View

'మై నేమ్ ఈజ్ శృతి' అంటున్న హన్సిక

Monday,July05th,2021, 11:12 AM

దేశ‌ముదురు సినిమాతో తెలుగు చిత్ర‌సీమ‌లో అరంగేట్రం చేసిన హ‌న్సిక అన‌తికాలంలోనే అగ్ర‌క‌థానాయిక‌గా గుర్తింపును సొంతం చేసుకున్న‌ది. ఆమె తెలుగులో న‌టిస్తున్న తొలి మ‌హిళా ప్ర‌ధాన చిత్రం 'మై నేమ్ ఈజ్ శృతి' ఆదివారం హైద‌రాబాద్‌లో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. శ్రీ‌నివాస్ ఓంకార్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. వైష్ణ‌వి ఆర్ట్స్ ప‌తాకంపై ర‌మ్య బురుగు, నాగేంద్ర‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫిలింన‌గ‌ర్ దైవ‌స‌న్నిధానంలో చిత్ర పూజా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించారు. అనంత‌రం చిత్రీక‌రించిన ముహూర్త‌పు స‌న్నివేశానికి రేవ‌తి క్లాప్‌నివ్వ‌గా వైష్ణ‌వి కెమెరా స్విఛాన్ చేశారు. తొలి స‌న్నివేశానికి వంశీ గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో...


హ‌న్సిక మాట్లాడుతూ - నేను క‌థానాయిక‌గా న‌టిస్తున్న 52వ చిత్ర‌మిది. తెలుగు సినిమాల‌తోనే క‌థానాయిక‌గా నా ప్ర‌యాణం ఆరంభ‌మైంది. న‌టిగా టాలీవుడ్ నాకు మంచి పేరును తీసుకొచ్చింది. తెలుగులో మ‌రో మంచి సినిమా చేస్తుండ‌టం ఆనందంగా ఉంది. స్వేచ్ఛ‌స్వాతంత్ర్యాలు క‌లిగిన శృతి అనే యువ‌తిగా ఈ సినిమాలో క‌నిపిస్తా. త‌న భావాల్ని ధైర్యంగా వెల్ల‌డించే యువ‌తిగా విభిన్నంగా నా పాత్ర‌ ఉంటుంది. ఆద్యంతం మ‌లుపుల‌తో ఆస‌క్తికరంగా సినిమా సాగుతుంది. క‌థ వింటున్న‌ప్పుడు త‌ర్వాత ఏం జ‌రుగుతుంద‌నే ముంగింపు వ‌ర‌కు నేను ఊహించ‌లేక‌పోయాను. ఆ కొత్త‌ద‌నం న‌చ్చే ఈ సినిమా అంగీక‌రించాను అని తెలిపింది.


న‌టుడు సాయితేజ మాట్లాడుతూ - ఇది నా మూడో సినిమా. ఇందులో ఓ మంచి పాత్ర‌ను పోషిస్తున్నా. హ‌న్సిక‌కు జోడీగా క‌నిపిస్తాను అని తెలిపారు.


నిర్మాతలు మాట్లాడుతూ - కొంత గ్యాప్ త‌ర్వాత తెలుగులో హ‌న్సిక న‌టిస్తున్న చిత్ర‌మిది. త‌ప్ప‌కుండా బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలుస్తుంది. త‌ర్వాత ఏం జ‌రుగుతుంద‌నే ప్రేక్ష‌కుల ఊహ‌కు అంద‌దు. ఇలాంటి ట్విస్ట్‌ల‌తో ఇప్ప‌టివ‌ర‌కు వెండితెర‌పై సినిమా రాలేదు. న‌ట‌న ప‌రంగా లీడ్‌రోల్ చాలెంజింగ్‌గా ఉంటుంది. క‌థ విన్న త‌ర్వాత ఈ క్యారెక్ట‌ర్ చేయ‌డానికి చాలా మంది భ‌య‌ప‌డ్డారు. హ‌న్సిక ధైర్యంగా ఈ సినిమాను అంగీక‌రించింది అని అన్నారు.


ద‌ర్శ‌కుడు శ్రీ‌నివాస్ ఓంకార్ మాట్లాడుతూ - ప్ర‌తి మ‌గాడి విజ‌యం వెనుక స్త్రీ ఉంటుంద‌ని చెబుతుంటారు. అలాగే ప్ర‌తి మ‌హిళ సంఘ‌ర్ష‌ణ వెనుక మ‌గాడు ఉంటాడు. త‌న జీవితంలో ఎదురైన సంఘ‌ర్ష‌ణ‌ను ఓ యువ‌తి ఎలా ఎదుర్కొన్న‌ద‌న్న‌ది ఈ చిత్ర ఇతివృత్తం. లాక్‌డౌన్ టైమ్ కావ‌డంతో హ‌న్సిక‌కు జూమ్ యాప్ ద్వారా క‌థ చెప్పాల‌ని అనుకున్నాం. కానీ ఆమె మాత్రం ముంబ‌యి వ‌చ్చి క‌థ చెప్ప‌మ‌ని అన్నారు. హ‌న్సిక‌ ఇంట్లోనే ఆమెకు నాలుగున్న‌ర గంట‌లు క‌థ చెప్పా. వెంట‌నే సినిమాను అంగీక‌రించింది. సోమ‌వారం నుంచి తొలి షెడ్యూల్‌ను మొద‌లుపెట్ట‌బోతున్నాం. ఈ నెలాఖ‌రున సెకండ్ షెడ్యూల్‌, ఆగ‌స్ట్‌లో మూడో షెడ్యూల్‌ను ప్రారంభిస్తాం. నాలుగేళ్లుగా న‌న్ను న‌మ్మి ఈ సినిమా చేసే అవ‌కాశాన్ని నిర్మాత‌లు ఇవ్వ‌డం ఆనందంగా ఉంది అని చెప్పారు.


ముర‌ళీశ‌ర్మ‌, ఆర్ నారేయ‌న‌న్‌, జ‌య‌ప్ర‌కాష్‌, వినోదిని, సాయితేజ‌, పూజా రామ‌చంద్ర‌న్‌, రాజీవ్ క‌న‌కాల ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీ : కిశోర్ బోయిడ‌పు, క‌ళా ద‌ర్శ‌క‌త్వం : గోవింద్, సంగీతం : మార్క్ కె రాబిన్‌, ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్‌ : జి సుబ్బారావు, పోస్ట‌ర్ డిజైనింగ్‌ : విక్ర‌మ్ విజ‌న్స్‌, కాస్ట్యూమ్ డిజైన‌ర్ : అమృత బొమ్మి, పీఆర్‌వో : మ‌డూరి మ‌ధు, కాస్ట్యూమ్ ఛీఫ్ : స‌ర్వేశ్వ‌ర‌రావు, కో ప్రొడ్యూస‌ర్ : ప‌వ‌న్‌కుమార్ బండి, నిర్మాత‌లు : ర‌మ్య బురుగు, నాగేంద్ర రాజు, ద‌ర్శ‌క‌త్వం : శ్రీ‌నివాస్ ఓంకార్‌



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Read More !