View

చిరు చేతుల మీదుగా విడుదలైన 'విరాటసర్వం' టీజర్

Thursday,March18th,2021, 05:01 PM

రానా, సాయిప‌ల్ల‌వి జంట‌గా వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న సినిమా 'విరాట‌ప‌ర్వం'. డి. సురేష్ బాబు స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్‌.ఎల్‌.వి. సినిమాస్ ప‌తాకంపై సుధాక‌ర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. "రివ‌ల్యూష‌న్ ఈజ్ ఏన్ యాక్ట్ ఆఫ్ ల‌వ్" అనేది ట్యాగ్‌లైన్‌. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ జ‌రుగుతున్న 'విరాట‌ప‌ర్వం'ను ఏప్రిల్ 30న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.


మేక‌ర్స్ ముందుగా ప్ర‌క‌టించిన‌ట్లుగానే గురువారం సాయంత్రం ఈ మూవీ టీజ‌ర్‌ను మెగాసార్ట్ చిరంజీవి విడుద‌ల చేశారు. త‌న ట్విట్ట‌ర్ హ్యాండిల్ ద్వారా టీజ‌ర్‌ను షేర్ చేసిన ఆయ‌న‌, "Happy to launch #VirataParvamTeaser. It looks raw and realistic. Great storytelling by @venuudugulafilm . My best wishes to @RanaDaggubati  and @Sai_Pallavi92 Good luck to the entire team @SLVCinemasOffl @SureshProdns ." అని ఆయ‌న ట్వీట్ చేశారు.


"ఆధిప‌త్య జాడ‌ల‌నే చెరిపేయ‌గ ఎన్నినాళ్లు.. తార‌త‌మ్య గోడ‌ల‌నే పెకిలించగ‌ ఎన్నినాళ్లు.. దున్నేటోడి వెన్నువిరిచి భూస్వాములు ధ‌నికులైరి." అంటూ రానా బ్యాగ్రౌండ్‌లో ఆవేశంగా క‌విత్వం చెప్తుండ‌గా, ఆ క‌విత్వాన్నే రాస్తూ రానా క‌నిపిస్తుండ‌గా, టీజ‌ర్ మొద‌లైంది. ఆ లైన్లు వినిపిస్తుండ‌గానే చెట్టుకు ఉరివేసుకొని వేలాడుతూ ఇద్ద‌రు వ్య‌క్తులు, వారిని చూసి గుండెలు బాదుకుంటూ జ‌నం క‌నిపిస్తున్నారు.


ఆ త‌ర్వాత‌, "ప్రియ‌మైన అర‌ణ్య‌.. నీకు నేను అభిమానిని ఐపోయాను. నీ క‌విత్వం చ‌దువుతుంటే నాలో తెలీని భావోద్వేగం ర‌గులుతోంది. మీరాబాయ్ కృష్ణుడి కోసం క‌న్న‌వాళ్ల‌ను, క‌ట్టుకున్న‌వాళ్ల‌ను వ‌దిలేసి వెళ్లిపోయిందో.. అలా నేనూ నీకోసం వ‌స్తున్నాను." అని చెప్తూ సాయిప‌ల్ల‌వి లేఖ రాస్తున్న విజువ‌ల్స్ క‌నిపించాయి.
"చ‌రిత్ర‌లో దాగిన క‌థ‌ల‌కు తెర‌లేపిన ప్రేమ ఆమెది" అనే అక్ష‌రాలు ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాక బ‌స్సులో ప్ర‌యాణిస్తూ క‌నిపించింది సాయిప‌ల్ల‌వి. అంటే ఆమె త‌న ఇంటిని వ‌దిలేసి రానాను వెతుక్కుంటూ అడ‌విలోకి వెళ్లిందని అర్థ‌మ‌వుతోంది. ఈసారి "ఆమె ప్రేమ‌.. అలౌకికం.. ఆత్మికం.. అపురూపం" అనే అక్ష‌రాలు ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాయి. ఆ వెంట‌నే రానా, ప్రియ‌మ‌ణి బృందం పోలీసులను ఎదుర్కొని వాళ్ల‌ను త‌మ గ‌న్స్‌తో కాల్చ‌డాన్ని మ‌నం చూడొచ్చు. "ఆపైన అన‌ల మార్గాన ఉరిమిన ర‌హ‌స్యోద్య‌మం ఆమె జీవితం" అనే అక్ష‌రాలు వ‌చ్చాయి.


సాయిప‌ల్ల‌వి పోలీసుల‌కు చిక్కింది. ఒక పోలీసు ఆమె చేతుల్ని పైకి విరిచిప‌ట్టుకోగా, మ‌రో పోలీసు ఆమెను ఒంటిని శోధించాడు. సాయిప‌ల్ల‌వి భ‌య‌విహ్వ‌ల‌గా మారింది.


పోలీసులు, న‌క్స‌లైట్ల మ‌ధ్య పోరు సాగుతుంటే వాళ్ల మ‌ధ్య‌ సాయిప‌ల్ల‌వి ప‌రుగులు పెట్టింది.


చివ‌రి సీన్‌లో ప‌రుగెత్తుతూ.. మ‌న‌కు క‌నిపించ‌ని వ్య‌క్తి మీద రాయివిసురుతూ, "దొంగ .. కొడ‌కా" అని సాయిప‌ల్ల‌వి అర‌వ‌డం, ఆమెను ఆప‌డానికి ఈశ్వ‌రీ రావ్ ప్ర‌య‌త్నించ‌డం చూడొచ్చు.


ఒక‌టిన్న‌ర నిమిషాల 'విరాట‌ప‌ర్వం' టీజ‌ర్‌ను చూస్తుంటే ఒక‌విధ‌మైన భావోద్వేగం ఒంటిని ఊపేస్తుంద‌నేది నిజం. టీజ‌ర్‌లో జాతీయ ఉత్త‌మ‌న‌టి నందితా దాస్ కూడా క‌నిపించారు.


ఇప్ప‌టివ‌ర‌కూ 'విరాట‌ప‌ర్వం'పై ఉన్న అంచ‌నాలు ఒక ఎత్త‌యితే, టీజ‌ర్ త‌ర్వాత వెల్లువెత్తుతున్న అంచ‌నాలు మ‌రో ఎత్త‌ని చెప్ప‌వ‌చ్చు. టీజ‌ర్‌తో ఒక్క‌సారిగా సినిమాపై అనూహ్యంగా అంచ‌నాలు పెరిగిపోయాయి.


వేణు ఊడుగుల ఈ సినిమాతో మ‌రో స్థాయిని అందుకుంటాడ‌ని చెప్ప‌డానికి సందేహించాల్సిన ప‌నిలేదు.


ఇక ప‌ర్ఫార్మెన్స్ ప‌రంగా రానా, సాయిప‌ల్ల‌వి విరాట‌ప‌ర్వంతో మరింత పేరు తెచ్చుకోవ‌డం ఖాయం. డానీ సాంచెజ్ లోపెజ్‌, దివాక‌ర్ మ‌ణి సంయుక్త సినిమాటోగ్ర‌ఫీ, సురేష్ బొబ్బిలి మ్యూజిక్ ఈ సినిమాకు ఎస్సెట్ కానున్నాయి.


ఒక యూనిక్ కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఇప్ప‌టివ‌ర‌కూ క‌నిపించ‌ని పాత్ర‌ల్లో రానా, సాయిప‌ల్ల‌వి న‌టిస్తున్నారు. మిగ‌తా ముఖ్య పాత్ర‌ల్లో ప్రియ‌మ‌ణి, నందితా దాస్‌, నివేదా పేతురాజ్‌, న‌వీన్ చంద్ర‌, జ‌రీనా వ‌హాబ్‌, ఈశ్వ‌రీ రావ్‌, సాయిచంద్ క‌నిపించ‌నున్నారు.


తారాగ‌ణం:
రానా ద‌గ్గుబాటి, సాయిప‌ల్ల‌వి, ప్రియ‌మ‌ణి, నందితా దాస్‌, నివేదా పేతురాజ్‌, న‌వీన్ చంద్ర‌, జ‌రీనా వ‌హాబ్‌, ఈశ్వ‌రీ రావ్‌, సాయిచంద్‌, బెన‌ర్జీ, నాగినీడు, రాహుల్ రామ‌కృష్ణ‌, దేవీప్ర‌సాద్‌, ఆనంద్ ర‌వి, ఆనంద్ చ‌క్ర‌పాణి
సాంకేతిక బృందం:
ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: వేణు ఊడుగుల‌
నిర్మాత‌: సుధాక‌ర్ చెరుకూరి
స‌మ‌ర్ప‌ణ‌: సురేష్ బాబు
బ్యాన‌ర్స్‌: సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, ఎస్.ఎల్‌.వి. సినిమాస్‌
సినిమాటోగ్ర‌ఫీ:  డానీ సాంచెజ్ లోపెజ్‌, దివాకర్ మ‌ణి
ఎడిటింగ్‌: శ్రీ‌క‌ర్ ప్ర‌సాద్‌
మ్యూజిక్‌: సురేష్ బొబ్బిలి
స్టంట్స్‌: స్టీఫెన్ రిచ‌ర్డ్‌, పీట‌ర్ హెయిన్‌
ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌: శ్రీ‌నాగేంద్ర‌
కొరియోగ్ర‌ఫీ: రాజు సుంద‌రం, ప్రేమ్ ర‌క్షిత్‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: విజ‌య్‌కుమార్ చాగంటి
పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్‌.


Virata Parvam Teaser Launched by Chiru


Rana and Sai Pallavi starrer Virata Parvam is a unique and content driven film where the lead pair will be seen in never seen before roles. Megastar Chiranjeevi has launched Virata Parvam’s teaser today and wished the team all the success.


As the story mainly revolves around Sai Pallavi’s role, Rana requested his makers to mention her name first in title credits. Inspired from true events of 1990s, Rana is introduced as Comrade Ravanna who is known by his pen name Aranya.


How long to erase the marks of hegemony? How long to uproot the barriers of discrimination? Knocking the bottom out of farmers… landlords prospered,” utters Rana as he writes poetry.


Spellbound by his revolutionary and inspiring writings, Sai Pallavi who plays the role of Vennela falls in love with him and his poetry. The rustic girl steps into forest in search of her love and she in her journey come across some ruthless humans.


Going by the teaser, Virata Parvam is going to narrate a wonderful love story in the backdrop of war. The setup is intriguing and Venu Udugula’s dialogues are thought-provoking.


Dani Sanchez Lopez and Divakar Mani’s camera work is praiseworthy, while Suresh Bobbili uplifts the visuals with his pulsating background score.


D Suresh Babu is presenting the film and Sudhakar Cherukuri of Sri Lakshmi Venkateswara Cinemas is bankrolling it. Production values, as we can see in the teaser, are top-notch.


Virata Parvam also stars Priyamani, Nanditha Das, Naveen Chandra, Zareena Wahab, Eswari Rao and Sai Chand in important roles.


Cast: Rana Daggubati, Sai Pallavi, Priyamani, Nanditha Das, Naveen Chandra, Zareena Wahab, Eswari Rao, Sai Chand, Benarji, Nagineedu, Rahul Ramakrishna, Devi Prasad, Anand Ravi, Anand Chakrapani and others.


Crew:
Writer & Director: Venu Udugula, Producer: Sudhakar Cherukuri
Banner: Suresh Productions, Sri Lakshmi Venkateswara Cinemas
Presents: Suresh Babu
DOP: Dani Sanchez Lopez, Divakar Mani
Editor: Sreekar Prasad
Production designer: Sri Nagendra
Music: Suresh Bobbili
Stunts: Stephen Richard, Peter Hein
Choreography: Raju Sundaram.
PRO: Vamsi - Sekhar
Executive producer: Vijay kumar chaganti
Publicity Design: Dhani AelayAuthor :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Read More !