View

కృతిశెట్టిని కొత్తగా చూస్తారు - ఇంద్రగంటి

Saturday,January01st,2022, 03:53 PM

హీరో సుధీర్ బాబు, మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్‌లో రాబోతోన్న మూడవ‌ చిత్రం 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'. ఈ చిత్రంలో సుధీర్ బాబు సరసన కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. బెంచ్ మార్క్ స్టూడియోస్ బ్యానర్ మీద గాజులపల్లె సుధీర్ బాబు సమర్పిస్తోన్న ఈ చిత్రాన్ని బి మహేంద్ర బాబు, కిరణ్ బల్లపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రానికి నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమా ఫస్ట్ లుక్ విడుదల కార్యక్రమం హైదరాబాద్ లోని ఓ హోటల్లో జరిగింది. ఈ సందర్భంగా...


నిర్మాత రవి శంకర్ మాట్లాడుతూ... కొత్త ఏడాదిలో ఫస్ట్ డే మనమంతా కలవడం సంతోషంగా ఉంది. ఆ అమ్మాయి గురించి ఉప్పెన సినిమా ద్వారా చెప్పాం. ఆ అమ్మాయి మంచి నటి అని మాకు తెలుసు. ఇంకా ఈ సినిమా ద్వారా దర్శకుడు, హీరో ఏం చెబుతారో చూడాలి. ఇంద్రగంటి గారు విభిన్నమైన చిత్రాలు చేయగల దర్శకులు. ఆయన యాక్షన్, లవ్, మ్యూజికల్ ఫిల్మ్, ఎంటర్ టైనర్స్ ఇలా అన్ని జానర్స్ సినిమాలు చేయగలరు. ఇంద్రగంటి గారితో సినిమా చేయాలని అనుకునేవాళ్లం. అలాగే హీరో సుధీర్ బాబు వెరీ టాలెంటెడ్. ఆయనతో మైత్రీ మూవీ మేకర్స్ సినిమా చేయాలని వెయిట్ చేశాం. ఇలా ఇంద్రగంటి, సుధీర్ బాబు సినిమాకు ప్రెజెంటర్ గా అసోసియేట్ అవడం సంతోషంగా ఉంది. ఆ అమ్మాయి గురించిచెప్పాలి టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్. అన్నారు.


మైత్రీ మూవీ మేకర్స్ సీయీవో చెర్రి మాట్లాడుతూ... ఆ అమ్మాయి గురించి చెప్పాలి కథను ఇంద్రగంటి  మోహనకృష్ణ గారు మాకు చెప్పగానే చాలా బాగుందని అనిపించింది. ఈ సినిమాలో అనేక ఎలిమెంట్స్ కలిసి ఉంటాయి. ఇదొక బ్లాక్ బస్టర్ సినిమా అవుతుందని చెప్పగలను. సుధీర్ బాబు వర్సటైల్ యాక్టర్ ఆయన సినిమాలో అసోసియేట్ అవడం ఆనందంగా ఉంది. అలాగే కృతి మాతో సెకండ్ మూవీ చేస్తోంది. ఆ అమ్మాయి గురించి ఇంద్రగంటి మోహనకృష్ణ గారు సినిమాలో ఏం చెబుతారో వినాలని ఉంది. అన్నారు.


సినిమాటోగ్రాఫర్ పీజీ విందా మాట్లాడుతూ... ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాకు కర్త, కర్మ, క్రియ అన్నీ ఇంద్రగంటి మోహనకృష్ణ గారే. అమ్మాయి గురించి చెప్పడమే కాదు చాలా అందంగా చూపించాం. సమ్మోహనం తర్వాత మేము కలిసి చేస్తున్న మరో బ్రీజీ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ఈ సినిమా. అన్నారు.


దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ మాట్లాడుతూ... ఆ అమ్మాయి గురించి చెప్పాలి సినిమా నాకు పర్సనల్ గా చాలా ఇష్టమైన మూవీ. ప్రతి సినిమాకు కొత్తగా కథ చెప్పాలని ప్రయత్నిస్తుంటాను. ఆ క్రమంలో వచ్చిన రొమాంటిక్ డ్రామా ఇది. ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి. కథలోనే పుట్టే సహజమైన కామెడీ ఉంటుంది. సుధీర్ బాబుతో నాకిది మూడో సినిమా. మా మధ్య అలా వేవ్ లెంగ్త్ కుదిరింది. సుధీర్ బాబు ప్రతిభ గల హీరో. అతనిలోని నటుడిని ఇండస్ట్రీ ఇంకా ఉపయోగించుకోవచ్చు. కృతిశెట్టిని ఉప్పెనలో చూసినప్పుడు ఇంప్రెసివ్ గా అనిపించింది. శ్యామ్ సింగరాయ్ లోనూ ఆకట్టుకుంది. ఇది కృతి శెట్టి బయోపిక్ కాదు. ఆమెను కొత్తగా చూస్తారు. సుధీర్ బాబు, కృతి వాళ్ల నటనతో సినిమాలో జీవించారు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి లైఫ్ ను ఎలా ప్రభావితం చేస్తుంది, అనూహ్యంగా వీళ్లు ఎలా ప్రేమలో పడ్డారు. ఆ ప్రేమకు ఫ్యామిలీ, సొసైటీ నుంచి ఎలాంటి ఇబ్బందులు వచ్చాయి వాటిని అధిగమించి ఎలా ప్రేమతో పాటువాళ్లు అనుకున్నది సాధించారు అనేది స్థూలంగా ఈ చిత్ర కథ. మైత్రీ మూవీ మేకర్స్ లాంటి పెద్ద సంస్థ మా సినిమాకు ప్రెజెంటర్ గా ఉండటం అనేది సినిమా బాగుందనే స్టాంప్ వేసినట్లే. మైత్రీ వాళ్లకు థాంక్స్. అలాగే బెంచ్ మార్క్ సంస్థకు శుభారంభం ఇచ్చామనే అనుకుంటున్నాను. అన్నారు.


హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ...ఇంద్రగంటి గారితో నాకిది మూడో సినిమా. నేను హీరోయిన్ తో కూడా మూడు చిత్రాలు చేయలేదు. ఆయనతో అంత ఫ్రెండ్ షిప్ ఉంది.  ఆ అమ్మాయి గురించి చెప్పాలి చిత్రానికి మీరు ఎక్కడా వంక పెట్టలేరు. అంత పర్ ఫెక్ట్ గా ఉంటుంది. సమ్మోహనం లో సినిమాలంటే ఇష్టం లేని క్యారెక్టర్ చేశాను. ఆ అమ్మాయి గురించి చెప్పాలి చిత్రంలో సినిమా డైరెక్టర్ క్యారెక్టర్ లో నటిస్తున్నాను. ఈ సినిమా కంప్లీట్ రొమాంటిక్ ఎంటర్ టైనర్. హీరో ఇంట్రడక్షన్ సాంగ్, ఐటెం సాంగ్ ఉంటుంది. కృతి గురించి చెప్పాలంటే కోరినట్లు నటించగల ప్రతిభ ఉన్న హీరోయిన్. కావాలంటే గ్లిజరిన్ లేకుండా ఏడ్చేయగలదు. బెంచ్ మార్క్ స్టూడియోస్ కు మొదటి సినిమా అయినా కంగారు లేకుండా జాగ్రత్తగా నిర్మించారు.  ఈ చిత్రానికి మైత్రీ మూవీస్ అసోసియేట్ అవడం ఇంధనం లాంటిది. వాళ్లకు థాంక్స్ చెబుతున్నా. అన్నారు.


హీరోయిన్ కృతి శెట్టి మాట్లాడుతూ...ఆ అమ్మాయి గురించి చెప్పాలి సినిమా మొదలైన కొద్ది రోజులకే ఇది నాకు గొప్ప అనుభవం ఇచ్చే సినిమా అవుతుందని అర్థమైంది. కథలోనే మా పాత్రలన్నీ అంత వివరంగా ఉన్నాయి. కొందరికి రొమాంటిక్ పార్ట్, మరికొందరికి ఫ్యామిలీ పార్ట్ నచ్చుతాయి. సినిమా అంతా మన ఇరుగు పొరుగు ఇంట్లో జరిగినంత సహజంగా ఉంటుంది. సుధీర్ బాబు అంత కోపరేట్ చేసే హీరోను చూడలేదు. మన క్యారెక్టర్ మనం చేసేందుకే కష్టపడాలి. అలాంటిది మాకు సపోర్ట్ చేస్తుంటారు. మైత్రీ మూవీస్ మై త్రీ అని చెప్పుకుంటాను. బెంచ్ మార్క్ స్టూడియోస్ కూడా ఇంకా మరిన్ని సినిమాలు చేయాలి. అన్నారు.


నటీనటులు: సుధీర్ బాబు, కృతి శెట్టి, అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, రాహుల్ రామకృష్ణ, తలైవాసల్ విజయ్, వడ్లమాని శ్రీనివాస్, గోపరాజు రమణ, కళ్యాణి నటరాజన్, ప్రేమ్ సాగర్, విశ్వంత్ దుద్దుపూడి, కునాల్ కౌశిక్ తదితరులు


సాంకేతిక బృందం
రచయిత, దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి
నిర్మాతలు: బి. మహేందర్ బాబు, కిరణ్ బల్లపల్లి
సమర్పణ: గాజులపల్లి సుధీర్ బాబు
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్, బెంచ్ మార్క్ స్టూడియోస్
సంగీతం: వివేక్ సాగర్
కెమెరామెన్: పీజీ విందా
ఆర్ట్: సాహి సురేష్
ఎడిటర్: మార్తాండ్ కే వెంకటేష్
లిరిక్స్: సిరివెన్నెల సీతారామశాస్త్రి, రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యాం
కో డైరెక్టర్: కోట సురేష్ కుమార్
పీఆర్వో: వంశీ-శేఖర్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Read More !