filmybuzz

View

ఆహా ఓటీటీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ గేమ్ చేంజ‌ర్  - విజ‌య్ దేవ‌ర‌కొండ‌

Sunday,February09th,2020, 11:34 AM

నేటి యువ‌త ఆలోచ‌న‌ల‌ను, అభిరుచికి త‌గిన విధంగా కొత్త కంటెంట్‌తో సినిమా రంగానికి ధీటుగా డిజిట‌ల్ రంగంలో అభివృద్ధి చెందుతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఇత‌ర భాష‌ల‌కు చెందిన ఓటీటీ ఫ్లాట్‌పామ్స్‌ను మాత్ర‌మే చూశాం. కానీ తొలిసారి 100 శాతం ప‌క్కా తెలుగు కంటెంట్‌ను తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది `ఆహా ఓటీటీ` ఫ్లాట్ ఫామ్‌. తెలుగు ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఫ్యూచ‌ర్‌లోనే బిగ్గెస్ట్ గేమ్ చేజింగ్ అనౌన్స్‌మెంట్ `ఆహా ఓటీటీ`.   శ‌నివారం ఆహా ఓటీటీ ప్రివ్యూ ఫంక్ష‌న్‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ..


న‌వదీప్ మాట్లాడుతూ - సాధార‌ణంగా మ‌నుషుల మ‌ధ్య ఉండే సంబంధాలు ఈవాళ రోజుల్లో ఎలా ఉన్నాయి? అనే పాయింట్‌తో ఈ మ‌స్తీ వెబ్‌సిరీస్‌ను చేశాం. డైరెక్ట‌ర్ క్రిష్‌గారు దీనికి క‌థ‌ను అందించారు. అన్నీ క్యారెక్ట‌ర్స్ క‌ల్పితాలే. తెలుగు ప్రేక్ష‌కులు కొత్త కాన్సెప్ట్‌ల‌ను ఆద‌రించ‌డంలో ఎప్పుడూ ముందుంటారు. గీతాఆర్ట్స్‌లో ఎలాంటి సినిమాలు వ‌స్తుంటాయో మ‌నం చూసే ఉంటాం. ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అహాలోనూ అలాంటి వైవిధ్యమైన కాన్సెప్ట్‌లు వ‌స్తాయి అన్నారు.


జాగ‌ర్ల‌మూడి క్రిష్ మాట్లాడుతూ - సంతోషం, దుఃఖం, గ‌ర్వం, సిగ్గుప‌డ‌టం, ప్రేమ‌, వాంచ‌, అతృత‌, ఇబ్బంది ప‌డ‌టం ఇలా ప్ర‌తిదీ ఓ ఎమోష‌న్‌. జీవితం అంటేనే ఎమోష‌న్‌. ప్ర‌తిరోజూ మ‌నం ఒక ఎమోష‌న్‌లో ట్రావెల్ చేస్తుంటాం. మ‌స్తీ సిరీస్ అనేది మ‌న జీవితం. ప్ర‌తి వాడి చేతిలో సెల్‌ఫోన్స్ వ‌చ్చేశాయి. ప‌ట్ట‌ణ నేప‌థ్యంలో తెర‌కెక్కిన సిరీస్ ఇది. అనేక జీవితాల స‌మాహారం, స‌మూహమే ఈ మస్తీస్‌. నేను రాసిన వాటిలో ఇదొక బెస్ట్ రైటింగ్ అని చెప్పొచ్చు. నేను పీరియాడిక్ సినిమాలే చేస్తున్నానని అంద‌రూ అంటుంటారు. కానీ సినిమాల్లో క‌న‌ప‌డే క్రిష్ వేరు. లోప‌ల కూడా మ‌రో క్రిష్ ఉంటాడు. నా రైటింగ్‌లోని మ‌రో కోణ‌మే ఈ మ‌స్తీస్‌. ఈ అవ‌కాశం ఇచ్చిన అల్లు అర‌వింద్‌గారికి, రామ్‌గారికి, అజిత్ ఠాగూర్‌కి థాంక్స్‌. అల్లు అర‌వింద్‌గారు నాకు మెంట‌ర్. ఈ మ‌స్తీస్‌కు ఆయ‌న హెడ్ మాస్ట‌ర్‌లా వ్య‌వ‌హ‌రించారు. స్క్రిప్ట్ ముందు నుండి ఆయ‌న ద‌గ్గ‌రుండి చూసుకున్నారు. ఈ స్క్రిప్ట్‌లో ఏదైనా క్రెడిట్ వ‌స్తే నాకు యాబై శాతం వ‌స్తే.. మిగిలిన యాబై శాతం అర‌వింద్‌గారికి ద‌క్కుతుంది. అజ‌య్ భుయాన్ అద్భుతంగా డైరెక్ట్ చేశాడు. ఇంత మంచి అవ‌కాశం ఇచ్చినందుకు అంద‌రికీ థాంక్స్‌ అన్నారు.


