View

ఆర్ ఎక్స్ 100 బ్యానర్ లో కార్తికేయ కొత్త చిత్రం '90 ఎం ఎల్'

Tuesday,September10th,2019, 06:29 AM

ఆర్‌.ఎక్స్.100 సినిమా టైటిల్‌కి త‌గ్గ‌ట్టుగానే బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఝుమ్‌... ఝుమ్మంటూ సంద‌డి చేసింది. న్యూవేవ్ సినిమాగా, క‌ల్ట్ మూవీగా భారీ విజ‌యాన్నిసొంతం చేసుకుని సినీ అభిమానుల గుండెల్లో ప‌దిలంగా చోటుచేసుకుంది. ఆ చిత్రాన్ని తెర‌కెక్కించింది కార్తికేయ క్రియేటివ్ వ‌ర్క్స్. ఆ సినిమా ద్వారా గొప్ప గుర్తింపు పొందిన హీరో కార్తికేయ‌. ఇప్పుడు మ‌ళ్లీ వీరి కాంబినేష‌న్‌లో సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో కార్తికేయ స‌ర‌స‌న నేహా సోలంకి నాయిక‌గా న‌టిస్తున్నారు. శేఖ‌ర్ రెడ్డి ఎర్ర ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు.


తాజా చిత్రం '90ఎంఎల్‌' గురించి నిర్మాత అశోక్ రెడ్డి గుమ్మ‌కొండ మాట్లాడుతూ - ఒక మంచి సినిమా తీస్తే ఇండ‌స్ట్రీలో గుర్తింపు ఎలా ఉంటుందో, గౌర‌వం ఎంత గొప్ప‌గా ద‌క్కుతుందో, బాక్సాఫీస్ గ‌ల‌గ‌ల‌లు ఎంత సంద‌డిగా ఉంటాయో మాకు ఆర్‌.ఎక్స్.100 ద్వారా తెలిసింది. గ‌తేడాది జూలై 12న మా ఆర్‌.ఎక్స్.100 ను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చాం. మా చిత్రం విడుద‌లై ఏడాది గ‌డిచినా ఆర్‌.ఎక్స్.100 లాంటి సినిమా అంటూ, సినీ ప్రియులు ఇంకా గుర్తుచేసుకుంటూనే ఉన్నారు. తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలోనే కాదు, యావ‌త్ సినీ ప్రేక్ష‌కుల మ‌న‌స్సుల‌నూ దోచుకున్న చిత్ర‌మది. ఈ చిత్రంతో మా హీరో కార్తికేయ‌కు బిగ్ బ్రేక్ వ‌చ్చింది. ఈ ఏడాదిలో ఆయ‌న వ‌రుస సినిమాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు మా కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఈ తాజా చిత్రానికి 90ఎంఎల్ అని పేరు పెట్టాం. టైటిల్‌కి త‌గ్గ‌ట్టుగానే చిత్రం వైవిధ్యంగా ఉంటుంది. ఇప్ప‌టికి 70 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ రెడ్డి కొత్త‌వాడైనా బ్ర‌హ్మాండంగా తీర్చిదిద్దుతున్నారు.మా బ్యాన‌ర్ నుంచి వ‌చ్చే చిత్రాలు ఏవైనా స‌రే `ఆర్‌.ఎక్స్.100` విజ‌యప‌రంప‌ర‌ను కొన‌సాగించేవే అయి ఉంటాయి అని అన్నారు.


ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ రెడ్డి ఎర్ర మాట్లాడుతూ - కార్తికేయ అన‌గానే ఎవ‌రికైనా ఆర్‌.ఎక్స్.100 గుర్తుకొస్తుంది. ఆ చిత్రం క్రియేట్ చేసిన క్రేజ్ అలాంటిది. ఎంతో మందికి ఆ సినిమా ఓ రెఫ‌రెన్స్ గా మిగిలింది. వాట‌న్నిటినీ దృష్టిలో పెట్టుకుని అంత‌కుమించి ఉండేలా 90 ఎంఎల్‌ క‌థ రాసుకున్నాను. పూర్తి స్థాయిలో ఎంట‌ర్‌టైన్ చేసే క‌థ ఇది. క‌మ‌ర్షియ‌ల్ వేల్యూస్ మెండుగా ఉంటాయి. 90 ఎంఎల్‌ అని టైటిల్ చెప్ప‌గానే చాలా మంది ఇంట్ర‌స్టింగ్‌ అన్నారు. సినిమా కూడా అంతే ఆస‌క్తిక‌రంగా వ‌స్తోంది. ఇప్ప‌టికే 70 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. మొత్తం ఆరు పాట‌లున్నాయి. అనూప్ రూబెన్స్ చాలా మంచి ట్యూన్లిచ్చారు. చంద్ర‌బోస్‌గారు యువ‌త‌ను ఆక‌ట్టుకునేలా పాట‌లు రాశారు. రంగ‌స్థ‌లం త‌ర్వాత చంద్ర‌బోస్ గారు మ‌ళ్లీ సింగిల్ కార్డు రాసింది మా సినిమాకే. ప్ర‌తి పాటా ఎక్స్ ట్రార్డిన‌రీగా ఉంటుంది. ఇటీవ‌ల సైరాలో కీల‌క పాత్ర‌లో న‌టించిన ర‌వికిష‌న్ మా సినిమాలో చాలా మంచి పాత్ర చేశారు. 90 ఎంఎల్‌ అనే టైటిల్ ఎందుకుపెట్టాం? దాని క‌థాక‌మామీషు ఏంట‌నేది తెర‌మీద చూస్తేనే బావుంటుంది. ఈ నెల 11 నుంచి హైద‌రాబాద్‌లో క్లైమాక్స్ తెర‌కెక్కిస్తాం. దీని త‌ర్వాత మ‌రో షెడ్యూల్లో బ్యాల‌న్స్ టాకీ, 2 పాట‌ల‌ను చిత్రీక‌రిస్తాం. అంత‌టితో షూటింగ్ మొత్తం పూర్త‌వుతుంది. క‌థ‌, క‌థ‌నం త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కుల‌కు న‌చ్చేలా ఉంటాయి అని అన్నారు.


న‌టీన‌టులు:కార్తికేయ‌, నేహా సోలంకి (తొలి ప‌రిచ‌యం), ర‌వికిష‌న్‌, రావు ర‌మేశ్‌, అలీ, పోసాని కృష్ణ‌ముర‌ళి, అజ‌య్‌, కాల‌కేయ ప్ర‌భాక‌ర్ , స‌త్య‌ప్ర‌కాశ్‌, ప్ర‌గ‌తి, ప్ర‌వీణ్‌, అదుర్స్ ర‌ఘు, నెల్లూర్ సుద‌ర్శ‌న్‌, తాగుబోతు ర‌మేశ్‌, రోల్స్ రిడా, దువ్వాసి మోహ‌న్‌, సంజ‌య్ స్వ‌రూప్ త‌దిత‌రులు
సాంకేతిక నిపుణులు:
నిర్మాత‌: అశోక్ రెడ్డి గుమ్మ‌కొండర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: శేఖ‌ర్ రెడ్డి ఎర్రసంగీతం: అనూప్ రూబెన్స్పాట‌లు: చంద్ర‌బోస్‌కెమెరా: జె.యువ‌రాజ్‌ఎడిట‌ర్‌: ఎస్‌.ఆర్‌.శేఖ‌ర్‌ఆర్ట్: జీఎం శేఖ‌ర్‌ఫైట్స్: వెంక‌ట్‌నృత్యాలు: ప్రేమ్ ర‌క్షిత్‌, జానీకో డైర‌క్ట‌ర్‌: సిద్ధార్థ్ రెడ్డి గూడూరిప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌: కె. సూర్య నారాయ‌ణ



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా చేసి అందరినీ స్వీట్ షాక్ కి గురి చేసా ..

Read More !

Gossips

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !