View

'నాని'స్‌ గ్యాంగ్‌లీడర్‌' ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఈ 13న విడుదల

Wednesday,September11th,2019, 04:50 AM

నేచురల్‌ స్టార్‌ నాని, వెర్సటైల్‌ డైరెక్టర్‌ విక్రమ్‌ కె.కుమార్‌ల క్రేజీ కాంబినేషన్‌లో మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌(సివిఎం) నిర్మిస్తున్న విభిన్న చిత్రం 'నాని'స్‌ గ్యాంగ్‌ లీడర్‌'. టీజర్‌, ట్రైలర్‌తో సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తుంది. ఇటీవల విడుదల చేసిన ప్రమోషనల్‌ సాంగ్‌తో సినిమాకు మంచి బజ్‌ ఏర్పడింది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా వైజాగ్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి భారీగా అభిమానులు హాజరయి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో...


లిరిసిస్ట్‌ అనంత్‌ శ్రీరామ్‌ మాట్లాడుతూ - ''ఈ ఇండస్ట్రీలో పనిచేసే ఎవరికైనా పదిరెట్లు ఎక్కువ పారితోషకం ఇస్తే పదికి పది రేట్లు ఎక్కువ వసూళ్లు సాధించొచ్చు' అనేది మైత్రి వాళ్ల సూత్రం. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఈ సూత్రాన్ని ఇంకెవ్వరు ఫాలో అవ్వరు. నానిలో నా.. అంటే నావాడు, నీఅంటే.. నీవాడు అని అర్ధం. అలా మన పక్కింటి అబ్బాయిలా ఈరోజు ఈ స్థాయికి చేరుకున్నారు నాని గారు. నన్ను నమ్మి ఈ సినిమాలో నాలుగు పాటలు రాసే అవకాశం ఇచ్చిన నిర్మాతలకి థాంక్స్‌. అలాగే రాబోయే పది సంవత్సరాలలో తెలుగు ఇండస్ట్రీని ఏలబోయే మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుద్‌ గారికి శుభాకాంక్షలు'' అన్నారు.


సినిమాటోగ్రఫర్‌ మిరోస్లా కుబా బ్రోజెక్‌ మాట్లాడుతూ - ''నాని లాంటి చాలా ఫెమస్‌ యాక్టర్‌, మైత్రి మూవీస్‌తో కలిసి పనిచేయడం చాలా ప్లజెంట్‌ ఎక్స్పీరియన్స్‌'' అన్నారు.


మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుద్‌ రవిచంద్రన్‌ మాట్లాడుతూ - ''ఈరోజు వైజాగ్‌ లోని ఎనర్జిటిక్‌ పీపుల్‌ ముందు ఉన్నందుకు హ్యాపీగా ఉంది. 'గ్యాంగ్‌లీడర్‌' నాకు చాలా స్పెషల్‌. ఎందుకంటే విక్రమ్‌ కుమార్‌ గారు ఇంతకుముందే 'మనం' లాంట వండర్‌ఫుల్‌ సినిమా చేశారు. ప్రస్తుతం నాని లాంటి నేచురల్‌ స్టార్‌తో వర్క్‌ చేస్తున్నారు. నేను నాని గారి 'జెర్సీ' సినిమాకు వర్క్‌ చేశాను. అయితే 'గ్యాంగ్‌లీడర్‌' పూర్తిగా దానికి కాంట్రాస్ట్‌ ఫిలిమ్‌. నేను 'జెర్సీ' సినిమాలో నాని గారి పెర్ఫామెన్స్‌ చూసి ఆయనకు మెసేజ్‌ చేశాను.అలాగే 'గ్యాంగ్‌లీడర్‌ 'చూసి మళ్ళీ మెసేజ్‌ చేశాను. మీరందరూ తప్పకుండా పెన్సిల్‌ పార్థసారధి క్యారెక్టర్‌ని ఎంజాయ్‌ చేస్తారు. నాని లాంటి వర్సటైల్‌ యాక్టర్‌ తెలుగు ఇండస్ట్రీలో ఉన్నందుకు సంతోషంగా ఉంది. అనంత్‌ శ్రీరామ్‌ గారు అన్ని పాటలకు మంచి లిరిక్స్‌ ఇచ్చారు. 'అజ్ఞాతవాసి', 'జెర్సీ', 'గ్యాంగ్‌లీడర్‌' సినిమాలతో నన్ను ఓన్‌ చేసుకున్నందుకు తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు'' అన్నారు.


హీరోయిన్‌ ప్రియాంక మాట్లాడుతూ - ''నేను ఒక ఫ్యాషనేట్‌ థియేటర్‌ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ స్టార్ట్‌ చేశాను. ఒక షార్ట్‌ ఫిలిమ్‌ చేశాను. అలాగే ఒక మూవీలో నటించాను. ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన విక్రమ్‌ సర్‌కి అలాగే నాని గారికి థాంక్స్‌, మైత్రి మూవీస్‌ వారు నన్ను వాళ్ళింటి అమ్మాయిలా చూసుకున్నారు. అలాగే నా కో యాక్టర్స్‌ లక్ష్మి, శరణ్య, కార్తికేయ గారికి స్పెషల్‌ థాంక్స్‌. ఇది మీ అందరి 'గ్యాంగ్‌లీడర్‌'. అందరూ థియేటర్స్‌లో సినిమా చూడండి'' అన్నారు.


వెర్సటైల్‌ డైరెక్టర్‌ విక్రమ్‌ కె.కుమార్‌ మాట్లాడుతూ - ''ముందుగా ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్న నాని గారికి థాంక్స్‌. ఏదేమైౖనా నీతో ఒక సినిమా తప్పకుండా చేస్తాను అని ఆయన గతంలోనే నాకు మాట ఇచ్చారు. అలాగే ఈ సినిమాకు నాకు ఎంతో సపోర్ట్‌ చేశారు. నాని ఒక స్టార్‌, ఒక బ్యూటిఫుల్‌ యాక్టర్‌తో పాటు ఒక మంచి ఫ్రెండ్‌. మేంమిద్దరం కలిసి మరిన్ని మూవీస్‌ చేయాలనీ కోరుకుంటున్నాను. అలాగే మైత్రి వారు బెస్ట్‌ ప్రొడ్యూసర్స్‌. వారు ఎన్నో గొప్ప సినిమాల్ని నిర్మించారు. వారితో కలిసి పనిచేసే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం. కార్తికేయరోల్‌ చాలా బాగుంటుంది. అలాగే ప్రియాంక వండర్‌ఫుల్‌ పెర్ఫార్మర్‌. అలాగే అనిరుద్‌ అద్భుతమైన మ్యూజిక్‌, మంచి బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ ఇచ్చారు. అలాగే మా సినిమాటోగ్రాఫర్‌ మిరోస్లాకుబాబ్రోజెక్‌ పోలెండ్‌ నుండి వచ్చారు. వండర్‌ఫుల్‌ హ్యూమన్‌ బీయింగ్‌. మా సెట్లో అందరి కంటే యాక్టీవ్‌గా ఉండేవారు. ఆయనతో నా అసోసియేషన్‌ కొనసాగుతుంది. మా రైటర్స్‌ముకుంద్‌ పాండే, వెంకీ చాలా సహకారం అందించారు. అలాగే ఈ సినిమా కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి థాంక్స్‌'' అన్నారు.


నటుడు కార్తికేయ మాట్లాడుతూ - '' మీ అందరితో పాటు గత పది సంవత్సరాలుగా నాని గారికి మీ అందరి కన్నా ఎక్కువ ఫ్యాన్‌ని. ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా హీరో అవ్వాలనుకే వారికి ఇండస్ట్రీలో కొన్ని పేర్లు కనిపిస్తాయి అందులో మొదటిపేరు మెగాస్టార్‌ చిరంజీవి, తరువాత రవితేజ. అలా ప్రస్తుత కాలానికి మేమందరం ఇంట్లో గర్వంగా చెప్పుకునే పేరు నాని. ఆయన్ని ఏ విషయంలో నైనా ఇన్స్పిరేషన్‌గా తీసుకోవచ్చు. ఒక మామూలు మిడిల్‌క్లాస్‌లో పుట్టి మన పక్కింటి అబ్బాయిలా ఈరోజు ఈ స్థాయికి చేరుకున్నారు. 'ఎంసిఏ' లాంటి కమర్షియల్‌ మూవీ తరువాత 'జెర్సీ' లాంటి డిఫరెంట్‌ మూవీ చేశారు. విక్రమ్‌ సర్‌ సినిమాలో నటించడం లక్‌ అనేది చిన్న మాట. 'గ్యాంగ్‌లీడర్‌' తరువాత నా నటన మారిపోయింది. అనిరుద్‌ గారు కొలవెరి సాంగ్‌తో ఖండాలు దాటారు. ఆయనతో కలిసి వర్క్‌ చేయడం హ్యాపీ. అలాగే మైత్రి మూవీస్‌లో 'శ్రీమంతుడు', 'జనతా గ్యారేజ్‌', 'రంగస్థలం' తరువాత 'గ్యాంగ్‌ లీడర్‌' నాలుగో బ్లాక్‌ బస్టర్‌ అవుతుంది'' అన్నారు.


ప్రొడక్షన్‌ డిజైనర్‌ రాజీవన్‌ మాట్లాడుతూ - '' గ్యాంగ్‌ లీడర్‌ సినిమా ఎప్పుడు మొదలై ఎప్పుడు అయిపోయిందో కూడా తెలియనంత తొందరగా జరిగింది. సినిమాటోగ్రాఫర్‌ కూబా మంచి విజువల్స్‌ ఇచ్చాడు. టీమ్‌ అందరికి ఆల్‌ ది బెస్ట్‌'' అన్నారు.


మైత్రి మూవీస్‌ నవీన్‌ మాట్లాడుతూ - '' మా బేనర్‌లో ఒక వండర్‌ ఫుల్‌ మూవీ తీసిన నాని గారికి, విక్రమ్‌ గారికిథాంక్స్‌. ఈ రోజు మార్నింగ్‌ సినిమా చూశాను. ఎక్స్‌ట్రార్డినరీగా ఉంది. తప్పకుండా హ్యుజ్‌ హిట్‌ అవుతుంది. అలాగే అనిరుద్‌ గారికి, కార్తికేయ గారికి థాంక్స్‌'' అన్నారు.


నేచురల్‌ స్టార్‌ నాని మాట్లాడుతూ - ''పది సంవత్సరాలక్రితం వైజాగ్‌ అమ్మాయితో ప్రేమలో పడ్డాను. అప్పటినుండి ఇప్పటి దాకా ఈ సిటీతోలవ్‌లోనే ఉన్నాను. మనోళ్ల్లు పాటలకి అబ్రాడ్‌ వెళ్తుంటారు కానీ ఇంతకంటే మంచి ప్లేస్‌ ఎక్కడుంటుంది చెప్పండి?. 'అష్టాచెమ్మా' కి మూడు రోజుల ముందు ప్రీమియర్‌ షో ఇక్కడే జరిగింది. ఎలా గడిచిందో తెలీదు కానీ నా కెరీర్‌ స్టార్ట్‌ చేసి 11 సంవత్సరాలు పూర్తి అయింది . మళ్ళీ 'గ్యాంగ్‌లీడర్‌' కి మూడు రోజుల ముందు ఇక్కడ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ జరుగుతుంది. ఇంకా 11 సంవత్సరాలు సేఫ్‌. సెప్టెంబర్‌ 13 నుండివైజాగ్‌లో ఏ థియేటర్స్‌లో టికెట్స్‌ దొరకకుండా చూసుకునే భాద్యత మీదే. 'మనం' తరువాత  మేము ఒక సినిమా చేద్దాం అనుకున్నాం అది 'గ్యాంగ్‌లీడర్‌ 'తో కుదిరింది. అలాగే మైత్రి మూవీస్‌ ఎంతో ఫ్యాషనేట్‌గా ఈ సినిమాను సపోర్ట్‌ చేసిఎంకరేజ్‌ చేశారు. సెప్టెంబర్‌ 13న వారికి బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ కావాలని కోరుకుంటున్నాను. అలాగే వెంకీ మా సినిమా రైటర్‌. అతన్ని విక్రమ్‌ దగ్గరకు పంపింది నేనే. రేపు థియేటర్స్‌లో మీరు తప్పకుండా నవ్వుకుంటారు. అనంత్‌ శ్రీరామ్‌ గారు చాలా అందంగా పాటలు రాశారు. అనిరుద్‌ ఆల్రెడీ ప్రపంచాన్ని ఊపేసాడు. అతనితో ఎప్పటికైనా ఒక మూవీ చేయాలనుకున్నాను. కానీ ఇలా బ్యాక్‌ టు బ్యాక్‌ మూవీస్‌ చేస్తానని అనుకోలేదు. 'జెర్సీ' నా కెరీర్‌ లోనే ఒక స్పెషల్‌ మూవీ. ఇప్పుడు మా కాంబినేషన్‌లో 'గ్యాంగ్‌లీడర్‌ 'మరో బ్లాక్‌ బస్టర్‌ అవుతుంది. మంచి సంగీతంతో పాటు అదిరిపోయే బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ ఇచ్చారు. ప్రియాంక మంచి పెర్ఫార్మర్‌. అలాగే లక్ష్మి గారు, శరణ్య గారి కామెడీ టైమింగ్‌కి మీరు ఫిదా అవుతారు. కార్తికేయ చాలా హుంబుల్‌గా ఉంటారు. సెప్టెంబర్‌ 13 తరువాత అందరూ దేవ్‌ అని పిలుస్తారు. కూబా అందర్నీ లడ్డులా చూపించాడు. మా ఈ సెలబ్రేషన్‌లో ఇంత పాజిటివ్‌ ఎనర్జీని ఇచ్చిన అందరికి థాంక్స్‌. మళ్ళీ సక్సెస్‌ సెలెబ్రేెషన్స్‌లో కలుద్దాం 'అన్నారు.


నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఒక ప్రధాన పాత్ర ఆర్‌ఎక్స్‌ 100 ఫేమ్‌ కార్తికేయ పోషిస్తున్నారు. ప్రియాంక, లక్ష్మీ, శరణ్య, అనీష్‌ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిశోర్‌, జైజా, సత్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.


ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్‌ రవిచందర్‌, సినిమాటోగ్రఫీ: మిరోస్లా కుబా బ్రోజెక్‌, మాటలు: వెంకీ, రచనా సహకారం: ముకుంద్‌ పాండే, పొడక్షన్‌ డిజైనర్‌: రాజీవన్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌: రామ్‌కుమార్‌, ఎడిటింగ్‌: నవీన్‌ నూలి, వి.ఎఫ్‌.ఎక్స్‌.: మకుట, కాస్ట్యూమ్‌ డిజైనర్‌: ఉత్తర మీనన్‌, స్టిల్స్‌: జి.నారాయణరావు, కో-డైరెక్టర్‌: కె.సదాశివరావు, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: శేషు, సి.ఇ.ఓ.: చిరంజీవి(చెర్రీ), నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ (సివిఎం), కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విక్రమ్‌ కె.కుమార్‌.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !