View

'రంగా' పాత్ర అంగీకరించడానికి కారణం అదే - సురేష్ కొండేటి

Thursday,March04th,2021, 03:04 PM

బెజ‌వాడ పేరెత్తితే వినిపించే పేర్లు వంగ‌వీటి రంగా .. దేవినేని నెహ్రూ. ఇప్పుడు ఆ ఇద్ద‌రి క‌థ‌తో సినిమా తెర‌కెక్కి రిలీజ‌వుతోంది. దేవినేని కోణంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి  'దేవినేని' అనే టైటిల్ ని నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే. 'బెజవాడ సింహం' అనేది ఉప‌శీర్షిక‌. శివ‌నాగు ద‌ర్శ‌క‌త్వంలో  దేవినేని నెహ్రూగా టైటిల్ పాత్ర‌లో నందమూరి తారకరత్న నటించ‌గా... వంగవీటి రంగా పాాత్రలో ప‌రిశ్ర‌మ‌లో అంద‌రికీ సుప‌రిచితుడు .. సంతోషం అధినేత‌.. నిర్మాత సురేష్ కొండేటి న‌టించారు. చారిత్రక నేపధ్యంలో రూపుదిద్దుకొని కమర్షియల్ హంగులతో ఈ శుక్ర‌వారం (మార్చి 5న‌) విడుదల  కానుంది.


సినిమాలో రంగా పాత్రలో నటించిన నిర్మాత, సంతోషం సినీ మాగజైన్ అధినేత కొండేటి సురేష్ మాట్లాడుతూ - బెజవాడ నేపథ్యంలో గతంలో అనేక సినిమాలు వచ్చాయి. వాటికి బిన్నంగా మా సినిమా దేవినేని ఉంటుంది. ఈ సినిమాలో ప్రధాన పాత్ర అయిన వంగవీటి మోహనరంగా పాత్రలో నటించాను. అందుకే తొలుత  బందరురోడ్డు లో ఉన్న వంగవీటి రంగా విగ్రహానికి పూల మాల వేసి నివాళి అర్పించాను. సినిమా అన్ని వ‌ర్గాల‌కు న‌చ్చేలా మా దర్శకుడు శివ నాగు తెర‌కెక్కించారు. అన్ని క్యారెక్టర్స్ ను చక్కగా మలిచారు. నిర్మాతలకు నా ధ‌న్య‌వాదాలు. సినిమా తప్పకుండా అందరిని ఆకట్టుకుంటుంది అని తెలిపారు.


మ‌రిన్ని సంగ‌తులు చెబుతూ... ఎవరిని కించ పరిచే ఉద్దేశంతో సినిమా ఉండదు. గతంలో జరిగిన అనేక సంఘటనలను పరిణామాలు ఈ సినిమాలో క‌నిపిస్తాయి. చాలా మంది కొత్త నటులు ఈ సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అవుతున్నారు. బెజవాడ నేపధ్యంలో వచ్చిన అన్ని సినిమాలను ప్రేక్షకులు ఆదరించారు. అలాగే దేవినేని సినిమాను కూడా ఆదరిస్తార‌ని ఆశిస్తున్నాం. వంగవీటి రంగా గారి పాత్ర పోషించడం నా పూర్వజన్మ సుకృతంగా బావిస్తున్నా. రంగా గారూ మన దేశానికి స్వాతంత్రం రావడానికి కొద్ది రోజుల ముందు ...1947 జూలై 4వ తేదీన‌ జన్మించారు. బహుశా అందుకే ఆయన స్వతంత్రభావాలతో పెరిగార‌ని భావిస్తాను.
కులమతాలకు అతీతంగా ఆయన జీవితం సాగడం విశేషం. రంగా గారి అన్న రాధా గారిని 1974లో  హత్య చేసిన తర్వాత అన్నగారి అనుయాయుల్ని ఆదుకోవడానికి విజయవాడలోని బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటడానికి రంగా గారు ప్రజా జీవితంలోకి అడుగుపెట్టారు. 1980లో విజయవాడ కార్పొరేషన్ కు జరిగిన ఎన్నికల్లో ఆయన 40వ వార్డు నుండి స్వతంత్ర అభ్యర్థిగా ఆయన జైలు లో ఉండి గెలిచారంటే... ఎంత ప్రజాదరణ ఉందో తెలుసుకోవచ్చు. రాజకీయ రాజధాని విజయవాడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా సేవలు అందించారు.


రంగా గారంటే ఓ ప్రభంజనం... ఓ ఉత్తేజం... ఓ ఉత్సాహం... నిజం చెప్పాలంటే ఆయన శాసన సభ్యుడిగా ఉన్నది కేవలం మూడు సంవత్సరాలే... అయితే... ఓ ముఖ్యమంత్రికి వచ్చినంత గుర్తింపును ఆయన పొందారు. ఆయనను చాలామంది ఒక కుల నేతగా గుర్తిస్తారు. కానీ ఆయన జీవితాన్ని... జీవన విధానాన్ని గమనిస్తే... అందులో నిజం లేదని మనకే తెలుస్తుంది. పీడిత తాడిత ప్రజల పక్షానే కాదు... పౌర హక్కుల సాధనలోనూ ఆయన ముందున్నారు.
1985లో ఎన్ కౌంటర్ పత్రిక అధినేత, సంపాదకుడు పింగళి దశరథ్ రామ్ ను హత్య చేసినప్పుడు రంగా పోరాడారు. 1986లో నేవీ ఆఫీసర్ మురళీధర్ ను విచారణ పేరుతో పోలీసులు స్టేషన్ కు పిలిచిన అనంతరం ఆయన అనుమానాస్పద మృతికి వ్యతిరేకంగా రంగా పోరాడారు. ముదిగొండ పద్మ అనే మహిళకు పోలీసులు శిరోముండనం చేస్తే... పోలీస్ స్టేషన్స్ ను రంగా ముట్టడించారు. ఇక ఎన్టీఆర్ పై జరిగిన ఉత్తుత్తు దాడిలో పాత్రధారి అయిన మల్లెల బాబ్జీ ఆత్మహత్య కేసును ప్రభుత్వం నీరుకార్చుతుంటే... రంగా దానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తన గళం విప్పి... శ్రీరాములు కమిటీని వేసేలా చేశారు. ఇలా అన్ని సందర్భాలలో ఆయన అన్ని కులాల వారికీ న్యాయం చేయడానికి ప్రయత్నించారు. అలానే కాపులకు అండగా నిలిచి వారిలో ధైర్యాన్ని నింపారు. అలాంటి గొప్ప ప్రజానాయకుడు రంగా గారి పాత్రను పోషించడం నిజంగా నా పూర్వ జన్మసుకృతంగా భావిస్తున్నాను.


ఇవాళ మన రాష్ట్రంలోని  ఆయనకున్నవి విగ్రహాలు మరే నాయకుడికీ లేవు. అయితే... ఆయన ఆశయాలను బడుగు బలహీన వర్గాల కోసం ఆయన చేసిన పోరాటాన్ని ఆదర్శంగా తీసుకోవడమే మనం చేయాల్సింది. ఈ పాత్ర చేసినప్పుడు కూడా నేను దానిని మనసులో పెట్టుకున్నాను. నటుడిగా ఇప్పుడిప్పుడే నన్ను నేను నిరూపించుకుంటున్న టైమ్ లో రంగా గారి పాత్ర పోషించమని దర్శక నిర్మాతలు కోరగానే... అంగీకరించడానికి కారణం కూడా అదే! ఈ పాత్ర  ద్వారా నేను ఆయనకు సరైన రీతిలో నివాళులు అర్పించానని భావిస్తున్నాను. నా నట జీవితంలో ఇదో మరపురాని పాత్రగా మిగిలిపోతుంది... అని సురేష్ కొండేటి తెలిపారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Read More !