పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్త నిర్మాణంలో ఓ చిత్రం రూపు దిద్దుకోవటానికి రంగం సిద్ధమైంది. నేడు వైష్ణవ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థలు ఈ మేరకు అధికారిక ప్రకటనను ఓ వీడియో రూపంలో విడుదల చేశాయి. తొలిచిత్రంతోనే స్టార్ గా ప్రేక్షక హృదయాలలో బలమైన స్థానాన్ని సంపాదించుకున్న వైష్ణవ్ తేజ్ సరికొత్త మాస్ అవతారం ఈ చిత్రం అనిపిస్తుంది. అంతేకాదు భారీస్థాయిలో నిర్మాణం జరుగుతుందనిపిస్తుంది ఈ వీడియోను పరికిస్తే. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు చిత్ర నిర్మాతలు సూర్య దేవర నాగవంశీ, శ్రీమతి సాయి సౌజన్య.
ఇప్పటికే ధనుష్ హీరోగా తెలుగు, తమిళంలో నిర్మితమవుతున్న 'సార్', నవీన్ పోలిశెట్టి హీరో గా మరోచిత్రం, సిద్దు జొన్నలగడ్డ హీరోగా ' డిజే టిల్లు' చిత్రాలు సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్త నిర్మాణం లో నిర్మిత మవుతున్న విషయం విదితమే.