View

సినిమాకూ, ఓటీటీ క‌థ‌ల‌కు చాలా వ్య‌త్యాసం వుంటుంది - సుప్రియ

Thursday,January20th,2022, 01:17 PM

స్పోర్ట్స్ డ్రామా జాన‌ర్‌లో రూపొందిన ఒరిజినల్ సిరీస్ 'లూజర్' వీక్షకుల మనసులు గెలుచుకుంది. ప్రజల కోరిక మేరకు తాజాగా ప్రియదర్శి, ధన్యా బాలకృష్ణన్, కల్పికా గణేష్, శశాంక్, పావనీ గంగిరెడ్డి, హర్షిత్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన 'జీ 5' ఒరిజినల్ సిరీస్ లూజర్ 1 ఏంతో ప్రేక్షాదరణ పొందింది. ఆ హిట్ సిరీస్ కు సీక్వెల్ గా 'లూజర్ 2' ను తీసుకువస్తోంది. తొలి సీజన్ అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో  తెరకెక్కింది. 'లూజర్ 2' కు అభిలాష్ రెడ్డి, శ్రవణ్ మాదాల దర్శకత్వం వహించారు. దీనికి అభిలాష్ రెడ్డి క్రియేటర్, అన్న‌పూర్ణ స్టూడియోస్‌, స్పెక్ట్ర‌మ్ మీడియా నెట్‌వ‌ర్క్క్‌ నిర్మించిన ఈ సిరీస్ జీ 5 ఓటీటీలో ఈనెల 21న టెలికాస్ట్ కాబోతుంది. ఈ సంద‌ర్భంగా దీని గురించి మ‌రిన్ని వివ‌రాలు తెలియ‌జేసేందుకు గురువారంనాడు అన్న‌పూర్ణ ఏడెకాల స్టూడియోలో టీమ్ అంతా పాల్గొన్నారు.


ముందుగా నిర్మాత సుప్రియ యార్ల‌గ‌డ్డ లూజ‌ర్‌2 టీమ్‌ను ప‌రిచ‌యం చేస్తూ, అన్న‌పూర్ణ స్టూడియోస్ స్కూల్ విద్యార్థినీ విద్యార్థులే దీనికి ప‌నిచేయ‌డం ఆనందంగా ఉంద‌ని పేర్కొన్నారు. నేను క‌థ‌లు రాస్తాన‌ని అంటారు. కానీ ఆ క‌థ‌లు బాగుంటాయ‌ని ఎదుటివారు చెబితేకానీ తెలీదు. సినిమాకూ, ఓటీటీ క‌థ‌ల‌కు చాలా వ్య‌త్యాసం వుంటుంది. ఓటీటీలో చిన్న పాత్ర అయినా చాలా డిటైల్‌గా రాయాలి. భ‌ర‌ద్వాజ్‌, శ్ర‌వ‌న్‌, అవినాష్ మొద‌టినుంచి క‌థ‌ను రాయాల‌ని అనుకుని వ‌చ్చారు. అవి విన్న వెంట‌నే ఏ పాత్ర‌ను చూసినా వాటికి పూర్తి న్యాయం చేశారు. వెబ్ క‌థ‌లు వేరుగా వుంటాయి. అదే సినిమా అయితే లాగ్ అనేది ఎడిటింగ్‌లో తెలిసిపోతుంది. కానీ ఓటీటీలో లాగ్‌ వుండాలి. దానిలోనూ అందం క‌నిపించాలి. దానికీ ఓ టైం పిరిడ్ వుంటుంది. అటువంటి దాన్ని స‌రిగ్గా చూప‌గ‌లిగితే ప్రేక్ష‌కుడు క‌నెక్ట్ అవుతాడు. ఇక స్క్రీన్ ఫేస్‌కూడా ద‌గ్గ‌రా చూపించాలి. అందులో న‌టీన‌టులను ఎఫెక్టివ్‌గా చూపించ‌గ‌ల‌గాలి. ఒక్కోసారి క‌ళ్ళు కూడా మాట్లాడుతుంటాయి. దాన్ని క్యాచ్ చేయ‌గ‌ల‌గాలి. మాకు ఫేవ‌ర్ అంశం ఏమంటే, దీనికి ప‌నిచేసిన వారంతా మా అన్న‌పూర్ణ స్టూడియోస్ కాలేజీలో చ‌దువున్న వారే. అందుకే వారి మ‌ధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఏర్ప‌డి క‌థ బాగా రావ‌డానికి దోహ‌ద‌ప‌డింది. ద‌ర్శ‌కుడు అభిలాష్ ఒకసారి క‌థ‌ను చెప్ప‌డానికి వ‌చ్చాడు. స్పోర్ట్స్ ఫీల్డ్‌లో స‌క్సెస్ అవ్వ‌ని వారు గురించి చెప్పారు. ఇలాంటి క‌థ‌లు ఎక్క‌డా చెప్ప‌లేం. ఓటీటీలోనే చెప్ప‌గ‌లం. అందుకు జీటీ వారు మ‌మ్మ‌ల్ని న‌మ్మ‌డం అందుకు అనుగుణంగా తెర‌కెక్కించ‌డం జ‌రిగింది. ఇందులో పాత్ర‌ల ప‌రంగా పెద్ద వారు. లేరు. అంద‌రూ స‌రిప‌డే విధంగా కుదిరారు. ఇప్ప‌టి యువ‌త‌రం ఏవైనీ కొత్త విష‌యాలు మాకు నేర్పించేవారుగా వుండాలి. అలా వున్న టీమ్ మాకు దొరికింది. కొత్త‌త‌రంలో టాలెంట్ బాగుంటుంది. రేపు ఓటీటీలో చూసి మీరు తెలుసుకుంటార‌ని తెలిపారు.


న‌టుటు వెంక‌ట్ మాట్లాడుతూ.. సినిమాలుచేసినా ఓటీటీలో చేయ‌డం థ్రిల్ క‌లిగిస్తుంది. లూజ‌ర్‌2 సిరీస్ నాకు బాగా న‌చ్చిన క‌థ‌. ఇందులో చాలా మంది జీవితాలు మ‌న క‌ళ్ళ‌ముందుక నిపించేలా వుంటాయ‌ని పేర్కొన్నారు.  


దర్శకుడు అభిలాష్ రెడ్డి మాట్లాడుతూ.. ఇది చాలా ఇష్ట‌ప‌డి చేసిన క‌థ‌. పీరియాటిక్ క‌థ‌తో కూడుకున్న‌ది. ఈ కథకు భరత్, శ్రవణ్ లిద్దరూ రైటింగ్ లో ఫుల్ సపోర్ట్ చేశారు.అలాగే  మాకు సపోర్ట్ గా నిలుస్తూ మంచి సూచ‌న‌లు సుప్రియ గారు ఇచ్చారు వారికి మా ధన్యవాదాలు. నాతోపాటు కొన్ని ఎపిసోడ్స్ శ్రవణ్  డైరెక్ట్ చేశాడు. స్పెక్ట్రా మీడియా నెట్వర్క్ మాకు ఎం కావాలన్నా సహాయ సహకారాలు అందించారు వారికి మా ధన్యవాదాలు. నటీనటులు, టెక్నికల్ టీమ్ అంతా బాగా సపోర్ట్ చేయడంతో ఈ సిరీస్ బాగా వచ్చింది.ఈ నెల 21 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న "లూజర్ 2" ను కూడా  ప్రేక్షకులందరూ ఆదరించి గొప్ప విజయాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.


నటుడు ప్రియదర్శి మాట్లాడుతూ.. అన్నపూర్ణ బ్యానర్ లో ఎంతో మందికి అవకాశం ఇచ్చినా కూడా వారు గొప్పలు చెప్పుకోరు. మేము లూజర్ కోసం చాలా కష్టపడ్డాము.టెక్నిసిషన్స్ అందరూ చాలా సపోర్ట్ చేయడంతోనే ఈ సీరీస్ ఇంతపెద్ద హిట్ అయ్యింది. మా కిలాంటి మంచి కంటెంట్ ఉన్న సిరీస్ లో  నటించే అవకాశం ఇచ్చిన అన్నపూర్ణ స్టూడియో కు,సుప్రియ గారిగి జీ 5 కు మా ధన్యవాదాలు అన్నారు.


శశాంక్  మాట్లాడుతూ.. నేను ఏజ్ వున్న వాడిగా క‌నిపిస్తాను. ఆ పాత్ర‌ను ద‌ర్శ‌కుడు బాగా డిజైన్ చేశాడు. ట్రైల‌ర్‌లో చూసిన వారంతం మెచ్చుకోవ‌డం ఆనందంగా వుంది. ఈ అవ‌కాశం ఇచ్చిన సుప్రియ గారికి ధ‌న్య‌వాదాలు తెలుపుకుంటున్నాన‌ని పేర్కొన్నారు.


ఇంకా ఈ కార్యక్రమంలో హర్షిత్, పావని, కల్పిక‌, గాయ‌త్రితోపాటు సాంకేతిక సిబ్బంది పాల్గొన్నారు.


నటీనటులు
ప్రియ‌ద‌ర్శి, ధ‌న్యా బాలకృష్ణ‌న్‌, క‌ల్పికా గణేష్, షాయాజీ షిండే,  శ‌శాంక్‌,  హ‌ర్షిత్ రెడ్డి, సూర్య‌,  పావ‌నీ గంగిరెడ్డి,  స‌త్య కృష్ణ‌న్  శ్రీ‌ను, టిప్పు, తదితరులు


సాంకేతిక నిపుణులు
ప్రొడ‌క్ష‌న్‌:  అన్న‌పూర్ణ స్టూడియోస్‌, నిర్మాత - సుప్రియ యార్ల‌గ‌డ్డ‌, ద‌ర్శ‌క‌త్వం- అభిలాష్ రెడ్డి క‌న‌కాల‌, శ్రవ‌ణ్ మాదాల‌, రచన: అభిలాష్ రెడ్డి క‌న‌కాల‌, శ్ర‌వ‌న్ మాదాల‌, సాయి భరద్వాజ్, సంగీతం: సాయి శ్రీ‌రామ్ మ‌ద్దూరి, ఛాయాగ్ర‌ణం: న‌రేష్ రామ‌దురై, క్రియేటివ్ ప్రొడ్యూసర్: మహేశ్వర్ రెడ్డి గోజల, ప్రొడక్షన్ డిజైన్: ఝాన్సీ లింగం, కాస్ట్యూమ్ డిజైనర్ & స్టైలిస్ట్: రజనీ, ఎడిటింగ్‌- అనిల్ కుమార్ పి, కూర్పు: కుమార్ పి. అనిల్‌Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

Read More !