View

గ్రాండ్ గా 'గానా ఆఫ్‌ రిపబ్లిక్‌' 

Sunday,July11th,2021, 02:14 PM

సుప్రీమ్‌ హీరో సాయితేజ్‌, దేవ్ క‌ట్టా కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న పొలిటిక‌ల్ థ్రిల్లర్‌ 'రిప‌బ్లిక్‌'. జీ స్టూడియోస్‌ సమర్పణలో జె.బి.ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై ఈ చిత్రాన్నినిర్మాత‌లు జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మిస్తున్నారు. శనివారం  'గానా ఆఫ్‌ రిపబ్లిక్‌' సాంగ్‌ లాంచ్‌ ఈవెంట్‌ హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. 'రిపబ్లిక్‌' సినిమాలో కాలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాంగే పాటను ముఖ్య అతిథిగా హాజరైన స్టార్‌ డైరెక్టర్‌ కొరటాల శివ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో హీరో సాయితేజ్‌, డైరెక్టర్‌ దేవ్‌ కట్టా, నిర్మాతలు జె.భగవాన్‌, జె.పుల్లారావు, జీస్టూడియోస్‌ ప్రసాద్‌, సినిమాటోగ్రాఫర్‌ ఎం.సుకుమార్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ మణిశర్మ, కో డైరెక్టర్‌ కిరణ్‌, రైటర్‌ బి.వి.ఎస్‌.రవి, సతీశ్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా...


నిర్మాతలు జె.భగవాన్‌, పుల్లారావు మాట్లాడుతూ - "మా సినిమా ఫస్ట్‌ సాంగ్‌ కొరటాల శివగారి చేతుల మీదుగా స్టార్ట్‌ కావడమే పెద్ద సక్సెస్‌గా మేం భావిస్తున్నాం. 


డైరెక్టర్‌ దేవ్‌ కట్టా మాట్లాడుతూ - "నేను మణిశర్మగారితో చాలా రోజుల నుంచి ట్రావెల్‌ అవుదామని అనుకుంటున్న సమయంలో 'రిపబ్లిక్‌' సినిమాకు కుదిరింది. చాలా హ్యాపీగా ఉంది. ఈ సాంగ్‌ను రిలీజ్‌ చేయడానికి కొరటాల శివగారి కంటే బెటర్‌ పర్సెన్‌ మరొకరు ఉండరనిపించింది. ఆయన మా సాంగ్‌ను రిలీజ్‌ చేయడం చాలా సంతోషం. అలాగే రైటర్‌ బి.వి.ఎస్‌.రవిగారికి థాంక్స్‌. జీ స్టూడియోస్‌వారు స్టార్టింగ్‌ నుంచి ఎంతో సపోర్ట్‌ చేస్తూ వస్తున్నారు. డైరెక్టర్‌గా నాకు ఎంతో స్పేస్‌ ఇచ్చారు. అందువల్ల నేను ఏదైతే అనుకున్నానో దాన్ని చక్కగా ప్రెజెంట్‌ చేయగలుగుతున్నాను. వారికి కూడా ఈ సందర్భంగా థాంక్స్‌ తెలియజేస్తున్నాను. లిరిక్‌ రైటర్‌ రెహమాన్‌ మంచి సాహిత్యాన్ని అందించాడు. అలాగే సాయితేజ్‌కి, నిర్మాతలకు స్పెషల్‌ థాంక్స్‌. ఎంతో సపోర్ట్‌ చేశారు" అన్నారు. 


రైటర్‌ బి.వి.ఎస్‌.రవి మాట్లాడుతూ - ''రిపబ్లిక్‌' అనే టైటిల్‌లోనే చాలా సామాజిక బాధ్యత కనిపిస్తుంది. ఇంతకు ముందు వచ్చిన ఫస్ట్‌ కట్‌ గమనిస్తే సినిమాలో చాలా స్ట్రాంగ్‌ మెసేజ్‌ ఉండబోతుందని అర్థమవుతుంది. ప్రస్థానం, ఆటోనగర్‌ సూర్యలాగానే ఈ సినిమాను కూడా దేవ్‌కట్టాగారు తన స్టైల్లో తెరకెక్కించారని అనుకుంటున్నాను. సాయితేజ్‌ ఎలాంటి క్యారెక్టర్‌ను అయినా చేయగల నటుడు. ఈ సినిమాలోనూ చాలా మంచి పాత్రలో కనిపిస్తాడు. మణిశర్మగారి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సాంగ్‌ను ఎంతో ట్రెండీగా అందించారు. నిర్మాతలు భగవాన్‌, పుల్లారావుగారు సహా ఎంటైర్‌ యూనిట్‌కు ఆల్‌ ది బెస్ట్‌" అన్నారు. 


మ్యూజిక్‌ డైరెక్టర్‌ మణిశర్మ మాట్లాడుతూ - "సాయితేజ్‌తో తొలిసారి కలిసి పనిచేస్తున్నాను. అలాగే నిర్మాతలు భగవాన్‌, పుల్లారావుగారితో ఎప్పటి నుంచో పరిచయం ఉంది. దేవ్‌ కట్టాగారితో కలిసి పని చేయడం ఎంతో ఆనందంగా ఉంది" అన్నారు. 


సుప్రీమ్‌ హీరో సాయితేజ్‌ మాట్లాడుతూ - "గానా ఆఫ్‌ రిపబ్లిక్‌' సాంగ్‌ను పెద్ద స్క్రీన్‌పై చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. కచ్చితంగా మా సినిమాను థియేటర్స్‌లోనే విడుదల చేస్తున్నాం. దేవ్‌ కట్టాగారు నాకు ఒక మంచి సినిమాను ఇచ్చారు. మా నిర్మాతలు భగవాన్‌గారు, పుల్లారావుగారు, జీస్టూడియోస్‌వారు కలిసి ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా సినిమాను నిర్మించారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మణిశర్మగారితో ఎప్పటి నుంచో సినిమా చేయాలని అనుకున్నాను. ఈ సినిమాతో మా జర్నీ స్టార్ట్ అయ్యింది. ఇకపై ఆయనతో చాలా సినిమాలు చేయాలని అనుకుంటున్నాను. కొరటాల శివగారు స్పెషల్‌ గెస్ట్‌గా వచ్చి ఆశీర్వదించినందుకు ఆయనకు థాంక్స్‌" అన్నారు. 


స్టార్‌ డైరెక్టర్‌ కొరటాల శివ మాట్లాడుతూ - ''రిపబ్లిక్‌'లో సాంగ్‌ రిలీజ్‌ చేయడాన్ని హ్యాపీగా ఫీల్‌ అవుతున్నాను. స్వేచ్చ గురించి చెప్పే సాంగ్‌.. చాలా బావుంది. ఎంటైర్‌ యూనిట్‌కు ఆల్‌ ది బెస్ట్‌. నిర్మాతలు భగవాన్‌, పుల్లారావుగారు..మిర్చి సినిమా నుంచి పరిచయం. చాలా సౌమ్యులు. ప్రొఫెషనల్‌ ప్రొడ్యూసర్స్‌. వారికీ సినిమా చాలా పెద్ద సినిమా కావాలి. దేవ్‌ కట్టాగారి గురించి చెప్పాలంటే.. ఆయన ప్రస్థానం సినిమా నాకు బాగా నచ్చుతుంది. ఆయన ఓ విషయాన్ని ఎంత బలంగా నమ్ముతారో, అంతే బలంగా చెబుతారు. ఇన్‌టెన్స్‌ ఫిల్మ్‌ మేకర్. సింపుల్‌ ఎక్స్‌ప్రెషన్‌ను కూడా ఇన్‌టెన్స్‌తో చెబుతారు. అందరినీ ఆలోచింపచేసే పాయింట్‌ను ఈ సినిమాలో చెబుతారని ఆశిస్తున్నాను. మణిశర్మగారితో పనిచేయడం ఆలస్యమైనా ఇప్పుడు కలిసి పని చేస్తున్నందుకు సంతోషంగా అనిపిస్తుంది. ఆయన్ని అందరూ మెలోడి బ్రహ్మ అని ఎందుకు అంటారో నాకు ఇప్పుడర్థమైంది. సాయితేజ్‌ నాకు బ్రదర్‌లాంటోడు. తనతో చిన్న ఎమోషనల్‌ కనెక్ట్‌ ఎప్పుడూ ఉంటుంది. తనకు సక్సెస్‌ వస్తే నాకు సక్సెస్‌ వచ్చినట్లు ఫీల్‌ అవుతాను. తను చేసే సినిమాలన్నీ సక్సెస్‌లు సాధించాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా గొప్ప విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను" అన్నారు. 


న‌టీన‌టులు:
సాయితేజ్, ఐశ్వర్యా రాజేశ్‌, జ‌గ‌ప‌తిబాబు, ర‌మ్యకృష్ణ, సుబ్బరాజు, రాహుల్ రామ‌కృష్ణ, బాక్సర్ దిన 


సాంకేతిక వ‌ర్గం:
నిర్మాత‌లు: జె.భ‌గ‌వాన్‌, జె.పుల్లారావు, జీ స్టూడియోస్‌, జె.బి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, కథ‌, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం:  దేవ్ క‌ట్టా, స్క్రీన్‌ప్లే:  దేవ క‌ట్టా, కిర‌ణ్ జ‌య్ కుమార్‌, సినిమాటోగ్రఫీ:  ఎం.సుకుమార్‌, మ్యూజిక్‌:  మ‌ణిశ‌ర్మ, ఎడిట‌ర్‌:  కె.ఎల్‌.ప్రవీణ్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Read More !