అల్లు అర‌వింద్ మాట్లాడుతూ - ఏడాది క్రితం ఓ మీడియం మ‌న సినిమాల‌ను తినేస్తుందేమో అనే భ‌యంతో ఆహా ఓటీటీ ప్ర‌యాణం మొద‌లైంద‌ని చెప్ప‌వ‌చ్చు. దీన్ని ఓ శ‌త్రువుగా చూడటం క‌న్నా.. దానిలో మంచి త‌నాన్నో మ‌రేదైనా కానీ.. మ‌న అచ్చ తెలుగువారికి తెలుగు కంటెంట్‌ను చూపిస్తే బావుంటుంద‌ని అనుకున్నాను. ఓసారి మై హోమ్ రామేశ్వ‌ర్‌రావుగారితో, రామ్‌తో ఈ విష‌యం గురించి మాట్లాడితే.. వాళ్లు వెంట‌నే త‌మ మ‌ద్దుతుని ఇస్తూ పార్ట్‌న‌ర్స్‌గా మారారు. ఇందులో మ‌రికొంత మంది ఎగ్జ‌యిటింగ్ పార్ట్‌న‌ర్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు అహా ప్రివ్యూ మాత్ర‌మే చేస్తున్నాం. ఉగాది రోజున ఇంకా పెద్ద లాంచ్ ఉంటుంది. ఇక అహాను పెట్ట‌బోతున్నాన‌ని మా అబ్బాయిల‌కు చెప్ప‌గానే నాన్న నువ్వు రేప‌టిని చూస్తున్నావని అన్నారు. టెక్నాల‌జీ బిజినెస్ గురించి మా కోల్‌క‌తా స్నేహితుల స‌పోర్ట్ తీసుకున్నాను. అలాగే ఓ అమెరిక‌న్ కంపెనీ కూడా స‌పోర్ట్ అందిస్తున్నారు. డిజిట‌ల్ రంగానిదే భ‌విష్య‌త్తు. సినిమా ప్రేక్ష‌కుల మ‌న‌సుల‌ను ఎంత‌లా హ‌త్తుకుంటుందో.. డిజిట‌ల్ కూడా అంతేలా హ‌త్తుకుంటుంది. ఎవ‌రైనా ఈ మీడియంలోకి రావాల‌నుకుంటే సందేహించ‌వ‌ద్దు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ జాగర్ల‌మూడి క్రిష్‌. నేను నా ఆలోచ‌న చెప్ప‌గానే త‌న‌కు తానుగా షో చేస్తాన‌ని ముందుకు వ‌చ్చాడు. అన్వేష్ ప్యూర్ తెలంగాణ సినిమాలో న‌టిస్తూ డైరెక్ట్ చేశాడు. అలాగే వైవా హ‌ర్ష‌, డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ స‌పోర్ట్‌తో ఇప్పుడు నాలుగు షోస్‌ను స్టార్ట్ చేశాం. ఈ ఏడాదిలో 25 షోస్‌ను చూస్తారు. కొన్ని సినిమాలు కూడా ఇందులోకి వ‌స్తాయి. ఇది మాకు కొత్త‌. ఏదీ క‌రెక్టో తెలియ‌దు. కాబ‌ట్టి అంద‌రూ స‌హ‌కారాన్ని అందించాల‌ని కోరుకుంటున్నాను. అజ‌య్ ఠాకూర్ దీన్ని అంత‌టినీ హ్యాండిల్ చేశాడు. ఇందులో కంటెంట్ బోల్డ్‌గా ఉంటుంది. మ‌నం ఎలా వ్య‌వ‌హరిస్తామో? ఎలా మాట్లాడుతామో? ఈ మీడియాలో చూపిస్తున్నాం. కాబ‌ట్టి పేరంట్ కంట్రోలింగ్ సిస్ట‌మ్ ఉండేలా చూసుకోండి అన్నారు.


రాము రావు జూప‌ల్లి మాట్లాడుతూ - మేం గృహ నిర్మాణ రంగం నుండి ఎంట‌ర్‌టైన్‌మెంట్ రంగంలోకి అడుగు పెట్టాం. అందులో భాగంగా డిజిట‌ల్ మీడియంలోకి అడుగు పెట్టాం. డిజిట‌ల్ రంగ‌మే భ‌విష్య‌త్‌. ఆహా ఓటీటీ .. అర‌వింద్‌గారి ఆలోచ‌న‌ల నుండి పుట్టింది. ఆయ‌న గ‌త ఎనిమిది నెల‌లుగా అజిత్ స‌హాకారంతో చాలా హార్డ్ వ‌ర్క్ చేశారు. ఇందులో 100 శాతం తెలుగు కంటెంట్ ఉంటుంది. ఇది అంద‌రికీ అందులో బాటులో ఉండాల‌ని ఏడాది ప్రీమియం 365 రూపాయ‌లుగా నిర్ణ‌యించాం. ఇందులో భాగ‌మైన అంద‌రికీ థ్యాంక్స్‌ అన్నారు.  


క్రేజీ స్టార్ విజ‌య్ దేర‌వ‌కొండ మాట్లాడుతూ - ఆహా ఓటీటీ ఫ్యూచ‌ర్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ గేమ్ చేంజ‌ర్ అని చెప్పొచ్చు. ఇప్పుడే ఒక ల‌క్ష యాప్స్ డౌన్ లోడ్ అయ్యాయి. ఈ ఓటీటీ టీవీని రీప్లేస్ చేస్తుంది. మీ న్యూస్‌, కామెడీ షోస్‌, సినిమాల ఇలా అన్నీ ఒక్క బ‌ట‌న్‌తో మీ చేతికి వ‌చ్చేస్తాయి. మ‌న లైఫ్ స్టైల్లో మ‌నం ఎప్పుడూ ఫ్రీగా ఉంటే అప్పుడు మ‌న‌కు కావాల్సిన షోస్ చూసుకునే అవ‌కాశం దొరుకుతుంది. ఒక‌ప్పుడు ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్‌లో మ‌న‌కు ప‌ద‌కొండు ఆట‌గాళ్లు మాత్ర‌మే తెలుసు. కానీ ఐపీఎల్ వ‌చ్చాక వంద‌ల మంది బ‌య‌ట‌కు వ‌చ్చారు. అలాగే ఆహా వ‌చ్చిన త‌ర్వాత కొత్త టాలెంట్ బ‌య‌ట‌కు వ‌స్తుంది. వెబ్ నుండి సినిమాకు టాలెంట్ క్రాస్ ఓవ‌ర్ అవుతుంది. అలాగే సినిమాల నుండి వెబ్‌కి యాక్ట‌ర్స్ క్రాస్ ఓవ‌ర్ అవుతారు. చాలా వ‌ర్క్ క్రియేట్ అవుతుంది. ఇదే భ‌విష్య‌త్‌. గొప్ప‌గా ఉంటుంది అన్నారు.


aha is the gamechanger that defines the future of Telugu entertainment: Vijay Deverakonda


The future is digital. The world has been lapping up on content that is available on OTT platforms. In fact, the Telugu audience is one of the major consumers of content on digital platforms of other languages. But it's time to bridge the gap! And in that regard, the announcement of the 100% Telugu web series and movie platform aha, at a grand preview event on Saturday, is surely a revolutionary move. In a bid to engage, entertain, entice and enthrall the Telugu audience, this brand new entrant into the entertainment industry promises a wide variety of shows and movies in Telugu.


The event saw the presence of the cast and crew of the various aha original web series alongside influencers, media and the promoters. Masti's, Geetha Subramanyam 2020, Kotha Poradu and Shit Happens were the shows unveiled at the grand preview of the first-ever Telugu OTT platform with original content.


Actor Navdeep who stars in the show Masti's spoke at the event and said, "Masti's explores modern-day relationships and how they pan out. Written by Krish garu this is a very interesting story and it's a cocktail of emotions. The Telugu audience has always accepted new content and that fact has been proven time and again. I am sure this will be loved just the same way by them. We all have loved and enjoyed the films from Geetha Arts so far and I hope the OTT platform aha is also given the same love and patronage by the audience."


Director Krish Jagarlamudi who has produced the series shared, "Every aspect of life is an emotion. This one's going to be a coming together of all those various emotions that define everyday life. The web series Masti's is the story of our lives and explores the urban space and relationships. I feel like this is surely my best writing to date. Everyone has been saying I make only periodic films but the Krish you see in cinema is different from the Krish who's actually within me. And that is who you'll see in Masti's! I thank Allu Arvind sir and Ajit Thakur for giving me this opportunity. Arvind sir is my mentor and was along with me through the journey of Masti's. Ajay Bhuyan has done a great job as a director."


Allu Arvind of Geetha Arts, one of the founders of aha lauded the entire team as he said, "The journey of aha began around a year ago out of the fear that a medium would eat away our films. So instead of looking at it as an enemy, we decided to take the good from it and create a space. On a casual discussion with Rameshwar Rao garu and Ramu Rao garu from My Home Group, they expressed interest and here we are today as partners. There are other exciting partners with us on this project. We are only having a preview of aha today. We will have a grand launch on Ugadi! My sons were very happy when they heard this idea and were glad that I am looking at ideas for tomorrow. We have teamed up with our friends from Kolkata, Hoichoi, and a company in the US for assistance in technology. I know digital is the future and that the audience is going to give the same love to the space as they have given to cinema. We are new to this and are learning at every step. We don't know what is right and what is not. And we really want everyone's support for this. Ajit Thakur has gone out of his way to make this a possibility and I appreciate the efforts of him and the entire team of aha. I'd like to end this by saying that this is a platform that will have bold content and we ensured that there is parental control in the app, request you have parental control on at all times!"


Ramu Rao Jupally of My Home Group said, "As we foray into the world of entertainment, we first begin with the digital space with the cooperation and collaboration of Allu Arvind garu who first proposed the idea. He has been working really hard from the last 8 months, with the support of Ajit. With the intention to make the 100% Telugu entertainment platform accessible to everyone, we have a subscription pricing of Rs 1 a day / Rs. 365 a year!”
Actor Vijay Deverakonda who made quite a dramatic entry to the stage called aha a gamechanger. "This is the future of entertainment. Over 1 lakh downloads have been registered even before the preview and I am sure aha is set to replace TV! You can watch news, comedy shows, movies and what not just by the click of a button. We live in times when we want to consume entertainment as and when we want. Just like IPL that brought many talented cricketers into the limelight, aha will showcase new talent that will surely cross over to films as well. Likewise, talent will crossover from movies to the web as well. A lot of work will be generated. This is the future and it's going to be great! aha is the gamechanger that defines the future of Telugu entertainment."


aha will showcase films like Arjun Suravaram and Khaidi in the digital premiere alongside a massive library of over 300 films.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !