View

'హ‌ను-మాన్' - సూపర్ హీరో ఫిల్మ్ 

Friday,June25th,2021, 12:11 PM

‘జాంబీరెడ్డి’ సినిమాతో జాంబీస్‌ను టాలీవుడ్‌కు పరిచయం చేసిన క్రియేటివ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ మరోసారి ఓ వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. తెలుగు ప్రేక్షకులకు ఓ సరికొత్త సినిమాటిక్ జోనర్‌ను పరిచయం చేసేందుకు రెడీ అయ్యారు.


ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వ‌చ్చిన `జాంబీరెడ్డి` సినిమాలో తన నటనతో ఆక‌ట్టుకున్న యంగ్ హీరో తేజ సజ్జతో కలిసి ప్ర‌శాంత్ వ‌ర్మ‌ చేస్తోన్న ఒరిజినల్‌ ఇండియన్‌ సూపర్‌ హీరో ఫిల్మ్‌  ‘హను–మాన్‌’ . ప్రైమ్ షో ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.


జాంబీ రెడ్డి వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత తేజా స‌జ్జ‌, ప్రశాంత్ వర్మ కాంభినేష‌న్‌లో వ‌స్తోన్న రెండో చిత్ర‌మిది. ‘హను–మాన్‌’ అనేక కారణాల వల్ల క్రేజీ ప్రాజెక్టులలో ఒకటిగా మారింది. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రాన్ని గ్రాండ్ స్కేల్ లో అత్యాధునిక విఎఫ్ఎక్స్ తో రూపొందిస్తోంది. ప్ర‌ముఖ న‌టీన‌టులు మ‌రియు  టాప్-గ్రేడ్ టెక్నీషియన్లు ఈ సినిమా కోసం వ‌ర్క్ చేస్తున్నారు.


ప్రశాంత్‌ వర్మ బర్త్‌ డే సందర్భంగా  ఇటీవ‌ల విడుద‌లైన `హ‌ను-మాన్` టైటిల్, టైటిల్ టీజ‌ర్ కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది.


మన పురాణాలు ఇతిహాసల్లో అద్భుతమైన శక్తులు ఉన్న సూపర్‌హీరోస్‌ గురించి మనకు తెలుసు. వారి అపూర్వమైన శక్తులు, బలాలు, పోరాటపటిమ అద్భుతమైనవి. సూపర్‌హీరోస్‌ చిత్రాల్లోని హీరో ఎలివేషన్స్, యాక్షన్‌ సీక్వెన్సెస్‌ ఆడియన్స్‌ను థియేటర్స్‌కు రప్పిస్తాయి. అంతే  కాకుండా `హనుమాన్` మ‌న భారతీయులకు సూపర్ హీరో.


హ‌ను-మాన్ సినిమా ఈ రోజు హైద‌రాబాద్‌లో పూజా కార్య‌క్ర‌మాల‌తో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ముహూర్త‌పు షాట్‌కి నిర్మాత సి. క‌ల్యాన్ క్లాప్ కొట్ట‌గా మ‌రో నిర్మాత జెమిని కిర‌ణ్ కెమెరా స్విఛాన్ చేశారు.  మొద‌టి స‌న్నివేశానికి  శివ‌శ‌క్తి ద‌త్త గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.


ముహూర్తపు వేడుకలో పొడవాటి జుట్టు, వాన్ డైక్ స్టైల్ మీసం మరియు గడ్డంతో స‌రికొత్త లుక్‌లో క‌నిపించారు హీరో తేజ సజ్జ.


జులై నుండి ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభంకానుంది.


శ్రీ‌మ‌తి చైత‌న్య స‌మ‌ర్ప‌ణ‌లో కె. నిరంజ‌న్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అశ్రిన్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌, వెంక‌ట్ కుమార్ జెట్టి లైన్ ప్రొడ్యూస‌ర్‌, కుశ‌ల్ రెడ్డి అసోసియేట్ ప్రొడ్యూస‌ర్‌. దాశ‌ర‌థి శివేంద్ర సినిమాటోగ్రాఫ‌ర్‌.


ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాలు త్వ‌ర‌లో వెల్ల‌డించ‌నున్నారు.


తారాగ‌ణం: తేజ స‌జ్జ‌
సాంకేతిక వ‌ర్గం:
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: ప్ర‌శాంత్ వ‌ర్మ‌,
నిర్మాత‌: కె. నిరంజ‌న్ రెడ్డి
బ్యాన‌ర్‌: ప్రైమ్ షో ఎంట‌ర్‌టైన్‌మెంట్స్
స‌మ‌ర్ప‌ణ‌: శ్రీ‌మ‌తి చైత‌న్య
స్క్రీన్ ప్లే: స్క్రిప్ట్స్ విల్లే
డిఒపి: దాశ‌ర‌థి శివేంద్ర
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: అశ్రిన్ రెడ్డి
లైన్ ప్రొడ్యూస‌ర్‌: వెంక‌ట్ కుమార్ జెట్టి
అసోసియేట్ ప్రొడ్యూస‌ర్‌: కుశ‌ల్ రెడ్డి
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: శ్రీ‌నాగేంద్ర తంగ‌ల‌
క్యాస్టూమ్స్ డిజైన‌ర్‌: లంక సంతోషి
పిఆర్ఒ: వంశీ - శేఖ‌ర్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Read More !