View

జనవరి 12 నుంచి ఆహా లో మెయిల్.. సంక్రాంతి కానుక

Saturday,January09th,2021, 11:01 AM

2020లో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో అల‌రించిన తెలుగు ఓటీటీ ‘ఆహా’.. రానున్న కొత్త సంవత్సరం 2021కి సరికొత్తగా ఆహ్వానం పలుకుతుంది. అందులో భాగంగా స్వ‌ప్నా సినిమాస్ బ్యానర్‌పై ప్రియాంక ద‌త్, స్వ‌ప్న ద‌త్  నిర్మాత‌లుగా  డైరెక్ట‌ర్ ఉద‌య్ గుర్రాల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన డిఫ‌రెంట్ మూవీ ‘మెయిల్‌’. ఈ చిత్రాన్ని 2021 సంక్రాంతి సందర్భంగా జనవరి 12న సాయంత్రం 6 గంటలకు విడుదల చేస్తున్నారు.  శుక్ర‌వారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో ... 


ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అర‌వింద్ మాట్లాడుతూ - ‘‘కంబాల‌ప‌ల్లె క‌థ‌లు, మెయిల్  గురించి మాట్లాడే ముందు నాగురించి, అశ్వినీద‌త్‌గారి గురించి మాట్లాడాల‌నుకుంటున్నాను. మేం ఇద్ద‌రం న‌ల‌బై ఏళ్ల క్రితం ఇండ‌స్ట్రీకి వ‌చ్చాం. అప్ప‌టి నుంచి  సినిమా తీస్తూ ఉన్నాం. మాతో పాటు వ‌చ్చిన వాళ్ల‌లో మేమే ఇంకా సినిమాలు తీస్తున్నాం. అంటే ఇది మా గొప్ప‌త‌నం అని అన‌డం కంటే మా పిల్ల‌లు మా నుండి వ‌స్తున్న దాన్ని అందుకోవ‌డం వ‌ల్ల.. మాకు ఉత్సాహం వాళ్ల వ‌ల్ల వ‌చ్చింది. అలా మా పిల్ల‌లు ఇదే ఇండ‌స్ట్రీలో సెటిల్ కావ‌డం అనేది చాలా గొప్ప విష‌యంగా భావిస్తాను. మేం నిర్మాత‌లం అనే కాదు.. మంచి స్నేహితులం... అంతే కాదు, ఏడు సినిమాలు ఇద్ద‌రం క‌లిసి నిర్మించాం. సినిమాలు వ‌చ్చాయి, పోయాయి. అయినా కూడా మేం మా స్నేహాన్ని కొన‌సాగించాం. ఇప్పుడు మా సెకండ్ జ‌న‌రేష‌న్ వ‌చ్చి సినిమాలు చేస్తున్నారు. అశ్వినీద‌త్‌గారి అమ్మాయి అయిన స్వ‌ప్న త‌న బ్యాన‌ర్ స్వ‌ప్న సినిమాస్ బ్యాన‌ర్‌పై సినిమా చేస్తుంది. నేను ఆహా కోసం కంటెంట్‌ను చేస్తున్న క్ర‌మంలో స్వ‌ప్న‌ను పిలిచి నా కోసం ఓ వెబ్ సిరీస్ చేసి పెట్ట‌వా అని అడిగాను. స్వ‌ప్న సినిమాస్ బ్యాన‌ర్‌లో త‌క్కువ సినిమాలే వ‌చ్చినా ఎలాంటి సినిమాలు వ‌చ్చాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న బ్యాన‌ర్‌లో ఉద‌య్ గుర్రాల‌తో క‌లిసి ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారు. నేను ర‌షెష్ చూశాను. నాకు న‌చ్చింది. త్వ‌ర‌లోనే ఆహాలో ప్ర‌సారం అవుతుంది. కాబ‌ట్టి ఆహా త‌ర‌పున స్వ‌ప్న‌కు థాంక్స్ చెబుతున్నాను’’ అన్నారు.


వైజ‌యంతీ మూవీస్ అధినేత  అశ్వినీదత్ మాట్లాడుతూ - ‘‘నేను నిర్మాతగా మారే క్రమంలో నవయుగ ఫిలింస్ వారిని కలిసినప్పుడు వారు అరవింద్‌గారి గురించి చాలా గొప్ప‌గా చెప్పారు. త‌ర్వాత ఆయ‌న్ని ఎన్నో విష‌యాల్లో ఆద‌ర్శంగా తీసుకుని, ఇద్ద‌రం మాట్లాడుకుంటూ ముందుకుసాగాం. నాకు ఇండ‌స్ట్రీలో ఎవ‌రు అత్యంత ఆప్తులు అని అడిగితే మూడు పేర్లు చెబుతాను. వారిలో ఒక‌రు చిరంజీవిగారు, రెండో వ్య‌క్తి అర‌వింద్‌గారు, మూడో వ్య‌క్తి రాఘ‌వేంద్ర‌రావుగారు. స్వ‌ప్న ఓ రోజు ఇలా అర‌వింద్ అంకుల్  న‌న్ను ఆహా కోసం వెబ్ సిరీస్ చేయ‌మ‌ని అన్నారు. చేస్తున్నాను. అన‌గానే...క‌చ్చితంగా నీకు ఇది గోల్డెన్ ఆప‌ర్చ్యునిటీ అన్నాను. క‌చ్చితంగా ఓటీటీ ఫార్మేట్‌లోనూ నువ్వు సక్సెస్ అవుతావ‌ని అన్నాను. ఓటీటీ మాధ్య‌మం ఎంతో ప్రాచుర్యం పొందింది. ఆహా మ‌న‌లో ఓ భాగ‌మైంది. ఇలాంటి ఫ్లాట్‌ఫామ్‌ను అర‌వింద్‌గారు టేక‌ప్ చేయ‌డం మంచి ప‌రిణామం’’ అన్నారు. 


స్వప్న దత్ మాట్లాడుతూ - ‘‘ఒకానొక సంద‌ర్భంలో నేను పార్టిన‌ర్‌షిప్ గురించి డాడీతో మాట్లాడుతుంటే అర‌వింద్ అంకుల్ గురించి చెబుతూ ‘ముప్పై ఏళ్లుగా నేను, అరవింద్ సినిమాలు చేశాం. హిట్స్ తీశాం. ఫ్లాపులు తీశాం. కానీ  ఏసంద‌ర్భంలోనూ ఒక‌రినొక‌రు మాట‌లు అనుకోలేదు.. అదే నిజ‌మైన పార్టిన‌ర్ షిప్ అంటే’ అన్నారు. దాంతో నేను ఈ ప్రాజెక్ట్ చేసేట‌ప్పుడు ఇంకా జాగ్ర‌త్త‌గా చేశాం. మాపై న‌మ్మ‌కంతో మాకు అవ‌కాశం ఇచ్చినందుకు అర‌వింద్ అంకుల్‌గారికి ధ‌న్యవాదాలు. మా హృద‌యాల‌కెంతో ద‌గ్గ‌రైన ప్రాజెక్ట్ ఇది. ఎంతో హాయిగా ఇంట్లోని అంద‌రూ చూసే అంద‌మైన క‌థ ఇది. ఇలాంటి క‌థ‌ను న‌మ్మి నాకు, ఉద‌య్‌కు అవ‌కాశం ఇచ్చినందుకు ధ‌న్య‌వాదాలు. మా అందిర‌కీ ఇది చాలా మంచి పేరుని తెచ్చిపెడుతుంద‌ని న‌మ్ముతున్నాం’’ అన్నారు. 


డైరెక్ట‌ర్ ఉద‌య్ గుర్రాల మాట్లాడుతూ - ‘‘దీన్ని నేను ఇండిపెండెంట్‌గా చేద్దామ‌ని అనుకుంటున్న స‌మ‌యంలో స్వ‌ప్న‌గారు ఈ క‌థ‌ను విని ఓకే చేశారు. అందుకు ముందుగా ఆమెకు థాంక్స్‌. మాపై ఎలాంటి ప్రెజ‌ర్ లేకుండా చిత్రీక‌ర‌ణ‌కు స‌పోర్ట్ చేశారు. హ‌ర్షిత్‌, రోజా, సుబ్బు, స‌న్ని, శివ‌న్న అంద‌రూ ఎంత‌గానో స‌పోర్ట్ చేశారు’’ అన్నారు. 


ప్రియ‌ద‌ర్శి మాట్లాడుతూ - ‘‘ఎంతో పెద్ద లెగ‌సీ ఉన్న అర‌వింద్‌గారు, అశ్వినీద‌త్‌గారితో క‌లిసి సినిమా చేయ‌డం చాలా ఆనందంగాఉంది. ముఖ్యంగా అర‌వింద్‌గారు ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వ‌డం ఆహాను స్థాపించి కొత్త వారిని ఎంక‌రేజ్ చేస్తుంన్నందుకు థాంక్స్‌. ఉద‌య్ వ‌ర‌ల్డ్ సినిమా స్టైల్లో మెయిల్‌ను తెర‌కెక్కించాడు. త‌ప్ప‌కుండా సంక్రాంతికి మిమ్మ‌ల్ని ఎంట‌ర్‌టైన్ చేస్తాం’’ అన్నారు. 


హ‌ర్షిత్ మాట్లాడుతూ - ‘‘నా తొలి సినిమానే ఇంత గొప్ప‌గా చేయ‌డం ఆనందంగా ఉంది. గ‌ర్వంగా ఫీల్ అవుతున్నాను. షూటింగ్ స‌మ‌యంలో అక్క‌డున్న స్కూల్ ఉండి షూటింగ్ పూర్తి చేశాం. అంద‌రి స‌పోర్ట్‌తోనే ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయ‌గ‌లిగాం’’ అన్నారు. 


ఈ కార్య‌క్ర‌మంలో మ్యూజిక్  డైరెక్ట‌ర్ స్వీక‌ర్ అగ‌స్తి స‌హా చిత్ర‌యూనిట్ స‌భ్యులు పాల్గొన్నారు. 


నటీనటులు:
ప్రియ‌ద‌ర్శి, హ‌ర్షిత్ మాల్గి రెడ్డి, మ‌ణి అగెరుల‌, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, శ్రీకాంత్ పల్లె, రవీందర్ బొమ్మకంటి, అనుషా నేత తదితరులు


సాంకేతిక వర్గం:దర్శ‌క‌త్వం:  ఉద‌య్ గుర్రాల‌నిర్మాత‌లు: ప‌్రియాంక ద‌త్‌, స్వ‌ప్న ద‌త్‌సినిమాటోగ్ర‌ఫీ:  ఉద‌య్ గుర్రాల‌, శ్యామ్ దుపాటిమ్యూజిక్‌:  స్వీకార్ అగ‌స్తిఎడిట‌ర్‌:  హ‌రి శంక‌ర్ టి.ఎన్‌.


Ace producers Aswani Dutt and Swapna Dutt presented the trailer to the media along with Priyadarshi who joined in virtually


After churning back-to-back blockbusters like Colour Photo, Maa Vintha Gaadha Vinuma and Orey Bujjiga alongside much-loved talk shows like - Sam Jam, hosted by Samantha Akkineni and Tamasha With Harsha, hosted by Harsha Chemudu, the much-awaited film, Mail, helmed by director Uday Gurrala, under the banner of Swapna Productions is aha's gift this Sankranti to the Telugu audience. 


This dramedy stars the versatile and talented actor Priyadarshi, digital star Harshith Reddy. It is a story based in a remote village of Telangana. The trailer was launched at a plush event hosted at Hotel Avasa by ace producer Allu Arvind. It was attended by the father-daughter duo, Aswani and Swapna Dutt, as well as Priyadarshi, albeit over a Zoom call.


"Aswani Dutt and I have known each other for many years and today is a special day because our next generations are taking things a notch higher! exclaimed Allu Arvind as he added, "I asked Swapna - who's like a daughter to me to make something for us and she immediately agreed and here we are!" 


It's wonderful to have none other than Arvind garu launch the trailer of Mail," beamed Swapna as she also thanked her father for being part of this special event. "I am glad to be part of such a beautiful film and hope the audience love it as much as we did, while shooting for it," added Priyadarshi as he was excited to have the stalwarts launch the trailer. 


With aha's wide range of movies available at a discounted price of Rs 365 for the annual subscription, there's no stopping unlimited Telugu entertainment anytime, anywhere.


In a short span of time, aha has become a household name with the best in Telugu entertainment. With a massive collection of favourites starring superstars and a huge library of classics and original web series and movies, aha is constantly giving its viewers a lot to look forward to.


Cast and Crew:
Producers: Swapna CinemaDirector:Uday Gurrala DOP:Uday Gurrala & Shyam DupatiMusic: Sweekar AgasthiEditor : Harishankar TNBGM : KamranCostumes : Ashwan
Cast:Haibath as Priyadarshi Ravi as HarshithSubbu as ManiRoja as GouriSuresh as Sunny palleAnusha as Girija



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Read More !