filmybuzz

View

క్వశ్చన్ మార్క్  (?) నుంచి 'రామసక్కనోడివిరో..' పాట విడుదల

Friday,October30th,2020, 11:07 AM

శ్రీ కృష్ణ క్రియేషన్స్ పతాకం పై ఆదా శర్మ హీరోయిన్ గా విప్రా దర్శకత్వం లో  గౌరీ కృష్ణ నిర్మాతగా గౌరు ఘనా సమర్పణలో  నిర్మించబడుతున్న నూతన చిత్రం క్వశ్చన్ మార్క్ (?).  షూటింగ్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని విడుద‌ల‌కు ముస్తాబ‌వుతోన్న ఈ చిత్రంలోని 'రామ‌స‌క్క‌నోడివిరో' అనే పాట‌ను ఈ రోజు హైద‌రాబాద్ లో లాంచ్ చేశారు. ఈ పాట‌ను ర‌ఘు కుంచె స్వ‌ర‌ప‌ర‌చ‌గా బండి స‌త్యం సాహిత్యాన్ని స‌మ‌కూర్చారు. మంగ్లీ ఆల‌పించ‌గా శేఖ‌ర్ మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీ చేశారు.


ఈ సంద‌ర్భంగా సంగీత ద‌ర్శ‌కుడు ర‌ఘు కుంచె మాట్లాడుతూ... ఈ చిత్రంలో మొద‌ట పాట పెట్టాల‌నుకోలేదు.  షూటింగ్ పూర్త‌య్యాక అనుకొని ఈ సాంగ్ చేశాం. బండి స‌త్యంగారు అద్బుత‌మైన సాహిత్యాన్ని స‌మ‌కూర్చారు.  శేఖ‌ర్ మాస్ట‌ర్ గారు కంపోజ్ చేసిన స్టెప్స్ కు  ఆదాశ‌ర్మ‌గారు అద‌ర‌గొట్టారు. నిర్మాత గౌరికృష్ణ గారు ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా సినిమాను నిర్మించారు.  ద‌ర్శ‌కుల ప‌నితీరు ఏంటో ఈ పాట‌తోనే తెలుసుకోవ‌చ్చు. ఇక ఈ పాండ‌మిక్ టైమ్ లో  ఈ సినిమా రావ‌డం కొంత సంతోషాన్ని క‌లిగించే విష‌యం అన్నారు.


 నిర్మాత గౌరీ కృష్ణ మాట్లాడుతూ... ఈ పాట‌కు సంబంధించిన క్రెడిట్ అంతా మా మ్యూజిక్ డైర‌క్ట‌ర్ ర‌ఘు కుంచె గారికి వెళ్తుంది. ఆయ‌న ఈ పాట‌తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోరు కూడా ఎక్స్ లెంట్ గా ఇచ్చారు. ఆదాశ‌ర్మ గారు ఈ సినిమా కోసం ఎంతో హార్డ్ వ‌ర్క్ చేశారు. త‌న ప‌ర్ఫార్మెన్స్ మాత్ర‌మే కాదు త‌న ఎంత మంచి డాన్సరో ఈ సినిమాతో తెలుస్తుంది. శేఖర్ మాస్టర్ గా కొరియోగ్రఫీ తో పాటకు ప్రాణం పోశారు. ఇక మేము ఈ సినిమా ఈ పాండమిక్ టైమ్ లో స్టార్ట్ చేసి పూర్తి చేయ‌గ‌లిగామంటే మా టీమ్ స‌పోర్ట్ వల్లే. ప్ర‌స్తుతం విడుద‌ల స‌న్నాహాల్లో ఉన్నాం. త్వ‌ర‌లో విడుద‌ల తేదీ ప్ర‌క‌టిస్తాం అన్నారు.


దర్శకుడు విప్రా మాట్లాడుతూ... ఇలాంటి సంక్లిష్ట స‌మ‌యంలో సినిమా చేయ‌డ‌మ‌నేది ఎంతో రిస్క్ తో కూడుకున్న‌ది. మా నిర్మాత స‌హ‌కారం వ‌ల్లే ఇది చేయ‌గ‌లిగాం. మా టీమ్ అంతా కూడా ఎంతో స‌హ‌కరించారు. ముఖ్యంగా ఆదాశ‌ర్మ‌గారి స‌పోర్ట్ మ‌రువ‌లేము.  క‌రోనా జాగ్ర‌త్త‌లు తీసుకుని సినిమా చేశాం. ఎక్క‌డా ఎలాంటి స‌మ‌స్య రాకుండా సినిమా పూర్తి చేశాం. ఇక మొద‌ట ఇందులో ఒక పాట పెట్టాల‌నుకున్న‌ప్పుడు ఎలాంటి పాటైతే బావుంటుంద‌ని అంతా ఆలోచించాం. ర‌ఘు కుంచెంగారు మంచి పాటిచ్చారు. శేఖ‌ర్ మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీ తో నెక్ట్స్ లెవ‌ల్ కు తీసుకెళ్లారు అన్నారు.


హీరోయిన్ ఆదా శర్మ మాట్లాడుతూ... ఒక డిఫ‌రెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమా వ‌స్తోంది. నేను తెలుగులో చేసిన సినిమాల‌న్నీ కూడా ప‌ర్ఫార్మెన్స్ కి స్కోపున్న చిత్రాలే . అదే కోవ‌లో ఈ సినిమాలో కూడా న‌ట‌ను ప్రాధాన్య‌త ఉన్న పాత్ర చేశాను. అలాగే ఇందులో పాట‌కు  శేఖ‌ర్ మాస్ట‌ర్ గారు మంచి స్టెప్స్ కూడా నాతో వేయించారు.  క‌రోనా టైమ్ లో స్టార్ట్ చేసి క‌రోనా టైమ్ లో రిలీజ్ కి రెడీ అవుతోన్న మొద‌టి సినిమా మాది. సినిమా చాలా బాగా వ‌చ్చింది. డైర‌క్ట‌ర్స్ ఎక్స్ లెంట్ గా డీల్ చేశారు. అంద‌రికీ న‌చ్చే సినిమా అవుతుంది అన్నారు.


హీరోయిన్ః ఆదాశ‌ర్మ‌
మిగ‌తా పాత్ర‌ల్లో సంజ‌య్, అభ‌య్, భానుశ్రీ
కెమెరా : వంశీ ప్రకాష్
ఎడిటర్ : ఉద్ధవ్
సంగీత దర్శకుడు : రఘు కుంచె
ఆర్ట్ డైరెక్టర్ : ఉపేంద‌ర్  రెడ్డి
పి ఆర్ ఓ : వంగాల‌  కుమారా స్వామి
నిర్మాత : గౌరీ కృష్ణ
కథ, కథనం, దర్శకత్వం : విప్రా  



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !