View

రౌడీ బాయ్స్ టీజర్ లాంఛ్ విశేషాలు

Tuesday,September21st,2021, 02:06 PM

దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్, ఆదిత్య మ్యూజిక్ అసోసియేష‌న్‌తో ... శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై శ్రీహ‌ర్ష కొనుగంటి ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తోన్న చిత్రం ‘రౌడీ బాయ్స్’. తెలుగు ప్రేక్ష‌కుల అభిరుచిగా త‌గిన‌ట్లు ఎన్నో స‌క్సెస్‌ఫుల్ చిత్రాల‌ను అందించిన దిల్‌రాజు, శిరీష్ ఫ్యామిలీ నుంచి హీరోగా ప‌రిచ‌యం అవుతున్నారు ఆశిష్‌(శిరీష్ త‌న‌యుడు).  ఈ సినిమా టీజర్ విడుదల కార్యక్రమం బుధవారం హైదరాబాద్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో ...


చిత్ర ద‌ర్శ‌కుడు శ్రీహ‌ర్ష కొనుగంటి మాట్లాడుతూ ‘‘రౌడీబాయ్స్‌లో 9 పాట‌లున్నాయి. అన్ని పాట‌లు ఆడియెన్స్‌కు ఫీస్ట్‌లా ఉంటాయి. అందులో రెండు కాలేజీ ఫెస్ట్ సాంగ్స్. ఈ సినిమా రిలీజ్ త‌ర్వాత కాలేజీ ఫెస్ట్స్‌లో ఆ సాంగ్సే ప్లే అవుతాయ‌ని అనుకుంటున్నాను. దేవిశ్రీప్ర‌సాద్‌గారితో ప‌నిచేయ‌డం అనేది నా క‌ల‌ను నేరవేర్చిన దిల్‌రాజుగారికి థాంక్స్‌’’ అన్నారు. 


హీరో ఆశిష్ మాట్లాడుతూ ‘‘టైటిల్ సాంగ్ అందరికీ నచ్చిందనే భావిస్తున్నాను. అనుపమ కొన్ని కారణాలతో ఈవెంట్‌కు రాలేక‌పోయింది. త‌న వ‌ల్ల‌, దేవిశ్రీప్ర‌సాద్‌గారి వ‌ల్ల‌, దిల్‌రాజుగారి వ‌ల్ల ఈ సినిమాకు చాలా మంచి క్రేజ్ వ‌స్తుంది. డైరెక్ట‌ర్ హ‌ర్ష‌కు థాంక్స్‌. నా లుక్ విష‌యంలో కేర్ తీసుకున్న అక్క‌య్య‌కు థాంక్స్‌. థియేట‌ర్స్‌లో క‌లుద్దాం’’ అన్నారు. 


నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ ‘‘ఈ సినిమా హీరో దేవిశ్రీ ప్రసాద్. ఎందుకంటే అంద‌రూ కొత్త వాళ్ల‌తో సినిమా చేస్తున్న‌ప్పుడు ఆడియెన్స్‌ను థియేట‌ర్స్‌కు ర‌ప్పించాలంటే ఫ‌స్ట్ అంద‌రినీ మెప్పించేది మ్యూజిక్కే. నాకు, దేవిశ్రీతో ఉన్న అనుబంధం కార‌ణంగా, ఆశిష్‌ను హీరోగా లాంచ్ చేస్తున్నామ‌ని, కొత్త వాళ్ల‌తో సినిమా చేస్తున్నామ‌ని, మ్యూజిక్ చేయాల‌ని అడిగితే త‌ను ఒక వారం టైమ్ తీసుకుని మ్యూజిక్ చేయ‌డానికి ఓకే  ఆలోచించ‌కుండా స‌రేన‌న్నాడు. క‌థ విన్న త‌ర్వాత నుంచి దేవిశ్రీ ప్ర‌సాద్ సినిమాతో ట్రావెల్ అవుతున్నాడు. ఏ సంద‌ర్భంలో ఏ పాట ఉండాలి, ఎలా ఉండాల‌ని అని త‌ను చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ వ‌చ్చాడు. మా జ‌ర్నీలో అన్ని సినిమాలు వేరు.. ఈ సినిమా వేరు. త‌న ఇన్‌వాల్వ్ అయ్యి చేసినందుకు థాంక్స్‌. హుషారు సినిమాతో యూత్ ఆడియెన్స్‌లో హుషారు నింపిన డైరెక్ట‌ర్ హ‌ర్ష. ఇప్పుడు రౌడీబాయ్స్‌తో నెక్ట్స్ లెవ‌ల్ మూవీని చేశాడు. యూత్‌కు కావాల్సిన అన్నీ ఎలిమెంట్స్ ఉంటాయి.  ఎగ్జయిటింగ్ సీన్స్‌, క్యారెక్టర్స్ క‌నిపిస్తాయి. ఔట్ అండ్ ఔట్ యూత్ మూవీ. చాలా కాలం త‌ర్వాత మా బ్యాన‌ర్‌లో వ‌స్తున్న యూత్ మూవీ ఇది. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ఇది వ‌ర‌కు శ‌త‌మానం భ‌వ‌తి, హ‌లోగురూ ప్రేమ‌కోస‌మే చిత్రాల‌ను మా బ్యాన‌ర్‌లో చేసింది. ఈ సినిమా స్టార్ట్ చేయ‌డం కంటే ముందు అనుప‌మ‌..ఇద్ద‌రి హీరోల‌కంటే పెద్ద వ్య‌క్తిగా క‌నిపిస్తుందేమోన‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ, త‌ను ఎక్స్‌ట్రార్డిన‌రిగా చేస్తుంద‌ని నేను న‌మ్మాను. దేవిశ్రీ త‌ర్వాత త‌నే సెకండ్ హీరో. రేపు సినిమా థియేట‌ర్స్‌లో మీకే అర్థ‌మ‌వుతుంది. ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల చేసిన‌ప్పుడు ప‌క్కింటి కుర్రాడిలా ఉన్నాడ‌ని అంద‌రూ అనుకున్నారు. ఫ‌స్ట్ సాంగ్ రిలీజ్ చేసిన త‌ర్వాత డాన్సులు బాగా చేశాడ‌ని అంద‌రూ అప్రిషియేట్ చేశారు. టీజ‌ర్‌కు కూడా మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. ఆశిష్‌, విక్ర‌మ్ చాలా బాగా చేశారు. మ‌దిగారు అద్భుత‌మైన విజువ‌ల్స్ ఇచ్చారు. స‌మీర్‌గారు, విజ‌య్ కె.చ‌క్ర‌వర్తిగారికి థాంక్స్‌. స్క్రిప్ట్‌లో వ‌ర్క్ చేసిన సందీప్, శౌరి స‌హా ఇత‌ర టెక్నీషియ‌న్స్ థాంక్స్‌. ద‌స‌రాకు సినిమాను విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు. 


రాక్‌స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ మాట్లాడుతూ ‘‘మళ్లీ అందరికీ థియేటర్స్ అనుభవం రావాలని కోరుకుంటున్నాను. రౌడీ బాయ్స్ చిత్రానికి వస్తే.. నన్ను దిల్‌రాజుగారు చెప్పిన‌ట్లు నేను ఈ సినిమాకు మ్యూజిక్ చేస్తాన‌ని చెప్ప‌డానికి  వారం రోజుల స‌మ‌యం తీసుకోలేదు. వెంట‌నే ఓకే చెప్పాను. దిల్‌రాజుగారు ఆ విష‌యాన్ని నా ద‌గ్గ‌ర అడాల్సిన ప‌నిలేదు. ఎందుకంటే ఆశిష్ సినిమాకు మ్యూజిక్ ఇవ్వ‌డం అనేది నా బాధ్య‌త‌. మ‌రో మ్యూజిక్ డైరెక్ట‌ర్‌ను తీసుకుని ఉండుంటే నేను వారింటి ముందు ద‌ర్నా చేసేవాడిని. ఈ సినిమాతో హీరోగా పరిచ‌యం అవుతున్న ఆశిష్‌కు అభినంద‌న‌లు. హ‌ర్ష‌తో వ‌ర్క్ చేయ‌డం హ్యాపీ. త‌ను యూత్‌ఫుల్‌గా ఈ సినిమాను చేశాడు. ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కూడా న‌చ్చే సినిమా. ఇప్ప‌టి వ‌ర‌కు చాలా యూత్‌ఫుల్ సినిమాలు చూశాం. ప్ర‌తి ఐదేళ్ల‌కో, ప‌దేళ్ల‌కో యూత్‌ఫుల్ ఫిల్మ్ వ‌చ్చి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంది. మ‌ళ్లీ అలా యూత్ అంద‌రూ క‌లిసి న‌వ్వుకోవ‌డానికి, ఎంజాయ్ చేయ‌డానికి, కాలేజీ డేస్‌ను ఈ సినిమాతో గుర్తు చేసుకుంటారు. ఆశిష్‌, విక్ర‌మ్ అంద‌రూ అద్భుతంగా చేశారు. ఆశిష్ పెర్ఫామెన్స్ చూస్తే ఫ‌స్ట్ సినిమాకే ఇంత బాగా చేస్తున్నాడేంట‌నిపించింది. ఆశిష్ గొప్ప‌గా న‌టించాడు. విక్ర‌మ్ పోటాపోటీగా న‌టించాడు. అనుప‌మ చాలా బాగా చేసింది. ఎంటైర్ టీమ్‌కు ఆల్ ది బెస్ట్‌’’ అన్నారు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Read More !