View

బాబీ సింహా వ‌సంత కోకిల టీజ‌ర్ కు సూపర్ రెస్పాన్స్

Friday,June25th,2021, 02:38 PM

ఎస్ ఆర్ టి ఎంట‌ర్ టైన్మెంట్స్, ముద్ర ఫిల్మ్ ఫ్యాక్ట‌రీ బ్యానర్లు సంయుక్తంగా తెలుగు, త‌మిళ, క‌న్న‌డ భాష‌ల్లో జాతీయ అవార్డు గ్ర‌హీత బాబీ సింహా హీరోగా రూపొందిన‌‌ ట్రైలింగ్వ‌ల్ మూవీ వ‌సంత కోకిల‌. ప్ర‌ముఖ నిర్మాత రామ్ త‌ళ్లూరి నిర్మాణ సార‌ధ్యంలో నూత‌న ద‌ర్శ‌కుడు ర‌మ‌ణ‌న్ పురుషోత్త‌మ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బాబీ సింహాకి జోడిగా కాశ్మీర ప‌ర్ధేశీ హీరోయిన్ గా న‌టిస్తోంది. వ‌సంత కోకిల్ అనే టైటిల్ ఎనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంచి ఈ సినిమా పై అటు సాధ‌ర‌ణ ప్రేక్ష‌కుల‌తో పాటు ఇటు ఇండస్ట్రీ ట్రేడ్ వ‌ర్గాల్లో ఆస‌క్తి పెరిగింది. అందుకు త‌గ్గ‌ట్లుగానే ఇప్ప‌టివ‌ర‌కు విడుద‌లైన ఈ సినిమా ప్ర‌మోష‌న్ కంటెంట్ కు అనూహ్య స్పంద‌న ల‌భించింది. 


ఈ నేప‌థ్యంలో తాజాగా ఈ ట్రైలింగ్వ‌ల్ మూవీకి సంబంధించిన టీజ‌ర్ విడుద‌లై అన్ని వ‌ర్గాల అభిమానుల ఆద‌ర‌ణ అందుకుంటూ సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. డైలాగ్స్ లేకుండానే కేవ‌లం విజువ‌ల్స్ తోనే ఆద్యంతం ఉత్కంఠ‌ని క‌లిగించే రీతిన టీజ‌ర్ ని రెడీ చేయ‌డం విశేషం. రొమాంటిక్ థ్రిల్ల‌ర్ జాన‌ర్ గా ఈ సినిమా రెడీ అవుతుంది. సినిమా జాన‌ర్ కి, బాబీ సింహా అత్యుత్త‌మ ప‌ర్ఫార్మెన్స్ కి త‌గిన విధంగానే ద‌ర్శ‌కుడు ర‌మ‌ణ‌న్ వ‌సంత కోకిలను తెర‌కెక్కించార‌ని చిత్ర బృందం కాన్ఫిడెంట్ గా చెబుతోంది. 


జాతియ అవార్డు గ్ర‌హిత‌, విల‌క్ష‌ణ హీరో క‌మ‌లహాస‌న్, శ్రీదేవి కాంబినేష‌న్ లో వ‌చ్చిన వ‌సంత కోకిల ఏ రేంజ్ స‌క్సెస్ అందుకుందో అంద‌రికీ తెలిసిందే. ఇప్పుడు అదే టైటిల్ తో తెర‌కెక్కుతున్న సినిమాలో మ‌రో జాతీయ అవార్డు గ్ర‌హీత బాబీ సింహా న‌టించ‌డం విశేషం. థింక్ మ్యూజిక్ వారు ఈ సినిమా ఆడియో రైట్స్ ద‌క్కించుకున్నారు.


ఈ సినిమాకి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే అధికారికంగా విడుద‌ల చేస్తామ‌ని నిర్మాత రామ్ త‌ళ్లూరి తెలిపారు.


న‌టీన‌టులు
బాబీ సింహా, కాశ్మీర ప‌ర్ధేశీ


సాంకేతిక వ‌ర్గం
ర‌చ‌న, ద‌ర్శ‌క‌త్వం - ర‌మ‌ణ‌న్ పురుషోత్త‌మ‌
మ్యూజిక్ - రాజేశ్ మురుగేశ‌న్
డిఓపి - గోపీ అమ‌ర‌నాథ్
ఎడిట‌ర్ - వివేక్ హ‌ర్ష‌న్
ప్రొడ‌క్ష‌న్ డిజైన్ - నాగ్ రాజ్ ఆర్ కే
యాక్ష‌న్ - స్ట‌న్న‌ర్ శామ్, స్టంట్ స్లివా
ఆడియోగ్ర‌ఫి - తాపాస్ నాయ‌క్
కాస్ట్యూమ్ డిజైన‌ర్ - నందిని ఎన్ కే
కొరియోగ్ర‌ఫి - ఎమ్ ష‌రీఫ్, విజీస‌తీష్
ప్రొడ‌క్షన్ ఎక్స్ క్యూటీవ్ - ఆర్ పి బాల గోపి
ఎక్సీక్యూటివ్ ప్రొడ్యూస‌న్ - స‌తీష్ సుంద‌ర్ రాజ్
లైన్ ప్రొడ్యూస‌ర్స్ - జే విద్య సాగ‌ర్, యూ. దిలీప్ కుమార్
ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్ - చెన్నూరు మ‌హేంద‌ర్
ప్రొడ‌క్ష‌న్ మ్యానేజ‌ర్ - విశ్వ‌నాథ‌న్
స్టిల్స్ - శ్రీ బాలాజీ
పీఆర్ఓ - ఏలూరు శ్రీను, మేఘ‌శ్యామ్
పబ్లిసిటీ డిజైన్స్ - ట్యూనీ జాన్ 24 ఎమ్
లిరిక్స్ - చంద్ర బోస్
డైలాగ్స్ - రాజేశ్ ఏ మూర్తి
నిర్మాత‌లు - ర‌జ‌నీ త‌ళ్లూరి, రేష్మీ సింహా



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Read More !