View

'విజ‌య రాఘ‌వ‌న్‌' ట్రైల‌ర్ ని విడుదల చేసిన రానా

Monday,August02nd,2021, 03:15 PM

న‌కిలీ, డా.సలీమ్‌, బిచ్చగాడు, భేతాళుడు, ఇంద్రసేన, రోషగాడు, కిల్లర్‌` వంటి చిత్రాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకున్న హీరో విజయ్‌ ఆంటోని. ఈయన హీరోగా... 'మెట్రో' వంటి డిఫరెంట్‌ మూవీని తెరకెక్కించిన డైరెక్టర్‌ ఆనంద కృష్ణన్‌ తెరకెక్కిస్తోన్న చిత్రం 'విజయ రాఘవన్‌'.  ఇన్ఫినిటీ ఫిల్మ్‌ వెంచర్‌ సమర్పణలో చెందూర్ ఫిల్మ్‌ ఇంటర్నేషనల్‌ బ్యానర్‌పై టి.డి.రాజా, డి.ఆర్‌.సంజయ్‌ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  కోడియిల్ ఒరువ‌న్‌` పేరుతో త‌మిళంలో.. `విజ‌య రాఘ‌వ‌న్‌`పేరుతో తెలుగులో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న ఈ సినిమా తెలుగు ట్రైల‌ర్‌ను వెర్స‌టైల్ హీరో రానా ద‌గ్గుబాటి విడుద‌ల చేసి చిత్ర యూనిట్‌కు అభినంద‌న‌లు తెలిపారు. ట్రైల‌ర్ విష‌యానికి వ‌స్తే నేరాలు చేసే వాళ్ల‌ని వ‌దిలేసి స్కూలుకెళ్లి చ‌దువుకునే చిన్న చిన్న పిల్ల‌ల్ని ప‌ట్టుకుని అరెస్ట్ చేస్తారేంట్రా ప‌నికిమాలిన సుంట‌ల్లారా! అంటూ ఓ వ్య‌క్తి పోలీసుల‌ను తిట్ట‌డంతో ట్రైల‌ర్ మొద‌లవుతుంది. 'బ‌య‌టూరోడివా' అని హీరోని ఓ సైడ్ విల‌న్ ప్ర‌శ్నిస్తే... 'అర‌కు ప‌క్క‌న‌' అంటూ హీరో విజ‌య్ ఆంటోని స‌మాధానం చెప్ప‌డం.. 'ఏదైనా తేడా వ‌చ్చిందా పేగులు తీసి మెళ్లో వేసుకుంటా' మ‌రో సైడ్ విల‌న్ వార్నింగ్ ఇవ్వ‌డం హీరో త‌న‌ని తాను ట్యూష‌న్ మాస్ట‌ర్ అని ప‌రిచ‌యం చేసుకోవ‌డం.. ఐఏఎస్‌కి ప్రిపేర్ అయ్యే హీరో బ‌స్తీలో చ‌దువుకోవాల‌నుకునే కుర్రాళ్ల కోసం స్పెష‌ల్ క్లాసులు చెప్ప‌డం.. పాడ‌వ‌కుండా ఉండాల‌ని ఆధార్ కార్డుని లామినేష‌న్ చేస్తారు కానీ.. చెద‌లు ప‌ట్టిన మా జీవితాల‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు అంటూ ఓ బ‌స్తీ మ‌హిళ హీరో ద‌గ్గ‌ర బాధ‌ప‌డటం ఏదో ఒక ప‌క్క నిల్చువాలి త‌మ్ముడు.. సెంట‌ర్‌లో నిల్చున్నావంటే రెండు ప‌క్క‌ల నుంచి న‌లిగిపోతావ్‌` అంటూ కె.జి.య‌ఫ్ విల‌న్ రామ‌చంద్ర‌రాజు హీరోని బెదిరించ‌డం`జీత‌మే లేని ఓ కార్పొరేట‌ర్ సీటుని ఓ పార్టీ కోటి ఇచ్చికొనుక్కుంటుంది.. ల‌క్ష జీత‌ముమ‌న్న ఎమ్మెల్యే సీటుకి ప‌దిహేను కోట్లు, ఎంపీకి ఇర‌వై ఐదు కోట్లు.. మొత్తం ఇలా ఎన్ని వేల కోట్లు.. వీళ్లంద‌రూ గెలిచొచ్చి ఏం పీకుతున్నారో అంద‌రికీ తెలిసిందే క‌దా..అని అసెంబ్లీలో హీరో ఎమోష‌న‌ల్ డైలాగ్ చెప్ప‌డం...మ‌ధ్య‌లో హీరోయిన్ ఆత్మిక‌తో హీరో ల‌వ్‌ట్రాక్ సీన్స్‌, విల‌న్స్‌తో హీరో చేసే యాక్ష‌న్ సీన్స్ ఓ బ‌స్తీ.. అందులో రౌడీయిజం చేసే రౌడీలు.. వారిని ఎదుర్కోడానికి వ‌చ్చిన హీరో.. దానికి సంబంధించిన రాజ‌కీయాలు.. వీటి కాంబినేష‌న్‌లో క‌ట్ చేసిన ట్రైల‌ర్ ఆస‌క్తిని రెట్టింపు చేస్తోంది.


ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసిన‌ రానా ద‌గ్గుబాటికి హీరో విజ‌య్ ఆంటోని ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు. 


‘‘ఇది వ‌రకే విడుద‌లైన‌ ఈ సినిమా పాటలకు, టీజ‌ర్‌కు ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఓ మాస్ ఏరియాలో పిల్ల‌లు ప‌క్క దారులు ప‌ట్ట‌కుండా ... చ‌దువు గొప్ప‌త‌నాన్ని వారికి వివ‌రించి, వారి ఉన్న‌తికి పాటు ప‌డే యువ‌కుడి క‌థే విజ‌య్ రాఘ‌వ‌న్‌. ప్ర‌స్తుత ట్రెండ్‌కు అనుగుణంగా తెర‌కెక్కించాం. డిఫరెంట్ పాత్ర. కచ్చితంగా తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగినట్లుగా సినిమా ఉంటుంది. డైరెక్ట‌ర్ ఆనంద కృష్ణ‌న్ సినిమాను అద్భుతంగా అన్ని ఎలిమెంట్స్‌ను క‌వ‌ర్ చేస్తూ తెర‌కెక్కించారు.ఎప్పుడో విడుద‌ల కావాల్సిన సినిమా కోవిడ్ కార‌ణంగా వాయిదా ప‌డింది. ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డ్డాయి. త్వ‌ర‌లోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి సినిమాను విడుద‌ల చేస్తాం’’ అని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది. 


న‌టీన‌టులు:విజయ్‌ ఆంటోని, ఆత్మిక, రామచంద్రరాజు, ప్రభాకర్ తదితరులు 


సాంకేతిక వ‌ర్గం:రచన, దర్శకత్వం: ఆనంద కృష్ణన్‌నిర్మాతలు: టి.డి.రాజా, డి.ఆర్‌. సంజయ్‌ కుమార్‌ సహ నిర్మాతలు: కమల్ బోరా, లలిత ధనంజయన్‌, బి.ప్రదీప్‌, పంకజ్‌ బోరా, ఎస్‌.విక్రమ్‌ కుమార్‌సినిమాటోగ్రఫీ: ఎన్‌.ఎస్‌.ఉదయ్‌కుమార్‌మ్యూజిక్‌: నివాస్‌ కె.ప్రసన్నఎడిటర్‌: లియో జాన్‌ పాల్‌Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Read More !