హ్యాపెనింగ్ యంగ్ హీరో కళ్యాణ్ దేవ్, యంగ్ డైరెక్టర్ రమణ తేజ(అశ్వధామ ఫేమ్) కాంబినేషన్ లో ప్రముఖ నిర్మాత రామ్ తళ్లూరి నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతున్న సినిమా కిన్నెరసాని. ఈ సినిమాను ఎస్.ఆర్.టి ఎంటర్ టైన్మెంట్స్, శుభమ్ ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కంటెంట్ కి పెద్ద పీఠ వేస్తూ, నిర్మాణ విలువల్లో ఎక్కడా రాజీ పడకుండా సినిమాలు నిర్మిస్తున్న ఎస్.ఆర్.టి ఎంటర్ టైన్మెంట్స్ వారు కిన్నెరసాని చిత్రాన్ని సైతం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు.
కిన్నెరసాని టైటిల్ లుక్ పోస్టర్ కు, ఆ తరువాత విడుదల చేసిన గ్లిమ్ప్స్ వీడియోకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 11న హీరో కళ్యాణ్ దేవ్ పుట్టిన రోజు సందర్భంగా కిన్నెరసాని చిత్రం బృందం ఓ మోషన్ పోస్టర్ ని సిద్ధం చేసి విడుదల చేశారు. ఈ సినిమా సాయిరిషిక సమర్పణలో రజనీ తళ్లూరి, రవి చింతల ఈ సినిమాకు నిర్మాతలుగా రూపొందుతుంది. ఈ చిత్రానికి దేశరాజ్ సాయితేజ కథ, కథనం అందిస్తున్నారు. గతంలో సాయితేజ్ కల్కి వంటి హిట్ చిత్రానికి స్టోరీ అందించడం విశేషం. అలానే ఛలో, భిష్మ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకి సంగీతాన్ని అందించిన మహతి సాగర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.
బ్యానర్ - ఎస్.ఆర్.టి ఎంటర్ టైన్మెంట్స్, శుభమ్ ఎంటర్ టైన్మెంట్స్
సమర్పణ - సాయిరిషిక
నిర్మాత - రజనీ తళ్లూరి, రవి చింతల
కథ, కథనం - దేశ్ రాజ్ సాయితేజ్
సంగీతం - మహతి సాగర్
సినిమాటోగ్రాఫర్ - సురేశ్ రఘుతు
ఎడిటింగ్ - అన్వర్ అలీ
ప్రొడక్షన్ డిజైన్ - శ్రీ నాగేంద్ర తంగల
పీఆర్ఓ - ఏలూరు శ్రీను, మేఘశ్యామ్
సౌండ్ డిజైన్ - సింక్ సినిమా
దర్శకుడు - రమణ తేజ