View

'ఇప్పుడు కాక ఇంకెప్పుడు' టీజర్ విడుదల

Tuesday,February16th,2021, 01:26 PM

నూతన నటుడు హస్వంత్ వంగా హీరోగా నమ్రత దారేఖర్, కతల్యాన్ గౌడ హీరోయిన్స్ గా చింతా రాజశేఖర్ రెడ్డి సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వై.యుగంధర్ దర్శకత్వంలో ప్రముఖ వ్యాపారవేత్త చింతా గోపాలకృష్ణ రెడ్డి (గోపి) నిర్మించిన రొమాంటిక్ రామ్ కమ్ ఫిల్మ్ "ఇప్పుడు కాక ఇంకెప్పుడు". మార్చిలో రిలీజ్ కానున్న ఈ చిత్రం టీజర్ ను ఫిబ్రవరి 16న ప్రసాద్ ల్యాబ్స్ లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో హీరో హస్వంత్ వంగా, నటి నోమినా తార, నటుడు అప్పజి, దర్శకుడు వై. యుగంధర్, నిర్మాత చింతా గోపాలకృష్ణ రెడ్డి, కెమెరామెన్ జెమిన్ జామ్ అయ్యనేత్, సంగీత దర్శకుడు సాహిత్యా సాగర్, ఎడిటర్ శ్రీకాంత్ పట్నాయక్, పాటల రచయిత సురేష్ బానిశెట్టి తదితరులు పాల్గొన్నారు.. టీజర్ రిలీజ్ అనంతరం...


నటుడు అప్పాజీ అంబరీష్ మాట్లాడుతూ...  చాలా సరదాగా ఫ్రెండ్లిగా షూటింగ్ అంతా జరిగింది. హీరో హస్వంత్ చూడటానికి చాలా అమాయకుడిగా వున్నా ఈ చిత్రంలో పెంటాస్టిక్ గా నటించాడు. ఈ చిత్రంలో హీరోయిన్ ఫాదర్ గా యాక్ట్ చేశాను. అన్నీ ఎమోషన్స్ ఉన్న పాత్ర చేయడం చాలా హ్యాపీగా ఉంది. యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ అందరికీ నచ్చేలా ఈ చిత్రాన్ని యుగంధర్ రూపొందించాడు. ప్రొడ్యూసర్ గోపీ గారు డైరెక్టర్ కి చాలా సపోర్ట్ ఇచ్చి ఈ సినిమాని బ్యూటిఫుల్ గా నిర్మించారు. ఈ సినిమా సక్సెస్ అయి యుగంధర్ మంచి డైరెక్టర్ గా ఇండస్ట్రీలో నిలబడాలి.. అలాగే మా నిర్మాత గోపీ గారికి కాసుల వర్షం కురిపించాలని కోరుకుంటున్నాను.. అన్నారు. 


నటి నోమిన తార మాట్లాడుతూ... ఈ చిత్రంలో లిటిల్ క్యూట్ గా వుండే ఒక ముఖ్యమైన పాత్రలో నటించాను. అది చూస్తే చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ఫిల్మ్ అందరికీ బాగా కనెక్ట్ అవుతుంది. ఈ సీనేంక్ మంచి హిట్ అవ్వాలి. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్.. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత దర్శకులకు నా థాంక్స్.. అన్నారు. 


పాటల రచయిత సురేష్ మాట్లాడుతూ... ఈ చిత్రంలో ఒక పాట రాశాను. ఇట్స్ ఎ రొమాంటిక్ ఫిల్మ్. మంచి కథ, కథనాలతో యుగంధర్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తీశాడు. ఆల్రెడీ పాటలు వైరల్ అవుతున్నాయి. ఒక టిపికల్ కంటెంట్ రాబోతున్న ఈ చిత్రం సూపర్ హిట్ అవుతుంది.. అన్నారు. 


సంగీత దర్శకుడు సాహిత్య సాగర్ మాట్లాడుతూ... ఇది నా ఫస్ట్ సినిమా. నామీద నమ్మకంతో ఈ సినిమాకి మ్యూజిక్ చేసే అవకాశం ఇచ్చిన యుగంధర్ కి చాలా థాంక్స్. సాంగ్స్ అన్నీ బాగా వచ్చాయి. కలర్ ఫుల్ గా ఈ చిత్రం ఉంటుంది. నిర్మాత గోపాలకృష్ణ రెడ్డి గారు మమ్మలందర్ని నమ్మి ఎంతో బడ్జెట్ ఖర్చుపెట్టి ఈ సినిమా తీశారు. రీ-రికార్డింగ్ జరుగుతోంది. టీమ్ అంతా కష్టపడి వర్క్ చేశారు. కెమెరా విజువల్స్ సూపర్బ్ గా ఉన్నాయి. చిన్న ట్విస్ట్ తో వుండే ఇంటర్వెల్ సీన్ కి విజిల్స్ పడతాయి.. అలాగే క్లైమాక్స్ లో వచ్చే సీన్ కి కళ్లలో నీళ్లు తిరిగాయి.. అంత అద్భుతంగా డైరెక్టుగా ఈ చిత్రాన్ని యుగంధర్ తెరకెక్కించాడు..టీజర్ చూసి కల్ట్ సినిమా అనుకుంటారేమో.. అది కల్ట్ కాదు.. గిల్ట్ కాదు.. 100%పర్సెంట్ గోల్డ్ సినిమా .. అన్నారు. 


కెమెరామెన్ జెమిన్ జామ్ మాట్లాడుతూ... తమిళ్, మలయాళంలో 8 సినిమాలు చేసాను. మద్రాస్ ప్రసాద్స్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో ట్రైనింగ్ చేశాను. తెలుగులో ఇది నా ఫస్ట్ ఫిల్మ్. పక్కా క్లారిటీ షూర్టీ ఉన్న డైరెక్టర్ యుగంధర్. నేను చాలా మంది కొత్త డైరెక్టర్స్ తో వర్క్ చేశాను. కానీ యుగంధర్ వెరీ టాలెంటెడ్ డైరెక్టర్. తనకి ఏం కావాలో అంతే తీసుకుంటాడు. చాలా నేచురల్ గా ఈ సినిమా తీశాడు. ప్రతీ డిపార్ట్మెంట్ వాళ్ళు యుగంధర్ కలని నిజం చేశారు. నిర్మాత గోపీ గారు కాంప్రమైజ్ అవకుండా స్క్రిప్టును నమ్మి సినిమా తీశారు. తప్పకుండా ఈ చిత్రం బిగ్ హిట్ అవుతుంది. 


చిత్ర నిర్మాత చింతా గోపాలకృష్ణ రెడ్డి మాట్లాడుతూ.., బేసిగ్గా నేను వ్యాపారవేత్తను.. మా సినిమా టైటిల్ లాగానే ఇప్పుడు కాక ఇంకెప్పుడు సినిమా తీయాలని అనుకునేవాడ్ని.. యుగంధర్ కథ చెప్పగానే నాకు బాగా నచ్చింది. సంవత్సరానికి రెండు సినిమాలు తీసి కొత్త టాలెంట్ ని మా బ్యానర్ ద్వారా ఎంకరేజ్ చేయాలని డిసైడ్ అయ్యాను. అందరూ శ్రీ చక్రాస్ బ్యానర్ ద్వారా మాకు లైఫ్ వచ్చింది అనుకునేలా సినిమాలు చేయాలని నాకొరిక.  యుగంధర్ మంచి సినిమా చేశాడు.. టీజర్ చాలా బాగుంది. సినిమా కూడా అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాను.. అన్నారు. 


హీరో హస్వంత్ వంగా మాట్లాడుతూ... మా పేరెంట్స్ అబ్రాడ్ లో వున్నా కూడా ఆవేలితి తెలియనీయకుండా మా అత్తామామలు నన్ను బాగా చూసుకున్నారు. ఇంజినీరింగ్ కంప్లీట్ అయ్యాక సినిమాలు చేస్తాను అంటే  బాగా సపోర్ట్ చేసిన మా ఫ్యామిలీకి  థాంక్స్. యుగంధర్ కథ చెప్పింది చెప్పినట్టుగా తీశాడు. గోపీ గారు ఎక్కడా రాజీ పడకుండా ఎక్స్ ట్రార్డినరిగా సినిమా తీశారు. సాహిత్యా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. జెమిన్ బ్యూటిఫుల్ విజువల్స్ తో సినిమాని కలర్ ఫుల్ గా చిత్రికరించారు. స్క్రీన్ మీద నన్ను నేను చూసుకొని చాలా థ్రిల్ ఫీలయ్యాను. ఈ సినిమాకి వర్క్ చేసిన ప్రతీ ఆర్టిస్టు, టెక్నీషియన్స్ అందరికీ నా థాంక్స్.. అన్నారు. 
చిత్ర దర్శకుడు వై. యుగంధర్ మాట్లాడుతూ... రామ్ కమ్ మూవీ. కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఈ చిత్రంలో ఉంటాయి. ఏసినిమాకైనా కథే హీరో.. దాంతోపాటు నిర్మాతే ఎప్పటికీ హీరో అని నేను బలంగా నమ్ముతాను..మా సినిమాకి మా నిర్మాత గోపాలకృష్ణ రెడ్డిగారి హీరో. నేను ఆయనకి కథ చెప్పాక.. చాలా బాగుంది.. నువ్ బాగా చేస్తావ్ అని నమ్మకంవుంది.. నువ్ దైర్యంగా చేయి నీ వెనుక నేనుంటాను అని ఈ సినిమా చేశారు. ఓటీటీలు వచ్చినా కూడా మన సినిమా థియేటర్స్ లోనే రిలీజ్ చేద్దాం అని వెయిట్ చేసి మార్చ్ లో మా చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. నేను నమ్మి పెట్టుకున్న ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ ప్రాణం పెట్టి ఈ చిత్రానికి వర్క్ చేశారు. ఖచ్చితంగా షూర్ షాట్ హిట్ కొడుతున్నాం అని కాన్ఫిడెన్స్ గా ఉన్నాం.. అన్నారు. 


హస్వంత్ వంగా, నమ్రత దారేఖర్ కతల్యాన్ గౌడ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో  తనికెళ్ళ భరణి, తులసి, రాజా రవీంద్ర, పూజ రామచంద్రన్, ఐడ్రీమ్ అంజలి, అప్పాజీ అంబరీష్, రాజా శ్రీధర్, జబర్దస్త్ రాఘవ, రాయ్ సింగ్ రాజు, వశిష్ఠ చౌదరి, నోమినా తార, నిఖిల్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ; జెమిన్ జామ్ అయ్యనేత్, మ్యూజిక్; సాహిత్యా సాగర్, ఎడిటర్; శ్రీకాంత్ పట్నాయక్ ఆర్, కోరియోగ్రఫి; శ్రీ క్రిష్, లిరిక్స్; సాహిత్యా సాగర్, సురేష్ బానిశెట్టి, ఆర్ట్; బాబా అర్మోన్, పీఆర్ఓ; వంశీ-శేఖర్, నిర్మాత; చింతా గోపాలకృష్ణ రెడ్డి, రచన- దర్శకత్వం; వై. యుగంధర్.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Read More !