విశాఖ టాకీస్ బ్యానర్ పై కీర్తి చావ్లా, సాధికా, అది ప్రేమ్, కవిత, శ్రీమాన్, గౌతమ్ రాజు, నెలగల రవి నటీనటులుగా జి.సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నట్టి కుమార్ నిర్మిస్తున్న సినిమా 'ఓ అమ్మాయి క్రైమ్ స్టోరీ'. హార్రర్, గ్రాఫిక్స్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం యూత్ కంటెంట్ తో తెరకెక్కుతుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేస్తున్న సందర్భంగా...
నిర్మాత నట్టి కుమార్ మాట్లాడుతూ ... కీర్తి చావ్లా ప్రధాన పాత్రలో లేడీ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కుతున్న మూవీ 'ఓ అమ్మాయి క్రైమ్ స్టోరీ'. హార్రర్, గ్రాఫిక్స్ తో పాటు యూత్ కు కనెక్ట్ అయ్యే రొమాంటిక్ అంశాలు ఈ చిత్రంలో ఉంటాయి. ఇప్పుడు ఈ ట్రైలర్ ను విడుదల చేస్తున్నాము. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న ఈ సినిమా మొదటి కాపీ రెడీ అయ్యింది. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సెన్సార్ వారు యు/ఎ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. ఫిబ్రవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము అన్నారు.
నటీ నటులు
కీర్తిచావ్లా, సాధికా, అది ప్రేమ్, కవిత, శ్రీమాన్, గౌతమ్ రాజు, నెలగల రవి
సాంకేతిక నిపుణులు
టైటిల్: ఓ అమ్మాయి క్రైమ్ స్టోరీ
బ్యానర్: విశాఖ టాకీస్
నిర్మాత: నట్టి కుమార్
డైరెక్టర్.. జి.సురేందర్ రెడ్డి
పిఆరోఓ: మధు.విఆర్