View

‘హిట్’ ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంది - నిర్మాత నాని

Thursday,February27th,2020, 03:21 PM

నేచుర‌ల్ స్టార్ నాని స‌మ‌ర్ప‌ణ‌లో వాల్ పోస్ట‌ర్ సినిమా బ్యాన‌ర్‌పై `ఫ‌ల‌క్‌నుమాదాస్` వంటి స‌క్సెస్‌ఫుల్ మూవీతో హీరోగా త‌న‌కంటూ గుర్తింపును సంపాదించుకున్న విశ్వ‌క్ సేన్ హీరోగా రూపొందుతోన్న చిత్రం `హిట్‌`. `ది ఫ‌స్ట్ కేస్‌` ట్యాగ్ లైన్‌. శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌శాంతి త్రిపిర్‌నేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రుహానీ శ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. విశ్వ‌క్ సేన్ ఈ చిత్రంలో విక్ర‌మ్ రుద్ర‌రాజు అనే ఐపీఎస్ ఆఫీస‌ర్‌గా క‌నిపిస్తున్నారు. ఫిబ్ర‌వ‌రి 28న ఈ సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా గురువారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో...


నిర్మాత ప్ర‌శాంతి త్రిపిర్‌నేని మాట్లాడుతూ - ‘‘సినిమా మా అంద‌రికీ న‌చ్చింది. డెఫ‌నెట్‌గా ప్రేక్ష‌కుల‌కు న‌చ్చుతుంద‌నే భావిస్తున్నాం’’ అన్నారు. 


హీరోయిన్ రుహానీ మాట్లాడుతూ - ‘‘చాలా సంతోషంగా ఉంది.. అలాగే ఎగ్జ‌యిటెడ్‌గా కూడా ఉన్నాను. సినిమా కోసం అంద‌రం చాలా క‌ష్ట‌ప‌డ్డాం. ఫిబ్ర‌వరి 28న విడుద‌ల‌య్యే సినిమాను చూసి పెద్ద స‌క్సెస్ చేయాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.


హీరో విశ్వ‌క్ సేన్ మాట్లాడుతూ - ‘‘ఫిబ్రవరి 28న సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. 24 గంటలు కూడా లేవు. అయినా సరే మా అందరి మొహల్లో చిరునవ్వు ఉందంటే ప్రేక్షకులు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను’’ అన్నారు. 


నిర్మాత నాని మాట్లాడుతూ - ‘‘రేపు(ఫిబ్రవరి 28న) సినిమా విడుదలవుతుంది. చాలా హ్యాపీగా, కాన్ఫిెడెంట్‌గా ఉన్నాం. ప్రేక్ష‌కుల రెస్పాన్స్ కోసం ఆతృత‌గా వెయిట్ చేస్తున్నాం. అంద‌రికీ న‌చ్చే సినిమా అవుతుంది. గ‌త రెండు మూడేళ్లుగా తెలుగులో కొత్త కంటెంట్ సినిమాలు అన్నీ స‌క్సెస్ అవుతున్నాయి. స‌పోర్ట్ చేస్తున్న అంద‌రికీ థాంక్స్‌. అన్ని చోట్ల నుండి  పాజిటివ్ బ‌జ్ వ‌స్తుంది. ప్రామిస్‌గా చెబుతున్నాను సినిమా న‌చ్చి.. మ‌ళ్లీ మీ స్నేహితుల‌తో, ఫ్యామిలీ మెంబ‌ర్స్‌తోనో వెళ‌తారనే న‌మ్మ‌కం ఉంది. సినిమాను చూసిన వారు సినిమా గురించి ఎక్కువగా రివీల్ చేయకుండా చూడాలని నిర్మాతగా చెబుతున్నాను. శైలేష్ క‌థ న‌చ్చ‌డంతో నిర్మాత‌గా మారాను. అంద‌రం క‌లిసి విశ్వ‌క్ అయితే ఈ సినిమాకు న్యాయం చేస్తాడ‌ని భావించాం. హిట్ అంటే హోమిసైడ్ ఇంట‌ర్వెన్ష‌న్ టీమ్ అని అర్థం. అంటే ఓ ప్ర‌మాదం జ‌రుగబోతుంద‌ని ముందే ఊహించి దాన్ని జ‌ర‌గ్గ‌కుండా చూసే టీమ్. ఈ సినిమా స్నీక్ పీక్‌ను చాలా మంది రెస్పాన్స్ వ‌చ్చింది. మా బ్యాన‌ర్‌లో కంటెంట్‌కు ప్రాధాన్య‌త ఉన్న సినిమాల‌నే నిర్మిస్తాం. కొత్త కాన్సెప్ట్‌, టాలెంటెను ఎంక‌రేజ్ చేయ‌డానికే ఈ బ్యాన‌ర్‌ను పెట్టాను. ఇందులో స్టార్ డైరెక్ట‌ర్స్ సినిమాలు చేయ‌రు. అలాగే నేను కూడా నా బ్యాన‌ర్‌లో న‌టించ‌ను. నాకు క‌థ న‌చ్చి నేను చేయ‌లేని సినిమాల‌ను నా బ్యాన‌ర్‌లో నిర్మిస్తాను. ఇది వ‌ర‌కు మా బ్యాన‌ర్‌లో కొత్త‌గా చేసిన  అ!  సినిమాకు నేష‌న‌ల్ అవార్డు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈసారి మ‌రో కొత్త జోన‌ర్‌తో మీ ముందుకు వ‌స్తున్నాం. నేను ఇప్ప‌టి వ‌ర‌కు ఏడు సార్లు సినిమా చూశాను. ఒక‌సారి కూడా బోర్ కొట్ట‌లేదు.  పిబ్ర‌వ‌రి 28.. ఈ సినిమాకు ఫ‌ర్ట్‌ఫెక్ట్ రిలీజ్ అనిపించింది. రేపు రాజ‌మౌళిగారు కూడా సినిమాను చూడ‌బోతున్నారు. నిర్మాత ప్ర‌శాంతిగారు మా ఫ్యామిలీ మెంబ‌ర్‌. చాలా టాలెంటెడ్. ఆమె లాంటి వ్య‌క్తులు.. మంచి టీమ్ ఉండ‌బ‌ట్టే నేను సినిమాల్లో న‌టిస్తూ.. సినిమాల‌ను నిర్మించ‌గ‌లిగాను’’ అన్నారు. 


డైరెక్ట‌ర్ శైలేష్ కొల‌ను మాట్లాడుతూ -  ‘‘శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుక వ‌స్తోన్న హిట్ ఓ హానెస్ట్ థ్రిల్ల‌ర్‌. మీ అంద‌రి స‌పోర్ట్ కావాలి. నిర్మాత‌గా నానిగారు క‌థకు ఏద‌వ‌స‌ర‌మో దాన్ని అందించారు. 49 రోజుల పాటు షూటింగ్ చేశాం. మా అంద‌రి క‌ష్టానికి త‌గిన ఫ‌లితం ద‌క్కుతుంద‌ని భావిస్తున్నాం’’ అన్నారు. 

 ‘‘ మీ లాంటి హీరోలు సంవత్సరానికి మూడు సినిమాలు చేస్తూ కూడా సినిమాల‌ను నిర్మిస్తే.. మాలాంటి నిర్మాత‌ల ప‌రిస్థితేంటి?’’నాని దిల్‌రాజు అడిగిన ప్ర‌శ్న‌కు నాని స‌మాధానం ఇస్తూ.. మ‌ళ్లీ ఆ సినిమాల‌ను కూడా తెచ్చి మీ చేతుల్లోనే పెడుతున్నాం క‌దా సార్‌! అని చ‌మత్క‌రించారు నాని.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !