా ఫ్యామిలీ సపోర్ట్ తో చేశాను. నా సహోదరి నాకు అండ గా నిలబడింది. దర్శకుడు నా స్నేహితుడు. ఒక ఆడియన్ గా సినిమాలు చూసే నేను ఇప్పుడు నా కుటుంబం ఇచ్చిన సపోర్ట్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసేందుకు ప్రయత్నించాను. సినిమా కథ అనుకున్నప్పటి నుండి ఫస్ట్ కాపీ చూసే వరకూ కూడా అంతే నమ్మకంతో పని చేసాము. అనుకున్న దాని కంటే బాగా కథ ను తెరమీద చూపాడు దర్శకుడు. ఒక మంచి ప్రేమకథ చూసిన ఫీల్ తప్పకుండా ప్రేక్షకులు ఫీల్ అవుతారు అన్నారు .


మరో హీరో అజిత్ రాధారామ్ మాట్లాడుతూ - నేను ఇక్కడ ఉన్నానంటే కారణం నన్ను సపోర్ట్ చేసిన మా నాన్న గారు, నాకు నటనలో శిక్షణ ఇచ్చిన సత్యానంద్ గారు, నా మీద నమ్మకం తో ప్రోత్సహించిన దర్శకుడు . స్టోరీకి నేను బాగా కనెక్ట్ అయ్యాను. రెగ్యులర్ లవ్ స్టోరీలా కాకుండా యూత్ అందరికీ బాగా కనెక్ట్ అయ్యే కథ. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఇలాంటి సంఘటనలు జరిగి ఉంటాయి. ప్రతి ఒక్కరూ రిలేట్ చేసుకుంటారు. నా పాత్ర ఒక సిన్సియర్ లవర్ గా ఉంటుంది. ఈ పాత్ర మీకు నిజ జీవితం లో చూసిన పాత్రలా ఉంటుంది. తప్పకుండా ప్రేక్షకులు మా ప్రయత్నాన్ని సపోర్ట్ చేస్తారనే నమ్మకం ఉంది అన్నారు.


హీరోయిన్ సుభాంగి పంత్ మాట్లాడుతూ - ఈ సినిమా రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నాను. ఈ సినిమా తప్పకుండా చూడాల్సిన సినిమా. లవ్ లోని భావోద్వేగాలు చాలా బాగా కన్సెక్ట్ అవుతాయి. ఈ టీమ్ తో పనిచేయడం మంచి అనుభూతినిచ్చింది. నా క్యారెక్టర్ ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. ఇది కేవలం లవ్ స్టోరీ మాత్రమే కాదు లైఫ్ స్టోరీ కూడా. ఈ సినిమా ప్రేక్షకులతో చూసేందు నేను ఎదురు చూస్తున్నాను అన్నారు.


మరో హీరోయిన్ దీక్షితా పార్వతి మాట్లాడుతూ - నేను ముందుగా మా అమ్మకు థాంక్స్ చెప్పాలి. నా ఇష్టాన్ని గౌరవించి ప్రోత్సహం అందించారు. ఒక బెస్ట్ టీం తో పనిచేసాను అనే ఫీల్ నాకు ఉంది. ఈ సినిమా లో పాటలు మీకు చాలా కాలం గుర్తుంటాయి. ఈ సినిమాలో మేం చేసిన ప్రతి క్యారెక్టర్ మీ అందరికీ కనెక్ట్ అవుతుంది. టీజర్, ట్రైలర్ చూసినప్పుడు మీకు మంచి ఫీలింగ్ వచ్చి ఉంటుంది. కానీ సినిమా చూసిన తర్వాత మీకు ఈ సినిమాతో ఓ ఎమోషనల్ బాండింగ్ కూడా ఏర్పడుతుంది. సినిమా కోసం చాలామంది కష్టపడ్డాం. మా దర్శకుడు చాలా ప్యాషన్ తో సినిమా చేశారు.. మాకు మీ అందరి ఆశిష్షులు కావాలి అని అన్నారు.


దర్శకుడు అవినాష్ కోకటి మాట్లాడుతూ - మనిషి పోయాక చాలా ప్రేమను చూపెడుతారు. కానీ ఉన్నప్పుడే ఆ ప్రేమని పంచుకుంటే జీవితం చాలా బాగుండేది. అదే నీ కోసం సినిమా లో చెప్పే ప్రయత్నం చేసాము. ఈ సినిమా లో ప్రేమ కథలు చాలా కాలం మీ తో ట్రావెల్ చేస్తాయి. మ్యూజిక్ దర్శకుడు అందించిన మ్యూజిక్ చాలా బాగుంది. ఒక పెద్ద స్టార్ హీరోకి ఇచ్చే ఆల్బం మాకు ఇచ్చాడు . ఈ సినిమా లో పాత్రలు మీకు తెలుసు అనే ఫీలింగ్ ప్రతి ఒక్క రి కీ కలుగుతుంది. మీరు మర్చిపోయిన, లేదా వదిలేసిన రిలేషన్స్ అన్ని మీకు మళ్లీ గుర్తొస్తాయి. ఇది కేవలం యూత్ కోసం మాత్రమే కాదు... ఒక ఎమోషనల్ డ్రైవ్ లాంటి సినిమా అని అన్నారు.


రాజలింగం సమర్పణలో తెరకెక్కిన ఈ మూవీ లో
అరవింద్ రెడ్డి, సుభాంగి పంత్, అజిత్ రాధారమ్, దీక్షితా పార్వతి ప్రధాన
పాత్రలలో నటిస్తున్నారు.
బ్యానర్: తీర్ధ సాయి ప్రొడక్షన్స్
ప్రొడ్యూసర్: అల్లూరమ్మ (భారతి)
సినిమాటోగ్రఫీ: శివక్రిష్ణ యెడుల పురమ్
ఎడిటింగ్ : తమ్మిరాజు
ఆర్ట్: క్రాంతి ప్రియ
పి.ఆర్. ఓ : జియస్ కె మీడియా
రచన, దర్శకత్వం : అవినాష్ కోకటిAuthor :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !