View

పూజా కార్యక్రమాలతో రంగు బొమ్మల కథ షూటింగ్ ప్రారంభం!

Saturday,February13th,2021, 12:41 PM

ప్రశాంత్, మీనల్ లను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ నూతన దర్శకుడు వి గోపి దర్శకత్వంలో  లక్కీఫేస్‌ ఎంటర్టైన్‌మెంట్‌ బ్యానర్‌ పై  నిర్మాత కమలాకర్‌ రాచకొండ నిర్మిస్తున్న ప్రొడక్షన్ నంబర్ 1 రంగు బొమ్మల కథ చిత్రం శనివారం హైదరాబాద్‌, ఫిల్మ్‌నగర్‌ కల్చరల్‌ సెంటర్‌లో పూజా కార్యక్రమాలతో షూటింగ్‌ ప్రారంభమైంది. దైవ సన్నిధానంలోని సాయి బాబా గుడిలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు.  ఈ సందర్బంగా టైటిల్ పోస్టర్ కూడా లాంచ్ చేసారు. అనంతరం హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ సీనియర్‌ దర్శకుడు ఎస్‌.వి. కృష్ణారెడ్డి గౌరవ దర్శకత్వం వహించగా, ప్రముఖ నిర్మాత అచ్చిరెడ్డి క్లాప్‌కొట్టారు. బిగ్‌బాస్‌ ఫేమ్‌ సొహైల్‌ కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు.


అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ప్రముఖ దర్శకుడు ఎస్‌. వి. కృష్ణారెడ్డి మాట్లాడుతూ ‘‘దర్శక, నిర్మాతలు ఈ ‘రంగు బొమ్మల కథ’సినిమాను అందంగా తెరపైకి తీసుకురావాలనే పట్టుదలతో ఉన్నారు. మంచి సినిమాను నిర్మించాలనే వారి కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ఇది ప్రేక్షకులు మెచ్చే చిత్రం అవుతుంది. తమ కలని నిజం చేసుకోవడానికి చిత్రబృందం కసిగా చేస్తున్న తొలి ప్రయత్నం విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నాను. టీం కు ఆల్‌ ది బెస్ట్‌’’ అని అన్నారు.


నిర్మాత కె అచ్చి రెడ్డి మాట్లాడుతూ .. ‘‘టైటిల్‌ చూడగానే చాలా పాజిటివ్‌ ఫీలింగ్‌ వచ్చింది. రంగులను తెరపైన చూడడానికి ప్రేక్షకులు పూర్తి నమ్మకంతో థియేటర్లకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిర్మాత కమలాకర్‌ రాచకొండ, దర్శకుడు వి. గోపీలో మనం ప్రేక్షకులకు రీచ్‌ అవ్వాలనే తపన ఉంది. ప్రతిభావంతులైన దర్శక నిర్మాతలను ప్రోత్సహించాలని సురేష్‌ కొండేటి ఆహ్వానించడంతో ఈ కార్యక్రమానికి వచ్చాం. వీరు ఎంచుకున్న కథాంశం కొత్తగా ఉంది. మంచి అభిరుచితో ఈ చిత్రాన్ని వినూత్నంగా తెరకెక్కిస్తారని నమ్ముతున్నాం. ఈ ‘రంగు బొమ్మల క థ’ తప్పకుండా సూపర్‌ హిట్‌ అవ్వాలని, లక్కీఫేస్‌ ఎంటర్టైన్‌మెంట్‌ బ్యాన ర్‌లో ఇలాంటి చిత్రాలు మరిన్ని తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం’’ అని అన్నారు.


బిగ్ బాస్ ఫేమ్ సోహైల్‌ మాట్లాడుతూ‘‘రంగుబొమ్మల కథ’ చిత్ర బృంధానికి నా శుభాకాంక్షలు. చిన్న సినిమాలకు ఓటీటీల్లో మంచి ఆదరణ దక్కుతోంది. ఇది చిన్న సినిమాయే అయినా పెద్ద సినిమా స్థాయిలో విజయం అందుకోవాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా తర్వాత మీ జీవితం రంగులమయం కావాలని కలర్‌ఫుల్‌గా ఉండాలని కోరుకుంటున్నాను. కమలాకర్‌, గోపీ ఇద్దరు కూడా మధ్య తరగతి నేపథ్యం నుంచి వచ్చినవారే. వారిద్దరిలోనూ కష్టపడి పైకి రావాలనే తపన ఉంది. 11 ఏళ్లు కష్టపడ్డాక నాకు బ్రేక్‌ వచ్చింది. ఏదైనా అవకాశం వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోవాలి.  ఈ సినిమాలో నటిస్తోన్న హీరో, హీరోయిన్లుకు దర్శకుడికి మంచి పేరుతో పాటు నిర్మాతగా కమలాకర్‌ విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.


దర్శకుడు గోపాల కృష్ణ మాట్లాడుతూ .. ‘‘దర్శకుడిగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మా నిర్మాత కమలాకర్‌ రాచకొండ గారికి ధన్యవాదాలు. టాలెంట్‌ను గుర్తించి ప్రోత్సహించడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. రాత్రి కథకు సంబంధించిన లైన్‌ చెప్పగానే మార్నింగ్‌ ప్రాజెక్ట్‌ను ఓకే చేశారు’’అన్నారు.


హీరో ప్రశాంత్ మాట్లాడుతూ ‘‘నన్ను హీరోగా పరిచయం చేస్తున్న దర్శకుడు గోపీ అన్న, నిర్మాత కమలాకర్‌ అన్నకు ధన్యవాదాలు. ఒక కొత్త తరహా కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. మమ్మల్ని ప్రోత ్సహించాలని ప్రేక్షకులను కోరుకుంటున్నాను’’ అన్నారు.  


నిర్మాత కమలాకర్‌ రాచకొండ మాట్లాడుతూ ‘‘ఒకప్పుడు ఎస్వీ కృష్ణారెడ్డి గారి చిత్రాలను మేం ఎంజాయ్‌ చేస్తూ చూశాం. ఇప్పుడు మా తొలి చిత్రం ప్రారంభోత్సవం సందర్భంగా వారితో వేదిక పంచుకోవడం సంతోషంగా ఉంది. ఈ నెల 20 నుంచి వరంగల్‌ సమీపంలోని గంగదేవిపల్లెలో మా చిత్రం షూటింగ్‌ ప్రారంభిస్తున్నాం’’ అన్నారు.


కథానాయిక మీనల్‌ మాట్లాడుతూ .. ‘‘ఈ సినిమాలో కథానాయికగా కొత్త తరహా పాత్ర పోషిస్తున్నాను. గ్రామీణ యువతిగా నటనకు ఆస్కారం ఉన్న పాత్ర చేస్తున్నాను. ఒక సాధారణ మహిళ కష్టపడి జీవితంలో ఉన్నత స్థాయికి చేరడానికి పడిన కష్టాన్ని తెరపై చూపిస్తున్నాం’’ అని  అన్నారు.  


నటీనటులు
హీరోః ప్రశాంత్
హీరోయిన్‌ః మీనల్‌,  
సాంకేతిక వర్గం
సంగీతంః ప్రశాంత బి.జే,
కెమెరా , ఎడిటింగ్ : శ్రవణ్ జి కుమార్,
నిర్మాతః కమలాకర్‌ రాచకొండ,
దర్శకత్వంః గోపాల కృష్ణ,
పీఆర్‌ఓః సురేష్‌ కొండేటి



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Read More !