View

సీనియ‌ర్ న‌టుడు స‌త్య‌ప్ర‌కాష్ ద‌ర్శ‌క‌త్వంలో ఉల్లాలా ఉల్లాలా

Friday,September13th,2019, 01:26 PM

సీనియ‌ర్ న‌టుడు స‌త్య‌ప్ర‌కాష్ పేరు చెప్ప‌గానే `పోలీస్ స్టోరీ` సినిమా గుర్తుకొస్తుంది. ఈ ఒక్క సినిమా అనే కాదు, ఎన్నో ఎన్నెన్నో సూప‌ర్ హిట్ సినిమాల్లో ప్ర‌తినాయ‌కుడిగానూ, ముఖ్య పాత్ర‌ధారిగానూ రాణించి ప్రేక్ష‌కుల మ‌న్న‌న‌లు పొందారు. 11 భాష‌ల్లో 500కు పైగా చిత్రాల్లో న‌టించిన ఈ సీనియ‌ర్ న‌టుడు తొలిసారిగా మెగాఫోన్ చేత‌బ‌ట్టారు. స‌త్య‌ప్ర‌కాష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం పేరు ఉల్లాలా ఉల్లాలా. గ‌త వేలంటైన్స్ డేకి భారీ ఎత్తున ల‌వ‌ర్స్ డే  చిత్రాన్ని విడుద‌ల చేసి మంచి నిర్మాత‌గా పేరు తెచ్చుకున్న సుఖీభ‌వ మూవీస్ అధినేత ఎ.గురురాజ్ ఉల్లాలా ఉల్లాలా చిత్రాన్ని ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. న‌ట‌రాజ్‌, నూరిన్‌, అంకిత హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ చిత్రం షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకుంది.


ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు స‌త్య‌ప్ర‌కాష్ మాట్లాడుతూ - తెలుగు, త‌మిళం, క‌న్న‌డం, మ‌ల‌యాళం, ఒరియా, బెంగాలీ, భోజ్‌పురి, మ‌రాఠీ, పంజాబీ, హిందీ, ఇంగ్లీషు భాష‌ల్లో 500కు పైగా సినిమాల్లో న‌టించాను. పోలీస్ స్టోరీ, సీతారామ‌రాజు, పెళ్లి చేసుకుందాం, స‌మ‌ర సింహారెడ్డి, మాస్ట‌ర్‌, డేంజ‌ర్‌, లాహిరి లాహిరి లాహిరిలో, బిగ్ బాస్‌ త‌దిత‌ర చిత్రాలు నాకెంత‌గానో పేరు తెచ్చిపెట్టాయి. ఇన్నేళ్ల కెరీర్‌లో న‌టుడిగా పూర్తిస్థాయి సంతృప్తితో ఉన్నాను. ద‌ర్శ‌క‌త్వం చేయాల‌ని ఎప్ప‌టి నుంచో అనుకుంటున్నాను. ఇప్ప‌టికి కుదిరింది. ఇదొక రొమాంటిక్ ఎంట‌ర్‌టైనింగ్  థ్రిల్ల‌ర్‌. ఈ సినిమాలో చాలా వింత‌లూ విశేషాలూ ఉన్నాయి. ఎవ్వ‌రూ ఊహించ‌ని రీతిలో ఈ సినిమా ఉంటుంది. మేకింగ్ ప‌రంగా కూడా చాలా కొత్త‌గా ఉంటుంది. ద‌ర్శ‌కునిగా నా తొలి చిత్రానికి గురురాజ్‌లాంటి నిర్మాత దొర‌క‌డం నా అదృష్టం అని చెప్పారు.


నిర్మాత ఎ.గురురాజ్ మాట్లాడుతూ - స‌త్య‌ప్ర‌కాష్ నాకెప్ప‌టి నుంచో మంచి స్నేహితుడు. న‌టునిగా అత‌నిలో ఎంత ఫైర్ ఉందో, ద‌ర్శ‌కునిగా అంత‌కు మించిన ఫైర్ ఉంది. ఈ చిత్రానికి నేనే క‌థ‌ను అందించాను. మేకింగ్ ప‌రంగా ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాలేదు. ఉల్లాలా ఉల్లాలా చిత్రం నిర్మాత‌గా నాకు, ద‌ర్శ‌కునిగా స‌త్య‌ప్ర‌కాష్‌కూ క‌చ్చితంగా ఓ ట‌ర్నింగ్ పాయింట్ అవుతుంది. షూటింగ్ కార్య‌క్ర‌మాలు తుదిద‌శ‌కు చేరుకున్నాయి. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ కూడా శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. అతి త్వ‌ర‌లోనే ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తాం అని తెలిపారు.


తారాగ‌ణం
న‌ట‌రాజ్‌, నూరిన్‌, అంకిత‌, గురురాజ్‌, స‌త్య‌ప్ర‌కాష్‌, `బాహుబ‌లి` ప్ర‌భాక‌ర్‌, పృథ్వీరాజ్‌, `అదుర్స్` ర‌ఘు, జ‌బ‌ర్ధ‌స్త్ న‌వీన్‌, లోబో, మ‌ధు, జ‌బ‌ర్ధ‌స్త్ అప్పారావు, రాజ‌మౌళి, జ్యోతి, గీతాసింగ్‌, జ‌య‌వాణి త‌దిత‌రులు
సాంకేతిక నిపుణులు
స‌మ‌ర్ప‌ణ‌:  శ్రీమ‌తి ఎ.ముత్త‌మ్మ‌,
ఛాయాగ్ర‌హ‌ణం:  జె.జి.కృష్ణ‌, దీప‌క్‌,
సంగీతం:  జాయ్‌,
ఎడిటింగ్‌:  ఉద్ధ‌వ్‌,
నృత్య ద‌ర్శ‌క‌త్వం:  శేఖ‌ర్ మాస్ట‌ర్‌, దిలీప్ కుమార్‌,
యాక్ష‌న్‌:  డ్రాగ‌న్ ప్ర‌కాష్‌,
ఆర్ట్:  కె.ముర‌ళీధ‌ర్‌,
పాట‌లు:  కాస‌ర్ల శ్యామ్‌, గురుచ‌ర‌ణ్‌,
క‌థ - నిర్మాత‌:  ఎ.గురురాజ్‌,
స్క్రీన్‌ప్లే - మాట‌లు - ద‌ర్శ‌క‌త్వం:  స‌త్య‌ప్ర‌కాష్‌.  



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా చేసి అందరినీ స్వీట్ షాక్ కి గురి చేసా ..

Read More !

Gossips

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !