యంగ్ హీరో రాజ్‌తరుణ్, షాలిని పాండే జంటగా రూపొందుతోన్నలవ్ ఎంటర్టైనర్ ఇద్దరి లోకం ఒకటే. స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్ నిర్మాతగా రూపొందుతున్న చిత్రం ఇద్దరి లోకం ఒకటే. జీఆర్.కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్‌ను పొందింది. డిసెంబర్ 25న సినిమాను విడుదల చేస్తున్నారు.
ఈ సందర్భంగా దిల్‌రాజు మాట్లాడుతూ - మా బ్యానర్లో రాజ్‌తరుణ్ హీరోగా నటిస్తోన్న రెండో చిత్రమిది. క్యూట్ లవ్ స్టోరీ. యూత్‌తోపాటు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా సినిమాను డైరెక్టర్ కృష్ణ తెరకెక్కించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన రెండు పాటలకు చాలా మంచి స్పందన వచ్చింది. త్వరలోనే మిగిలిన పాటలు, ట్రైలర్‌ను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. సినిమా సెన్సార్ పూర్తయ్యింది. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న సినిమాను విడుదల చేస్తున్నాం అన్నారు.
నటీనటులు:రాజ్ తరుణ్, షాలిని పాండే, నాజర్, పృథ్వీ, రోహిణి, భరత్, సిజ్జు, అంబరీష్, కల్ప లత తదితరులు
సాంకేతిక వర్గం:స్క్రీన్ ప్లే, దర్శకత్వం: జీఆర్.కృష్ణసమర్పణ: దిల్రాజునిర్మాత: శిరీష్కెమెరా: సమీర్ రెడ్డిమ్యూజిక్: మిక్కీ జె.మేయర్ఎడిటింగ్: తమ్మి రాజుడైలాగ్స్: అబ్బూరి రవి