View

గ్రాండ్ గా  'యాధ్గిరి & సన్స్' ప్రీ రిలీజ్ వేడుక

Monday,May01st,2023, 02:26 PM

శ్రీ వేంకటేశ్వర క్రియేటివ్ వర్క్స్ పతాకంపై అనిరుధ్, యశస్విని జంటగా బిక్షపతి రాజు పందిరి దర్శకత్వంలో.. చంద్రకళ పందిరి నిర్మించిన రియల్ ఇన్సిడెంట్ బేస్డ్ స్టోరీ ‘యాద్గిరి & సన్స్’. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ‘భీమ్లా నాయక్’ దర్శకుడు చిత్ర ట్రైలర్‌ను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో..  


హీరో అనిరుధ్ మాట్లాడుతూ.. ‘‘ఇది నా డెబ్యూ చిత్రం. ఈ అవకాశం నాకు రావడానికి కారణం కో-డైరెక్టర్ అమర్‌గారు. ఆయనకి, డైరెక్టర్ భిక్షపతి రాజుగారికి థ్యాంక్స్. ఎన్నో విషయాలు చెప్పారు. ఎంతగానో మోరల్ సపోర్ట్ అందించారు. ఈ సినిమా రియల్ ఇన్సిడెంట్స్‌తో తెరకెక్కింది. అన్ని రకాల ఎలిమెంట్స్ ఉంటాయి. థియేటర్‌కి వచ్చి సినిమా చూసి వెళ్లేటప్పుడు.. ఒక మంచి సినిమా చూశామనే ఫీలింగ్ ఖచ్చితంగా ఈ సినిమా ఇస్తుంది. ట్రైలర్ విడుదల చేసిన సాగర్ కె చంద్రగారికి, వేడుకకు వచ్చిన ఇతర అతిథులకు థ్యాంక్స్. మే 5న ఈ సినిమా థియేటర్లలో విడుదలవుతుంది. ప్రేక్షకులు ఈ సినిమా చూసి మా టీమ్‌ని బ్లెస్ చేస్తారని కోరుతున్నాను’’ అని తెలిపారు.


విలన్‌గా చేసిన రోహిత్ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా ఖచ్చితంగా అందరూ చూడాలి. ఇందులో చూపించే ఇన్సిడెంట్స్ ప్రతి ఇంట్లో జరిగే అవకాశం ఉంది. అలాంటి వాటిని ఎలా ఎదుర్కోగలం అనేది ఇందులో చూపించడం జరిగింది. అందుకే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా ఇది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాత భిక్షపతి రాజు‌గారికి, ఇతర టీమ్‌కు, ముఖ్య అతిథి సాగర్ కె చంద్రగారికి ధన్యవాదాలు’’ అని అన్నారు.


సంగీత దర్శకుడు విజయ్ కురాకుల మాట్లాడుతూ.. ‘‘నన్ను మొదటి నుంచి ఎంకరేజ్ చేస్తున్న రాజీవ్ కనకాల‌ గారికి థ్యాంక్స్. ఆయన ఈ సినిమాలో చాలా మంచి పాత్ర చేశారు. దర్శకుడు భిక్షపతిగారు చాలా ప్యాషనేట్ డైరెక్టర్. ఇది చిన్న సినిమా కాదు.. ఇంటిలిజెంట్ మూవీ. స్ర్కీన్‌ప్లే, డైరెక్షన్ ప్రతీది చాలా బాగుంటుంది. సీన్సియర్‌గా ఈ సినిమాకు మ్యూజిక్ చేశాను. ఇప్పుడున్న మూవీస్‌లో డిఫరెంట్ మూవీ ఇది. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా. మే 5న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం భారీ విజయం అందుకుంటుందని ఆశిస్తున్నాను..’’ అని చెప్పారు.


దర్శకుడు భిక్షపతి రాజు మాట్లాడుతూ.. ‘‘అడగగానే వచ్చి.. మా యూనిట్‌ను బ్లెస్ చేసిన దర్శకుడు సాగర్ చంద్రగారికి ధన్యవాదాలు. ఈ సినిమాని నేను అనుకున్న విధంగా, అనుకున్న టైమ్‌లో పూర్తి చేయడానికి సహకరించిన ఆర్టిస్ట్‌లు, సాంకేతిక నిపుణులందరికీ థ్యాంక్స్. అందరూ ఎంతగానో సపోర్ట్ చేశారు. ఒక మంచి సినిమాని ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేశాను. సినిమా చూసి.. ప్రేక్షకులే ఇక డిసైడ్ చేయాలి. మే 5న సినిమాని థియేటర్లలో విడుదల చేయబోతున్నాం. అందరూ ఈ సినిమా చూసి.. నచ్చితే ఇంకో పది మందికి చెప్పి.. మంచి సక్సెస్ చేస్తారని కోరుతున్నాను. ఈ సినిమా విషయంలో సహకరించిన అందరికీ థ్యాంక్యూ సో మచ్’’ అని తెలిపారు.


‘భీమ్లా నాయక్’ దర్శకుడు సాగర్ కె చంద్ర మాట్లాడుతూ.. ‘‘‘యాద్గిరి & సన్స్ ట్రైలర్ చూశాను. చాలా ఇన్నోవేటి‌వ్‌గా ఉంది. ఏంటీ ఇందులో కథ అని దర్శకుడిని అడిగి తెలుసుకున్నాను. అది ఇక్కడ రివీల్ చేయలేను కానీ.. రియల్ ఇన్సిడెంట్స్‌తో ఇటువంటి సినిమాని రూపొందించడం గ్రేట్. చాలా మంచి అటెంప్ట్ చేశారు. మంచి అటెంప్ట్‌ని, మంచి కంటెంట్‌ని సపోర్ట్ చేయాల్సిన బాధ్యత అందరిపై ఉంది. మంచి కంటెంట్ బేస్డ్ సినిమాని భిక్షపతి రాజుగారు తీశారని నేను నమ్ముతున్నాను. అందకు ఆయనకు కంగ్రాచ్యులేషన్స్ తెలియజేస్తున్నాను. సినిమాకు సంబంధించిన నేను చూసిన క్లిప్స్‌లో అనిరుధ్, రోహిత్ చాలా బాగా చేశారు. మ్యూజిర్ డైరెక్టర్ విజయ్ గారికి నేను ఫ్యాన్‌‌ని. ఆయన ఈ సినిమా గురించి చాలా పాజిటివ్‌గా చెబుతున్నారు. దీంతో నాకు ఈ సినిమాపై మరింత నమ్మకం కలిగింది. ఈ సినిమాతో భిక్షపతిగారికి మంచి పేరు, డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా సూపర్ హిట్ అయి.. ఇందులో పని చేసిన అందరికీ మంచి పేరు రావాలని కోరుతూ.. అందరికీ ఆల్ ద బెస్ట్ చెబుతున్నానని అన్నారు.  


అనిరుధ్, యశస్విని, రోహిత్, జీవా, రాజీవ్ కనకాల, మధుమణి, నాగరాజ్, మోతీలాల్ తదితరులు నటించిన ఈ చిత్రానికి
సంగీతం: విజయ్ కురాకుల,
డి.ఓ.పి: శ్రీను బొడ్డు,
ఎడిటింగ్: మార్తాండ్. కె. వెంకటేష్,  
పి.ఆర్.ఓ: బి. వీరబాబు
కో డైరక్టర్: అమర్నాథ్ కొత్తూరు,
నిర్మాత: చంద్రకళ పందిరి,
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: భిక్షపతి రాజు పందిరి



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !