View

‘న్యూసెన్స్’ టీజర్ - 'ఆహా' లో వెబ్ సిరీస్

Wednesday,March22nd,2023, 02:30 PM

తిరుగులేని ఎంట‌ర్‌టైన్మెంట్‌ను అందిస్తోన్న 100 % తెలుగు ఓటీటీ మాధ్య‌మం ఆహాలో మ‌రో స‌రికొత్త ఒరిజిన‌ల్ వెబ్ సిరీస్ న్యూసెన్స్ సీజ‌న్ 1 ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. దీని టీజ‌ర్‌ను మంగ‌ళ‌వారం విడుద‌ల చేశారు. శ్రీ ప్ర‌వీణ్ ద‌ర్శ‌క‌త్వంలో కార్తికేయ 2వ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్స్‌ను నిర్మించిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ సిరీస్‌ను నిర్మించారు. న‌వ‌దీప్, బిందు మాధ‌వి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. 


1990-2000 ద‌శ‌కంలో ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని మ‌ద‌న‌ప‌ల్లె ప్రాంతానికి చెందిన ప్రెస్ క్ల‌బ్‌లోని స్ట్రింగర్స్ గురించి తెలియ‌జేసిన ప‌వ‌ర్‌ఫుల్ వెబ్ సిరీస్‌గా నూసెన్స్ సీజ‌న్ 1న రూపొందిస్తున్నారు. ఇది మ‌న స‌మాజంలో ఎంతో ప్రాధాన్యత క‌లిగిన మీడియా పాత్ర ఏంటి? అనే ప్ర‌శ్న‌ను లేవ‌నెత్తుతుంది. లంచ‌గొండి సంస్కృతి పెరిగిపోవ‌టం, వార్త‌ల ప్రాధాన్య‌త‌, సెన్సేష‌న్ న్యూస్ వెనుక ప‌రుగులు తీయ‌టం అనే అంశాల‌ను ఈ సిరీస్‌లో ప్ర‌స్తావిస్తున్నారు. 


న్యూసెన్స్ టీజ‌ర్‌ను గ‌మ‌నిస్తే మీడియాలో ఎవ‌రికీ క‌నిపించ‌కుండా దాగున్న క్రూర‌మైన నిజాయ‌తీని తెలియ‌జేసేలా ఉంది. ఎలాంటి క‌ల్పితాలు లేని భావోద్వేగాలు, చెప్పాల‌నుకున్న విష‌యాన్ని నేరుగా చెప్పిన తీరుతో పాటు స‌ద‌రు పాత్ర‌ల్లో న‌టించిన న‌టీన‌టుల అద్భుత‌మైన న‌ట‌న ప్రేక్ష‌కుల‌కు సీట్ ఎడ్జ్ అనుభూతిని క‌లిగిస్తుంద‌నటంలో సందేహం లేదు. ఓ బ్రేకింగ్ న్యూస్‌ను ఎంపిక చేసుకునే సంద‌ర్భంలో మ‌న‌లో తెలియ‌ని నైతిక సందిగ్ధ‌త నెల‌కొని ఉంటుంది. ఎందుకంటే నిజ‌మైన వార్త‌ను చెప్పాలా, ప్ర‌జాద‌ర‌ణ పొందే వార్త‌ల‌ను బ్రేకింగ్ న్యూస్‌గా ఎంపిక చేసుకోవాలా అనే ఆలోచ‌న‌లు ఎప్పుడూ ఉంటాయి. ప్ర‌స్తుతం జ‌ర్న‌లిస్టులు ఎదుర్కొంటున్న ఉద్వేగ‌భ‌రిత‌మైన స‌వాళ్ల‌ను కూడా న్యూసెన్స్‌లో ఆవిష్క‌రించ‌బోతున్నారు.  టీజ‌ర్ లాంచ్ సంద‌ర్భంగా..


‘‘ఒక స‌మాజంలో ఉండే వ్య‌క్తులుగా మ‌నం నిజాల‌ను తెలుసుకోవ‌టానికి జవాబుదారీతనాన్ని పెంచ‌టానికి మీడియాపై ఆదార‌ప‌డ‌తాం. వాటిని మ‌న క‌ళ్లు, చెవులుగా భావిస్తాం. అలాంటి మీడియా త‌న‌కు తానుగా రాజీప‌డితే ఎలా? న్యూసెన్స్ సీజ‌న్ 1 సిరీస్ నేటి జ‌ర్న‌లిస్టులు ఎదుర్కొంటున్న నైతిక సందిగ్ధ‌త గురించి లోతుగా ప్ర‌శ్నించే శ‌క్తివంతమైన ఆలోచ‌న‌ను రేకెత్తించే వెబ్ సిరీస్‌.  స‌త్యాన్ని అది ఎలాంటి దాప‌రికాలు లేకుండా నిజాయ‌తీగా చూపించిన తీరు ప్రేక్ష‌కుల‌కు న‌చ్చుతుంద‌ని భావిస్తున్నాను’’ అన్నారు. 


దర్శకుడు శ్రీప్రవీణ్ మాట్లాడుతూ ‘‘కచ్చితంగా చెప్పాల్సిన కథ ఇది. న్యూసెన్స్ సీజ‌న్ 1 అనేది మీడియాలో దాగున్న క‌ఠిన‌మైన వాస్త‌వాల‌ను, ప్ర‌జ‌ల‌కు చేర‌వేయాల్సిన వార్త‌ల‌ను జ‌ర్న‌లిస్టులు ఎలా ఎంపిక చేసుకుంటున్నారు అనే దాన్ని తెలియ‌జేస్తుంది. మీడియాలో నైతిక‌త‌, స‌మాజంలో మీడియా పాత్ర అనే దాని గురించిమాట్లాడాల్సిన ఆవ‌శ్య‌క‌త‌ను తెలియ‌జేస్తుంద‌ని భావిస్తున్నాం’’ అన్నారు. 


న్యూసెన్స్ సీజన్ 1 అతి త్వరలోనే మన ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రేక్ష‌కుల‌కు  స్ఫూర్తిని క‌లిగిస్తూ, ఛాలెంజింగ్‌గా, ఆలోచింప చేసేదిగా ఈ సిరీస్ ఉంటుంది. 


* శ‌క్తివంత‌మైన‌, ఆలోచ‌న‌ను రేకెత్తించే న్యూసెన్స్ సీజ‌న్ 1ను మీ ఆహాలో చూసే అవ‌కాశాన్ని అస‌లు వ‌దులుకోకండిAuthor :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !