View

'బందోబస్త్'  ప్రీ రిలీజ్ ఈవెంట్ విశేషాలు

Saturday,September14th,2019, 02:57 PM

ప్రతి చిత్రంలోనూ పాత్ర పరంగా నటనలోనూ, ఆహార్యంలోనూ వైవిధ్యం కనబరిచే కథానాయకుల్లో సూర్య ఒకరు. 'గజిని', 'సూర్య సన్నాఫ్ కృష్ణన్', 'సింగం' సిరీస్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లోనూ ఆయన స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ఆయన నటించిన తాజా సినిమా 'బందోబస్త్'. డిఫరెంట్ కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రానికి 'రంగం' ఫేమ్ కె.వి. ఆనంద్ దర్శకత్వం వహించారు. తెలుగు ప్రేక్షకులకు 'నవాబ్', విజువల్ వండర్ '2.0' చిత్రాలు అందించిన లైకా ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ తమిళ నిర్మాత సుభాస్కరణ్ నిర్మించారు. హ్యారీస్ జైరాజ్ సంగీతం అందించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎన్వీఆర్ సినిమా పతాకంపై ప్రముఖ తెలుగు నిర్మాత ఎన్వీ ప్రసాద్ విడుదల చేస్తున్నారు. సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ శుక్రవారం హైదరాబాద్ లో నిర్వహించారు. సురేష్ ప్రొడక్షన్స్ అధినేత, ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు సినిమా ట్రైలర్ విడుదల చేశారు. 


అనంతరం డి. సురేష్ బాబు మాట్లాడుతూ "లైకా ప్రొడక్షన్స్, తెలుగులో విడుదల చేస్తున్న ఎన్వీ ప్రసాద్ గారికి ఆల్ ది బెస్ట్. సూర్య మాకు ఫ్యామిలీలాగే. మా నాన్నగారి సినిమాల్లో వాళ్ళ నాన్నగారు నటించారు. సూర్యతో నేను ఎప్పుడు సినిమా చేస్తానో నాకు తెలియదు. మంచి మనిషి. వాళ్ళది లవ్లీ ఫ్యామిలీ. తనకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నా. ఈ సినిమా బాగా ఆడాలని కోరుకుంటున్నా. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్" అని అన్నారు. 


సూర్య మాట్లాడుతూ "ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు ఇంత భారీగా తారాగణం, ఉన్నత నిర్మాణ విలువలతో రావడానికి కారణమైన లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ గారికి థాంక్స్. మా టీమ్ అందరి కలను ఆయన నిజం చేశారు. సెప్టెంబర్ 20న తెలుగులోనూ భారీ ఎత్తున సినిమాను విడుదల చేస్తున్న ఎన్వీ ప్రసాద్ గారికి థాంక్స్. లైకా ప్రొడక్షన్స్, ఎన్వీ ప్రసాద్ గారి అమేజింగ్ అసోసియేషన్ గురించి నాకు ఈ రోజు తెలిసింది. ఇక్కడికి వచ్చిన సురేష్ బాబుగారికి థాంక్స్. వర్కింగ్ డే అయినప్పటికీ... ఈ రోజు ఇక్కడికి వచ్చిన ప్రేక్షకులు అందరికీ థాంక్స్. మీరు ఇచ్చే కిక్, హై డిఫరెంట్. ఈ 'బందోబస్త్' కంప్లీట్ ఎంటర్టైనర్ ఫిల్మ్. మీ అందరికీ నచ్చుతుంది. జర్నలిస్ట్ బ్యాగ్రౌండ్ నుండి కెవి ఆనంద్ సార్ వచ్చారు. రియల్, ట్రూ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఆయన సినిమాలు తీస్తారు. ఈ సినిమానూ అలాగే తీశారు. ఇందులో నేను చేసిన పాత్ర నాకు చాలా కొత్త. నాకు కొత్త ఎక్స్ పీరియన్స్. మనకు ఉద్యోగాలు ఉన్నాయి. మనం కష్టపడినందుకు జీతం వస్తుంది. మన దేశం కోసం, భద్రత కోసం ఎంతో మంది నిజమైన హీరోలు, గుర్తింపుకు నోచుకొని హీరోలు సరిహద్దుల్లో ప్రతి రోజు నిలబడతారు. వాళ్లను నేను వ్యక్తిగతంగా కలవడం గొప్ప అనుభవం. దేశానికి ఎంతో సేవ చేసిన వారందరూ వేదికల మీదకు ఎప్పుడూ రారు. గుర్తింపు కోరుకోకుండా తమ తమ బాధ్యతలను నెరవేరుస్తుంటారు. ఆ హీరోలను వెలుగులోకి తీసుకువచ్చే ప్రయత్నమే ఈ 'బందోబస్త్'. వాళ్లు ఏం చేస్తారో చూపించే ప్రయత్నం చేశాం. నేను ఈ సినిమాలో ఎస్.పి.జి (స్పెషల్ ప్రొటక్షన్ గ్రూప్) కమాండోగా చేశా. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి భద్రతగా నిలిచే ఫస్ట్ సర్కిల్ లో ఎస్.పి.జి కమాండోలు ఉంటారు. ఎవరైనా ఫైరింగ్ చేస్తే వాళ్లు పారిపోరు. తమ గుండెలు చూపిస్తారు. కుటుంబ జీవితాలను త్యాగం చేస్తారు. అటువంటి గొప్ప అధికారులకు నేను ఇచ్చే గౌరవం ఈ సినిమా. 'బందోబస్త్'తో వాళ్లకు థాంక్స్ చెప్పాలని అనుకుంటున్నాను. 'బందోబస్త్' సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ మాత్రమే ఇవ్వదు, ఇంతకు ముందు ఎన్నడూ సినిమాల్లో చూడని కొత్త వాతావరణంలోకి ప్రేక్షకులనుతీసుకు వెళుతుంది. ప్రధానమంత్రి కార్యాలయం, డిఫెన్స్, సెక్యూరిటీ, వ్యవసాయం... సినిమాలో చాలా లేయర్స్ ఉన్నాయి. ఇవన్నీ తెలిసిన ఒక వ్యక్తి రెబెల్ గా మారితే... అతను ఏం చేయగలడు? అతను ఎందుకు రెబెల్ గా మారాడు? అనేది సినిమాలో చూడండి. సినిమాలో చాలా చాలా కథలు ఉన్నాయి. సినిమాలో నేను మాత్రమే కాదు... మోహన్ లాల్ గారు, ఆర్య, బోమన్ ఇరానీ, కిరణ్ ఉన్నారు. అన్ని కథలు కూడా ఉన్నాయి. నాతో సన్నివేశాలకు మాత్రమే సాయేషా పరిమితం కాలేదు. కథను మార్చే పాత్రలో ఆమె కనిపిస్తుంది. ఇదొక ఆల్ రౌండ్ ఎంటర్టైనర్. కెవి ఆనంద్ గారితో నేను చేసిన మూడో సినిమా 'బందోబస్త్'. ఇందులో మోహన్ లాల్ గారితో పని చేయడం అమేజింగ్ ఎక్స్ పీరియన్స్" అని అన్నారు. 

  
ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ "లైకా ప్రొడక్షన్స్ సుభాస్కరన్ గారు మాకోసం 'స్పైడర్'ను తమిళనాడులో విడుదల చేశారు. భారీ ఎత్తున విడుదల చేసి, మాకు బ్రహ్మాండమైన బిజినెస్ చేసి పెట్టారు. తెలుగు సినిమాకు అక్కడ మార్కెటింగ్ చేస్తే ఎంత రెవెన్యూ వస్తుందో... అంత చేశారు. వాళ్ల బ్యానర్ మాకు ఎంతో సపోర్ట్ చేసింది. అప్పటి నుండి వాళ్ల సినిమాలు అన్నిటినీ తెలుగులో నేను విడుదల చేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన సుభాస్కరన్ గారికి, ఆయన టీమ్ కి నమస్కారం. చిన్న స్థాయి నుండి ఉన్నత స్థాయికి చేరుకున్న సుభాస్కరన్  గారు, సినిమాలపై ప్రేమతో విదేశాల్లో ఉన్నప్పటికీ దక్షిణాదిలో చాలా కాస్ట్లీ సినిమాలు నిర్మిస్తున్నారు. అటువంటి బ్యానర్ పది కాలాల పాటు ఉండి, ఎన్నో విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నా. తమిళనాడులో టాప్ హీరోలు, టెక్నీషియన్లు ఈ బ్యానర్ లో చేశారంటే ఈ బ్యానర్ గొప్పతనం ఏంటో తెలుసుకోవచ్చు. 'బందోబస్త్' సూర్య కెరీర్లో బిగ్గెస్ట్ సినిమాగా నిలుస్తుంది. కెవి ఆనంద్ గారి 'రంగం'కు తిరుపతిలో నేను 100 రోజుల ఫంక్షన్ చేశాను. తమిళనాడులో ఆ సినిమాకు ఫంక్షన్ చేయలేదు. నేను మెగాస్టార్ చిరంజీవిగారిని ముఖ్య అతిథిగా తీసుకొచ్చి, ఫంక్షన్ చేశాను. సూర్య గారు, కెవి ఆనంద్ కాంబినేషన్లో వస్తున్న ఈ 'బందోబస్త్'కు కచ్చితంగా 100 రోజుల ఫంక్షన్ చేయాలని, అంత పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా ఒక సెన్సేషనల్ హిట్ అయి సూర్యగారికి తెలుగు ఇండస్ట్రీలో ఒక పెద్ద మార్కెట్ ఏర్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని అన్నారు.


అతిథిగా హాజరైన నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ మాట్లాడుతూ "లైకా ప్రొడక్షన్ సంస్థ సూపర్ స్టార్స్, మహా నటులతో బందోబస్తుగా తీసిన సినిమా ఈ 'బందోబస్త్'. మా తిరుపతి ప్రసాద్ (ఎన్వీ ప్రసాద్) గారు విడుదల చేస్తున్నారు. సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను" అని అన్నారు.


అతిథిగా హాజరైన 'జెర్సీ' దర్శకుడు గౌతమ్ తిన్ననూరి మాట్లాడుతూ "సూర్యగారిని ఈ రోజు కలవడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. ఆయన నటనకు నేను పెద్ద అభిమానిని. 'కాకా కాకా' (తెలుగులో 'ఘర్షణ'గా వెంకటేష్ రీమేక్ చేశారు) ఇప్పటికీ నా ఫెవరెట్ ఫిల్మ్. 'బందోబస్త్' ఈ నెల 20న విడుదలవుతుంది. ఈ సినిమాలో ప్రతి ఒక్కరికీ నా బెస్ట్ విషెస్. సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని ఆశిస్తున్నాను" అని అన్నారు.    


'బందోబస్త్' దర్శకుడు కెవి ఆనంద్ మాట్లాడుతూ "సూర్యతో పని చేయడం గొప్ప ఫీలింగ్. ఆయనలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే... మనం 50 పర్సెంట్ ప్లాన్ చేస్తే, ఆయన తన నటనతో, డ్యాన్సులతో, యాక్షన్ తో 100 పర్సెంట్ చేస్తారు. ఈ సినిమాకు గొప్ప గొప్ప నటులు నటులు దొరకడం నా అదృష్టం. మోహన్ లాల్ గారు ప్రధానమంత్రి పాత్రలో నటిస్తున్నారు. ఆర్య, సాయేషా మంచి క్యారెక్టర్స్ చేశారు. సినిమా బాగా వచ్చింది. మూడు రోజుల క్రితం మొత్తం సినిమాను చూశాను. హ్యారీస్ జైరాజ్ గారు మంచి పాటలు ఇచ్చారు. అంతకు మించి ఫెంటాస్టిక్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. సినిమాను నెక్స్ట్ లెవల్ కి తీసుకు వెళ్లారు" అని అన్నారు.


ఆర్య మాట్లాడుతూ "సూర్యగారితో పని చేయడం గౌరవం. అదే విధంగా లెర్నింగ్ ప్రాసెస్. సూర్యగారు గ్రేట్ జెంటిల్ మన్. మీ అందరిలా నేనూ ఆయన్ను ప్రేమిస్తాను. ఈ సినిమాలో సూర్యగారితో కలిసి నటించే అవకాశం దక్కినందుకు సంతోషంగా ఉంది. 'బందోబస్త్' పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా" అని అన్నారు.   


సాయేషా సైగల్ మాట్లాడుతూ "ఫస్ట్ టైమ్ సూర్యగారితో నటించాను. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఆయనతో కలిసి నటించాలనేది నా డ్రీమ్. సూర్యగారితో పని చేస్తుంటే మనమూ ఎక్కువ కష్టపడతాం. కళ్లలో వెయ్యి భావాలు పలికిస్తారు. నా క్యారెక్టర్ చాలా బావుంటుంది. కెవి ఆనంద్ గారు కేవలం పాటలు, డ్యాన్సుల కోసం హీరోయిన్ క్యారెక్టర్స్ రాయరు. కథలో వాళ్లకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. హీరోయిన్లకు నటించే అవకాశం దొరుకుతుంది. ఇంకా చాలా చేయవచ్చు. కెవి ఆనంద్ గారి దర్శకత్వం నటించడం నా అదృష్టం. నా క్యారెక్టర్ లో చాలా షేడ్స్ ఉంటాయి. మిస్టీరియస్ క్యారెక్టర్. కథను ముందుకు తీసుకు వెళుతుంది. గొప్ప టీమ్ తో కలిసి చేసిన అద్భుతమైన సినిమా ఇది. మేమంతా సినిమా కోసం చాలా కష్టపడ్డాం. నెక్స్ట్ ఫ్రైడే... సెప్టెంబర్ 20న మీరందరూ థియేటర్లకు వచ్చి సినిమా చూడండి" అని అన్నారు. 


గేయ రచయిత వనమాలి మాట్లాడుతూ "యాక్చువల్లీ... డబ్బింగ్ పాటలు అంటే చాలామందికి చులకన భావం ఉంటుంది. 'ఏముంటుంది? మాతృకలో ఉన్న భావాలను రాస్తారు' అని. కానీ, ఆ అభిప్రాయం తప్పు. నిజంగా స్ట్రయిట్ సాంగ్స్ రాయడం కంటే డబ్బింగ్ సాంగ్స్ రాయడం కష్టం. 'హ్యాపీ డేస్', 'ఆరెంజ్' నుండి నేను చాలా సినిమాల్లో స్ట్రయిట్ సాంగ్స్ రాశాను. కానీ, ఇటువంటి పాటలు రాసినప్పుడు... నిజంగా ఆ భావాన్ని తెలుగులో స్ట్రయిట్ సాంగ్స్ వలే రాయడానికి ఎంత కష్టపడ్డామనేది పాటలు వింటున్నప్పుడు తెలుస్తుంది. 'శివపుత్రుడు', 'రంగం'... చాలా సినిమాలకు నేను డబ్బింగ్ సాంగ్స్ రాశాను. ముఖ్యంగా డబ్బింగ్ సాంగ్స్ రాసేటప్పుడు మణిరత్నం, శంకర్ తర్వాత కేవీ ఆనంద్ గారికి భయపడతాను. మణిరత్నం, శంకర్ పాట రాసేటప్పుడు పక్కన కూర్చుని ప్రతి పదానికి మీనింగ్ తెలుసుకుంటారు. కేవీ ఆనంద్ గారు కూడా అంతే. 'రంగం' నుండి ఆయన ప్రతి సినిమాకు నాతో పాట రాయించుకుంటున్నారు. ఆయనతో పని చేయడం గొప్ప సంతృప్తి ఇచ్చింది. హ్యారిస్ జైరాజ్ గారు మంచి పాటలు ఇచ్చారు. పాటలతో పాటు సినిమా కూడా హిట్ కావాలని కోరుకుంటున్నారు" అని అన్నారు.   


'బందోబస్త్' సినిమాటోగ్రాఫర్ ఎం.ఎస్. ప్రభు మాట్లాడుతూ "నాకు చాలా పరిచయమైన హీరో సూర్య గారు. ఆయనకు నేను డైహార్డ్ ఫ్యాన్. మా కాంబినేషన్లో 'వీడోక్కడే' చేశాం. సూర్యగారి అభిమానుల కోలాహలం చూస్తుంటే సంతోషంగా ఉంది. 'బందోబస్త్' విడుదలైన తర్వాత థియేటర్లలో ఇదే విధమైన సపోర్ట్ ఇవ్వాలి. ఈ సినిమాను మీరందరూ పెద్ద హిట్ చేయాలి. కేవీ ఆనంద్ దర్శకుడి కంటే ముందు నా స్నేహితుడు. చిన్నప్పటి నుండి తెలుసు. మేం ఇద్దరం పీసీ శ్రీరామ్ గారి దగ్గర అసిస్టెంట్స్ గా చేశాం. సూర్య ఫస్ట్ సినిమాకు కేవీ ఆనంద్ సినిమాటోగ్రాఫర్. తర్వాత నేను చేశాను. ఇప్పుడు ఇద్దరం కలిసి పని చేశాం" అని అన్నారు.


'బందోబస్త్' ఎడిటర్ ఆంటోనీ మాట్లాడుతూ "ఈ సినిమాను ఫస్ట్ చూసింది నేనే. చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరూ చాలా చాలా బాగా నటించారు. సూర్యగారు సూపర్ గా చేశారు 


ఈ కార్యక్రమంలో నిర్మాతలు మల్కాపురం శివకుమార్, 'ఠాగూర్' మధు, నటులు రాజ్ కుమార్, రామదాస్, కిరణ్, లైకా ప్రొడక్షన్స్ సంస్థకు చెందిన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్  సుందర్ రాజన్,  లైకా ప్రొడక్షన్స్ సంస్థకు సేల్స్ అండ్ మార్కెటింగ్ చెందిన శరన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.  


సూర్య సరసన సాయేషా సైగల్ నటిస్తున్న ఈ సినిమాలో భారత ప్రధానిగా మలయాళ సూప‌ర్‌స్టార్ మోహ‌న్‌లాల్‌, కీలక పాత్రలో ఆర్య నటిస్తున్నారు. బోమన్ ఇరానీ, ఆర్య, సాయేషా సైగల్, సముద్రఖని, పూర్ణ, నాగినీడు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.


ఈ చిత్రానికి పీఆర్వో: సురేంద్రకుమార్ నాయుడు - ఫణి కందుకూరి, రైటర్: పి.కె.పి & శ్రీ రామకృష్ణ, లిరిక్స్: చంద్రబోస్, వనమాలి, ఆర్ట్ డైరెక్టర్:  డి.ఆర్.కె. కిరణ్, ఎడిటర్: ఆంటోనీ, స్టంట్స్: దిలీప్ సుబ్బరాయన్, పీటర్ హెయిన్స్, డాన్స్: బాబా భాస్కర్, శోభి, గణేష్ ఆచార్య, సినిమాటోగ్రఫీ: ఎం.ఎస్. ప్రభు, సంగీతం: హ్యారీస్ జైరాజ్, నిర్మాత: సుభాస్కరణ్, దర్శకత్వం: కె.వి. ఆనంద్.


'Bandobast' is an all-round entertainer: Suriya says at pre-release event


Ahead of the release of 'Bandobast' on September 20, a grand pre-release event was held on Friday night at Hyderabad's ITC Kohenur.  The event was graced by the beloved and versatile actor Suriya, who was extremely delighted to receive the love of the fans at the event.  Also graced by the film's cast crew, producer D Suresh Babu (who launched the theatrical trailer of the film) and others, it was a nice spectacle.  


Speaking on the occasion, Suresh Babu said, "I wish all the best to Lyca Productions and NV Prasad garu, who is releasing the Telugu version of 'Kaappaan' as 'Bandobast'.  Suriya is like family.  His father acted in my father's movies.  I too want to work with Suriya but I am not sure when it will happen.  He is a very good man and his family is lovely.  I wish only good for him."


Suriya said, "I thank Lyca Productions' Subaskaran for making 'Bandobast' as a big movie with rich production values and an ensemble cast.  I also thank NV Prasad garu for ensuring a grand release in Telugu on Sept 20.  I have come to know that Lyca and NV Prasad garu have had a very strong association with each other.  I thank Suresh Babu garu and others for being here today.  Many have attended the event by securing passes despite it being a working day.  The high you people (fans) give is different.  KV Anand, who comes from a journalism background, is often inspired by true incidents in making movies.  My character is an SPG commando in the movie  It has been a new experience doing it.  I have learned how much security personnel sacrifice for the sake of national security.  They don't pine for recognition.  I have met several decorated officers as part of the homework for this movie.  And I learned so much from them in a span of a few days.  SPG commandos don't think twice before taking the bullet for the security of VVIPs, they take the bullet as the first in the line of fire.  'Bandobast' tries to show some aspects of their lives. This film is not just a cinematic experience but will transport you to new atmospherics.  A lot of elements, such as the Prime Minister's Office, defence, etc have been explored.  What happens when someone who is in the know of secrets goes rogue?  Why did he turn a rogue?  That's the film's crux.  There are several stories in the movie.  It has been an honour to work with the legendary Mohanlal garu.  And Arya, Boman Irani, Sayyeshaa Saigal, Kiran... have been great to work with.  Sayyeshaa changes the direction of the story.  'Bandobast' is an all-round entertainer."
NV Prasad said, "It was Subhaskaran garu who released the Tamil version of 'SPYder' in Tamil Nadu and ensured that the film had a maximum market.  Lyca Productions ensured a huge release.  That way, the potential of a Telugu movie was proved.  Lyca has been of immense support to me.  I am happy that I am getting to release their prestigious ventures in Telugu.  Subaskaran garu has been making ambitious projects out of a passion for cinema, in south India.  His banner should continue to grow forever.  Top Kollywood technicians and heroes are all associated with this banner.  'Bandobast' will be Suriya's biggest film in his career.  When director KV Anand garu scored a blockbuster with 'Rangam' ('Ko') years ago, I hosted a 100 days celebration in Tirupathi.  Chiranjeevi garu graced it as the chief guest.  I hope that kind of success will be repeated with  'Bandobast'."


Producer BVSN Prasad said, "This huge film should bring success to everyone associated with it, especially NV Prasad garu."


'Jersey' director Gowtam Tinnanuri said, "I feel honoured to have got to meet Suriya garu today.  I am a big fan of his acting.  I loved him in 'Kaka Kaka', which is one of my most favourite movies.  My best wishes to team  'Bandobast'.  I hope it will become a blockbuster."


Director KV Anand said, "It was a great feeling to work with Suriya.  What makes him special is that he makes everything complete.  It's enough if you plan 50 percent.  He will make it complete with his performance, acting and dances.  Mohanlal garu has played a Prime Minister in the movie.  It was a nice experience to work with Arya, Sayyeshaa and others.  More than the songs, Harris Jayaraj's background score is superb."


Arya said, "Working with Suriya garu has been a learning experience.  He is such a gentleman and lovely person.  I hope 'Bandobast' becomes a big hit."


Sayyeshaa Saigal said, "It was always my dream to work with Suriya garu.  And I finally got the opportunity to work with him.  My character is not limited to songs and dances in the movie but has a specific purpose.  KV Anand garu's characters are performance-oriented and heroines get a lot of scope for showing their talent.  My character has got several shades in 'Bandobast'.  It drives the story.  We are all waiting for you all to watch our movie on Sept 20.
Lyricist Vanamali said, "Writing songs for dubbed movies is more difficult that penning straight songs.  After Mani Ratnam garu and Shankar garu, the one director who is quite demanding when it comes to songs is KV Anand garu.  He is particular about lyrics.  I have written songs for a number of dubbed movies since the days of 'Shiva Putrudu'.  Working with KV Anand garu is something that I regard special always."


Cinematographer MS Prabhu said, "I am a fan of Suriya garu.  We did 'Veedokkade' before.  I am happy to watch the excitement of Suriya's fans for 'Bandobast'.  Director KV Anand is a good friend of mine.  I have known him since childhood.  We both got trained under PC Sreeram garu."


Editor Anthony said, "I am the first one to watch 'Bandobast'.  The output is really great."


Lyca Production's Executive Producer Sundarajan said, "I convey my thanks to one and all on behalf of  Subaskaran garu."


The event was also graced by producers Malkapuram Sivakumar, 'Tagore' Madhu, actors Raj Kumar, Ramdoss, Kiran, Lyca Productions' Executive Producer S Sundarajan , Lyca Productions' Sales & Marketing side's Saran Raj and others.  


Cast & crew:
Suriya, Mohanlal, Boman Irani, Arya, Sayyeshaa Saigal, Samuthirakani, Poorna, Nagineedu and others will also be seen in key roles.  
PRO: Surendra Kumar Naidu - Phani Kandukuri.  Writer: PKP , Sri Ramakrishna.  Lyrics: Vanamali, Chandrabose.  Art Director: DRK Kiran.  Editor: Anthony.  Stunts: Dhilip Subbarayan, Peter Heins.  Dances: Baba Bhaskar, Sobhi, Ganesh Acharya.  Cinematography: MS Prabhu.  Music: Harris Jayaraj.  Producer: Subhaskaran.  Director: KV Anand. Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !