View

'జాను' సినిమాతో ఆ ప్రేమను తిరిగి ఇస్తాను - శర్వానంద్

Thursday,February06th,2020, 04:21 AM

శర్వానంద్‌, సమంత అక్కినేని హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న హార్ట్‌ టచింగ్‌ లవ్‌స్టోరీ 'జాను'. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై సి.ప్రేమ్‌ కుమార్‌ దర్శకత్వంలో హిట్‌ చిత్రాల నిర్మాత దిల్‌రాజు, శిరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఫిబ్రవరి 7న విడుదల చేస్తున్నారు.  ఈసంద‌ర్భంగా మంగ‌ళ‌వారం వైజాగ్‌లో జ‌రిగిన గ్రాండ్ ప్రీరిలీజ్ కార్య‌క్ర‌మంలో... 


హీరో శ‌ర్వానంద్ మాట్లాడుతూ - ‘‘ప్రేక్ష‌కులు ఇస్తున్న ప్రేమ‌ను ఎలా తీర్చుకుంటానో తెలియ‌దు కానీ.. జాను సినిమాతో ఆ ప్రేమ‌ను తిరిగి ఇస్తాను. ఈ టైటిల్ మాకు ఇచ్చినందుకు ప్ర‌భాస్ అన్న‌కు థ్యాంక్స్‌. నా కెరీర్‌లో `జాను` గొప్ప సినిమాగా నిలిచిపోతుంది. నాకే కాదు ప్రేక్ష‌కుల‌కు కూడా జాను గుర్తుండిపోతుంది. దానికి కార‌ణం దిల్‌రాజుగారు. ఎందుకంటే మా అంద‌రికీ ఆయ‌నే న‌మ్మ‌కాన్ని క‌లిగించారు. న‌న్ను న‌మ్ము అని చెప్పి సినిమా చేయించారు. ఆయ‌న‌పై న‌మ్మ‌కంతో చేసిన సినిమా ఇది. ఓ సాంగ్‌ను చాలా క‌ష్ట‌ప‌డి 20 రోజుల పాటు చిత్రీక‌రించాం. ఈ సినిమా చేసే స‌మ‌యంలో నాకు యాక్సిడెంట్స్ కూడా అయ్యాయి. నేను మ‌ర‌చిపోలేని సినిమా. నేను ఈ సినిమాలో బాగా యాక్ట్ చేశానంటే కార‌ణం స‌మంత‌. ఆమెతో యాక్ట్ చేయాలంటే ఒళ్లు జాగ్ర‌త్త‌గా పెట్టుకుని యాక్ట్ చేయాలి. సీన్‌ను తినేస్తుంది. కాబ‌ట్టి చాలా జాగ్ర‌త్త‌గా చేశాను. సమంతతో ఓ సినిమా కూడా చేయ‌లేక‌పోయానే అని అనుకునేవాడిని. ఈ సినిమాలో త‌న‌తో క‌లిసి గొప్ప సినిమాలో న‌టించాను. అలాగే నేను, స‌మంత బాగా న‌టించ‌డానికి కార‌ణం డైరెక్ట‌ర్ ప్రేమ్‌కుమార్‌. ప్ర‌తి ఒక్క‌రికీ ఫ‌స్ట్ ల‌వ్ ఉంటుంది. ఈ సినిమా చూసిన‌ప్పుడు అందరూ క‌నెక్ట్ అవుతారు. బ్యూటీఫుల్ మూమెంట్స్ క్రియేట్ అయ్యాయి. అందుకు కార‌ణ‌మైన స‌మంత‌కు థ్యాంక్స్‌. ఫిబ్ర‌వ‌రి 7న థియేట‌ర్స్‌లో సినిమాను ఎంజాయ్ చేయండి’’ అన్నారు. 


సమంత అక్కినేని మాట్లాడుతూ - ‘‘చాలా మంది ఇక్క‌డ 96 సినిమాను చూసే ఉంటారు. అదే క‌థ‌లో ఓ మేజిక్‌తో జాను సినిమాను చేశాం. సినిమా సైన్ చేయ‌క ముందు బాగా భ‌య‌ప‌డ్డాను. క్లాసిక్ రీమేక్ చేస్తునాం క‌దా! అని భ‌య‌ప‌డిన మాట వాస్త‌వ‌మే. వ‌ద్దులే అని అనుకున్నాను. కానీ ఫ‌స్ట్ డే షూటింగ్ నుండి నాకు పూర్తిగా సినిమాపై న‌మ్మ‌కం వ‌చ్చింది. అదే మేజిక్ కాస్త డిఫ‌రెంట్‌గా ఉంటుంది. నా కెరీర్‌లో ప్ర‌తి సంవత్స‌రం ఓ స్పెషల్ మూవీ వ‌స్తుంటుంది. అది నా గుండెల్లో నిలిచి పోతుంది. అలా కల‌కాలం నా గుండెల్లో గుర్తుండిపోయే సినిమాగా జాను నిలిచిపోతుంది. ఈ సినిమాలో ఎమోష‌న‌ల్ సీన్స్‌లో న‌టించేట‌ప్పుడు క‌న్నీళ్లు పెట్టుకున్నాను. గ్లిజ‌రిన్ కూడా వాడ‌లేదు. అందుకు కార‌ణం.. ప‌వ‌ర్ ఆఫ్ ది స్క్రిప్ట్‌, డైలాగ్స్‌, ల‌వ్‌. దిల్‌రాజుగారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నేను నో చెప్పినా కూడా ఆయ‌న ఒప్పించారు. ఆ కార‌ణంతో ఇప్పుడు నా కెరీర్‌లోని టాప్ త్రీ ప్లేస్‌ల్లో జాను నిలిచింది. తెలుగు ఇండ‌స్ట్రీలోకి బృందావ‌నంతో సినిమాతో ఎంట్రీ ఇచ్చారు దిల్‌రాజుగారు. ఇప్పుడు మ‌రో మంచి అవ‌కాశం ఇచ్చారు. జాను సినిమానే మా ఇద్ద‌రికీ బెస్ట్ మూవీ అని చెప్ప‌గల‌ను. శ‌ర్వాతో క‌లిసి ప‌నిచేయ‌డాన్ని ఎంజాయ్ చేస్తాను. త‌న‌కు థ్యాంక్స్‌. అలాగే డైరెక్ట‌ర్ ప్రేమ్‌కుమార్‌గారికి థ్యాంక్స్‌. ప్రేమ్‌గారు జీనియ‌స్‌.. మేజిక్ క్రియేట్ చేశారు. అదే ఫీల్‌ను, మేజిక్‌ను క్రియేట్ చేయ‌డం చాలా క‌ష్టం. కానీ ఆయ‌న క్రియేట్ చేశారు’’ అన్నారు. 


హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ - ‘‘ముందుగా రెబల్‌స్టార్ ప్ర‌భాస్‌కు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమాకు జాను అనే టైటిల్ మిన‌హా మ‌రో టైటిల్ పెట్ట‌లేం. అప్ప‌టికే ప్ర‌భాస్ సినిమాకు జాన్ అనే టైటిల్ ఉన్నా కూడా.. నేను అడ‌గ్గానే జాను అనే టైటిల్‌ను ఇచ్చిన ప్ర‌భాస్‌, వంశీ, ప్ర‌మోద్‌కి థాంక్స్ . త‌మిళంలో ఈ సినిమాను చూసిన‌వాళ్లు.. అంద‌మైన కావ్యం త‌ర‌హా చిత్ర‌మిది.  మా బ్యాన‌ర్‌లో చాలా సినిమాలను నిర్మించాం. 96 త‌మిళ సినిమాను నేను చూసిన‌ప్పుడు నాకు అద్భుత‌మైన సినిమాగా అనిపించింది. అప్పుడే రీమేక్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాను. ఆరోజు నుండి నేటి వ‌ర‌కు ఈసినిమాతో జ‌ర్నీ చేస్తూనే ఉన్నాను. స‌మంత‌, శ‌ర్వాను ఒప్పించి ఈ సినిమా చేయించాను. ఈ సినిమాలో న‌టించాలంటే అద్భుత‌మైన పెర్ఫామెన్స్ చేయ‌గ‌లిగే హీరో హీరోయిన్స్ కావాలి. శ‌ర్వా, స‌మంత ఈ సినిమాలో న‌టించినందుకు అక్క‌డే .. నేను 50 శాతం స‌క్సెస్ అయ్యాను.  మా బ్యాన‌ర్‌లో శ‌ర్వాతో శ‌త‌మానం భ‌వ‌తి సినిమా చేశాను. అలాగే స‌మంత‌ బృందావ‌నం, సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లెచెట్టు సినిమాలు చేసింది. ఈ సినిమా చూసిన కొంత మంది ఇలాంటి క్లాసిక్‌ను ఎందుకు చేస్తున్నార‌ని అన్నారు. కానీ 96 సినిమాను చూసిన వారు కూడా ఈ సినిమాను కూడా చూస్తారు. శ‌ర్వా, సామ్ అద్భుతంగా న‌టించారు. డైరెక్ట‌ర్‌, మ్యూజిక్ డైరెక్ట‌ర్ టీమ్ అదే కావ‌డం వ‌ల్ల అద్భుత‌మైన కావ్యాన్ని మ‌ళ్లీ క్రియేట్ చేశారు. ఈ సినిమాలో ఎన్నో అద్భుత‌మైన మూమెంట్స్ ఉంటాయి. ఈ ఫిబ్ర‌వ‌రి 7న తెలుగు ప్రేక్ష‌కుల‌కు అద్భుత‌మైన అనుభూతికి లోన‌వుతారు. అదే ఫీలింగ్స్‌తో ఇంటికి వెళ‌తారు. యూత్‌తో పాటు అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కులు క‌నెక్ట్ అవుతారు’’ అన్నారు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !