View

డైరెక్టర్ డి.గోపాల్ చేతుల మీదుగా రామ చ‌క్క‌ని సీత మూవీ ట్రైల‌ర్‌

Thursday,September05th,2019, 10:04 AM

క్రొకోడైల్ క్రియేష‌న్స్ మ‌రియు లియో సెల్యూలాయిడ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం రామ‌చ‌క్క‌ని సీత‌. ఈ చిత్రంతో శ్రీ‌హ‌ర్ష మండా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. శ్రీ‌మ‌తి విశాలాక్షి మండా, జి.ఎల్‌.ఫ‌ణికాంత్ నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ చిత్రానికి ఇంద్రా, సుక్రుతావేగ‌ల్ హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ చిత్ర ట్రైల‌ర్‌ను నేడు ప్ర‌సాద్‌ ల్యాబ్‌లో బి.గోపాల్ చేతుల మీదుగా విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా విలేక‌రుల స‌మావేశంలో...


ద‌ర్శ‌కుడు శ్రీ‌హ‌ర్ష మాట్లాడుతూ... ముందుగా నేను దాస‌రి కిర్‌ణ్‌గారికి నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నాను. మ‌మ్మ‌ల్ని ఆశీర్వ‌దించ‌డానికి ఇక్క‌డ‌కు విచ్చేసిన పెద్ద‌లంద‌రికీ థ్యాంక్స్‌. ఈ సినిమా తీసిన ఫ‌నీంద్ర నా ఫ్రెండ్ న‌న్ను. నా కోసం ఈ సినిమాని తీశాడు. హీరో హీరోయిన్లు ఈ సినిమా ద్వారా తొలిప‌రిచ‌యం అవుతున్నారు. ఈ చిత్రం అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని సెప్టెంబ‌ర్‌లో మీ ముందుకు వ‌స్తుంది అని అన్నారు.


హీరో ఇంద్ర మాట్లాడుతూ... ముందుగా ఇక్క‌డ‌కి విచ్చేసిన పెద్ద‌ల‌కి నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు. రామ చ‌క్క‌ని సీత ఈ చిత్రం గ‌త సంవ‌త్స‌రం ఇదే టైంకి మేము షూటింగ్‌లో ఉన్నాం. ఈ సంవ‌త్సం సినిమాని పూర్తి చేసుకుని మీ ముందుకు రావ‌డం చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు చూసిన ట్రైల‌ర్ మీ అంద‌రికి న‌చ్చి ఉంటుంద‌ని అనుకుంటున్నాను. ఈ సినిమా అంతా ఒన్‌మ్యాన్ షో క్రెడిట్ మొత్తం డైరెక్ట‌ర్‌దే. నాకు ఇంత మంచి అవ‌కాశం ఇచ్చినందుకు ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కి నా కృత‌జ్ఞ‌త‌లు. మా యూనిట్ అంద‌రూ చాలా కో-ఆర్డినేట్‌గా ప‌నిచేశారు. అంద‌రికీ చాలా చాలా థ్యాంక్స్‌. రైట‌ర్ విస్సూగారు నా ఫ్యామిలీ మెంబర్‌లాంటివారు మొద‌టినుంచి ఈ సినిమాకి చాలా హెల్ప్ చేస్తూ వ‌చ్చారు. అంద‌రికీ చాలా థ్యాంక్స్ అన్నారు.


హీరోయిన్ మాట్లాడుతూ... క‌న్న‌డ‌లో నేను 7చిత్రాల్లో న‌టించాను. తెలుగులో ఇదే నా మొద‌టి చిత్రం. క‌న్న‌డ ప్రేక్ష‌కులు న‌న్ను ఆద‌రించిన‌ట్లే తెలుగులో కూడా ఆద‌రిస్తార‌ని భావిస్తున్నాను. న‌న్ను ఈ సినిమాకి హీరోయిన్‌గా సెలెక్ట్ చేసుకున్నందుకు హ‌ర్ష‌గారికి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు. నేను ఇంత బాగా తెలుగు మాట్లాడ‌డానికి మొద‌టి కార‌ణం మా డైరెక్ట‌ర్ టీం అంతా బాగా హెల్ప్ చేశారు. నేను మీ ముందు ఉండ‌డానికి ప్ర‌ధాన కార‌ణం మా ప్రొడ్యూస‌ర్ ఫ‌ణిగారు ఆయ‌న‌కి నా కృత‌జ్ఞ‌త‌లు. ఆలాగే మ‌మ్మ‌ల్ని ఆశీర్వ‌దించ‌డానికి వ‌చ్చిన మా గెస్ట్‌లంద‌రికీ ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు అన్నారు.


రైట‌ర్ విస్సూ మాట్లాడుతూ... నేను ఈ సినిమా చూశాను చాలా బాగా వ‌చ్చింది. హ‌ర్షా ఎక్క‌డా కొత్త డైరెక్ట‌ర్ తీసిన‌ట్లు తియ్య‌లేదు. చాలా బాగా తీశాడు. బి.గోపాల్ గారు దాదాపుగా మా ఫ్యామిలీ మెంబ‌ర్ లాంటివారు ఆయ‌న ఈ సినిమా కోసం రావ‌డం ఆనందంగా ఉంది. కొత్త టీం అంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు. ఈ సినిమా కోసం ఇంద్ర చాలా క‌ష్ట‌ప‌డ్డాడు. త‌న‌కు త‌ను డ్యాన్స్, ఫైట్స్ అన్నీ నేర్చుకున్నాడు. ఎంతో డెడికేటెడ్‌గా ప‌ని చేస్తాడు. ఇంద్ర నాకు కొన్ని కొన్ని సీన్స్‌లో స్టార్టింగ్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌లా అనిపించాడు. కొత్త‌ల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ అలాగే ఉండేవాడు అని అన్నారు.


మ‌ల్టీ డైమ‌న్ష‌న్ వాసు మాట్లాడుతూ...టీజ‌ర్ రిలీజ్ అయ్యాక ఈ సినిమా పై చాలా అంచ‌నాలు పెరిగాయి. ఇంద్ర చాలా బాగా చేశాడు. ఈ సినిమా ద్వారా చాలా మంచి హీరో అనిపించుకుంటాడు. ఈ మూవీతో కొత్త టీం ప‌రిచ‌య‌మ‌వుతుంది అని అన్నారు.


బి. గోపాల్ మాట్లాడుతూ... ఈ టైటిల్ చాలా బావుంది. చాలా మంచి టైటిల్‌. ఇంద్ర అంటే నాకు చాలా ఇష్టం. చాలా మంచి అబ్బాయి. ఈ సినిమా మంచి హిట్ రావాల‌ని అలాగే హీరోయిన్‌కి కూడా తెలుగులో మంచి పేరు రావాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ద‌ర్శ‌కుడు హ‌ర్ష‌కి టీం అంద‌రికీ ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు అన్నారు.
ప్రొడ్యూస‌ర్ ఫ‌ణీంద్ర మాట్లాడుతూ... నాకు చాలా ఆనందంగా ఉంది. ముందుగా దాస‌రి కిర‌ణ్ గారికి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు. ఆయ‌న ఈ సినిమాని ముందు నుంచి ఎంక‌రేజ్ చేస్తూ వ‌చ్చారు. అలాగే మేం క‌థ అంతా రెడీ చేసుకున్నాక ఏం చెయ్యాలో తెలియ‌ని ప‌రిస్థితుల్లో విశాలాక్ష్మి ఆంటీ, అంకుల్ వ‌చ్చి మాకు అండ‌గా నిల‌బ‌డి మేం ఉన్నాం మీరు ముందుకు వెళ్లండి అంటూ మాకు పుషింగ్ ఇచ్చారు. ఎంతో క‌ష్ట‌ప‌డి ఈ మూవీని ఇంత దూరం తీసుకువ‌చ్చాం అని అన్నారు.


ప్రొడ్యూస‌ర్ విశాల‌క్ష్మి మాట్లాడుతూ... మా అబ్బాయిని అంద‌రూ ఆశీర్వ‌దించాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమా కూడా ప్ర‌తి ఒక్క‌రూ చూసి ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాను. ఇండ‌స్ట్రీలో ఉన్న పెద్ద నిర్మాత‌లు, డైరెక్ట‌ర్లు అంద‌రూ మా అబ్బాయిని ఆశీర్వ‌దించాల‌ని నా ఆకాంక్ష అని ముగించారు.


ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో చిత్ర యూనిట్ అంతా పాల్గొన్నారు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా చేసి అందరినీ స్వీట్ షాక్ కి గురి చేసా ..

Read More !

Gossips

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !