View

రాధాకృష్ణ ను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలి - ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

Wednesday,February03rd,2021, 10:11 AM

ప్ర‌ముఖ ద‌ర్శకుడు 'ఢ‌మ‌రుకం' ఫేమ్ శ్రీనివాస‌రెడ్డి స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణలో రూపొందుతున్న చిత్రం ‘రాధాకృష్ణ‌’. అనురాగ్‌, ముస్కాన్ సేథీ(పైసా వ‌సూల్ ఫేమ్‌) హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ చిత్రంలో నంద‌మూరి లక్ష్మీ పార్వతి ఒక కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నారు. టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్నిహ‌రిణి ఆరాధ్య‌ క్రియేష‌న్స్ ప‌తాకంపై పుప్పాల సాగ‌రిక కృష్ణ‌కుమార్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని పాట‌లు ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజ‌వుతున్నాయి. ఇప్ప‌‌టికే విడుద‌లైన సాంగ్స్‌, ట్రైల‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఫిబ్ర‌వ‌రి5న గ్రాండ్‌గా విడుద‌ల‌వుతున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ హైద‌రాబాద్ ద‌స‌ప‌ల్లా హోట‌ల్‌లో ఘ‌నంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి తెలంగాణ రాష్ట్ర అట‌వీ,ప‌ర్యావ‌ర‌ణ‌,దేవాదాయ‌,న్యాయ‌శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజ‌రై 'రాధాకృష్ట' మూవీ  బిగ్‌టికెట్‌ను ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా..


తెలంగాణ‌రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి మాట్లాడుతూ - నూత‌నంగా ఏర్ప‌డిన నిర్మ‌ల్ జిల్లాలో ప్ర‌కృతి మ‌నకిచ్చిన ప్ర‌సాదం విశాల‌మైన అడ‌వి, కుంటాల జ‌ల‌పాతం, క‌వ్వాల్ టైగ‌ర్‌జోన్. ఇలాంటి అంద‌మైన లోకేష‌న్స్‌లో 'రాధాకృష్ణ' మూవీ చిత్రీక‌రించ‌డం నిజంగా అభినందించాల్సిన విష‌యం.  ప్ర‌పంచ ప్ర‌ఖ్యాతిగాంచిన నిర్మ‌ల్ కొయ్య‌ బొమ్మ‌ల నేఫ‌థ్యంలో, అంత‌రించిపోతున్న హ‌స్త క‌ళ‌లు,  క‌ళాకారుల గురించి సాగ‌రిక కృష్ణ‌కుమార్‌గారు మంచి క‌థ‌ను ఎంచుకుని ఈ సినిమాని నిర్మించారు. వారికి నా హృద‌య‌పూర్వ‌క అభినంద‌న‌లు. నిర్మ‌ల్ బోమ్మ‌ల నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని ప్ర‌తి ఒక్క‌రూ చూసి ప్రోత్స‌హించాల్సిన అవ‌స‌రం ఉంది. అలాగే లక్ష్మి పార్వ‌తిగారు ఈ చిత్రంలో ఒక ప్ర‌ధాన పాత్ర పోషించడం చాలా సంతోష‌క‌ర‌మైన విష‌యం. హీరో అనురాగ్‌, హీరోయిన్ ముస్కాన్ సేథీల‌కు ఈ సినిమా మంచి పేరు తేవాల‌ని ఆశిస్తున్నాను. అలాగే అలీ, కృష్ణ భ‌గ‌వాన్ గారు ఈ సినిమాలో న‌టించ‌డం జ‌రిగింది వారికి నా అభినంద‌న‌లు. ఎం.ఎం.శ్రీ‌లేఖ‌గారు మంచి సంగీతం అందించారు వారికి, ఈ సినిమాలో నిర్మ‌ల బొమ్మా పాట పాడిన మంగ్లీగారికి అభినంద‌న‌లు. అలాగే శ్రీ‌నివాస రెడ్డిగారు చాలా ఎక్స్‌పీరియ‌న్స్ డైరెక్ట‌ర్ వారు ఈ సినిమాని ముందుండి న‌డిపారు. పూర్తిగా తెలంగాణలోని నిర్మ‌ల్‌ జిల్లాలోనే చిత్రీక‌రించిన సినిమా అందులోనూ నిర్మ‌ల్ క‌ళాకారుల క‌ష్టాల నేప‌థ్యంలో మంచి ఆశ‌యంతో తీసిన కాబ‌ట్టి త‌ప్ప‌కుండా ఈ విష‌యాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీనుకెళ్తాను. ఈ మూవీ పెద్ద స‌క్సెస్ కావాల‌ని ఆ భ‌గ‌వంతున్ని ప్రార్ధిస్తున్నాను అన్నారు.


ఏపీ తెలుగు అకాడమీ అధ్యక్షురాలు ల‌క్ష్మీ పార్వ‌తి మాట్లాడుతూ - ఏ దేశపు నాగ‌రిక‌త అయినా ముందుకుపోవాలి అంటే వారి  ప్రాచీన సంస్కృతి, సాంప్ర‌దాయాల మీదే ఆధార‌ప‌డి ఉంటుంది. వాటిని ఎవ‌రైతే నిల‌బెట్టుకుంటారో ఆ దేశం ఎన్ని సంవ‌త్స‌రాలైన మ‌నుగ‌డ సాగిస్తుంది. ఆ ప్రాచీన క‌ళ‌ల్ని కాపాడుకుంటూ వ‌స్తుంది కాబ‌ట్టే మ‌న భార‌త‌దేశం ప్ర‌పంచ‌దేశాల్లో మ‌కుటాయ‌మానంగా ఉంది. ప్ర‌పంచంలో ఎక్క‌డా లేని ఎన్నో అద్భుత‌మైన‌ క‌ళ‌ల‌కు భార‌త‌దేశం పుట్టినిల్లు. అలాంటి ప్రాచీన క‌ళ‌ల‌ను మ‌నం కోల్పోతే మ‌న మ‌నుగ‌డ‌నే మ‌నం కోల్పోవాల్సి వ‌స్తుంది.  నిర్మ‌ల్ కొయ్య‌ బొమ్మలు ఎంత ఫేమ‌స్ అనేది మ‌నంద‌రికీ తెలుసు. నిర్మ‌ల్ బొమ్మ‌లు అంటేనే ఒళ్లు పుల‌క‌రిస్తుంది. అంత‌రించి పోతున్న నిర్మ‌ల్ క‌ళ‌ల‌ను క‌థ‌గా తీసుకుని ఒక మంచి కాన్సెప్ట్‌తో ఈ సినిమా తీశారు. ఒక మంచి చిత్రానికి మీ అంద‌రి ఆద‌ర‌ణ త‌ప్ప‌క ఉండాల‌ని కోరుకుంటున్నాను. శ్రీ‌నివాస్ రెడ్డి గారు నాతో ప‌ట్టుబ‌ట్టి ఈ సినిమాలో ఒక  పాత్ర చేయించ‌డం జ‌రిగింది. చిత్ర యూనిట్, నిర్మ‌ల్ ప్ర‌జ‌లు అంద‌రూ ఎంతో ప్రేమ‌తో నన్ను చాలా బాగా చూసుకున్నారు. నా పాత్ర ఎలా చేశాను అన్న‌ది రేపే థియేట‌ర్‌లో ఆడియ‌న్స్ చూసి చెప్పాలి. ఒక గొప్ప ఉద్ధేశ్యంతో మంచి సినిమా తీసిన సాగ‌రిక కృష్ణ‌కుమార్ గారికి నా అభినంద‌న‌లు. అలి ఇందులో ఒక మంచి క్యారెక్ట‌ర్ చేయ‌డం చాలా సంతోషంగా ఉంది. ఒక మంచి చిత్రానికి మీ అంద‌రి ఆద‌ర‌ణ త‌ప్ప‌క ఉండాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.


ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శ్రీ‌నివాస‌రెడ్డి మాట్లాడుతూ - ఈ కార్య‌క్ర‌మానికి మంత్రి ఇంద్ర క‌ర‌ణ్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా రావ‌డం మా అదృష్టంగా భావిస్తున్నాం. ల‌క్ష్మీ పార్వ‌తిగారు ఈ సినిమాలో ఒక కీల‌క పాత్ర‌లో న‌టించ‌డం ఒక గొప్ప విష‌యం. ఆమె ఆ క్యారెక్ట‌ర్ చేయ‌డంతో సినిమాకే ఒక అందం వచ్చింది. రేపు సినిమా రిలీజ‌య్యాక మీరు ఇదే విష‌యం చెప్తార‌ని ఆశిస్తున్నాను. అంత‌రించిపోతున్న నిర్మ‌ల్ క‌ళ‌ల‌ని బ్ర‌తికించాల‌ని ఒక మంచి పాయంట్‌తో ఈ స‌బ్జెక్ట్ నా ద‌గ్గ‌ర‌కి తీసుకువ‌చ్చిన‌ప్పుడు నాకు చాలా బాగా అనిపించి ఈ సినిమాకి ద‌ర్శ‌కత్వ ప‌ర్య‌వేక్ష‌ణ చేయ‌డం జ‌రిగింది. ఈ సినిమా విజ‌య‌వంతం అయ్యి మొద‌టిసారి నిర్మాత‌గా అడుగుపెట్టిన కృష్ణ‌‌కుమార్ గారికి డ‌బ్బులు రావాల‌ని  అలాగే  ప్ర‌సాద్ వ‌ర్మ‌కి మంచి భ‌విష్య‌త్ ఉండాల‌ని కోరుకుంటున్నా. అనురాగ్ ముస్కాన్ సేథీ చాలా బాగా న‌టించారు. కేవ‌లం ప్రేమ‌క‌థా చిత్రంగానే కాకుండా అంత‌రించి పోతున్న హ‌స్త‌క‌ళ‌ల‌ను బ్ర‌తికించాలి అని ఒక మంచి మెసేజ్ కూడా ఇస్తున్నాం.  కృష్ణ‌భ‌గ‌వాన్‌, అలీ కాంభినేష‌న్లో మంచి కామెడీ ట్రాక్ ఉంటుంది. సురేందర్ రెడ్డిగారు గొప్ప కెమెరామెన్‌. ప్రతి సీన్‌ను ఎక్సలెంట్‌గా విజువలైజ్‌ చేశారు. ఎం.ఎం శ్రీ‌లేఖ‌గారి మ్యూజిక్ ఈ సినిమాకి త‌ప్ప‌కుండా ప్ల‌స్ అవుతుంది. మంచి టెక్నీషియ‌న్స్‌తో, మంచి ఆర్టిస్టుల‌తో చేసిన ఈ సినిమాని ప్ర‌తి ఒక్క‌రూ ఆద‌రించి పెద్ద హిట్ చేయాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.


చిత్ర నిర్మాత పుప్పాల సాగ‌రిక‌ కృష్ణ‌కుమార్ మాట్లాడుతూ  - మా నిర్మ‌ల్ జిల్లాలో అంత‌రించి పోతున్న నిర్మ‌ల్ బొమ్మ‌లు, ఆ క‌ళాకారులు ప‌డుతున్న ఇబ్బందుల‌ను గురించి తెలియ‌జేస్తూ ఆ క‌ళ‌ని బ్ర‌తికించాల‌ని ఒక మంచి సంక‌ల్పంతో ఈ చిత్రాన్ని నిర్మించ‌డం జ‌రిగింది. ఫిబ్ర‌వ‌రి 5న రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున ఈ సినిమాని విడుద‌ల చేస్తున్నాం. ఇక లక్ష్మీపార్వతి గారు ఈ సినిమాలోమొద‌టి సారి ఈ సినిమాలో ఒక కీల‌క‌పాత్ర‌లో అద్భుతంగా న‌టించారు. ఎన్నో విజయవంతమైన చిత్రాలకు సంగీతాన్ని అందించిన ఎం.ఎం.శ్రీలేఖగారు అద్భుతమైన సంగీతాన్నిఅందించారు. సురేందర్ రెడ్డిగారు గొప్ప కెమెరామెన్‌. ప్రతి సీన్‌ను ఎక్సలెంట్‌గా విజువలైజ్‌ చేశారు. ప్రసాద్‌ వర్మగారుప్ర‌సాద్ వ‌ర్మ ఎంతో క‌ష్ట‌ప‌డి ఈ చిత్రాన్ని అద్భుతంగా తెర‌కెక్కించారు. అనురాగ్‌, ముస్కాన్ సేథీ చ‌క్కగా న‌టించారు. వారికి మంచి భ‌విష్య‌త్ ఉండాల‌ని కోరుకుంటున్నాను. మాకు బ్యాన్‌బోన్‌గా నిలిచిన డ‌మ‌రుకం శ్రీనివాస్‌ రెడ్డిగారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. సినిమా చాలా బాగా వ‌చ్చింది. కేవ‌లం నిర్మ‌ల్ బొమ్మ‌ల గురించే కాదు ఒక అద్భుత‌మైన ప్రేమ‌కావ్యంగా నిలిచిపోతుంది అని న‌మ్మ‌కం ఉంది. మా హ‌రిణి ఆరాధ్య‌ క్రియేష‌న్స్ బ్యానర్‌లో రూపొందిన ఈ 'రాధాకృష్ణ' సినిమాను ఫిబ్ర‌వ‌రి5న ప్ర‌తి ఒక్క‌రూ చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను అన్నారు.


చిత్ర ద‌ర్శ‌కుడు ప్ర‌సాద్ వ‌ర్మ మాట్లాడుతూ - ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నందుకు హ్యాపీగా ఉంది.  ఈ అవ‌కాశం ఇచ్చిన కృష్ణ‌కుమార్‌గారికి నా జీవితాంతం రుణ‌ప‌డిఉంటాను. ఎం.ఎం. శ్రీ‌లేఖ గారు ఐదు మంచి పాట‌లు ఇచ్చారు. ప్ర‌తిక్ష‌ణం నా వెన్నంటే ఉంటూ ఈ సినిమా ఇంత బాగా రావ‌డానికి ఎంతో స‌హ‌కారం అందించిన మా గురువుగారు శ్రీ‌నివాస్ రెడ్డి గారు ఆయ‌న్ని నా జీవితంలో మ‌ర్చిపోలేను. ప‌ల్లెటూరి నేప‌థ్యంలో ఒక అంద‌మైన ల‌వ్‌స్టోరీతో పాటు హస్తకళలకు సంభందించిన మంచి పాయంట్‌తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌డం జ‌రిగింది. త‌ప్ప‌కుండా మీ అంద‌రికీ న‌చ్చుతుంది అన్నారు.


హీరో అనురాగ్ మాట్లాడుతూ - ఇంత మంచి  సినిమాలో అవ‌కాశం ఇచ్చిన శ్రీ‌నివాస్ రెడ్డి గారికి, సాగ‌రిక కృష్ణ‌కుమార్ గారికి థ్యాంక్స్. శ్రీ‌లేఖ మేడ‌మ్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. అలీ, కృష్ణ‌భ‌గ‌వాన్‌, సంపూర్ణేష్ బాబు గారితో న‌టించ‌డం చాలా గొప్ప విష‌యం. మంచి ఫ్యామిలీఎంట‌ర్‌టైన‌ర్ మీరంద‌రు చూసి మ‌మ్మ‌ల్ని ఆశీర్వ‌దించాలని కోరుకుంటున్నాను అన్నారు.


హీరోయిన్ ముస్కాన్ సేథీ మాట్లాడుతూ - రాధాకృష్ణ నా మ‌న‌సుకి చాలా ద‌గ్గ‌రైన సినిమా. కేవ‌లం ఎంట‌ర్‌టైన్‌మెంట్ మాత్ర‌మే కాకుండా మంచి సందేశం కూడా ఉంది. ఈ అవ‌కాశం ఇచ్చిన శ్రీ‌నివాస్ రెడ్డి గారికి, సాగ‌రిక కృష్ణ‌కుమార్ గారికి నా హృద‌య‌పూర్వ‌క ద‌న్య‌వాదాలు. ఇది నాకు డ్రీమ్ ప్రాజెక్ట్‌లాంటిది.  మంచి పాట‌లు ఇచ్చిన ఎం.ఎం. శ్రీ‌లేఖ గారికి థ్యాంక్స్‌. ల‌క్ష్మి పార్వ‌తి మేడ‌మ్ గారితో క‌లిసి న‌టించ‌డం చాలా గొప్ప విష‌యం అన్నారు.


సంగీత ద‌ర్శ‌కురాలు ఎం.ఎం శ్రీ‌లేఖ మాట్లాడుతూ - రాధాకృష్ణ సినిమా ఒక మ్యూజిక‌ల్ ఫీస్ట్‌లా ఉంటుంది. మంచి పాట‌లు కుదిరాయి‌. సుద్దాల అశోక్ తేజ‌గారు, శ్రీ‌మ‌ణి, చైత‌న్య ప్ర‌సాద్‌, వ‌రికుప్పల యాద‌గిరి లాంటి బిగ్‌ రైట‌ర్స్ ఈ సినిమాకి పాట‌లు రాయడం జ‌రిగింది, రాహుల్ సిప్లిగంజ్‌, మంగ్లీ, అనురాగ్ కుల‌క‌ర్ణి లాంటి బిగ్ సింగర్స్ పాడారు. ఈ అవ‌కాశం ఇచ్చిన సాగ‌రిక కృష్ణ‌కుమార్ గారికి నా స్పెష‌ల్ థ్యాంక్స్‌.  ఫిబ్ర‌వ‌రి 5న అంద‌రూ సినిమా చూడండి త‌ప్ప‌కుండా ఎంజాయ్ చేస్తారు అన్నారు.


న‌టుడు ఆలీ మా‌ట్లాడుతూ - ఇప్పుడున్న పిల్ల‌ల‌కి నిర్మ‌ల్‌బొమ్మ‌లు అంటే తెలియ‌క‌పోవ‌చ్చు కాని ఈ సినిమాతో వాటి గొప్ప‌ద‌నం త‌ప్ప‌కుండా అంద‌రికీ తెలుస్తుంది. నిర్మ‌ల్ బొమ్మ మీద తీసిన ఈ సినిమా డెఫినెట్ గా పెద్ద హిట్ అవుతుంది. హీరో హీరోయిన్లు చ‌క్క‌గా న‌టించారు. ద‌ర్శ‌కుడు ప్ర‌సాద్ వ‌ర్మ అద్బుతంగా తెర‌కెక్కించారు అన్నారు.


ప్ర‌ముఖ డిస్ట్రిబ్యూట‌ర్ వ‌రంగ‌ల్ శ్రీ‌ను మాట్లాడుతూ - 400 సంవ‌త్స‌రాల చ‌రిత్ర ఉన్న నిర్మ‌ల్‌బొమ్మ‌ల గురించి తీసిన ఈ సినిమా త‌ప్ప‌కుండా మంచి స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నాను. నిర్మాత సాగ‌రిక కృష్ణ‌కుమార్ గారికి అలాగే టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్‌ అన్నారు.


అనురాగ్‌, ముస్కాన్ సేథీ(పైసా వ‌సూల్ ఫేమ్‌), ల‌క్ష్మీ పార్వ‌తి, అలీ, కృష్ణ భ‌గ‌వాన్‌, అన్న‌పూర్ణ‌మ్మ త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబు ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీ: సురేంద‌ర్ రెడ్డి, సంగీతం: ఎం.ఎం. శ్రీలేఖ‌, ఎడిటింగ్‌: డి. వెంక‌ట‌ప్ర‌భు, ఆర్ట్: వి. ఎన్ సాయిమ‌ణి, నిర్మాణ సార‌థ్యం: కృష్ణ కుమార్‌, నిర్మాత‌: పుప్పాల సాగ‌రిక‌ కృష్ణకుమార్, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌: శ్రీనివాస రెడ్డి, ద‌ర్శ‌క‌త్వం: టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ‌.

 

I Wish Everyone To Watch And Encourage 'RadhaKrishna' Which Is Made With A Backdrop Of Nirmal Crafts - Telangana Minister Allola Indrakaran Reddy

 

Popular Director, 'Dhamarukam' fame Sreenivass Redde is providing Screenplay and Direction Supervision to 'Radhakrishna' movie starring Anurag, Musskan Sethi (Paisa Vasool Fame) along with Nandamuri Lakshmi Parvathy in a crucial role. T.D. Prasad Varma is Directing this film. Puppala Sagarika Krishnakumar is Producing it under Harini Aradhya Creations. Music is released through Aditya Music. Recently released songs and trailer received very good response. The film is getting released on February 5th. On this occasion the team held a grand pre release event at Daspalla Hotel at Hyderabad. Minister of State for Endowments, Law and Forest, Environment, Science and Technology of Telangana, Allola Indrakaran Reddy graced the event as a Chief Guest and launched the Big Ticket of 'RadhaKrishna'. On this occasion..

Telangana Minister Allola Indrakaran Reddy says, " Newly formed Nirmal district is gifted with beautiful nature. It composes naturally formed Thick Forest, Kuntala Waterfalls, Kawal Tiger Reserve. It is appreciable that the team of 'RadhaKrishna' has shot their film in such scenic locations. Sagarika Krishnakumar Garu chose to make a film about world famous Nirmal Crafts and industry which is on the verge of extinction. My Heartful wishes to her for her effort to bring this valuable craft into light. Everyone should watch and encourage this film. Lakshmi Parvathy Garu playing a crucial role in this film is a welcoming aspect for this film. I wish this film to bring name and fame for hero Anurag and Heroine Musskan Sethi. Congrats to MM Sreelekha Garu who has composed very good music and to Mangli who sang 'Nirmala Bomma' song in this film. Wishes to Ali and Krishna Bhagawan who acted in this film. Sreenivass Redde Garu is a very experienced director. He ran the show for this film. This film is completely shot in Nirmal District in Telangana and explored about hardships facing by Nirmal craftsmen. I will definitely take this film to the notice of our Honourable Chief Minister KCR Garu. I pray for the film to become a very big success."

AP Telugu Academy Chairperson Lakshmi Parvathy said, " Arts stand as a testament for out culture and heritage. India is birthplace for many ancient arts. We will lose our existence if we don't protect our ancient arts.  We all know how famous Nirmal Crafts are.Team has made a very good film with the theme of Nirmal Crafts which are on the verge of extinction. I wish all of you will support such a good film. I know Sreenivass Redde Garu for many years. He is the main reason behind my acting debut in this film. I have to see how I did the role along with you all. Ali played a very good role in this film. Hero, Heroines did very good performance. Entire unit looked after me very well with love and affection. I wondered how nice is Film Industry. Best wishes to Sagarika Krishnakumar Garu for making this film with noble intentions. I wish this film will get all of your blessings. "

Director Sreenivass Redde said, " We feel very lucky with the presence of Minister Indrakaran Reddy Garu here today. Lakshmi Parvathy Garu playing an important role is a great thing for this film. Her role will surely get accolades.  This is a very good film made with a very good concept about Nirmal Crafts which are going extinct. That's why I immediately agreed to do Directional Supervision for this film. I wish this film to bring money to First Time Producer Krishnakumar Garu and fame to Director Prasad Varma. Anurag and Musskan Sethi did very well. Along with a pleasant love story there is an undercurrent message about Nirmal  Hand Crafts too. Comedy track between Krishna Bhagawan and Ali will be hilarious.  MM Sreelekha Garu and Surender Reddy Garu gave their best. 'RadhaKrishna' Which is made with a noble concept backed by very good technicians will surely become a big success."

Film Producer Puppala Sagarika Krishnakumar said, " We made this film with a noble intention to breathe fresh air to our Nirmal Handicrafts and craftsman in our Nirmal District.  We are releasing the film on a grand manner in both Telugu states on February 5th. Lakshmi Parvathy Garu acted for the first time in this film.  She is the heart of the film. Her role came out superbly. M.M. Sreelekha Garu who has worked for many SuperHit films has agreed to work for this film even though I am a new producer and composed very good music. Surender Reddy Garu is a great cameraman. He gave excellent visuals with his terrific work. Anurag and Musskan Sethi did superbly and I wish a very bright future for both of them. Heartfelt thanks to our 'Dhamarukam' Sreenivass Redde Garu for standing as the backbone for 'RadhaKrishna'. The Film came out very well. It not only showcases about Nirmal Crafts but also will be remembered for its heart touching love story. I wish everyone to watch our 'RadhaKrishna' movie which is made in our 'Harini Aaradhya Creations' banner."

Film Director T.D. Prasad Varma said, " I am very happy for debuting as a director with this film. I am indebted to Krishnakumar Garu for giving me this opportunity. M.M. Sreelekha Garu composed very good music. My mentor Sreenivass Redde Garu is there for me at my every step. He helped a lot for this project. Special thanks to him. Along with Handicrafts this film is made with a beautiful lovestory. I wish this film will impress everyone."

Hero Anurag said, " Thanks to Sreenivass Redde Garu and Sagarika Krishnakumar Garu for giving me this opportunity to act in such a good film.This is a soft love story. Everyone will enjoy it. Sreelekha madam has given superb music. Great to act with Ali, Krishna Bhagawan and Sampoornesh garlu. This is a very good family entertainer. I wish you all to watch this film."

Heroine Musskan Sethi said, " 'RadhaKrishna' is very close to my heart. This film not only has entertainment but also carries a heratwarming message too. Thanks to Sreenivass Redde and Sagarika Krishnakumar for giving me this opportunity. This is like a dream project for me. Thanks to MM Sreelekha Garu for providing very good music. Great to work with Lakshmi Parvathy madam. "


Music Director M.M. Sreelekha said, " 'RadhaKrishna' film is a musical feast. All songs came out very well. Big lyricists like Suddala Ashok Teja Garu, Chaitanya Prasad, Sree Mani, Varikuppala Yadagiri penned lyrics for the songs. Big singers Rahul Sipligunj, Mangli, Anurag Kulkarni crooned for this film. Special Thanks to Sagarika Krishnakumar Garu for this opportunity. Everyone, watch the film on bigscreen on February 5. You all will enjoy for sure."

Ali said, " Today's Kids may not know about Nirmal Toys. This film will definitely let the audience know about the greatness of Nirmal Handicrafts. This film which is made with a backdrop of Nirmal craft will definitely become a big hit. Hero and Heroines played their roles beautifully. Director Prasad Varma has made this film perfectly."

Popular Distributor Warangal Srinu says, " I wish this film which is made about Nirmal Crafts with a history of 400 years to become a big success. All the best to Producer Sagarika Krishnakumar and the entire team."

Principal Cast involves,
Anurag, Musskan Sethi ( Paisa Vasool Fame ), Nandamuri Lakshmi Parvathy, Ali, Krishna Bhagawan, Annapurnamma and Others while Sampoornesh Babu is playing a special role in the film.

Cinematography: Surender Reddy
Music: M.M. Sreelekha
Editing: D. Venkataprabhu
Art: V.N. Saimani
Nirmaana Saradhyam: Krishna Kumar
Producer: Puppala Sagarika Krishnakumar
Presenter, Screenplay, Direction Supervision: Sreenivass Redde
Direction: T.D. Prasad VarmaAuthor :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Read More !