View

నేను రేటింగ్ ఇస్తున్నా - భీష్మ థాంక్ యు మీట్ లో వరుణ్ తేజ్

Sunday,March01st,2020, 05:07 AM

ప్రముఖ హీరో నితిన్ టైటిల్ రోల్ పోషించిన 'భీష్మ' మూవీ ఫిబ్రవరి 21న విడుదలై ఘన విజయం సాధించింది. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రంలో రష్మికా మందన్న నాయిక. 'ఛలో' ఫేమ్ వెంకీ కుడుముల దర్శకుడు. చిత్ర విజయాన్ని పురస్కరించుకుని శనివారం రాత్రి వైజాగ్ లో థాంక్ యు మీట్ నిర్వహించారు. ఈ విజయోత్సవంలో 'భీష్మ' డిస్ట్రిబ్యూటర్లకు, యూనిట్ మెంబర్లకు వరుణ్ తేజ్, నితిన్, రష్మిక, వెంకీ జ్ఞాపికలను అందజేశారు. వరుణ్ తేజ్ నుంచి నిర్మాత నాగవంశీ, డైరెక్టర్ వెంకీ, హీరోయిన్ రష్మిక, హీరో నితిన్ జ్ఞాపికలను అందుకున్నారు.


ఈ సందర్భంగా గేయరచయిత కాసర్ల శ్యామ్ మాట్లాడుతూ, "ఈ సినిమాలో నేను రాసిన 'వాటే బ్యూటీ' పాటను హిట్ చేశారు, సినిమానీ హిట్ చేశారు. వెంకీ కుడుముల డైరెక్ట్ చేసిన ఫస్ట్ ఫిల్మ్ 'ఛలో'లో రెండు పాటలు రాస్తే.. వాటిని ఆదరించారు, ఆ సినిమానీ హిట్ చేశారు. నితిన్ హీరోగా మణిశర్మ సంగీతం అందించిన 'లై' సినిమాకు పాట రాసిన నేను, ఇప్పుడు మణిశర్మ వాళ్లబ్బాయి మహతి స్వరసాగర్ సంగీతానికి పాట రాయడం ఆనందంగా ఉంది" అన్నారు.


ఫైట్ మాస్టర్ వెంకట్ మాట్లాడుతూ, "మా 'భీష్మ'మూవీని ఇంత పెద్ద హిట్ చేసినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఏ సినిమా రికార్డ్స్ రాయాలన్నా వైజాగ్ నుంచే మొదలవుతుంది. ఈ సినిమాలో సెకండాఫ్ లో వచ్చే ఫైట్ ను త్రివిక్రమ్ గారు  చాలా మెచ్చుకున్నారు" అన్నారు.


నటుడు అజయ్ మాట్లాడుతూ, "నా ఫ్రెండ్, నా బ్రదర్ నితిన్ కు ఇంత పెద్ద హిట్టిచ్చిన ప్రేక్షకులందరికీ థాంక్స్. వైజాగ్ ఆడియెన్స్ సినిమా లవర్స్. సినిమాని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. 'భీష్మ' ఇంత పెద్ద హిట్టయ్యిందంటే కారణం ప్రేక్షకులే" అన్నారు.


డైరెక్టర్ వెంకీ కుడుముల మాట్లాడుతూ, "ఈ సినిమాని డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చిన నితిన్ గారికి, మా ప్రొడ్యూసర్ నాగవంశీ గారికి థాంక్స్" అని చెప్పారు.

 

నటుడు సంపత్ రాజ్ మాట్లాడుతూ, "వైజాగ్ లో 'భీష్మ' ఇంకా పెద్ద సినిమా అవ్వాలని కోరుకుంటున్నా. ఈ సినిమాని ఇత పెద్ద హిట్ చేసినందుకు ప్రేక్షకులకు థాంక్స్. చూసినవాళ్లు మరోసారి ఇంట్లోవాళ్లందర్నీ తీసుకొని సినిమాకి వెళ్లాల్సిందిగా కోరుతున్నా. ఈ సినిమాలో నన్ను భాగం చేసిన యూనిట్ సభ్యులందరికీ థాంక్స్" అన్నారు.


హీరోయిన్ రష్మికా మందన్న మాట్లాడుతూ,  'భీష్మ' మంచి సక్సెస్ అయినందుకు సంతోషంగా ఉంది."నితిన్ గారు, వెంకీ గారు వాళ్లిద్దరంటే నాకు బాగా ఇష్టం. ఈ ఈవెంట్ కు వరుణ్ తేజ్ గారు వచ్చినందుకు థాంక్స్. నిర్మాత నాగవంశీ గారు మంచి లాభాలు పొందాలని  ఆశిస్తున్నా. 'భీష్మ'ను ఇంత పెద్ద హిట్ చేసినందుకు ప్రేక్షకులకు చాలా చాలా థాంక్స్" అన్నారు.


'భీష్మ' హిట్టయినందుకు పవన్ కల్యాణ్ గారు చాలా సంతోషించారు! -  హీరో నితిన్   
హీరో నితిన్ మాట్లాడుతూ, "పవన్ కల్యాణ్ గారు ఆరడుగుల బుల్లెట్ అయితే, మా వరుణ్ ఆరడుగుల నాలుగంగుళాల బుల్లెట్. ఆయన రాలేకపోయినా మా వరుణ్ గారు వచ్చారు. ఈ ప్రొడ్యూసర్ తో నా మొదటి సినిమా 'అ ఆ' పెద్ద హిట్టయింది. ఇది మా రెండో సినిమా. కల్యాణ్ గార్ని మొన్ననే కలిశాను. సినిమా హిట్టయినందుకు ఆయన చాలా హ్యాపీ ఫీలయ్యారు. ఈ వారంలో సినిమా చూస్తానని చెప్పారు. ఆయన సినిమా చూశాక మళ్లీ కలుస్తాను. 'భీష్మ' సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు చాలా చాలా థాంక్స్. నాలుగేళ్ల తర్వాత మళ్లీ నాకు హిట్ వచ్చింది. ఈ హిట్ ను నాకిచ్చిన నిర్మాతలకు, డైరెక్టర్ వెంకీకి థాంక్స్ చెప్పుకుంటున్నా. రష్మిక గారు చాలా చాలా బాగా చేశారు. మా ఫస్ట్ కాంబినేషన్ మంచి హిట్టయింది. ఈ సినిమాలో ఆమె డాన్సులు 'నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్' (రష్మికను చూస్తూ 'ఏవండీ మీకు అర్థమవుతుందా!' అన్నారు). మా ఇద్దరి కాంబినేషన్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సాగర్ మహతి చాలా మంచి మ్యూజిక్ ఇస్తే, నవీన్ నూలి ఎడిటింగ్ బాగా చేశాడు. సెకండాఫ్ లో వెంకట్ మాస్టర్ అదిరిపోయే ఫైట్ ఇచ్చాడు. కాసర్ల శ్యామ్, శ్రీమణి చక్కని లిరిక్స్ ఇచ్చారు. అజయ్ తో నాది హిట్ కాంబినేషన్" అని చెప్పారు.


నితిన్ ను చూసి చాలా హ్యాపీ ఫీలవుతున్నా!-మెగా ప్రిన్స్ 'వరుణ్ తేజ్'
ముఖ్య అతిథిగా పాల్గొన్న హీరో వరుణ్ తేజ్ మాట్లాడుతూ, "పది రోజుల నుంచీ నా సినిమా షూటింగ్ లో పాల్గొంటూ వైజాగ్ లోనే ఉంటున్నాను. ఇక్కడి గాలి, అవీ వంటపట్టాయి. నేనిక్కడకు ఒక చీఫ్ గెస్టులా కాకుండా నా ఫ్రెండ్ నితిన్ సక్సెస్ ను ఎంజాయ్ చెయ్యడానికి వచ్చాను. ఈ సినిమా స్టార్ట్ చెయ్యక ముందు నుంచీ, ఒకటిన్నర సంవత్సరంగా నితిన్, నేను కలిసి ట్రావెల్ చేశాం. ఈ సినిమా స్టోరీ నాకు ముందే చెప్పాడు. సాంగ్స్ ముందే చూపించాడు. సినిమా మంచి హిట్టవ్వాలని కోరుకున్నా. నిజంగా నా సినిమా హిట్టయితే ఎంత హ్యాపీగా ఫీలవుతానో, దానికంటే ఎక్కువగా నితిన్ సినిమా సక్సెస్ అయినందుకు హ్యాపీగా ఫీలయ్యాను. వెంకీ కుడుముల ఇదివరకు తీసిన 'ఛలో' సినిమా చూసి చాలా ఎంజాయ్ చేశాను. సాధారణంగా ఇండస్ట్రీలో సెకండ్ సినిమా హిట్ కొట్టడం కొంచెం కష్టమంటారు. వెంకీ ఆ పరీక్ష పాసయ్యాడు. అతను ఇంకా ఎన్నో ఎన్నో సక్సెస్ లు కొట్టాలని కోరుకుంటున్నా. రష్మిక గ్రేట్ ట్రాక్ లో ఉంది. ఈ సంవత్సరం 'సరిలేరు నీకెవ్వరు', 'భీష్మ'.. ఇదివరకు 'గీత గోవిందం', 'ఛలో' సినిమాలు చేసింది. తను మంచి టాలెంట్ ఉన్న నటి. తనతో చేస్తే సినిమా హిట్టవుతుందని అంటారు. బహుశా త్వరలోనే ఆమెతో కలిసి చెయ్యాలని ఆశిస్తున్నా. నిర్మాత నాగవంశీ ఈ ఏడాది మొదట్లో 'అల.. వైకుంఠపురములో'తో పెద్ద సక్సెస్ కొట్టి, ఇప్పుడు 'భీష్మ'తో కంటిన్యూ చెయ్యడం మామూలు విషయం కాదు. ఈ సినిమాకి పనిచేసిన వాళ్లందరికీ అభినందనలు. నేను చిన్నప్పట్నుంచీ మణిశర్మ గారికి పెద్ద అభిమానిని. చిరంజీవి గారు, మణిశర్మ గార్ల కాంబినేషన్ అంటే చొక్కాలు చించేసుకొనేవాళ్లం. వాళ్లబ్బాయి సాగర్ వచ్చి ఇంత మంచి ఆడియో ఇవ్వడం హ్యాపీ. ఇటీవల మణిశర్మ గారిని కలిస్తే, ఆయన కళ్లల్లో కొడుకు సక్సెస్ సాధించాడనే గర్వం కనిపించింది. సాగర్ కు అభినందనలు. సినిమాలో వాట్సాప్ సీన్ ను బాగా ఎంజాయ్ చేశాను. నితిన్ ను చూసి చాలా హ్యాపీ ఫీలవుతున్నా. ఈ మధ్యనే మేం బాగా సన్నిహితులమయ్యాం. అతనితో ఈ స్నేహం కొనసాగాలని కోరుకుంటున్నా. 'భీష్మ'ను మళ్లీ మళ్లీ చూసి ఇంకా పెద్ద సక్సెస్ చెయ్యాలని కోరుకుంటున్నా. నేను చిన్నప్పట్నుంచీ కల్యాణ్ బాబాయ్ ఇంట్లో పెరిగాను. రక్త సంబంధం కాబట్టి నేను ఆయనకు అభిమానినవడం పెద్ద విషయం కాదు. కానీ నేను రేటింగ్ ఇస్త్తున్నా.. నితిన్ నంబర్ వన్ పవన్ కల్యాణ్ గారి ఫ్యాన్. కచ్చితంగా నితిన్ కు కల్యాణ్ బాబాయ్ అభిమానుల సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది" అని చెప్పారు.


హైలైట్స్:
* నితిన్ మాట్లాడుతూ డైరెక్టర్ వెంకీని పొగుడుతుంటే, ఆయన వచ్చి వచ్చి నితిన్ బుగ్గను ముద్దు పెట్టుకున్నారు. "శాలిని గారు (నితిన్ కాబోయే భార్య) ఇంక ఈ బుగ్గను ముద్దు పెట్టుకోరు" అన్నారు.


* రష్మికపై ప్రశంసలు కురిపించిన నితిన్ "ఈ సినిమాలో ఆమె డాన్సులు 'నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్" అని చెప్పి, ఆమెను చూస్తూ "ఏవండీ మీకు అర్థమవుతుందా!" అని ప్రేక్షకులకు నవ్వులు పంచారు.


* వరుణ్ తేజ్ తన ప్రసంగంలో "నితిన్ సినిమానంతా జెన్యూన్ గా తీసి, ఒక విషయంలో మోసం చేశాడు. 'భీష్మ.. సింగిల్ ఫరెవర్' అన్నాడు. ఫస్ట్ రీల్ అయ్యేవరకు అమ్మాయిని పడేశాడు. సింగిల్ గా ఉంటానని చెప్పి, సినిమా విడుదలకు ముందు ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు. మమ్మల్ని మోసం చేశాడు. ఏదేమైనా అతని విషయంలో నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఈ సినిమా సక్సెస్ కంటే పెద్ద అడుగు పెళ్లి చేసుకోవడం. అతనికీ, శాలినికీ కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నందుకు అభినందనలు" అని చెప్పి అలరించారు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !