filmybuzz

View

ఊర్వశి రౌతేల 'బ్లాక్ రోజ్' ప్రమోషనల్ వీడియో సాంగ్ విడుదల

Wednesday,September30th,2020, 01:20 PM

సూపర్ హిట్ చిత్రాల నిర్మాత శ్రీనివాసా చిట్టూరి తమ శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ బ్యానర్ పై పవన్ కుమార్ సమర్పణలో ప్రొడక్షన్ నెం: 4 గా 'బ్లాక్ రోజ్' సినిమాని తెలుగు, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు. సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు సంపత్ నంది క్రియేట్ చేస్తున్న ఈ చిత్రానికి మోహన్ భరద్వాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. రెండు సార్లు మిస్ యూనివ‌ర్స్‌ ఇండియా గా గెలుపొందిన అందాల తార ఊర్వశి రౌతేల హీరోయిన్ గా నటిస్తున్న 'బ్లాక్ రోజ్' ఎమోషనల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది. ఈమధ్యనే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ కి విశేష స్పందన లభించింది. నేడు చిత్ర బృందం 'నా తప్పు ఏమున్నదబ్బా' అంటూ సాగే ప్రమోషనల్ వీడియో సాంగ్ ని విడుదల చేసింది. ఈ సాంగ్ ని మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ ఎస్ థమన్ ఈ రోజు (సెప్టెంబర్ 30) సా 4:24 కి విడుదల చేశారు. సోనీ మ్యూజిక్ ద్వారా ఈ పాట విడుదలైంది.


ఈ ప్రమోషనల్ సాంగ్ లో హీరోయిన్ ఊర్వశి రౌతేల తన అందం తో పాటు అద్భుతమైన డాన్స్ స్టెప్స్ తో విశేషంగా ఆకట్టుకున్నారు. 4 రోజుల పాటు చిత్రీకరణ జరుపుకున్న ఈ పాటకి జానీ మాస్టర్ డాన్స్ కంపోజ్ చేశారు. స్వతహాగా మంచి డాన్సర్ అయినా ఊర్వశి ఈ సాంగ్ లో కష్టమైన డాన్స్ మూవ్ మెంట్స్ తో అలరించడం విశేషం. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్టైల్ డాన్స్ స్టెప్స్ స్ఫూర్తిగా కంపోజ్ చేసిన డాన్స్ కి రిహార్సల్స్ చేస్తూ ఊర్వశి పలుమార్లు గాయపడినా నేర్చుకుని చేయడం తనకి ప్రొఫెషన్ పట్ల ఉన్న డెడికేషన్ కు అద్దం పడుతోంది. ఈ పాట ఆడియన్స్ కు ట్రీట్ లా ఉంటుంది.


ఊర్వశి రౌతేల మాట్లాడుతూ, " నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. డాన్స్ లో ట్రైనింగ్ కూడా తీసుకున్నాను. బ్లాక్ రోజ్ నాకు చాలా స్పెషల్ ఫిలిం. ఈ సినిమా నటిగా నాలో ఇంకో కోణాన్ని ఆవిష్కరించే అవకాశం ఇవ్వడమే కాకుండా చాలా కష్టమైన డాన్స్ నేర్చుకుని చేసే అవకాశం ఇచ్చింది. ఈ పాట షూట్ చేయడానికి ముందు చాలా రిహార్సల్స్ చేసాను. దెబ్బలు కూడా తగిలాయి కానీ పాట పూర్తయ్యాక చూసినప్పుడు ఆ కష్టమంతా మర్చిపోయాను. పాట అద్భుతంగా వచ్చింది. ఆడియన్స్ ఎప్పుడెప్పుడు చూస్తారా అని వెయిట్ చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన సంపత్ నంది గారికి, శ్రీనివాసా చిట్టూరి గారికి కృతజ్ఞతలు."


మణి శర్మ కంపోజ్ చేసిన ఈ పాటని తెలుగు, హిందీ భాషల్లో హారిక నారాయణ్ పాడారు. తెలుగు పాటని సంపత్ నంది రాయగా హిందీ వెర్షన్ ని వనిత గుప్త రాశారు.


షేక్స్ పియర్ రచించిన 'ద మర్చంట్ ఆఫ్ వెనిస్' లో షైలాక్ అనే పాత్రని ఆధారంగా చేసుకుని ఫిమేల్ ఓరియంటెడ్ ఎమోషనల్ థ్రిల్లర్ గా 'బ్లాక్ రోజ్' తెరకెక్కుతోంది. 'విచక్షణ లేని యోగ్యత లేని ఆర్థిక లావాదేవీలు మరణానికి సంకేతం' అనే కౌటిల్యుడి అర్థ శాస్త్రం లోని కాన్సెప్ట్ తో 'బ్లాక్ రోజ్' రూపొందింది. ఆగష్టు లో ప్రారంభమైన ఈ చిత్రం తెలుగు. హిందీ భాషల్లో ఒకే షెడ్యూల్ లో ఏకధాటిగా షూటింగ్ జరుపుకుని నిర్మాణం పూర్తి చేసుకుంది.


రచన: సంపత్ నంది, మోహన్ భరద్వాజ్
ఆర్ట్ డైరెక్టర్: ఆచార్య సత్యనారాయణ
ఎడిటర్: తమ్మిరాజు
పి ఆర్ ఓ: బి. ఏ. రాజు
డి ఓ పి: సౌందర్ రాజన్
సంగీతం: మణిశర్మ
సమర్పణ: పవన్ కుమార్
నిర్మాత: శ్రీనివాసా చిట్టూరి
క్రియేటెడ్ బై: సంపత్ నంది
దర్శకత్వం: మోహన్ భరద్వాజ్


Urvashi Rautela looks stunning in the promotional song from her debut Tollywood film Black Rose


Two times Miss Universe India pageant winner and actor Urvashi Rautela, who marked her foray into Tollywood with Black Rose is all excited as the promotional song is out and Urvashi is looking stunning in it. The Hindi version of the song is titled 'Naa Thappu Emunnadabba'. The shoot took place over a span of four days. The song has been choreographed by Jani Master. Music Sensation SS Thaman has Unveiled the song at 4:24 PM Today (September 30th). The Song has been released via Sony Music South.


Urvashi, who is known to be an excellent dancer, will be seen doing some interesting moves in the video of the promotional track. Talking about the shoot, a source says, “The choreography set has been inspired by the signature knee moves of Telugu Stylish Star Allu Arjun. Urvashi has rehearsed very hard to ace the moves. She bruised her knee a few times during the shoot but being a thorough professional, she continued with the dance sequence. The song will be a treat for the audience.”


Urvashi, who is rather excited for her Telugu debut, says, “I am a trained dancer and I love dancing. Black Rose is a really special film not only because it helped me explore a different side to me as an actor but it also gave me the opportunity to perform a rather difficult choreography set. I rehearsed a lot before performing before the camera. I did injure myself during the shoot but it was all worth it. I am very happy with the final result and I look forward to sharing it with my audience.”


The song has been composed by Mani Sharma. Harika Narayan has lent her vocals in both the Hindi and the Telugu versions. The lyrics for the Telugu version have been penned by Sampath Nandi and that of Hai Kya Yeh Mera Kasoor has been written by Vanitha Gupta.


Black Rose is touted to be a female-oriented emotional thriller. It also deals with the central theme of Kautilya's Arthashastra of how ‘transactions which have no conscience or morals... are indicators of death’. Its shoot had commenced in August and was wrapped up in a start-to-finish single schedule.


The script of the film is penned by Telugu director-screenwriter Sampath Nandi and Mohan Bharadwaj. Srinivasaa Chhitturi is producing the movie under Srinivasaa Silver Screen. Music for the film has been composed by Mani Sharma. The cinematography is being done by Soundar Rajan.The film is directed by Mohan Bharadwaj. Black Rose is being simultaneously shot in Hindi and Telugu languages to cater to a wider audience.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !