View

ప్లేబోయ్ గా శ్రీ.. ఫిబ్రవరి 5న విడుదల

Monday,January25th,2021, 12:32 PM

చరిత అండ్‌ గౌతమ్‌ ప్రొడక్షన్స్ ప‌తాకంపై ‘ఈ రోజుల్లో’  ఫేం శ్రీ మంగం, శశాంక్‌, అవంతిక నల్వా, గాయత్రి  రీమ  హీరో హీరోయిన్లుగా కుమార్‌ జి. దర్శత్వంలో తను.ఎస్  నిర్మించిన  ల‌వ్ అండ్ స‌స్పెన్స్  థ్రిల్ల‌ర్  చిత్రం ‘ప్రణవం’. ఈ చిత్రంలోని పాట‌లు ఇటీవ‌ల విడుద‌లై శ్రోత‌ల‌ను అల‌రిస్తున్నాయి.  ఫిబ్ర‌వరి 5న సినిమా విడుద‌ల‌కు సిద్ద‌మైంది. 


ఈ సంద‌ర్భంగా ఈ రోజు ఫిలించాంబ‌ర్ లో సినిమాకు సంబంధించిన ట్రైల‌ర్ ని విడుదల చేసిన అనంతరం ప్ర‌ముఖ నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ... 'ప్ర‌ణ‌వం' చాలా పాజిటివ్ టైటిల్‌. ట్రైల‌ర్ చూశాక థ్రిల్ల‌ర్ స్టోరి అని తెలుస్తోంది. పాట‌లు కూడా బావున్నాయి. స్టోరీ బావుంటే  చాలు సినిమాను ప్రేక్ష‌కులు ఎప్పుడూ ఆద‌రిస్తూనే ఉంటారు. ఈ సినిమా కూడా ఆ కోవ‌లోనే బాగా ఆడుతుంద‌న్న న‌మ్మ‌కం ట్రైల‌ర్ చూసాక అర్థ‌మైంది. హీరో శ్రీ తో నాకు మంచి రిలేష‌న్ ఉంది. త‌న‌కు మంచి పేరు తెచ్చే సినిమా అవుతుంది.  ద‌ర్శ‌క నిర్మాత‌లు ఎంతో ప్యాష‌నేట్ తో  సినిమాను తెర‌కెక్కించారు. ఫిబ్ర‌వ‌రి 5న వస్తోన్న ఈ చిత్రం విజ‌యం సాధించి యూనిట్ అంద‌రికీ పేరు తీసుక‌రావాల‌ని కోరుకుంటున్నా అన్నారు.


నిర్మాత  త‌ను .ఎస్ మాట్లాడుతూ... ఈ రోజుల్లో చిత్రంతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీ మంగం హీరోగా కొంత గ్యాప్ త‌ర్వాత వ‌స్తోన్న చిత్రం  'ప్ర‌ణవం'. మ‌రో మారు హీరోగా త‌నేంటో నిరూపించుకునేలా ఈ సినిమా ఉంటుంది. ఇక ద‌ర్శ‌కుడు కుమార్ కి ఇది తొలి సినిమా అయిన‌ప్ప‌టికీ క‌ ప్రేక్ష‌కుల ఆలోచ‌నా విధానానికి త‌గ్గ‌ట్టుగా తెర‌కెక్కించారు. ప్ర‌జెంట్ కొత్త క‌థ‌ల‌తో పోటీ ప‌డి సినిమాలు చేస్తోన్న ద‌ర్శ‌కుల లిస్ట్ లో మా ద‌ర్శ‌కుడు కుమార్ కూడా చేర‌తారు అన్న న‌మ్మ‌కంతో ఉన్నాం.  క‌థ‌కి త‌గ్గ‌ట్టుగా ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా సినిమాను చాలా రిచ్ గా నిర్మించాం. పాట‌లు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్ర‌ఫీ బాగా కుదిరాయి.  ఫిబ్ర‌వ‌రి 5న  గ్రాండ్ గా థియేట‌ర్స్ లో రిలీజ్ చేస్తున్నాం అన్నారు. 


ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ... రొటీన్ కు భిన్నంగా ఉంటుంది మా ప్ర‌ణవం చిత్రం. శ్రీ ఇందులో ప్లే బాయ్ పాత్ర‌లో న‌టించారు. హీరోయిన్స్ పాత్ర‌లు విభిన్నంగా ఉంటాయి. అలాగే శశాంక్, జెమిని సురేష్ పాత్ర‌లు సినిమాకే కీల‌కంగా ఉంటాయి.  ప‌ద్మ‌నావ్ భ‌ర‌ద్వాజ్ గారు మూడు  అద్భ‌త‌మైన పాట‌లతో పాటు సినిమాను ఎలివేట్ చేసే విధంగా నేప‌థ్య సంగీతం స‌మ‌కూర్చారు. చాలా గ్యాప్ త‌ర్వాత ఆర్ .పి ప‌ట్నాయ‌క్ గారు, ఉష క‌లిసి మా సినిమాలో ఓ పాట‌ను ఆల‌పించ‌డం విశేషం. సోష‌ల్ మీడియాలో మా పాట‌ల‌కు రెస్పాన్స్ బావుంది. ఫిబ్ర‌వ‌రి 5న వ‌స్తోన్న మా సినిమాను ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నా అన్నారు. 


హీరో శ్రీ మంగం మాట్లాడుతూ.. అతి ప్రేమ అన‌ర్థాల‌కు దారి తీస్తుంద‌నే క‌థాంశంతో  `ప్ర‌ణ‌వం` రూపొందింది. ద‌ర్శ‌క నిర్మాత‌లు ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా సినిమాను తెర‌కెక్కించారు. పాట‌లు, నేప‌థ్యం సంగీతం సినిమాకు హైలెట్ గా ఉంటుంద‌న్నారు. 


హీరోయిన్ గాయ‌త్రి రీమా, న‌టి స‌మీర  మాట్లాడుతూ... అవ‌కాశం ప‌ట్ల ఆనందాన్ని వ్య‌క్తం చేశారు. 


జెమిని సురేష్‌, నవీన, జబర్దస్త్‌ బాబి, దొరబాబు, సమీర, తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి పిఆర్వో: వంగాల‌ కుమార స్వామి; స్టిల్స్‌: శశాంక్‌ శేఖర్‌; డిఓపి: మార్గల్‌ డేవిడ్‌;  కొరియోగ్రాఫర్‌: అజయ్ శివ శంక‌ర్‌;   కో-డైరక్టర్‌: శ్రావణ్ న‌ల్లూరి;  సంగీతం: పద్మనావ్‌ భరద్వాజ్‌;  ఎడిటర్‌: సంతోష్‌; ఫైట్స్‌: దేవరాజ్‌; లిరిక్స్‌: కరుణ కుమార్‌, విజయ్‌కుమార్‌, రామాంజనేయులు; నిర్మాత: తను.ఎస్‌; ర‌చ‌న‌- ద‌ర్శ‌క‌త్వంః కుమార్.జి.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Read More !