View

నాని చేతుల మీదుగా విడుదలైన అత‌డే శ్రీమ‌న్నారాయ‌ణ‌ ట్రైలర్  ర‌క్షిత్ శెట్టి హీరోగా పుష్క‌ర్ ఫిలింస్ బ్యాన‌ర్‌

Friday,November29th,2019, 10:53 AM

ర‌క్షిత్ శెట్టి హీరోగా పుష్క‌ర్ ఫిలింస్ బ్యాన‌ర్‌పై పుష్క‌ర్ మ‌ల్లిఖార్జున‌, హెచ్‌.కె.ప్ర‌కాశ్ నిర్మిస్తోన్న చిత్రం అత‌డే శ్రీమ‌న్నారాయ‌ణ‌. స‌చిన్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచయం అవుతున్నారు. క‌న్న‌డ‌, తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో ప్యాన్ ఇండియా చిత్రంగా గ్రాండ్ లెవ‌ల్లోఈ సినిమానువిడుద‌ల చేస్తున్నారు. గురువారం ఈ సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. తెలుగు ట్రైల‌ర్‌ని నేచుర‌ల్ స్టార్ నాని విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా...
హీరో ర‌క్షిత్ శెట్టి మాట్లాడుతూ - ట్రైల‌ర్ అంద‌రికీ న‌చ్చింద‌నే అనుకుంటున్నాను. సాధార‌ణంగా నేను ఇప్ప‌టి వ‌ర‌కు నా సినిమాల ట్రైల‌ర్స్‌ను నేనే క‌ట్ చేసుకుంటున్నాను. కానీ ఈ సినిమా ట్రైల‌ర్‌ను క‌ట్ చేయ‌డానికి నెల‌రోజుల స‌మ‌యం ప‌ట్టింది. నేను షార్ట్ ఫిలింస్ నుండి సినిమాల్లోకి వ‌చ్చాను. చాలా క‌ష్ట‌ప‌డ్డాను. ఇక `అత‌డే శ్రీమ‌న్నారాయ‌ణ‌` సినిమా విష‌యానికి వ‌స్తే ఈ సినిమా కోసం మూడేళ్లు క‌ష్ట‌ప‌డ్డాను. ఈ జ‌ర్నీలో నాతో పాటు చాలా మంది ప్ర‌యాణించారు. నా టీమ్‌కు ఈ సంద‌ర్భంగా థ్యాంక్స్ చెబుతున్నాను. నేను వ‌చ్చి ఏడేళ్లు అయ్యింది. త‌క్కువ సినిమాలే చేశావ‌ని అంటుంటారు. కానీ మీరు చూస్తే నేను చేసిన సినిమాలు చూస్తే నేను, నాటీమ్ ప‌డ్డ కష్టం ప‌డుతుంది. ఈ సినిమాకు శంక‌ర్ నాగ్‌గారు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `మాల్గుడి డేస్‌` నాకు స్ఫూర్తి. ఆ సినిమాలోని మాల్గుడి ప్ర‌దేశం ద‌క్షిణ భార‌తానికి చెందిన ఉహ‌త్మాక ప్ర‌దేశం.  అది భార‌త‌దేశంలోని అన్ని ప్రాంతాల‌కు క‌నెక్ట్ అయ్యేలా ఉంటుంది. ఈ సినిమాకోసం 19 సెట్స్ వేశాం. దాదాపు 90 శాతం బెంగ‌ళూరు సెట్స్‌లోనే తీశాం. మిగిలిన భాగాన్ని బీజాపూర్‌, ఉత్త‌ర క‌ర్ణాట‌క‌ల్లో చిత్రీక‌రించాం. అలాగే సినిమా ప్రారంభించి టీజ‌ర్ విడుద‌ల చేసే స‌మ‌యానికి ప్యాన్ ఇండియా మూవీగా చేయాల‌ని నిర్ణయించుకున్నాం. అందులో భాగంగానే ఇప్పుడు సినిమా హ్యూజ్ రేంజ్‌లో విడుదల చేస్తున్నాం. డ‌బ్బింగ్ విష‌యానికి వ‌స్తే క‌న్న‌డ వెర్ష‌న్ ను పూర్తి చేశాను. హిందీ ట్రైల‌ర్‌కు డ‌బ్బింగ్ చెప్పాను. వాయిస్ సెట్ అవ‌డంతో ఇప్పుడు హిందీకి పూర్తి స్థాయిలో డ‌బ్బింగ్ చెప్పాల‌ని అనుకుంటున్నాను. ఇంత పెద్ద సినిమాను పూర్తి చేసి ప్యాన్ ఇండియా మూవీగా చేశామంటే నిర్మాత‌లు అందించిన ప్రోత్సాహ‌మే కార‌ణం. ఈ సినిమా కోసం మూడేళ్లలో 385 రోజ‌లు పాటు క‌ష్ట‌పడ్డాం. డైరెక్ట‌ర్ స‌చిన్ నిద్రాహారాలు మానుకుని రేయింబ‌గ‌ళ్లు క‌ష్ట‌ప‌డ్డాడు. టీమ్ అంద‌రూ బాగా స‌పోర్ట్ చేశారు. నా మిత్రుడు, కిరిక్ పార్టీ డైరెక్ట‌ర్ రిష‌బ్ శెట్టి ఈసినిమాలో చిన్న స‌న్నివేశంలో క‌నిపించింనందుకు థ్యాంక్స్. ఈ సినిమాలో ల‌వ్‌, అడ్వెంచ‌ర్‌, కామెడీ, యాక్ష‌న్ స‌హా అన్ని హంగులుంటాయి`` అన్నారు. అనంత‌రం పాత్రికేయులు అడిగిన ప్ర‌శ్న‌కు బ‌దులుగా తెలుగులో త‌న అభిమాన న‌టుడు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్ట‌మ‌ని తెలిపారు. త‌న న‌ట‌న‌, ఆఫ్ స్క్రీన్, ఆన్ స్క్రీన్‌లో త‌న ప‌రిణితి త‌న‌కు న‌చ్చుతుంద‌ని తెలిపారు.
నిర్మాతలు పుష్క‌ర్ మ‌ల్లిఖార్జున‌, హెచ్‌.కె.ప్ర‌కాశ్ మాట్లాడుతూ - ముందు ఈ సినిమాను 8 కోట్ల రూపాయ‌ల బ‌డ్జెట్ తో ప్రారంభించాం. క‌థ‌, స‌బ్జెక్ట్ మీద నమ్మ‌కంతో మంచి చిత్రంగా, నిర్మాణ వ్య‌యంలో రాజీ ప‌డ‌కుండా నిర్మించాం. అలాగే ప్యాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేస్తున్నాం. ర‌క్షిత్ శెట్టి ఈ సినిమాలో యాక్ట్ చేయడం మాకు హ్యాపీ. త‌న‌తో మ‌రిన్ని చేయాల‌నుకుంటున్నాం అన్నారు.
డైరెక్ట‌ర్ స‌చిన్ మాట్లాడుతూ - మూడేళ్ల పాటు ఓ సినిమాకు ప‌నిచేయ‌డం చాలా గొప్ప విష‌యం. ఇందులో నా ఒక్క‌డి క‌ష్టమే కాదు.. అంద‌రి స‌పోర్ట్ దొరికింది. అంద‌రికీ నచ్చేలా ఉంటుంది. హీరో ర‌క్షిత శెట్టి, నిర్మాత‌లు పుష్క‌ర్ మ‌ల్లిఖార్జున‌, హెచ్‌.కె.ప్ర‌కాశ్ల‌కు, ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల‌కు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేసుకుంటున్నాను అన్నారు.
ఈ కార్య‌క్ర‌మంలో హీరోయిన్ శాన్వి శ్రీవాత్స‌వ స‌హా ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.


Athade Srimannarayana Trailer Launched by Hero Nani


Starring Rakshit Shetty as the lead, Atade Srimannarayana is an upcoming flick produced on the Pushkar Films banner by Pushkar Mallikarjuna and H.K. Prakash. Directed by debutant Sachin, the film is releasing across India in Kannada, Telugu, Tamil, Malayalam and Hindi in a grand fashion! 


An elaborate trailer launch event was held for the film on Thursday where the key members of the team were in attendance.


Speaking at the occasion, actor Rakshit Shetty said, "I hope everyone likes the trailer! So far, I have always cut the trailer for my films. But this time it took over a month to do so. Athade Srimannarayana has been a labour of love of three years and there were many who were part of this journey and that is why I want to say a huge, heartfelt thanks to my entire team on this occasion. It has been seven years since I ventured into films and everyone says that I have done less work. But if you see my films you can see how much effort our team puts in. This film is inspired by Shankar Nag's Malgudi Days. The fictional South Indian town of Malgudi in the film is the kind that will have a pan India appeal. We set up around 19 sets for the film and over 90% was shot on the sets in Bengaluru. The rest was filmed in Bijapur and the northern parts of Karnataka. And it was when we started the film and released the first teaser that we thought we should give the film a pan India release. The Kannada version's dubbing has been completed. I dubbed for the Hindi trailer myself and with the voice suiting well, I'll dub for the film too. If we have managed to make this such a big relase, it was possible only because of the support of our producers. In the three years, we had over 385 hard working days of shoot. Director Sachin spent sleepless nights on this project. Rishab Shetty, the director of Kirak Party has played a small role in this film. This one is going to be full of love, adventure, comedy and action. The journey to this space has been a long and crazy one. I started with short films, worked really hard and I am here today!”


Rakshit thanked Natural Star Nani for unveiling the Telugu trailer online and he revealed that Young Tiger NTR is his favourite actor in Telugu.


The producers Pushkar Mallikarjuna and H.K. Prakash said, "We started off the film on a budget of Rs 8 crore. We loved the script and story and decided that there would be no compromise on anything! We are so happy to associate with Rakshit Shetty and excited to release this pan India."


Director Sachin said, "Three years is a crazy time to work on a project. The film is a culmination of a lot of people's hard work. I am excited for everyone to see it."


At the event, the female lead Shanvi Srivastava was also present alongside other key members of the cast and crew.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !