View

కంటెంట్ ఈజ్ కింగ్ అని 'మత్తు వదలరా' మరోసారి నిరూపించింది

Saturday,January04th,2020, 02:00 PM

దిగ్గజ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి తనయుడు శ్రీసింహా కథానాయకుడిగా పరిచయమైన చిత్రం మత్తు వదలరా. మైత్రీ మూవీస్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై చెర్రి, హేమలత ఈ చిత్రాన్ని నిర్మించారు. రితేష్‌రానా దర్శకత్వం వహించారు. కీరవాణి పెద్ద కుమారుడు కాలభైరవ ఈ చిత్రంతో సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం అద్వితీయ వసూళ్లను సాధిస్తున్నది. ఈ సందర్భంగా  శనివారం హైదరాబాద్‌లో కంటెంట్ ఈజ్ కింగ్ సమావేశాన్ని చిత్రబృందం నిర్వహించింది. ఈ వేడుకకు హీరో అడివిశేష్‌తో పాటు  దర్శకుడు వివేక్ ఆత్రేయ, ఆర్.ఎస్.జే స్వరూప్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా...
అడివిశేష్ మాట్లాడుతూ మత్తు వదలరా నా దృష్టిలో పెద్ద సినిమా. రెండు రోజుల క్రితం సినిమా చూశాను. సగటు ప్రేక్షకుడిలా చాలా ఎంజాయ్ చేశాను.  ఈ చిత్రబృందం నాలో స్ఫూర్తిని నింపింది. ఇలాంటి ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు, నటీనటులతో పనిచేయాలనే తపన నాలో కలిగించింది. పరిపూర్ణమైన చిత్రమిది.  నటుడిగా శ్రీసింహా చక్కటి వేరియేషన్స్‌ను కనబరిచారు. కేవలం రెండు కంప్యూటర్స్‌తోనే అత్యున్నతమైన క్వాలిటీలో ఈసినిమాను అద్భుతంగా తెరకెక్కించారు అని అన్నారు.
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఫేమ్ ఆర్.ఎస్.జె.స్వరూప్ మాట్లాడుతూ ఈ చిత్రబృందాన్ని చూస్తుంటే నా ఆత్రేయ టీమ్ గుర్తొస్తుంది. చాలా బ్రిలియంట్ ఫిల్మ్ ఇది. నవ్విస్తూనే చప్పట్లు కొట్టిస్తున్నది. వైవిధ్యమైన కథాగమనంలో సరికొత్తగా సినిమాను తెరకెక్కించారు. గత ఏడాది వచ్చిన ఏడు థ్రిల్లర్ సినిమాలు అద్భుతమైన విజయాల్ని సాధించాయి. అందులో మత్తు వదలరా ఒకటిగా నిలవడం ఆనందంగా ఉంది అని పేర్కొన్నారు.


బ్రోచేవారెవరురా ఫేమ్ వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ నన్ను నేను పూర్తిగా మర్చిపోయి ఎంజాయ్ చేసిన సినిమా ఇది. డైరెక్షన్, మ్యూజిక్, ఎడిటింగ్..ఇలా ఏదో ఒక విభాగం పనితీరుతో సినిమాలు ఆడుతుంటాయి. కానీ ఈ సినిమా అన్ని విభాగాల సమిష్టి కృషి వల్ల విజయవంతమైంది. ఇలాంటి కథను రాయడం చాలా కష్టం.  కొత్తవాళ్లను నమ్మి ఇలాంటి కథతో నిర్మాతలు సినిమా తీయడం ఇంకా కష్టం. రితేష్‌రానా బృందం ఆలోచనల్ని నమ్మి చెర్రి, మైత్రీ మూవీస్ వారు సినిమాను చేయడం అభినందనీయం అని చెప్పారు.


మైత్రీ మూవీ నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ మాట్లాడుతూ ఓ సినిమా వందకు 125 వసూలు చేస్తే హిట్. వందకు 150 వసూలు చేస్తూ సూపర్ హిట్. అదే వంద పెట్టుబడికి రెండు వందలు  కలెక్షన్స్ రాబడితే బ్లాక్‌బస్టర్. మత్తు వదలరా మూడో కేటగిరికి చెందిన సినిమా. అనుకున్న బడ్జెట్‌లోనే చిత్రబృందం ఈసినిమాను పూర్తిచేశారు. చేశారు. చిన్న సినిమా అయినా కథను నమ్మి ప్రొడక్షన్ డిజైనర్ ఏ.ఎస్ ప్రకాష్ పారితోషికం తీసుకోకుండా ఈ సినిమాకు పనిచేశారు. డిసెంబర్‌లో పోటీగా చాలా సినిమాలు విడుదలైనా కథపై నమ్మకంతో తక్కువ థియేటర్లు దొరికినా విడుదలచేశాం. మౌత్ పబ్లిసిటీతో సినిమా విజయవంతమవ్వడం ఆనందంగా ఉంది. ఎన్టీఆర్, రామ్‌చరణ్, రానా, ప్రభాస్  ఇండస్ట్రీలోని చాలా  మంచి సినిమాకు తోడ్పాటును అందించారు అని తెలిపారు.


నిర్మాత చెర్రి మాట్లాడుతూ రొటీన్‌కు భిన్నమైన ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరించడం ఆనందంగా ఉంది. కొత్త నటీనటులు, సాంకేతిక నిపుణులు మంచి సినిమా తీసి విజయాన్ని అందుకోవడం గర్వాన్ని కలిగిస్తున్నది. కంటెంట్ బాగుంటే పెద్ద సినిమా, చిన్న సినిమా అనే తేడాలు లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని ఈ సినిమా రుజువుచేసింది. కంటెంట్ ఈజ్ కింగ్ అని నిరూపించింది అని అన్నారు.


దర్శకుడు రితేష్‌రానా మాట్లాడుతూ మౌత్ పబ్లిసిటీతో ఈ సినిమా ప్రేక్షకులకు చేరువ అవుతుందని నమ్మాను. అదే నిజమైంది. ప్రతి ఒక్కరూ  కథ, పాత్రల్ని ఓన్ చేసుకుంటున్నారు. కాలభైరవ తన సంగీతంతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాడు. ఈసినిమాతో టీమ్ అందరికి పేరురావడం ఆనందంగా ఉంది అని తెలిపారు.
హీరో శ్రీసింహా మాట్లాడుతూ కొత్త ఏడాది చక్కటి విజయంతో ప్రారంభం కావడం సంతోషంగా ఉంది. భవిష్యత్తులో కథాబలమున్న సినిమాలతోనే నటుడిగా నా ప్రయాణాన్ని కొనసాగిస్తాను అని చెప్పారు.


కాలభైరవ మాట్లాడుతూ ఈ సినిమాతో ఎంతో నేర్చుకున్నాను. సినిమా రూపకల్పనతో పాటు ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించడానికి ఉండే శ్రమ ఏమిటో తెలిసింది. టీమ్‌లోని ప్రతి ఒక్కరూ వందశాతం కష్టపడి ఈసినిమా చేశారు. అందువల్లే నేను మంచి నేపథ్య సంగీతాన్ని ఇవ్వగలిగాను అని పేర్కొన్నారు.


ఈ కార్యక్రమంలో సురేష్ సారాంగం, థామస్, తేజ, రోహిణి, అతుల్యచంద్ర, నరేష్ అగస్త్య తదితరులు పాల్గొన్నారు. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !