filmybuzz
filmybuzz
filmybuzz
filmybuzz
filmybuzz
filmybuzz
filmybuzz
filmybuzz
filmybuzz
filmybuzz
filmybuzz
filmybuzz
filmybuzz

View

డైరెక్టర్ వినాయక్ చేతుల మీదుగా ఆర్డీఎక్స్ లవ్ ట్రైలర్ లాంఛ్

Wednesday,September11th,2019, 04:41 AM

హుషారు ఫేమ్ తేజస్ కంచర్ల హీరోగా, ఆర్.ఎక్స్ 100 భామ పాయల్ రాజ్ పుత్ కాంబినేషన్ లో టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ భాను దర్శకుడిగా  హ్యాపీ మూవీస్ పతాకంపై సి.కళ్యాణ్ నిర్మిస్తోన్న చిత్రం ఆర్డీఎక్స్ లవ్. ఈ చిత్రం టీజర్  నాలుగు మిలియన్ వ్యూస్ పైగా రాబట్టుకొని సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. దీంతో సినిమాపై హై ఎక్స్ పెక్టేషన్స్ నెలకొని వున్నాయి. కాగా ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం సెప్టెంబర్ 10న హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా జరిగింది. సెన్సషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ ముఖ్య అతిధిగా విచ్చేసి ఆర్డీఎక్స్ లవ్  థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేసారు. ఈ కార్యక్రమంలో హీరో తేజస్ కంచర్ల, హీరోయిన్ పాయల్ రాజ్ పుత్, దర్శకుడు శంకర్ భాను, ప్రముఖ నిర్మాతలు మల్లిడి సత్యనారాయణ రెడ్డి, తుమ్మలపల్లి రామసత్యనారాయణ పాల్గొనగా నిర్మాత సి.కళ్యాణ్ బొకేలతో అతిధులకు స్వాగతం పలికారు. 


సెన్సషనల్ డైరెక్టర్ వి.వివి.వినాయక్ మాట్లాడుతూ.. కళ్యాణ్ గారు డబ్బులకోసం కాకుండా నిత్యం ఫ్యాషన్ తో సినిమాలను తీస్తున్నారు. ఈ కథని నమ్మి బడ్జెట్ కి వెనుకాడకుండా చాలా రిచ్ గా ఆర్డీఎక్స్ లవ్ చిత్రాన్ని నిర్మించారు. నా స్నేహితుడు శంకర్ భానుకి చాన్స్ ఇచ్చిన కళ్యాణ్ గారికి నా థాంక్స్. ఈ చిత్రంతో కళ్యాణ్ గారు పెద్ద హిట్ కొట్టబోతున్నారు. దర్శకుడు  శంకర్ భాను నాతోపాటే అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్  చేసాడు. చాలా తెలివైన వాడు. చాలా మంచి సినిమాలు చేసాడు.. కానీ సరైన బ్రేక్ రాలేదు. ఈ సినిమాతో కమర్షియల్ డైరెక్టర్ గా భానుకి  పెద్ద బ్రేక్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తేజస్, పాయల్ పెయిర్ చాలా బాగుంది. ఈ సినిమా వాళ్ళిద్దరికీ మంచి పేరు తేవాలి. అలాగే పాయల్ రాజ్ పుత్ ఈ సినిమాతో విజయశాంతి గారిలా స్టార్ ఇమేజ్ తెచ్చుకోవాలి అన్నారు. 


నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ.. ఈ సినిమా టీజర్ కి  4 మిలియన్ వ్యూస్ పైగా వచ్చాయి. నేను ఏ లక్ష్యంతో అయితే ఈ సినిమాని స్టార్ట్ చేశానో అది ఆర్డీఎక్స్ లవ్ బ్లాస్ట్ అయి నిరూపిస్తుంది. టీజర్ రిలీజ్ అయినప్పుడు చాలా మంది కామెంట్స్ చేసారు.. అలాగే గొప్పగా ఉందని పొగిడిన వారు వున్నారు. ఒక యుక్త వయసులో వున్న అమ్మాయి ఎంజాయ్ చేసే టైములో అవన్నీ వదులుకొని తన గ్రామం కోసం, చుట్టుప్రక్కల గ్రామాల ఆశయ సాధనకోసం తన శీలాన్ని సైతం పణంగా పెట్టి ఏవిధంగా పోరాడిందనేది చిత్ర కథాంశం. డెఫినెట్ గా ఈ చిత్రం బాక్సఫీస్ వద్ద బ్లాస్ట్ అవుతుంది అన్న నమ్మకంవుంది. ఈ చిత్రం తర్వాత పాయల్ మరో  విజయశాంతి అవుతుంది. అంత గొప్పగా ఈ చిత్రంలో నటించింది. విజయవాడ, పోలవరం, రంపచోడవరమ్ లలో 45 డిగ్రీల టెంపరేచర్లో కూడా నటీనటులు, టెక్నీషియన్స్ అందరు ఎంతో  కస్టపడి వర్క్ చేసారు. ముఖ్యంగా కెమెరామెన్ రాంప్రసాద్, ఆర్ట్ డైరెక్టర్ చిన్నా సహకారం మరువలేనిది. చిన్న బడ్జెట్ లో కాకుండా కథని నమ్మి పెద్ద బడ్జెట్ లోనే 75 రోజుల పాటు ఈ చిత్రాన్ని కాంప్రమైజ్ కాకుండా తీశాం. అందుకొనే చాలా రిచ్ గా విజువల్స్ వున్నాయి. ఒక కసితో గొప్ప సినిమా తియ్యాలని చేశాను. హీరో తేజస్, పాయల్ కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యింది. రథన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. ఆదిత్య మీనన్ విలన్ గా నటించాడు. నరేష్, తులసీల నటన క్లైమాక్స్ లో కంట తడి పెట్టిస్తుంది. ప్రేక్షకులకు ఒక గొప్ప సినిమా చుసిన ఫీలింగ్ కలుగుతుంది. ఈ క్రెడిట్ భానుకె దక్కుతుంది. సెన్సార్ పూర్తయింది.. మంచి డేట్ చూసుకొని త్వరలో సినిమా రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నాం.. అన్నారు. 


హీరో తేజస్ కంచెర్ల మాట్లాడుతూ.. నా మీద నమ్మకంతో ఈ చిత్రంలో నటించే ఛాన్స్ ఇచ్చిన కళ్యాణ్ గారికి నా కృతజ్ఞతలు. టీమ్ వర్క్ తో సినిమాని అందరమ్  కష్టపడి చేసాం. టీజర్ కి రకరకాల కామెంట్లు వచ్చాయి.  ట్రైలర్ చూస్తే సినిమా కంటెంట్ తెలుస్తుంది. పాయల్ బాగా కోపరేట్ చేసి ఈ సినిమాలో నటించింది. డైరెక్టర్ శంకర్ భాను చాలా అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. వినాయక్ గారు మా ట్రైలర్ లాంచ్ చేయడం చాలా హ్యాపీగా వుంది అన్నారు. 


హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ మాట్లాడుతూ.. "ఆర్ ఎక్స్ 100" చిత్రంతో ఒక్కసారిగా నా లైఫ్ మారిపోయింది. ఆర్డీఎక్స్ లవ్ చిత్రం కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఎడ్యుకేషన్ పరంగా ఆలోచింప చేస్తూ.. ఇన్స్పిరేషన్ గా ఈ చిత్రం నిలుస్తుంది. వెరీ హార్ట్ టచ్చింగ్ మూవీ. ఇంత మంచి మూవీలో నటించే ఛాన్స్ ఇచ్చిన కళ్యాణ్ గారికి, భాను గారికి నా థాంక్స్.. అన్నారు. 


దర్శకుడు శంకర్ భాను మాట్లాడుతూ.. కథ విని కళ్యాణ్ గారు  ప్రోత్సహించారు. కథ కి  ఏంకావాలో అవన్నీ ప్రొవైడ్ చేసి సూపర్బ్ క్వాలిటీతో ఈ చిత్రాన్ని కళ్యాణ్ గారు నిర్మించారు. హ్యాపీ మూవీస్, సీకే ఎంటర్టైన్మెంట్స్ లో ఈ సినిమా చేయడం చాలా ప్రౌడ్ గా ఫీలవుతున్నాను. తేజస్, పాయల్ ల మ్యాజిక్ వండర్స్ క్రియేట్ చేస్తుంది. రాంప్రసాద్ కెమెరా వర్క్, ఆర్ట్ చిన్న సెట్ వర్క్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ గా నిలుస్తాయి. రథన్ వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు. ఆర్డీఎక్స్ లవ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుందని కాన్ఫిడెంట్ గా వున్నాను. ఈ బ్లాస్టింగ్ హిట్ తో కళ్యాణ్ గారి సంస్థ గొప్ప ప్రొడక్షన్ కంపినీ అవుతుంది. ఈ మూవీ తరువాత ఈ బ్యానర్ లో వరుస కమర్షియల్ సక్సెస్ లు మరిన్ని రావాలని కోరుకుంటున్నాను... అన్నారు. 


తేజస్ కంచెర్ల, పాయల్ రాజ్ పుత్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో డా. వికె.నరేష్, నాగినీడు, ఆదిత్య మీనన్, తులసి, ఆమని, ముమైత్ ఖాన్, విద్యులేక రామన్, సత్యశ్రీ, సాహితిజడి, దేవిశ్రీ, జోయా మిజ్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సి.రాంప్రసాద్, సంగీతం: రథన్, మాటలు: పరశురామ్, పాటలు: భాస్కరభట్ల, ఎడిటర్: ప్రవీణ్ పూడి, ఫైట్స్: నందు, కొరియోగ్రాఫర్: గణేష్ స్వామి, ఎక్సిక్యూటివ్ ప్రొడ్యూసర్: చిన్న, కో-ప్రొడ్యూసర్: సివి రావ్, నిర్మాత: సి.కళ్యాణ్, కథ-స్క్రీన్ ప్లై-దర్శకత్వం: శంకర్ భాను. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా చేసి అందరినీ స్వీట్ షాక్ కి గురి చేసా ..

Read More !

Gossips

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !