View

మనిషి జీవితం ఓ ఫుల్ బాటిల్ లాంటిదే - హీరో సత్యదేవ్

Saturday,May27th,2023, 03:15 PM

విలక్ష‌ణ‌మైన సినిమాలు, పాత్ర‌ల‌తో మెప్పిస్తోన్న స‌త్య‌దేవ్ హీరోగా రామాంజ‌నేయులు జ‌వ్వాజి, ఎస్‌.డి. కంపెనీ చిన‌బాబు నిర్మాణంలో రూపొందుతోన్న ఫ‌న్ రైడ‌ర్ ‘ఫుల్ బాటిల్’. శ‌ర‌ణ్ కొప్పిశెట్టి ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. శ‌నివారం ఈ సినిమా టీజ‌ర్‌ను విజ‌య్ దేవ‌ర‌కొండ విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ...


చిత్ర నిర్మాత రామాంజ‌నేయులు జ‌వ్వాజి మాట్లాడుతూ ‘‘హీర సత్యదేవ్, దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి కాంబినేషన్‌లో ఇప్ప‌టికే తిమ్మ‌రుసు వంటి హిట్ మూవీ వ‌చ్చింది. ఇప్పుడు మ‌రోసారి ‘ఫుల్ బాటిల్’ సినిమాతో అల‌రించ‌బోతున్నారు. ఈ టీజ‌ర్‌ను చూస్తుంటే ఎంత కిక్‌తో ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. జ్యోతిల‌క్ష్మీ సినిమా నుంచి నేను స‌త్య‌దేవ్‌గారిని గ‌మ‌నిస్తున్నాను. ఆయ‌న ప్ర‌తీ సినిమాకు త‌న మార్కెట్ పెంచుకుంటూ వ‌స్తున్నారు. స్టార్‌గా ఎదుగుతున్నారు. ఇదే బ్యాన‌ర్‌లో భ‌విష్య‌త్తులోనే ఓ సినిమాను చేస్తాను. ఆ వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తాను’’ అన్నారు. 


చిత్ర దర్శ‌కుడు శ‌ర‌ణ్ కొప్పిశెట్టి మాట్లాడుతూ ‘‘తిమ్మరుసు సినిమాకు ముందు స‌త్య‌దేవ్ సీరియ‌స్‌గా కనిపించారు. అయితే ఆ సినిమాను డైరెక్ట్ చేసే స‌మ‌యంలో త‌న‌లోని మంకీ బ‌య‌ట‌కు వచ్చింది. దీన్ని మ‌నం ఎందుకు బ‌య‌ట‌కు తీసుకు రాకూడ‌ద‌ని అనిపించేంది. అలాగే డార్క్ కామెడీ నా స్ట్రెంగ్త్ అని అనిపించేంది. ఆ స‌మ‌యంలో ఈ స్క్రిప్ట్ కుదిరింది. స‌త్య‌దేవ్‌కి న‌చ్చింది. సాయికుమార్‌గారి గెట‌ప్ కూడా కొత్త‌గా ఉంటుంది. సునీల్‌గారు, రాశీగారు, హ‌ర్ష‌ణ్ స‌హా మా టెక్నిక‌ల్ టీమ్ ఎంతో క‌ష్ట‌ప‌డ్డాం. సినిమాను కాకినాడ‌లో షూట్ చేశాం. మా నిర్మాత‌ల‌కు థాంక్స్‌. కాకా, న‌వీన్‌గారు స‌హా మా టీమ్‌కు థాంక్స్‌’’ అన్నారు. 


హీరో సత్యదేవ్ మాట్లాడుతూ ‘‘‘ఫుల్ బాటిల్’' సినిమాకు సంబంధించి ఇప్ప‌టి వ‌ర‌కు  ఏ కంటెంట్ రాలేదు. తొలిసారి టీజ‌ర్‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాం. మంచి రెస్పాన్స్ రావ‌టం చాలా సంతోషంగా ఉంది. అలాగే రామాంజ‌నేయుల‌న్న వ‌ల్ల‌నే ఈ సినిమా ఈరోజు స్టేజ్‌కు చేరుకుంది. ఆయ‌న‌తో క‌లిసి మ‌ళ్లీ సినిమాలు చేయాలి. అలాగే మ‌రో నిర్మాత చిన్న‌బాబన్న‌కు థాంక్స్‌. వారికి నా కృత‌జ్ఞ‌త‌లు. నాలుగు క్వార్టర్స్ ఉంటే ఫుల్ బాటిల్‌.. అలాగే మ‌నిషి జీవితం కూడా ఓ ఫుల్ బాటిల్‌లాంటిద‌నే ఈ సినిమాకు ‘ఫుల్ బాటిల్’ టైటిల్ పెట్టాడు. డైరెక్ట‌ర్ శ‌ర‌ణ్ నా బ్ర‌ద‌ర్‌లాంటోడు. నాకు కామెడీ అంటే చాలా ఇష్టం. నాలోని ఆ కోణాన్ని ఈ సినిమాలో చ‌క్క‌గా త‌ను వాడుకున్నాడు. ఈ సినిమాలో న‌న్ను మెర్క్యురీ సూరి అనే పాత్ర‌లో శ‌ర‌ణ్  చూపించాడు. న‌న్ను పూర్తిగా మార్చేసి కొత్త స‌త్య‌దేవ్‌గా చూపించ‌బోతున్నాడు. బ్ర‌హ్మాజీగారే నాకు పాజిటివ్ ఎనర్జీనిస్తుంటారు. మా సినిమాటోగ్రాఫ‌ర్ సిద్ధార్థ్‌గారు, మ్యూజిక్ డైరెక్ట‌ర్ స్మ‌ర‌ణ్‌, కో డైరెక్ట‌ర్ ర‌మ‌ణ‌న్న‌, మా పి.ఆర్ వంశీ కాకా ఇలా అంద‌రూ ఎంతో క‌ష్ట‌ప‌డి మంచి సినిమాను చేశారు. పేరు పేరున అంద‌రికీ థాంక్స్‌’’ అన్నారు. 


బ్ర‌హ్మాజీ మాట్లాడుతూ ‘‘‘ఫుల్ బాటిల్’ మూవీ సరికొత్తగా ఉంటుంది. ఇప్పటి వరకు సత్యదేవ్‌ను మీరు చూడ‌న‌టువంటి పాత్ర‌లో చూడ‌బోతున్నారు.  ఫ‌న్నీగా న‌టించాడు. త‌న రోల్‌తో అంద‌రూ ల‌వ్‌లో ప‌డిపోతారు. డైరెక్ట‌ర్ శ‌ర‌ణ్ నాకు చాలా క్లోజ్‌. నిర్మాత‌లు రామాంజ‌నేయులు, చిన్న‌బాబు, కాకా, న‌వీన్‌, కో డైరెక్ట‌ర్‌గారు అంద‌రం చ‌క్క‌గా సినిమా చేశాం. సినిమాతో మెప్పిస్తాం’’ అన్నారు. ల‌క్ష్మీ భూపాల్ మాట్లాడుతూ ‘‘ఇంత‌కు ముందు నేను స‌త్య‌దేవ్ న‌టించిన గాడ్ ఫాద‌ర్ సినిమాకు డైలాగ్స్ రాశాను. ఈ సినిమాతో స‌త్య‌ను నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళ్లాల్సిన బాధ్య‌త ప్రేక్ష‌కుల‌దే. అలాగే త‌మ్ముడు శ‌ర‌ణ్ కొప్పిశెట్టి పెద్ద డైరెక్ట‌ర్ కావాల‌ని అనుకుంటున్నాను’’ అన్నారు. 


హేమంత్ మ‌ధుక‌ర్ మాట్లాడుతూ ‘‘టీజర్ చాలా బావుంది. సత్య, శరణ్‌ల‌కు కంగ్రాట్స్‌. స‌త్య‌లోని ఎంట‌ర్‌టైన్‌మెంట్ యాంగిల్‌ను తొలిసారి చూడ‌బోతున్నారు. క‌చ్చితంగా సినిమా రాక్ చేస్తుంది. అంద‌రికీ కంగ్రాట్స్‌’’ అన్నారు. 


చిత్ర ద‌ర్శ‌కుడు కార్తీక్ దండు మాట్లాడుతూ ‘‘సత్యదేవ్ నీళ్లలాంటి వ్యక్తి. డైరెక్టర్ తనకు కంటెంట్ ఇవ్వాలంటే తను ఒదిగిపోతాడు. ఫస్ట్ టైమ్ తనలోని హైపర్ ఎన‌ర్జిటిక్ కామెడీని చూడ‌బోతున్నాం. శ‌ర‌ణ్ బ‌లం కామెడి. డార్క్ కామెడీతో ఫుల్ బాటిల్ సినిమాను చేశాడు. ఎంటైర్ టీమ్‌కు అభినంద‌న‌లు’’ అన్నారు. 


సాయి రాజేష్ మాట్లాడుతూ ‘‘టీజర్ చాలా సూపర్‌గా ఉంది. శ‌ర‌ణ్‌, రాహుల్‌, నేను, చందు అంద‌రం మంచి ఫ్రెండ్స్‌. స‌త్య‌న్న‌కు నేను పెద్ద ఫ్యాన్‌ని. సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది’’ అన్నారు. 


రాహుల్ సంక్రిత్యాన్ మాట్లాడుతూ ‘‘తిమ్మరుసు సినిమా చూసి శరణ్ చాలా సీరియస్ పర్సన్ అని అనుకున్నాను. కానీ తనతో పరిచయం అయిన తర్వాత తనెంత జోవియల్ పర్సనో తెలిసింది. టీజర్ బావుంది. స‌త్య‌గారు వెర్స‌టైల్ యాక్ట‌ర్..త‌న‌లోని యాక్టింగ్ ఎనర్జీ సూప‌ర్‌. ఈ సినిమాలో స‌త్యాగారు.మంచి కామెడీ టైమింగ్‌తో మెప్పిస్తారు’’ అన్నారు. 


చందు మొండేటి మాట్లాడుతూ ‘‘శరణ్‌తో నాకు ఎప్ప‌టి నుంచో ప‌రిచ‌యం ఉంది. కార్తికేయ‌, ప్రేమ‌మ్  సినిమాకు క‌లిసి ప‌ని చేశాను. సినిమా చాలా పెద్ద హిట్ కావాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స‌త్య‌దేవ్‌గారి యాక్టింగ్‌కి నేను పెద్ద ఫ్యాన్‌ని’’ అన్నారు. 


కోన వెంక‌ట్ మాట్లాడుతూ ‘‘సత్యదేవ్, కాకినాడ అంటే శరణ్‌కు చాలా ఇష్ట‌మ‌ని టీజ‌ర్ చూస్తుంటే అర్థ‌మ‌వుతుంది. కొంద‌రికీ ఎన్ని హిట్స్‌, సూప‌ర్ హిట్స్ వ‌చ్చినా ఓ ప‌ర్టికుల‌ర్ ఫిల్మ్‌తో ఓపెన్ అవుతారు. ఉదాహ‌ర‌ణ‌కు దూకుడు సినిమా. ఈ సినిమాకు ముందు మ‌హేష్‌గారు ఒక్క‌డు, పోకిరి వంటి ఎన్ని సినిమాలు చేసిన దూకుడుతో మ‌హేష్‌లోని కామెడీ టైమింగ్ అంద‌రికీ తెలిసింది. ప్ర‌భాస్ ఎన్ని సినిమాలు చేసినా, బుజ్జిగాడుతో త‌న‌లోని కామెడీ యాంగిల్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అలాగే స‌త్య‌లోని స్ట్రెంగ్త్‌ను శ‌ర‌ణ్ ప‌ట్టుకుని ఫుల్ బాటిల్ సినిమా చేశారు. ఈ సినిమా అంద‌రికీ ఓ సూప‌ర్ హిట్ మూవీ కావాలి’’ అన్నారు. 


న‌టీన‌టులు :
స‌త్య‌దేవ్‌, సంజ‌నా ఆనంద్‌, సాయి కుమార్‌, సునీల్, రాశి, బ్ర‌హ్మాజీ త‌దిత‌రులు


సాంకేతిక వర్గం: 
నిర్మాత‌లు :  రామాంజ‌నేయులు జ‌వ్వాజి, ఎస్‌.డి.కంపెనీ చిన‌బాబు 
ద‌ర్శ‌క‌త్వం: శ‌ర‌ణ్ కొప్పిశెట్టి
సినిమాటోగ్ర‌ఫీ :  సుజాత సిద్ధార్థ్‌
సంగీతం:  స్మ‌రణ్ సాయి
ఎడిటింగ్ :  సంతోష్ కామిరెడ్డి
ఆర్ట్‌:  విఠ‌ల్ కోస‌నం
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ : న‌వీన్ రెడ్డి
లైన్ ప్రొడ్యూస‌ర్‌:  ప్ర‌సాద్ బిళ్ల‌కుర్తి
కో డైరెక్ట‌ర్ :  ర‌మ‌ణ మాధ‌వ‌రం
వి.ఎఫ్‌.ఎక్స్‌:  శ్రీధ‌ర్.డి
కాస్ట్యూమ్స్ డిజైన‌ర్‌:  దీపికా శ్రీ పెరుంబుదూరి
సౌండ్ ఎఫెక్ట్స్‌:  రఘునాథ్‌.కె
లిరిక్స్‌:  పూర్ణాచారి, మ‌నోజ్ కుమార్‌
యాక్ష‌న్‌:  పృథ్వీ
కొరియోగ్ర‌ఫీ:  విజ‌య్ పోలంకి
పి.ఆర్‌.ఒ:  వంశీ కాక‌



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !