View

'వరల్డ్ ఫేమస్ లవర్' ఫ్రీ రిలీజ్ ఈవెంట్ విశేషాలు

Thursday,February13th,2020, 05:31 AM

విజయ్ దేవరకొండ టైటిల్ రోల్ పోషిస్తోన్న చిత్రం 'వర్లడ్ ఫేమస్ లవర్' ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ లెవల్లో రిలీజ్ అవుతోంది. కె.ఎస్. రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కె.ఎ. వల్లభ నిర్మించిన ఈ మూవీలో రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, క్యాథరిన్ ట్రెసా, ఇజాబెల్లే లెయితే హీరోయిన్లుగా నటించారు. బుధవారం రాత్రి ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ ఈవెంట్ వైజాగ్ లో జరిగింది. ఈ వేడుకకు విజయ్ దేవరకొండ లుంగీ, తలగుడ్డ ధరించి హాజరరై అందర్నీ ఆశ్చర్యపరిచారు.


నిర్మాత కె.ఎ. వల్లభ మాట్లాడుతూ, "మా ఫ్యామిలీ మొత్తానికి సెంటిమెంటల్ గా వైజాగ్ చాలా బ్యూటిఫుల్ సిటీ. ఇక్కడ మా నాన్నగారు 'అభిలాష', 'ఛాలెంజ్' లాంటి సినిమాలు తీశారు. ఈ సినిమా ఈవెంట్ కోసం ఇక్కడకు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. వేలంటైన్స్ డేకి మీ దగ్గర్లో ఉన్న థియేటర్లలో 'వరల్డ్ ఫేమస్ లవర్'ను చూడండి. ఈ సినిమాని మీరందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నా" అన్నారు.


డైరెక్టర్ క్రాంతి మాధవ్ మాట్లాడుతూ, "వైజాగ్ లో నేను నిత్యా మీనన్, శర్వానంద్ లతో 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' అనే సినిమా తీశా. మీరంతా మీ విశాఖపట్నంలో ఎగిసిపడే ఒక అలలా ఉన్నారు. మీ బీచ్ లో ఉన్న ప్రతి అలతో నాకు పరిచయం. ఇక్కడ షూటింగ్ చేస్తూ మూడు నెలలు గడిపాం. చాలా బ్యూటిఫుల్ మెమరీస్ ఇచ్చిన ప్రదేశం విశాఖపట్నం. సముద్ర తీరం దగ్గర ఉన్నవాళ్లంతా చాలా ప్రేమగల వాళ్లయి ఉంటారు. మిమ్మల్ని అందర్నీ ఎంటర్ టైన్ చెయ్యడానికి 'వరల్డ్ ఫేమస్ లవర్'గా విజయ్ దేవరకొండ నలుగురు అమ్మాయిలతో చాలా కష్టపడి చేశాడు. ప్రేమికుల రోజున మీరంతా థియేటర్‌కు వచ్చి ఎంజాయ్ చెయ్యండి" అన్నారు.
రాశీ ఖన్నా మాట్లాడుతూ, "నేనిప్పటి దాకా ఇంత ఎగ్జైట్ అయ్యే ఆడియెన్సును చూడలేదు. మీ ఎగ్జైట్ మెంటును చూస్తుంటే నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ముందు మీ రౌడీ గురించి మాట్లాడతాను. విజయ్ నుంచి అనూహ్యమైంది ఎక్స్ పెక్ట్ చేస్తాం మనం. ఈ రోజు కూడా అతని బట్టలు చూసి ఆశ్చర్యపోయాను. విజయ్.. మస్తుగా ఉన్నావ్. అదే రకంగా 'వరల్డ్ ఫేమస్ లవర్' ఫిల్మ్ నుంచి కూడా అనూహ్యమైన దాన్ని మనం ఎక్స్ పెక్ట్ చేయొచ్చు. విజయ్ ఈ సినిమాలో చాలా బాగా చేశాడు. అతని గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రేమలో పడే ముందు చాలామంది చాలా ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకుంటారు. ప్రేమలో పడిన తర్వాత ఈ ఎక్స్ పెక్టేషన్స్ మారుతున్నాయ్. రియాలిటీతో చూస్తే ప్రేమ అనేది డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఈ సినిమా రియాలిటీకి చాలా దగ్గరగా ఉంటుంది. మీరు యామిని పాత్రను ఎంతో ప్రేమించినందుకు చాలా థాంక్స్. మీకు యామిని, గౌతమ్ లవ్ స్టోరీ కచ్చితంగా నచ్చుతుంది. ఫిబ్రవరి 14న సినిమా రిలీజవుతోంది. ఈరోజు మాపై చూపిస్తున్న ప్రేమను ఆ రోజు కూడా సినిమాకి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నా" అన్నారు.


విజయ్ దేవరకొండ స్పీచ్ "నన్ను చూడ్డానికి, మా ఈవెంట్ చూడ్డానికి ఎక్కడెక్కడ్నుంచో వచ్చుంటారు. చాలా గ్రేట్ ఫుల్ గా ఫీలవుతున్నాను. మీరందరూ నేనెక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నారు. నేనేం చేసినా గుంపులు గుంపులుగా వస్తున్నారు. థియేటర్లు నింపుతున్నారు. ఇంతమందిని చూస్తే అందరినీ గట్టిగా కౌగలించుకోవాలని ఉంటుంది. నిన్ననే 'రౌడీ హగ్' అని ఒకటి కొత్తది ప్రారంభించాం. రెండు రోజుల్లో నా తొమ్మిదో సినిమా 'వరల్డ్ ఫేమస్ లవర్' రిలీజవబోతోంది. అది నా ఆఖరి లవ్ స్టోరీ అని చెప్పాను. కానీ ఈరోజు దాని గురించి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. నేను బాంబేలో షూటింగులో ఉండటం వల్ల ఈ సినిమాకి నేనెక్కువగా ప్రమోట్ చెయ్యలేదు. మా హీరోయిన్లు, ముఖ్యంగా రాశీ ఖన్నా అయితే, 'విజయ్ ఎప్పుడొస్తున్నావ్? నువ్వు రావాలి, బజ్ క్రియేట్ చెయ్యాలి, హైప్ క్రియేట్ చెయ్యాలి' అని రోజూ కాల్స్ చేస్తూ నన్ను బెదిరిస్తూ వచ్చింది. నేను హైదరబాద్ కు 6వ తేదీ వచ్చిన. ఆ రోజు ట్రైలర్ లాంచ్ చేసినం. అప్పుడే చెప్పిన, 'విజయ్ దేవరకొండ సినిమా అంటే ఒక బజ్, ఒక ఎగ్జైట్ మెంట్ ఉంటుంది. అది ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది' అని. మళ్లీ నేను బిజీ అయిపోయా. 9న ప్రి రిలీజ్ ఈవెంట్ కు వచ్చా. అక్కడికి వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ అభిషేక్ వచ్చి, 'హైదరాబాద్ లో బుకింగ్స్ ఫుల్ అవుతున్నాయ్' అని చెప్పాడు. 'అట్లా ఎట్లా అవుతాయ్, ఇంకా ప్రమోషనే స్టార్ట్ చెయ్యలేదు' అని నేనడిగాను. 'లేదు, అవుతున్నాయ్' అన్నాడు. నేను చేసే సినిమాలు ఒకటైతే, ఆ సినిమాకి బజ్ ఉండేది మీవల్లే (ఫ్యాన్స్ వల్లే) అని నాకు అర్థమైంది. మీ రౌడీస్ వల్ల, తెలుగు సినిమా ఆడియెన్స్ వల్ల ఈ బజ్ క్రియేట్ అవుతోంది. నేను మీకిచ్చేది ఒకే ఒక గ్యారంటే. మీరు నా ఏ సినిమాకి వెళ్లినా ఒక కొత్త ఎక్స్ పీరియెన్స్ ఉంటుంది. ఈ సినిమాలోనూ మీకొక కొత్త ఎక్స్ పీరియెన్స్ గ్యారంటీ. ఒక చిన్న పల్లెటూరిలో జరిగే ప్రేమకథ,  ప్యారిస్ లో జరిగే ఒక ప్రేమకథ, హైదారాబాద్, వైజాగ్ లాంటి సిటీల్లో జరిగే ఓ ప్రేమకథ. ఈ వేలంటైన్స్ డేన నాలుగు ప్రేమకథలు నింపి మీ కోసం ఒక సినిమా తీసుకొస్తున్నాం. ఈ సినిమా ఏమవుతుందో జెన్యూన్ గా నాకు తెలియదు. శుక్రవారం మీరే చెప్పాలి. మా పర్ఫార్మెన్సెస్ అయితే అన్నీ అదిరిపోతాయ్. మా యాక్టర్స్ అందరూ కష్టపడి సూపర్బ్ గా చేశారు. ప్రతి యాక్ట్రెస్ సూపర్బ్ గా చేసింది. ఈ వేలంటైన్స్ డేకి మీ అందరికీ స్వాగతం. థియేటర్స్ కి రండి. ప్రేమలో పడండి, ప్రేమను ఎక్స్ పీరియెన్స్ చెయ్యండి. 'వరల్డ్ ఫేమస్ లవర్' వరల్డ్ ను ఎక్స్ పీరియెన్స్ చెయ్యండి. మీరందరూ నా లైఫ్ లో ఉండటం నా లైఫ్ లో ఒక గిఫ్ట్. బిగ్ బిగ్ లవ్ టు ఆల్ ఆఫ్ యు."


హైలైట్
ఈవెంట్ లో ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. డైరెక్టర్ క్రాంతిమాధవ్ తన ప్రసగం మధ్యలో రాశీ ఖన్నా చేతికి మైక్ ఇచ్చి, ఈవెంట్ కు వచ్చిన విజయ్ ఫ్యాన్సును చూపిస్తూ, 'రాశీ, నువ్వు వాళ్లను ప్రేమిస్తున్నావా?' అని అడిగారు. 'ఐ లవ్ దెమ్' అని జవాబిచ్చింది రాశీ. 'నువ్వు గౌతమ్ ను ప్రేమిస్తున్నావా?' అని క్రాంతి మరో ప్రశ్న వేశారు. 'గౌతమ్ ను యామిని ప్రేమిస్తుంది' అని తెలివిగా సమాధానం చెప్పింది రాశీ. ఈసారి 'గౌతమ్ ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? వాళ్లను (ఫ్యాన్స్ ను) ఎక్కువగా ప్రేమిస్తున్నావా?' అనడిగారు క్రాంతి. ఒక్క క్షణం ఆలోచించి, పక్కనే ఉన్న విజయ్ భుజం తడుతూ 'గౌతమ్' అని రాశీ చెప్పడంతో ఫ్యాన్స్ ఈలలు వేశారు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !