View

పైసా పరమాత్మ ఆడియెన్స్ ని థ్రిల్ చేస్తుంది - విజయ్ కిరణ్ కుమార్ 

Tuesday,March09th,2021, 04:22 AM

కంటెంట్ ఉన్న చిత్రాలను ఆదరించడానికి తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ముందుంటారు. అలా సరికొత్త కాన్సెప్ట్ తో రాబోతున్న చిత్రం 'పైసా పరమాత్మ' . సాంకేత్, సుధీర్, కృష్ణ తేజ్, జబర్దస్త్ అవినాష్, ర‌మ‌ణ‌, అనూష‌, అరోహి నాయుడు, బ‌నీష, జబర్దస్త్ దీవెన ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ల‌క్ష్మీ సుచిత్ర క్రియేష‌న్స్ ప‌తాకంపై టి.కిర‌ణ్ కుమార్ నిర్మించారు. ఈ చిత్రానికి విజయ్ కిర‌ణ్ తిరుమల  దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ కి హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది.. కాగా ఈ చిత్రం మహా శివరాత్రి సందర్బంగా  మార్చి 12 భారీగా విడుదల కానుంది.. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.. ఈ కార్యక్రమంలో దర్శక, నిర్మాత కిరణ్ కుమార్ తిరుమల,  హీరోలు సాకేత్, సుధీర్, నటులు కృష్ణ తేజ, ముక్కు అవినాష్, రమణ, హీరోయిన్స్ ఆరోహి నాయుడు, భనిష, సంగీత దర్శకుడు కనిష్క, కోడైరెక్టర్ రాకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు...


దర్శక, నిర్మాత కిరణ్ కుమార్ తిరుమల మాట్లాడుతూ.. ' మానవ నిత్య జీవితంలో అందరూ నమ్మేది, నమ్మించేది పైసా.. దానిని బేస్ చేసుకొని 8 క్యారెక్టర్స్ చుట్టూ కథ జరుగుతోంది.. ప్రధానంగా సస్పెన్స్,   యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని రూపొందించాం. రెగ్యులర్ సినిమాలా కాకుండా కథ, కథనం చాలా కొత్తగా ఉంటుంది. ప్రతి సన్నివేశం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ చాలా సపోర్ట్ చేశారు. ముఖ్యంగా కనిష్క ఇచ్చిన మ్యూజిక్, అర్ అర్ సినిమాకి మెయిన్ హైలెట్. ఆర్ ఆర్ సాంగ్స్ రింగ్ టోన్స్ పెట్టుకుంటారు. అంత అద్భుతంగా కనిష్క్ చేసాడు.  అలాగే  బాబు ఇచ్చిన విజువల్స్ బ్యూటిఫుల్ గా ఉంటాయి. సస్పెన్స్ ఎంటర్టైన్మెంట్స్ తో యాక్షన్ డ్రామా థ్రిల్లర్ చిత్రం ఇది. మార్చి 12న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రేక్షకులను డిజప్పాయింట్ చేయదు.. అన్నారు. 


మ్యూజిక్ డైరెక్టర్ కనిష్క మాట్లాడుతూ.. ' డిఫరెంట్ సబ్జెక్ట్ తో రూపొందిన పైసా పరమాత్మ చిత్రం అందరికీ నచ్చుతుంది. నటీ నటులు అందరూ సూపర్బ్ పెర్ఫార్మెన్స్ చేశారు.. ఈ చిత్రంలో రెండు సాంగ్స్ ఒక రిమిక్ సాంగ్ ఉంటుంది.. సినిమా చూసి అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను.. అన్నారు. 


హీరో సాకేత్ మాట్లాడుతూ.. ' ఈ చిత్రంలో హీరోగా నటించే ఛాన్స్ ఇచ్చిన కిరణ్ గారికి ఋణపడి ఉంటాను. అందరం కలిసి ఒక మంచి సినిమా చేశాం.. సస్పెన్స్ థ్రిల్లర్ తో రూపొందిన ఈ చిత్రం అనేక ట్విస్ట్ లతో సాగుతుంది.. అన్నారు. 


మరో హీరో సుధీర్ మాట్లాడుతూ.. మంచి కంటెంట్ ఉన్న సినిమాని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు.. మా పైసా పరమాత్మ కూడా కొత్త కంటెంట్ తో వస్తోంది. ఆడియెన్స్ అందరూ మా చిత్రాన్ని ఆదరించాలి  అన్నారు. 


నటుడు కృష్ణ తేజ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో ఒక ముఖ్యపాత్రలో నటించాను. నా 14ఏళ్ళు సినీ కేరియర్ లో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ చేసిన చిత్రం ఇది. మెస్మరైజింగ్ చేస్తుంది. ప్రతీ ఒక్కరూ నా క్యారెక్టర్ ని ఓన్ చేసుకుంటారు. అంత అద్భుతంగా కిరణ్ డిజైన్ చేసాడు.. ట్రైలర్ పై మంచి రెస్పాన్స్ వచ్చింది.. సినిమా కూడా ఇంకా బాగుంటుంది.. అన్నారు. 


హీరోయిన్ ఆరోహి నాయుడు మాట్లాడుతూ.. కంప్లీట్ టీం వర్క్ ఇది. డైరెక్టర్ కిరణ్ గారు ప్రతి క్యారెక్టర్ ని అద్భుతంగా డిజైన్ చేశాడు. మెయిన్ లీడ్ క్యారెక్టర్ చేశాను.. నన్ను నమ్మి ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చిన కిరణ్ గారికి నా థాంక్స్.. అన్నారు. 


నటి బనిష మాట్లాడుతూ.. ' నేను, అవినాష్ కాంబినేషన్లో వచ్చే సీన్స్ చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటాయి. టీమ్ అందరం చాలా కష్టపడి చేసిన సినిమా ఇది. ముఖ్యంగా కిరణ్ గారు వన్ మాన్ షోలా ఈ చిత్రాన్ని చేశారు. ప్రేక్షకులకు ఈ చిత్రం బాగా నచ్చుతుంది.. అన్నారు. 


కమిడియన్ ముక్కు అవినాష్ మాట్లాడుతూ.. కెమెరామెన్ జియల్ బాబు కాల్ చేసి ఈ చిత్రంలో మంచి క్యారెక్టర్ ఉంది చేయాలి అన్నారు.. కిరణ్ చెప్పిన సబ్జెక్ట్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. సినిమా చాలా బాగా వచ్చింది.. అందరికీ నచ్చుతుంది.. అన్నారు. 


నటుడు రమణ మాట్లాడుతూ.. కథని నమ్మి ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ వర్క్ చేశారు. ఒక ముఖ్యపాత్రలో నటించాను. సినిమా చూశాను.. చాలా బాగుంది.. అందరికీ నచ్చుతుంది.. అన్నారు. 


రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. ' కిరణ్ గారు అద్భుతమైన కథతో ఈ చిత్రాన్ని చేశారు. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ చాలా సపోర్ట్ చేశారు. సినిమా బాగా వచ్చింది.. మార్చి 12న విడులవుతుంది.. సినిమాని చూసి పెద్ద హిట్ చేయాలని ప్రేక్షకులను కోరుకుంటున్నాను.. అన్నారు.  

 

సాంకేతిక విభాగం : బ్యానర్ :  ల‌క్ష్మీ సుచిత్ర క్రియేష‌న్స్మ్యూజిక్ : కనిష్క్దర్శకుడు : విజయ్ కిర‌ణ్ తిరుమలనిర్మాత  : టి.కిర‌ణ్ కుమార్Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Read More !